లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఒక మంచి వృక్షము

కీ.శే. యన్‌. దానియేలు గారు

మత్తయి 7:11-20; 18వ''
ఒక మంచి వృక్షము చెడ్డ ఫలములు ఫలింపనేరదు. అట్లే ఒక చెడ్డ వృక్షము మంచి ఫలములు ఫలింపనేరదు''

ఒక గొప్ప శాస్త్రజ్ఞునివలె క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఆయన ఏదైనా పలికినప్పుడు అది సంపూర్ణముగా సత్యము. ఆయన మాటలను జాగ్రత్తగా చదివి వాటిని వెంబడించవలెను. అనేకమంది క్రైస్తవులు ఈ సత్యములను అక్కడక్కడ వెంబడిస్తారు. వారు సత్యమునకు విధేయులవుతున్నారని తలుస్తారు. కొంతమంది విద్యార్థులు తప్పుడు సూత్రాలనుపయోగించి, వారు లెక్క కరెక్టుగా చేశామని తలుస్తారు. ఈలాగు వారెన్నడు మంచి ఫలములు చూడలేరు. నేను సైన్సు విద్యార్థిని. నాకు నేర్పించబడినట్లు నేను నేర్చుకొన్నాను. కొంతమంది విద్యార్థులు తప్పుడు సూత్రాలుపయోగించి వారు లెక్క సరిగ్గా చేశామనుకొంటారు. వారికి, ఆ లెక్కకు ఏ మార్కులు ఇవ్వలేను. మనలో కొంతమంది దేవుని వాక్యముతో ఆటలాడుతున్నారు. మనము దేవుని వాక్యమును సరిగ్గా వెంబడించే వారమైతే, మంచి ఫలములు ఫలించాలి. దేవుడు తన సూత్రాలనిచ్చాడు. నేను తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు, కాగితాలతో బెలూన్లు చేసేవాడిని. నేను వాటిని ఎగురవేసేవాడిని. లోపల బరువు లేనప్పుడు, అవి నేరుగా పైకి పోయేవి. మనము దేవుని సత్యమందలి సత్యములు వెంబడించునప్పుడు, మనము మన జీవితములో విజయము చూడగలము. నీవు చెట్టును మంచి దానిగా చేసినవా? నీవు ఒక వేప విత్తనము విత్తి, మామిడి చెట్టు ఉద్భవించాలని ఎదురుచూస్తావు, చెట్టు ఎదిగినప్పుడు, నీవు దానిని కత్తిరించి మంచి ఎరువులు వేస్తావు. నీవు ఏమి చేసినా సరే, చేదైన వేపపండ్లే ఫలిస్తాయి. దాన్ని పెరికివేయి.

నీవు దేవుని సూత్రములను సరిగ్గా తీసికోలేదు. నీవు వాటిని మార్చి వేశావు. దేవుడు కోరే ఫలములు ఫలించలేవు. దేవుని వాక్యమును జాగ్రత్తగా చదువు. ''నేను దాన్ని సరిగ్గా గ్రహించి నానా?'' అని దేవున్ని అడుగు, అవును అని ప్రభువు సెలవిచ్చినపుడు, దాన్ని నమ్మకముగా వెంబడించు. అనేకమంది నాయకులు, అనేక విషయాలు బోధింపవచ్చు. కాని నీవు వెంబడించవలసినది ఆయన వాక్యము. అనేకమంది మిషనరీలు నన్ను అర్థము చేసుకోలేదు - వారికి ఎదురుగా నేను ప్రవర్తింపలేదు. వారు ''దేవుని వాక్యమున్నది ఉన్నట్లుగానే వెంబడించరాదు'' అని అన్నారు. కాని దేవుడు నన్ను నా సైకిలు తీసుకొని పట్టణము వెలుపలికి వెళ్ళి ప్రార్థించమన్నారు. నేను అలాగే చేసాను, నా యొద్ద సైకిలు లేనప్పుడు నేను నడిచి వెళ్ళి ప్రార్థించేవాడిని. యేసు, ఆయన శిష్యులు యెహెజ్కేలు వంటి ప్రవక్తలు అలాగు చేసిరి. దేవుడు తన ప్రవక్తకు ఎంత ఆశ్చర్యకరమైన నడిపింపు యిచ్చాడు ! దేవుని కృప వలన నేనెన్నడు ఓడింపబడలేదు.

మద్రాసులో నాకొక స్నేహితుడుండినాడు. ఆయన ఒక విశ్వాసి. ఆయన నాతో ''దానియేలు గారు, ఒంటరిగా ప్రార్థనకు సముద్రపుటొడ్డుకు వెళ్ళి రావడము ఎంత సమయము వృథా అవుతుంది! నేనట్లు చేయలేను'' అని అన్నాడు. కాని దేవుడు నన్నా రీతిగా చేయమన్నాడు. కనుక నేనట్లు చేసితిని. ఆ నా స్నేహితునికి నా కన్నా ఎక్కువ విశ్వవిద్యాలయ డిగ్రీలున్నవి. కాని నేను యేసు చేసినట్లే, మోషే చేసినట్లే చేసితిని. నేను వింతగా కనిపించినా ఫర్వాలేదు. నేను ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించేవాడిని. కొద్దికొద్దిగా దేవుని నడిపింపు నాకు లభించినది! దేవుడు చెప్పినట్లు నేను చేసాను. దానివలన వచ్చే ఫలితమేమి అనిమట్టుకు చూడవద్దు. దేవుని వాక్యమునకు విధేయుడవు కమ్ము. ఒక దినాన్న నీవు దాని ఫలితాన్ని చూస్తావు. నిన్ను నీవు ''నేను దేవునిని వెంబడిస్తున్నానా, లేక ఇతరులను వెంబడిస్తున్నానా?'' అని అడుగు.

నేను కళాశాల విద్యార్థిగా ఉండినప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడు అని చెప్పేవాడిని. ఆ కళాశాల విద్యార్థులు నన్ను చూచి నవ్వేవారు. ఈనాటికి, మా సొంత ఊరిలో ఉన్న బ్రదరెన్‌ సంఘస్థులు నా మాట నమ్మరు. నేనా సంఘములో పెరిగాను. క్రీస్తు నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉన్నాడని నేను నమ్ముతాను. నేను దేవునితో వాదించే వాడిని. ''నీవు మారిపోతివా''? నీవు అబ్రహాము దేవుడవు కాదా? నీవు ఈ యుగమందు నిశ్శబ్దముగా ఉందువా?'' అని నేను అడిగాను. ప్రభువు నాతో మాట్లాడినాడు. నా స్నేహితులలో కొందరు నన్ను అపహాస్యము చేసి, నన్ను చూచి నవ్వేవారు, నన్ను నేను మోసము చేసుకుంటున్నానా అని నేను చింతించే వాడిని. 45 సంవత్సరాల క్రితం ఎవరో నాకు అన్నామణి జీవిత చరిత్ర ఇచ్చారు. నేను అది చదివినపుడు నా సందేహాలన్నీ కుదుటపడినాయి. సరియైన మార్గము వెంబడించకుండా ఎవరైనా నన్ను అడ్డగించినపుడు దేవుడు నాకు కొన్ని పుస్తకము లిచ్చేవారు. అవి నాకు వెలుగిచ్చేవి. నీవు దేవుని వాక్యము చదువుతున్నావా? దేవుడు నీకు ఒక ఏర్పాటు చేసాడు. ఒకవేళ దేవుడు నిన్ను, మోషే అబ్రహాము, కర్మెలులో దేవుని కొరకు పోరాడిన ఏలియా వంటివాడవు అయ్యేటట్లు చేస్తాడు. మనకు తెలియదు. దేవునికి తెలుసు. కాని చెట్టు మంచిదేనా? నీవు దేవుని వాక్యమును వెంబడించుచున్నావా? అయితే ఒక రోజున నీవు ఫలము చూస్తావు.

మత్తయి 12:33 చెట్టు మంచిదిగా చేయండి. కొన్ని వేరులు తెగగొట్టి, కొన్ని కొమ్మలు విరిచివేస్తే, దాని ఫలములలోనికి కొంచెము తేనె పోస్తే, నీవు చెట్టును మంచిదిగా చేయగలవా? నీ హృదయాన్ని, అన్నిటికి ఆధారమైన సత్యము దేవుని మనస్సుననుసరించి నీ హృదయాన్ని పట్టుకోకపోతే ఏదియు సాయము చేయదు. ఆయన ఆధారభూతమైన సత్యములు, సూత్రములు, నీ హృదయమును పట్టుకోనిమ్ము. నీవు భయపడనక్కరలేదు. నీవు నీ పట్టణాన్ని జయిస్తావు. ''నాకు మొఱ్ఱపెట్టుము. నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును'' అని దేవుడు పలికాడు. పరలోక సమూహములు నీ వెనుక ఉన్నాయి. దేవుడు నిన్ను పిలిచినాడని నీవెరుగుదువా? నీవు సరిగా ప్రారంభించినావో లేదో చూసుకో. మనము తిరిగితిరిగి మనలను మనము పరీక్షించుకోవాలి. నేను, ''ప్రభువా, సహవాసము ఎదుగుతూ ఉన్నది. నేను ఎదిగి లోతుగా వెళ్ళకపోతే, ఏదో ఒక సమయంలో నేను అడ్డుబండయై పోతాను. దాని కన్నా నేను మరణించుటయే మేలుగా భావిస్తాను. నేను ఎన్నడు, అడ్డుగా ఉండుట కిష్టపడను'' అని ప్రార్థిస్తాను. నేను మెళకువగా ఉండి ప్రార్థిస్తాను. దేవుడు అనేకసార్లు నన్ను హెచ్చరించేవాడు. ''ఈ ప్రార్థనా మెట్టుతో నీవు ఈ సేవ చేయలేవు'' ఆయన నన్ను తెల్లవారుజామున రెండు గంటలకు మేల్కొలుపుతాడు. నేను లేచి ప్రార్థిస్తాను. నేను నా హృదయమును పరీక్షించుకొని ప్రార్థిస్తాను. తదుపరి నేను మధురైకి, తిరుచ్చికి, తిరునల్వేలికి, మార్తాండంకు, ఉడిపికి, బొంబాయికి, హైదరాబాద్‌కు, ఢిల్లీకి ప్రార్థనలో ప్రయాణము చేస్తాను. ఈ రీతిగా ప్రార్థనలో నేను అనేక స్థలాలకు ప్రయాణిస్తాను. దేవుడు నన్ను ప్రార్థన చేయడానికి నడిపిస్తాడని నేననుకుంటాను. కొన్నిసార్లు నేను దేవునికి అవిధేయుడనౌతాను. కాని నేనాలగు చేయడానికి భయపడతాను. ఎన్ని ఆత్మలు నశించిపోతాయి! చెట్టును మంచిదిగా చేయండి. నీవు వెంబడించే ఆధారభూతమైన సూత్రమును పరీక్షించుకో!

ఒకసారి ఎవరో మరణించినట్లు నేను విన్నాను. అతడు నన్ను చాలా బాధపెట్టినాడు. ఈ వార్త వినగానే నేను కొంతమట్టుకు సంతోషాన్ని అనుభవించాను. కాని అది క్రైస్తవ గుణ లక్షణము కాదని నేను వెంటనే గుర్తించాను. ప్రథమంగా అది తప్పే. నీ శత్రువు పడిపోయినపుడు నీవు ఆనందించరాదు. నీవు ఉన్నది ఉన్నట్టుగా వెంబడించే క్రైస్తవుడుగా ఉండాలి. మనుష్యులు వచ్చి మీయింటిలో దొంగిలించవచ్చు. మనము వాళ్ళను పట్టుకొని వాళ్ళ ఎముకలు విరిగే వరకు కొట్టవచ్చు. వారిని దూషించవచ్చు. కాని అదంతయు సరియేనా? అది దేవుని వాక్యానుసారమైనదా? నేను దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా ఏమైనను చేసి, ప్రార్థించగలనా? దేవుని వాక్యము మీద మీ పట్టు విడువకండి. ''సర్ప సంతానమా, మీ హృదయము చెడుగుతో నిండి యుంటే మీరు మంచియేలాగు మాట్లాడగలరు''? మీ హృదయము మంచివాటితో నిండి యుండే, మీ పరపతి అన్నివైపులా వ్యాపిస్తుంది. మీ కుటుంబాన్ని అది కప్పుతుంది. సైతాను మీ యింటికి వచ్చి, దానిలో నుండి బయటికి వచ్చు, శక్తిని కృపను రుచి చూస్తాడు. ఆ యింటి లోనికి వెళ్ళలేనని అంటాడు. కనుక అతడు వెళ్ళిపోతాడు. అసిస్సివాసియగు ఫ్రాన్సిస్‌ను, అతని గుంపువారును నివసించిన యింటిలోనికి సైతానుడు వెళ్ళలేకపోయాడు. అనేక క్రైస్తవ గృహాలలో సైతాను నివాసమేర్పరచుకొన్నాడు. ఇది ఆ యింటివారి దుష్టప్రవర్తనను బట్టి, నేను పెరిగిన సంఘములో, ఏ దుష్టప్రర్తన లేదు, దేవునికి స్తోత్రము.

నేను సాతాంకుళమును గూర్చి మీతో చెప్పితిని. అక్కడ క్రైస్తవులనేకులు దయ్యములు పట్టినవారు. నేను నా చేతులు వారి మీద వేయుట తోడనే వారు పడిపోయేవారు. నేను దానిని వైద్య విద్యార్థులకు చూపెట్టాను. ఇటువంటి కేసులు చూడగలుగుటకు, వారి వైద్య విద్య సరిపోదు. బైబిలు వారికి పరిపూర్ణ జ్ఞానమిస్తుంది. సాతాంకుళములో ఉన్న ఇండ్ల కంటే వారి దేవాలయములే ఎక్కువ. క్రైస్తవులు హిందూ పండుగల నాచరిస్తూ ఉంటారు. వారిలో అనేకమందిని దయ్యము పట్టివేసినాడు.

చెట్టును మంచిదిగా చేయండి. నేను మాంట్‌గోమొరీ హాస్టలులో చేరినప్పుడు, అక్కడుండిన వారు చెప్పారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా దయ్యములు పట్టిన స్థలము. దయ్యములు చుట్టూ తిరుగుతూ ఉంటవి, అక్కడ ఉండిన చింతచెట్టు మీద దీపాలు వెలుగుట కనిపించేది. సరే నేను వారితో చెప్పాను. అవి కనబడినప్పుడు నన్ను లేపండి అని చెప్పాను అవి మళ్ళీ కనబడలేదు. దయ్యములున్నవి నిజమే. కాని దేవుని వాక్యమును వెంబడించండి. చెట్టును మంచిదిగా చేయండి. మీ క్రైస్తవ జీవితము దానంతట అది ప్రవహించేదిగా ఉంటుంది. నీ గుండె కొట్టుకొనేది, నీ అనుమతిని బట్టి కాదు. మీరు దేవుని వాక్యమును మీ హృదయముతో నమ్మినారు. కనుక దేవుని ఆత్మ మిమ్మును విడువలేదు. మీరు నడచుట, మాట్లాడుట, కదలుట, అన్ని ఆత్మయందే జరుగనివ్వండి. మీరు ప్రార్థించినా, ఆత్మయందే ప్రార్థించెదరు. దేవుని ఆత్మ మీతో నెల్లపుడున్నాడు. ఎందుకనగా మీరు మంచి చెట్టు గనుక దేవుని వాక్యానుసారముగా మీరు నాట బడ్డారు. దాని సారమును మీరు దేవుని మనస్సును బట్టి తీసుకుంటారు. ఫలము వచ్చినపుడు అది తియ్యగా ఉంటుంది. దేవుడు ఈలాగు చెప్పాడు. యెషయా 5:1, 2లో ఈవిధంగా చెప్పబడింది. ''నేను ద్రాక్ష వనమును నాటితిని, కాని అది కారు ద్రాక్షలు ఫలించెను'' ఎందుకీలాగు జరిగింది? దేవుడు చేయగలిగినదేమి? మీరు ఎవరితో పొత్తు కుదుర్చుకొన్నారో, అది మిమ్మును పాడుచేస్తుంది. నీ బంధువులు నిన్ను పాడుచేసినారు. వారు నిజముగా, ఆత్మీయముగా నీ శత్రువులు, వారు సమస్తము ఎరిగినట్లు మాట్లాడతారు. క్రైస్తవ నాయకులు కూడా అలా ఉండగలరు. నేను అలాటి వారికి దూరముగా ఉంటిని. నేను గర్విష్టినని వారనుకొన్నానరు. నా ఆత్మీయ జీవితమునకు అపాయకరమైన ప్రతి దానికి దూరముగా ఉంటిని. దేవుడు నన్ను తనకు సమీపముగా నడచుట నేర్పించారు.

భయము లేకుండా నడిచే ఆత్మ ప్రభువు నాకిచ్చినందుకు ప్రభువుకు స్తోత్రము. అంటే నాకు మనుష్యుల యెడల మర్యాద లేదని అర్థము కాదు. నేను దేవునికి భయపడ్డాను. నరుడు నరుడే. అతడు నిత్యము నిలిచియుండడు. అతడు దేవుని పనిని ఎదిరించితే, దేవుడతని శిక్షిస్తాడు. నేను దేవునిని వెంబడిస్తాను. నిత్య సత్యమును గూర్చి మాట్లాడతాను. నేను నా కళాశాల దినాలలో ఆడిన మాటలలో కొన్ని నెరవేరినాయి. ఎందుకు? నేను ఆత్మయందు మాట్లాడితిని. తెలివి తేటలు గల కొంతమంది యువకులు నన్ను పరీక్షించారు. నేను దూరమందుండిన ఒక కొబ్బరి తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడను. అంటే చాలా దూరము నడిచి వెళ్ళే వాడిని. దానికి నడిచి వెళ్ళిన దూరమంతా దేవుని సన్నిధిని అనుభవించాను. ఎట్టి క్రమశిక్షణ! అలాగు చేయడము సులువైన విషయము కాదు. ప్రార్థనలో నన్ను నేను మరచిపోతాను. దేవుడు తానే నా ప్రార్థన ముగించి, నన్ను తిరిగి వెళ్ళమనేవాడు. నేను తిరిగి వచ్చి హాస్టలులో నాతోనేకీభవించే వారిని చప్పట్లు కొట్టి పిలిచేవాడిని. వారిని, హాస్టలు టెర్రస్‌ మీదికి జమ చేసేవాడిని. వారిని ప్రార్థనలో నడిపేవాడిని.

చెట్టును మంచిదిగా చేయండి. దేనిని గూర్చి భయపడనక్కరలేదు. నీవు దేవుని వాక్యమందు నీ విశ్వాసపు పునాది వేస్తావు. ఒకరోజుకు నీవు పేతురు వలె, ఏలియా వలె ఉంటావు. కొంత అనాను కూలతలు నీవు ఓర్చుకో. వెక్కిరింతలు సహించడానికి సిద్ధపడు. నీ కార్యములను కాదనడానికి సిద్ధపడియుండు. అనేక పరీక్షలు రావచ్చు. భయపడకు.

మచిలీపట్నంలో రాత్రి 10:00 గం||లకు వర్షము ద్వారా నేను బైబిలు తీసుకొని ప్రార్థనకు వెళ్ళేవాడిని. మోకాలు లోతు నీళ్ళలో 11/2 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. కొన్నిసార్లు బాగా తడిచిపోయేవాడిని. ఎత్తైన స్థలం ఒకటి చూచుకొని దేవుడు నన్ను తిరిగి వెళ్ళిపొమ్మనే వరకూ ప్రార్థనలో ఉండేవాడిని. నాకు ఆ దినములలో బ్యాటరీ లైటు లేదు, ఒకసారి నేను తిరిగివస్తూ ఉండగా దేవుడు నన్ను మార్గం కొంచెం మార్చమని చెప్పాడు. కాని నేను నా యథాప్రకారమైన రూటులో వెళ్ళాను. అకస్మాత్తుగా గొంతులోతు నీళ్ళలో మునిగిపోయాను, ''దేవా ఇది ఏమిటి'' అని నేను ప్రశ్నించాను. దేవుడు ''నీ స్వంత మార్గంలో వెళ్ళావు'' అని జవాబిచ్చాడు. నేను ఆ అనుభవంను మరచిపోలేను. నేను దేవునికి ప్రార్థనలో విధేయుడనై యుండవలెనని కోరి అనేక సంగతులను నేర్చుకొన్నాను.

చెట్టు మంచిదిగా చేయండి. దేవుని వాక్యమును హత్తుకోండి. సర్వశక్తిమంతుడైన దేవుడు నీతో ఉంటాడు, వెలుగు వచ్చినది. ఇంటికి వెళ్ళి ప్రార్థనలో సమయం గడుపు. దానియేలు వలే దేవుని కలుసుకో, ఆత్మచేత నడిపించబడినావని నీవు నిశ్చయం చేసుకో, వాక్యము దేవుని ఆత్మ. ఈ ఆత్మ నిన్ను ఎన్నడూ విడిచి పెట్టదు. దేవుని కృప ద్వారా వాక్యము యొక్క ఆత్మ నన్ను ఎన్నడూ విడిచిపెట్టలేదు. లోక సంబంధమైన మేలు నిమిత్తం నేను ఎన్నడూ జీవించలేదు. నా లాభం... నా నిరీక్షణ... నా అంతము... క్రీస్తే. మన సహవాసం అలాగుండాలి. యెషయా 60:22 ''వారిలో ఒంటరియైన వాడు వేయిమంది యగును. ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యము త్వరపెట్టుదును.

దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చినపుడు ఒకేఒక విద్యార్థి నా తరగతిలో ఉండినాడు. నేను అడిగాను, ''ఓ ప్రభువా ఇదిఏమి. ఒక పెద్ద హైస్కూల్‌ నుండి నన్ను వెలుపలికి తీసుకువచ్చి ఈ ఒక్క విద్యార్థికి ఉపాధ్యాయుడుగా చేసావే'' అయినప్పటికి నాపని హృదయమంతటితో చేసాను. ఒక పెద్ద బడిలో పనిచేసినట్లే పని చేసాను. వారందరికి ఒక టైం టేబుల్‌, రూల్సు ఈ ఒక్క విద్యార్థి బడికి ఉండినవి. ఒక్క విదార్థి అయినా నూరుమంది అయినా ఒకటే! నేను గంట మ్రోగించే వాడిని. విద్యార్థి బైబిలు తీసుకొని వచ్చేవాడు. బైబిలు పఠన ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ముగించేవాడిని. అతడు వెళ్ళిపోయేవాడు.

నీవు ప్రార్థించినప్పుడు పరలోకములు వింటుంటాయి. నీ ప్రార్థనలు వ్యర్థముగా పోవు, నీవు నీ దేశంను జయించబోతున్నావని జ్ఞాపకం ఉంచుకో. అనేక పట్టణములలో తప్పుడు మతం ఉన్నది. నీవు దానిని జయించాలి. ఒకవేళ మనం ఇంగ్లాండుకు, జర్మనీకి, ఆస్ట్రేలియాకు వెళ్ళవచ్చు. ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ లోకంలో ఉండే ధనమంతయు దేవునిదే. ఒకనాడు అనేక దేశముల నుండి 5వేల మంది మన ఫెలోషిప్‌కు రావచ్చు. దేవుని నామం హెచ్చించబడును. ఇది మన సహవాసం సరైన మెట్టులో ఉంటేనే. నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని వాక్యానుసారముగా విత్తబడిన చెట్టువా? భూగర్భంలోనికి నీ వేళ్ళు వెళ్ళును. నీ కొమ్మలు లోకమంతటా వ్యాపించును. సహవాసం దేవుని వాక్యమును లోకమంతటా ప్రకటించాలి. దేవుడు మనకు సహాయం చేయును గాక.
మూల ప్రసంగాలు