|
సమస్తము క్రొత్తదాయెను |
కీ.శే. యన్. దానియేలు గారు |
2 కొరింధి 5:17
''అతడు ఒక నూతన సృష్టి'' క్రీస్తు నందు ఉంటే మాత్రమే నూతన సృష్టి.16వ వచనం కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగం. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇక మీదట ఆయన ఆలాగు ఎరుగం. ఇక మీదట ఎవరిని శరీరరీతిగా ఎరుగం అంటే సహోదరుడు క్రీస్తు నందు లేని సహోదరుని ఎరుగడు. నీవు నూతన సృష్టి అయితే నీవు అతనిని శరీరరీతిగా ఎరుగవు. ఆయన సహోదరులు, తల్లి ఆయన కొరకు కనిపెట్టుచుండగా క్రీస్తు ఏమి సెలవిచ్చినాడు ఎరుగుదురా? ''దేవుని వాక్యమును విని అలాగున చేయువారు నా సహోదరులును, సహోదరీలునైయున్నారు. మీరు అక్కడ నిలువబడి నాతో బంధుత్వం ఉన్నదని చెప్పవచ్చును. నేను మీకు చెందినవాడను కాను. నేను వీరికి చెందిన వాడను''. ''ఓ నీవు నా సహోదరుడవా'' అని యాకోబు, యూదా చెప్పియుండవచ్చు. కాని క్రీస్తు చెప్పాడు, ''మీరు నాకు ఎలాంటి సహోదరులు? మీరు దేవుని రాజ్యమునకు ఆటంకముగా ఉన్నారు''.
మన బంధువులలో కొందరు క్రైస్తవులు కాకపోవచ్చు. వారు నామకార్థ క్రైస్తవులై యుండవచ్చు. ఆదివారంనాడు నీ యొద్దకు వచ్చి నీవు ఆరాధనకు వెళ్ళకుండా ఆగిపోయి వారితో నీ సమయం గడపవలెనని ఆశిస్తారు. వారు మంచి భోజనంను, కలిసియుండడంను ఆశిస్తారు. నీవు ఆరాధన నుండి ఆగిపోతే నీవు క్రీస్తు నందున్న వానివి కావు. నీవు నూతన సృష్టికావు.వారి యొద్ద నుండి వారి భావముల యొద్ద నుండి నీవు తొలగిపోలేదు. నీవు నూతన సృష్టి అయినట్లయితే నేను నూతన సృష్టి. ''నేను క్రీస్తు నందున్నాను, నేను ఈ లోక పద్ధతులను వెంబడించలేను'', రోమా 12:2 ''మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి''. నీవు ఒక నూతన సృష్టి. దేవుడు తన చిత్తం నెరవేర్చుటకు నిన్ను నూతన పరికరముగా చేయబోవుచున్నాడు. నీవు నీ బంధువులను, నీ పాత స్నేహితులను తృప్తిపరచగోరితే నీవు పూర్తిగా తప్పిపోతావు. వారు నిన్ను పైకెత్తలేరు. క్రిందకు లాగి వేయగలరు కూడా. నీవు ఒక నూతన సృష్టియా? వారు వెనుకకు వెళ్ళిపోవుచున్న ప్రజలు. నీవు వారితో కలిసి ఉండవలెనని ఆశిస్తున్నావా? లేదు. నీవు ముందుకు వెళ్ళవలెనని ఆశిస్తున్నావు. కొంతమంది సైకిల్ తొక్కేవారు లారీని పట్టుకొని వేగంగా ముందుకు ఈడ్వబడతారు. కాని వారు వెనుకకు పోవుతున్న లారీని పట్టుకోరు. మనం చేస్తున్న క్రియ అలాగున్నది. నీవు నూతన సృష్టి అయితే పాత బాంధవ్యములన్నీ త్రెంచి వేయబడినవి. నీవు క్రీస్తు నందు నీయొక్క స్థానం తెలుసుకుంటే నీ నూతనత్వమును చూసి నిశ్చయముగా నిన్ను కొందరు వెంబడిస్తారు. నీ జీవిత విధానం వారికి ఆశ్చర్యమును కలిగిస్తుంది. అప్పుడు వారు నిన్ను వెంబడించవలెనని కోరతారు. ''ఏమిటి ఈ కుర్రవాడు మనతో ఒకటిగా ఉండేవాడు. ఇప్పుడు అతని జీవితం ఎంతో వ్యత్యాసంగా ఉంది'' అని వారు అంటారు. నీ పని అంతా నిన్ను నీవు క్రీస్తులో నిర్మించుకోవడమే. నీవు ఎంత ఎక్కువగా నిన్ను నీవు క్రీస్తులో నిర్మించుకుంటావో అంత ఎక్కువగా నామకార్థ క్రైస్తవులైన బంధువులను, స్నేహితులను నీవు ఆకర్షించగలవు. దేవునికి అవిధేయుడవు అవుట ద్వారా నీవు ఇతరులకు సహాయం చేసి వారిని స్నేహితులుగా చేసుకోవాలని చూస్తే నీవు నిలకడ లేనివాడవు అవుతావు. సైతాను కూడా నీ మీద శక్తి సంపాదించుకుంటుంది. నీవు ఒక బంధువుని, బంధువురాలను నీతో ఉండుటకు ఆహ్వానించినట్లయితే వారు నిన్ను చిక్కించుకొనుటకు వల వలే అవుతారు. నీకు కాకపోతే నీ పిల్లలకైనా అవుతారు. దేవుని చిత్తం కాకపోతే వారు వచ్చి నీతో నివాసం చేయకూడదు. వారు బంధువులు కావచ్చును, కాని నీవు నూతన సృష్టి. మన విశ్వాసులలో ఒకని సహోదరుడు తన వివాహానికి ఆహ్వానించాడు. అది ఒక హిందూ వివాహము. వారు ఆ వివాహ సమయమందు విగ్రహములను ఆరాధిస్తారు. కనుక అతడు ''నేను రాలేను'' అని చెప్పాడు. అతడు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిది.
నేను ఫుట్‌బాల్ బాగా ఆడేవాడిని. మారు మనస్సు పొందటానికి పూర్వము నాతో కలిసి ఆడేవారు నా స్నేహితులు, వారు చెడు మార్గములకు అలవాటు అయినప్పటికిని. కాని తదుపరి వారి సహవాసం నేను సంతోషించలేకపోయాను. వారు తమ మార్గమునకు వెళ్ళిపోయారు. పాత స్నేహితులు, పాత బంధువులు అందరూ జారిపోయారు. ఇప్పుడు వారు నావైపుకు చూస్తారు. వారి కష్టములలో వారు నాకు వ్రాస్తారు. కొంతమంది విశ్వాసంలో ఎదగరు. శ్రమలు వచ్చినపుడు వారు వణికిపోతారు. ''నేను వారితో చెప్పాను. మీ నూతన జీవంలో అనేక శ్రమలను మీరు ఎదుర్కొనవచ్చు. మీరు విశ్వాసంలో ఎదుగుట ద్వారా మీరు జయించండి'' వారు వివాహం చేసుకున్నారు. వారు మంచి స్థానంను ఆక్రమించుకున్నారు. కాని వారు ప్రార్థనలో ఎదగటానికి లక్ష్యముంచలేదు. క్రైస్తవ సహవాసం అవసరం అయినదని వారు ఎంచుకొనలేదు. నేను వారితో అనవసరంగా చెప్పాను. ''మీరు కృపలో ఎదగాలి. కష్టములు వస్తాయి. పరిశోధనలు వస్తాయి. అప్పుడు మీ విశ్వాసం నిలబడదు''. ఉపద్రవములు కలిగినప్పుడు కొంతమంది లక్ష్యం ఉంచలేదు. వారికి నిరీక్షణ లేదు. వారికి విశ్వాసం లేదు. అలాంటి వారికి వారి అవసరములలో ప్రార్థించేవారు ఉండరు. అకస్మాత్తుగా వారి అంతం వస్తుంది.
డాక్టర్లు కొంతవరకు సహాయం చేయగలరు. కాని సర్వశక్తిమంతుడైన దేవుడే మీతో ఎల్లప్పుడు ఉండి ఎన్నడూ మిమ్మును విడువడు. నీ సహోదరునికిగాని, నీ బంధువునికి గాని నీవు సహాయం చేయవచ్చును. కాని వారు ఆదివారం వస్తే నిన్ను ఆరాధన స్థలం నుండి ఆపి వేసుకోవడం చాలా తప్పు. ''దేవుడు మనందరి కన్నా గొప్పవాడు. ఆయనను ఆరాధించడానికి వెళదాం'' అని నీవు చెప్పాలి.
నీవు ఒక నూతన సృష్టి. నీ యందు పైకి తేల్చే శక్తి ఉన్నది. నీవు పైకి ఎదగడానికి పనికి వచ్చే దేనినైననూ గట్టిగా పట్టుకోవడానికి ఇష్టపడతావు.
|
|