|
నా సమస్తము యేసుకే |
కీ.శే. యన్. దానియేలు గారు |
2 కొరింధి 5:17
''క్రీస్తుకే నా సమస్తము సమర్పింతును'' సమస్తము అని నీవు చెప్పినప్పుడు నీ దృష్టిలో సమస్తము కావచ్చును. కానీ దేవుని దృష్టిలో అది సమస్తము కాదు. ప్రార్థన, బైబిలు పఠనము వలన నీ సమస్తము పెరుగును. 40 ఏండ్ల క్రితము నేనీ పాట పాడాను. నేను నా సమస్తమును సమర్పించాను అని అనుకున్నాను. నేను లోతుగా త్రవ్వినప్పుడు నా సమస్తము సమర్పించలేదని గ్రహించాను. ''నా సమస్తము క్రీస్తుకు సమర్పింతును'' అనే నీ వాక్యము నీ గ్రహింపు వలన కట్టుబాటు చేయబడింది. మన సమస్తమును క్రీస్తుకు సమర్పించినప్పుడు దేవుని వలన ఈ మెప్పుదల పొందుదుము. ''ఈయనే నా ప్రియ కుమారుడు. ఆయన యందే ఆనందించుచున్నాను''. ఒకనాడు దేవుడు మన విషయమై ఈ రీతిగా ఆనందించవలెను.
యెషయా 64:4 ''తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమునను చూచి యుండలేదు'' 1 కొరింథి 2 : 9 దేవునికి నీ నిమిత్తము ఏమి దాచియుంచినాడో అది తెలుసును. ఆయన దగ్గర ఉన్న దానికంటే తక్కువ విలువ కోరుకుంటే ఆయన దు:ఖిస్తాడు. ఆయన గొప్పవాటిని నీ కొరకు కలిగి ఉన్నాడు. నా యింటిలో అనేకమైన విలువైనవి ఉన్నవి. కాని నా మనుమరాలు వాటి కొరకు అడుగదు. ఆమె నా చొక్కా గుండీలను అడుగుతుంది. మన గ్రహింపులో చిన్న పిల్లలము కాక పెద్దవాటి లోనికి ఎదగాలి. దేవుడు నీ నిమిత్తము, నీ ఇంటి నిమిత్తము ఏమి దాచియుంచియున్నాడో నీవు ఎరుగుదువా? దేవుడు మరియను చూచినప్పుడు ఆమె ఎంత గొప్ప స్త్రీ కాబోతున్నదో ఆయన ఎరుగును. (లూకా 1:28-33) మరియ దేవుడు ఆమె కొరకు దాచి ఉంచినవి ఎరుగునా? నేనెరుగను కాని ఆమె ఆ గొప్ప వాటి విషయమై అర్హత పొందినది. దేవుడు వాటిని ఆమెకు ఇచ్చాడు. ఆమె స్త్రీలలో బహు ధన్యురాలు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు. చెవికి వినబడలేదు. మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మరియ దేవుని భయము కలిగిన కుటుంబం నుండి వచ్చినది. దేవుడు ఆమె కొరకు గొప్ప వాటిని దాచియుంచెను. అనేక క్రైస్తవ గృహములలో వ్యభిచారము ఉన్నది. వారి మధ్య భయం ఉన్నది. దాని విషయమై బైబిలు ఏమి చెపుతుంది ఎఫెసి 5 : 3 ''మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైననూ ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ''క్రైస్తవుడు ఈ రీతిగా ఉండవలెను. ఈ పాపము పేరు కూడా మీ మధ్య ఎత్తకూడదు. వృద్ధులైన వారు దానిని దాచినపుడు గొప్పవి ఎలాగు మీ దగ్గరి నుండి వచ్చును? మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు మీరు జారత్వము విడిచిపెట్టి పారిపోతారు. మేము పెరిగిన సంఘములో వీటి పేరైననూ ఎత్తలేదు. మిషనరీలు ఆ మెట్టులో జీవించారు.
కన్ను చూడలేదు. చెవికి వినబడలేదు. ఇవి దేవుడు మీ కొరకు దాచి ఉంచిన విషయములు. ఈ శరీర వాంఛల కొరకు పరుగులెత్తవద్దు. నాతో చదువుకున్న వారు అనేకమంది వీటిని వెంబడించి చనిపోయారు. దేవుని యెడల భయము జ్ఞానమునకు మూలము. యోబు 28:28 ''మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను''. భారతదేశములో పాపమునకు భయపడరు. మిగుల భయంకరమైన పాపి ధైర్యవంతమైన ముఖమును ధరించి బోధించగలడు. సైతాను వారిని చూచి నవ్వుతుంటాడు. కొంతమంది వేదాంత కళాశాలలో కూడా చదువవచ్చు. దేవుని గూర్చిన భయం అక్కడ నేర్చుకుంటారా? వేషధారణతో బోధించడానికి మొదలుపెడతారు. ఒక బోధకుడు అనేక అపాయములకు గురి అగుతాడు. అందుకే ఇలాంటి హెచ్చరిక ద్వితీ 11:18-20 లో ఇవ్వబడింది.
దేవుడు ఈ ఆజ్ఞను మనకు ఇచ్చుటలో ఆయన అజ్ఞానంగా ప్రవర్తించాడా? లేదు. మొదట ఈ ధర్మశాస్త్రము నీ హృదయంలో ఉంచుము అని దేవుడు చెప్పుతున్నాడు. దేవుని వాక్యము మన హృదయములోనికి తెచ్చుట అంత సులువైన విషయం కాదు. ఇతరులకు బోధించే నిమిత్తం మనము దేవుని వాక్యము చదువకూడదు. నేను అలాగ చేయుటకు ఇష్టపడలేదు. నేను అలా ఇష్టపడను. నేను దానిని నమ్మి నా హృదయములోనికి తీసుకొనకపోతే నేను దానిని బోధించటానికి ఇష్టపడను. ప్రతి వారికి ఈ పూచీ ఉన్నది. ప్రతివాడు తనను గూర్చి జాగ్రత్తపడి తన హృదయంలోనికి దేవుని వాక్యము తీసుకుంటే నీ ఇంట నున్న సమస్తమూ ఆశీర్వదించబడును.
ఈ రిట్రీట్‌లో ప్రతీది దీవించబడింది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి సమస్తము ఆయన చేతులలో విడిచిపెట్టాలి. దేవుడు దాచి ఉంచి ఆశీర్వాదములు నీ సహోదరుల్లో ఉంచబడినవి. దేవుడు వాటిని చూచుచున్నాడు. కాని నీవు వాటిని చూడలేదు. కనుక వారికి నీవు ఉపదేశించలేవు. వారిలో దాచబడిన బంగారం వారికి బోధించినప్పుడు అది బయటకు వస్తుంది. ఇశ్రాయేలు (యాకోబు) యోసేపుకు దేవుని విషయములను గూర్చి చిన్నతనం నుండి నేర్పించాడు. యాకోబు దేవునితో పోరాడి ఇశ్రాయేలు పేరు తెచ్చుకున్నప్పుడు యోసేపు చిన్నబిడ్డ. దేవుడు ఏ విషయంలో అతనికి నేర్పించాడో అవి యోసేపుకు కూడా నేర్పించి యుంటాడు. ప్రవచించు ఆత్మనీతిని కలిగించు ఆత్మ యోసేపు నుంచి వచ్చినవి.
ఐగుప్తు దాని అపవిత్రతను బట్టి బహు అధమమైన దేశంగా మారిపోయింది. ఈ రిట్రీటును విడిచి దేవున్ని కలుసుకోకుండా మీరు వెళ్ళకూడదు. దానియేలు ఒక దేవదూత వచ్చి అతనిని బలపరచువరకు ప్రార్థనలో పోరాడెను. పాపమును జయించే శక్తి నీకు పరలోకం నుండి క్రిందికి పంపబడును. కొంతమంది చెబుతారు. ''నేను శరీరం మీద జయం సంపాదించలేను. నాకు దుర్మార్గమైన తలంపులు వస్తాయి'' అంటే నీవు క్రింది అంతస్తులో ఉన్నావన్నమాట. ధనం మీద ప్రేమ, పేరు మీద ప్రేమ నన్ను చాలా కాలం క్రింద విడిచిపెట్టినవి. నేను వాటిని లక్ష్యం ఉంచను. నాకు క్రీస్తును పోలిన జీవితం కావాలి. అదే నన్ను తృప్తి పరచును.
|
|