|
ఒక పాపికి ఒక కార్యం అప్పగించబడింది
|
కీ.శే. యన్. దానియేలు గారు |
యోహాను 4:28, 29
'' ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరు లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా?
స్త్రీలందరివలె ఈస్త్రీకి కూడా ఒక భక్తి ఉన్నది. ఆమెకు దేవుని భయం లేదు. ఆమె వ్యభిచారంలో జీవించింది. క్రీస్తు ఆమె బావి దగ్గరకు వచ్చిన గంటను ఏర్పాటుచేసికొని వేరెవరూ అక్కడ ఉండరని నిశ్చయించుకున్నాడు. ఆమె పట్టణంలో ఉన్నటువంటి స్త్రీలలో మిక్కిలి చెడిపోయిన స్త్రీ. అయినప్పటికీ యేసు ఆమెను గురించి ఆలోచిస్తూ ఆమె ద్వారా ఆ పట్టణంను రక్షించాలని ఆలోచించారు. ఆమె సిగ్గును విడిచి ఒకవేళ ఆమె తన అందం గూర్చి గర్వించినదేమో.
క్రీస్తును మనలోతు లేని భక్తితో కలుసుకొనుట శ్రేష్టమైన విషయం. 2 సమూయేలు 13వ అధ్యాయం నాకు చూపించబడింది. ఒకరు సువార్తికుడనే పేరుతో నన్ను మోసం చేయవలెనని చూపించినప్పుడు నేను అతనికి దేవుడు తన గూర్చి చూపించిన అధ్యాయం అతనికి చూపించాను. ఇది దేవుడు అతనితో మాట్లాడినట్లుగానే యుంది. అతడు ఒక వేటగాడు. అతని దగ్గర తుపాకి ఒకటి ఉంది. పాస్టరు గారు నాకు ఈ విషయం తెలిపారనే భావంతో పాస్టరు గారిని తుపాకీతో కొట్టాలని చూసాడు. అతడు సభ యందు ప్రార్థించాలని చూసాడు. అది ఉజ్జీవం వచ్చే సమయం. దేవుని ఆత్మ ఆ స్థలం మీద ఆవరించియుండినాడు. నేను అతనితో చెప్పాను. ''నీవు కూర్చోవలసింది, నీవు అననీయ వలే క్రింద పడి చనిపోతావు. అతను కోపం వచ్చి లేచి వెళ్ళిపోయాడు.
మనము క్రీస్తుతో మాట్లాడేటప్పుడు మన పాపములు బయటికి వస్తాయి. ఒక పాస్టరు గారి కుమార్తె వైద్య విద్యార్థిని రహస్యంగా ఒకనితో ప్రేమలో జీవిస్తూ ఉండింది. దానిని విడిచి పెట్టడానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయని చెప్పింది. కాని దేవుడే ఆమెకు మార్గం చూపెట్డాడు. దేవుడు చెప్పాడు ''నేను మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించుదును. నీవు ధర్మశాస్త్రం వెంబడించునట్లు నేను నా ఆత్మను నీకు అనుగ్రహించెదను'' యోహాను 16:13. దేవుడు నన్ను సత్యంలోనికి, ఇంకా ఎక్కువైన సత్యంలోనికి నడిపించాడు. నా యౌవ్వన దినములలో ఒక స్త్రీని చూసినప్పుడు నేను ఆమెను పొందవలెననే ఆశ తీసివేశాడు. దేవుని చిత్తంలో ఉండుట నా మనస్సులో అత్యున్నతమైనదిగా ఉండింది. నేను దేవుని చిత్తంలో నుండి బయటకు అడుగువేయటానికి భయపడ్డాను. ఒక స్త్రీ అంటే ''లోకము'' అని అర్థం. ఆమె ప్రభువును ఎరిగినదైతే ఆమె ఆశ్చర్యపరురాలుగా ఉండవచ్చును. హృదయమందు క్రీస్తు ఉంటే వారి స్వభావం ఘనమైనదిగా ఉండను. వివాహం ఘనమైన తలంపు. అది ఒక పురుషునికి స్త్రీకి మధ్య దేవుడు చేసిన ఏర్పాటు.
ఈ స్త్రీ పాపంలో జీవించటానికి పుట్టినాను అనుకొనింది. ఇంతవరకు ఆమె పాపంలో జీవించింది. అప్పుడు ఆమె మిషనరీ అయింది. యేసు గ్రామంలో ఉండిన అధమమైన స్త్రీని పట్టుకొన్నాడు. ఆమెపైన ఆశీర్వాదం అనుగ్రహించాడు.
ఒకప్పుడు ఆమె ఒక శాపంగాను, యౌవనస్తులను పడగొట్టేదిగాను ఉండింది. ఇప్పుడు ఆమె దేవుని కొరకు ధైర్యంగాను సంతోషంగాను ఉండింది. క్రీస్తు మాటలు ఆమెకు నూతన జీవం తెచ్చింది. ఇక మీదట ఆమె ముందుకే వెళ్ళింది. మనుష్యులు ఆమెను గమనిస్తూ ఉండినారు. 49 సం||ల క్రితం నేనీ నూతన జీవం అందుకున్నాను. దేవుని కృపను బట్టి నేనెన్నడు వెనకకు పోలేదు. ''నాకు క్రీస్తు ఇంకా ఎక్కువ దొరుకుతాడా?'' అనేది నా హృదయ వాంఛ. ఎందుకనగా అది నా ఆస్తి.
మనం క్రీస్తు దొరికే స్థలానికి వెళ్దాం. క్రీస్తు అనుకున్నాడు, ''నేను ఒక మిషనరీని కనుక్కున్నాను. ఇకమీదట సుఖారు వ్యత్యాసంగా ఉండబోతుంది. దేవుని ఆత్మబలం అన్నింటిని ఆమె కనుగొంటుంది. ఈ స్థలం మార్చబడుతుంది.
నీవు క్రీస్తును కనుగొంటే పరలోకం యొక్క వెలుగు నీ కనులకు దొరుకుతుంది. నీవు ప్రభువుతో ఉంటే భార్యభర్తలకు మధ్య ఏ రహస్యం ఉండదు.
నీవు పోట్లాటల నుండి పారిపోతావు. నీవు సమాధానం వెదుకుతావు. నాకు సమాధానం కావాలని నీవు అంటావు. ఎవరైనా నా యింటి నుండి ఏదైనా తీసుకొనగోరితే వారిని తీసుకోనివ్వండి. నేను ఎవరితోను పోట్లాడను.
దేవుడు నీ కొక నూతన హృదయంను, నూతన నామమును ఇచ్చును. ఈలోకంలో దేనికొరకైనను సరే క్రీస్తును విడువకుము. క్రీస్తు నందు నీవు నిరుత్సాహపడవు. నేను పరిశుద్ధత కొరకు ప్రార్థించాను. నన్ను యోసేపువలే చేయమని దేవుని అడిగాను. ఒక పరిశుద్ధమైన జీవితం నీవు జీవించలేకపోతే అది నీ పొరపాటు. క్రీస్తు కొరకు ఒక సాక్షిగా జీవించటం ఒక ఆధిక్యత. ఒక పరిశుద్ధ జీవితం, క్రీస్తును పోలిన జీవితం ఈ రెండు చాలా ముఖ్యమైనవి.
|
|