లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నిజమైన శిష్యుడు

కీ.శే. యన్‌. దానియేలు గారు
మత్తయి 16:19

''పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేనిని బంధించెదవో, అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును''. క్రీస్తు తన శిష్యుల అభివృద్ధిని పరీక్షించుచుండెను. శిష్యులను పిలిచి వారిని తీసుకోవడం పెద్ద పూచి. నేను సుందర్‌సింగ్‌ గారితో నన్ను ఒక శిష్యునిగా తీసుకోమని చెప్పితిని గాని ఆయన నిరాకరించారు. కొంతమంది పరిశుద్ధులు శిష్యులను తీసుకొనుటకు అంగీకరించలేదు. ఒక కొండ ఒంటరిగా ఎక్కడం ఒక విషయం. నీతో శిష్యులను తీసుకొని వెళ్ళడం మరియొక విషయం శిష్యులు నిర్లక్ష్యంగా ఉండి తప్పటడుగులు వేస్తే మంచు మీద జారిపడి వారు చాలా అపాయములో ఉంటారు. వారు పరిశుద్ధుని యొక్క అభివృద్ధిని వెనక్కులాగుతారు. క్రీస్తు శిష్యులను తీసుకున్నాడు. దేవదూతలు పాపం ఎరుగని వారు గనుక వారు సువార్తను వ్యాపింప చేయలేరు. దేవున్ని స్తుతించటానికి వారు పనికి వస్తారు. మనుష్యులు మాత్రమే సువార్త వ్యాపకమునకు పనికి వస్తారు. పాపం నుండి విడిపించబడి రక్షకునిగా సమీపంగా నడిచేవారు ఈ పనికి పనికి వస్తారు. ఇలాంటి మనుష్యులు వారిలో ఉన్న సమస్తము పాపమే అని ఎరుగుదురు. వారిలో నుండి బయటకు వచ్చేదంతా కూడా పాపమే. వారు ఎంత గొప్ప ఉద్దేశ్యములతో ప్రారంభించిననూ అది చివరకు వ్యర్థమైన స్వార్థం.

క్రీస్తు 12మంది శిష్యులను తీసుకున్నాడు. వారిలో ఒకడు నిశ్చయంగా దొంగ. అతడు తన పదవి నుండి తప్పుకోవడానికి ఇష్టపడలేదు. క్రీస్తు తన శిష్యులతో పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి మాట్లాడుతున్నాడు. వారు ఆయన మాటను గ్రహించలేదు. క్రీస్తు భక్తిని గూర్చిన పెద్ద ప్రదర్శన, నిజత్వం లేకుండా ఉండే దానిని గూర్చి వారిని హెచ్చరించెను. కొంతమంది దేవుని చిత్తము వెలుపట ఉండి తమ్మును రక్షించినందుకు వందనములు అని చెప్పుతూ ఉంటారు. ఇలాంటి జీవితముల నుండి మంచి ఏమియూ రాదు. చాలాసార్లు ఈ శిష్యులు క్రీస్తును గ్రహించలేకపోయారు. వారిని ప్రార్థనకు కొండమీదికి తీసుకొని వెళ్ళినప్పుడు వారు నిద్రపోయారు. గెత్సెమనే వనంలో తీక్షణమైన సమయంలో వారు ప్రార్థన చేయవలసి యుండగా నిద్రించుచుండినారు. పేతురు తన ఖడ్గం తీసుకొని క్రీస్తును రక్షించడానికి వచ్చాడు. ఇది క్రీస్తుకు శ్రమను అధికం చేసింది. శిష్యుల భారంను క్రీస్తు భరించాడు. తప్పుడు ఉద్దేశ్యములను వారిలో నుండి తీసివేశాడు. వారిలోనికి సరియైన తలంపులను ఉంచాడు. అవి వారిని బలమైన మనుష్యులుగా చేశాయి.

నీ స్వంత శక్తి వలన నిన్ను నీవు సంతోషపరచుకోవాలని చూస్తున్నావా? నీవు సంతోషించలేవని తెలుసుకో. నిన్ను నీవు ధనికునిగా చేసుకోవాలని ఆలోచిస్తున్నావా? నీవు పేదవానిగా మారిపోతావు.

నీ హృదయంలో ఒక మూలలో సైతాను పొంచియున్నాడని తెలుసుకో. అతనిని తరిమి వేయమని దేవుడు కోరుతున్నాడు. ఏదో ఒక తప్పుడు ప్రేమ ఒక తప్పుడు ఆలోచన నీలో నుండి తీసివేయవలసి ఉన్నది. పేతురు క్రీస్తు దగ్గర నుండి గట్టి గద్దింపు తీసుకున్నాడు. అది అతనికి మేలైనది. అలాంటి గద్దింపులు మనకు అవసరము. దేవుడు మనకు బలమైన సుత్తి దెబ్బలు కొడుతుంటాడు. అది మనకు మేలే. మన కూటములలో ఒక వ్యక్తి మారుమనస్సు పొందాడు. సాక్ష్యం ఇస్తూ ఉండేవాడు. సేవలో ప్రయోజకుడిగా ఉండినాడు. కాని తన సాక్ష్యంలో ఒక తప్పుడు మాట ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తప్పుడు ఉద్దేశ్యము చివరకు అతనిని వెనుకకు లాక్కుపోయింది. మన హృదయంలో ఎక్కడో సైతాను పొంచియుంటాడు. పేతురు పొందిన గద్దింపును బట్టి అతడు తన శిష్యత్వమును విడిచి పెట్టలేదు. అతనిలో గర్వం ఏమియు లేదు. మనం మారు మనస్సు పొందినప్పుడు విడిచిపెట్టిన గర్వం ఏదో ఒక విధంగా మనలోనికి తిరిగివస్తే అది మనలను వెనుకకు లాగివేస్తుంది. ఏ విషయంలోనైనా సరే మనం కాదనటానికి సిద్ధంగా ఉండాలి. ఏ అవమానమునకు అయినను, పేదరికంనకు అయినను మనం సిద్ధంగా ఉండాలి. క్రీస్తు ఇచ్చిన బలమైన గద్దింపు వెనుక పేతురు ఇంకను తన్ను తాను తగ్గించుకున్నాడు.

మూల ప్రసంగాలు