|
మనము దేవుని నురిపిడి మ్రానుగా ఉన్నామా? |
కీ.శే. యన్. దానియేలు గారు |
1రాజులు 18:31-46 యెషయా 41:15
''నీవు కొండలను పొట్టు వలే చేయుదువు'' మనం అది నమ్మగలమా? దేవుడు మనకు ఈ వాగ్దానం ఇచ్చుచున్నాడు. నీవు ప్రార్థించే సమయంలో నీవు నురిపిడి మ్రానుగా తయారగుచున్నావు. దేవుడు నిన్ను పర్వతములను పొడిచేయువానిగా సిద్ధపరచుచున్నాడు. పట్టు కొరకు నీలో పండ్లు నిర్మించుచున్నాడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు ఒక దినాన నీవు పర్వతములను నూర్చుదువు. దేవుని రాజ్యమునకు అడ్డముగా నిలువబడు పర్వతములు పొడిగా కొట్టబడును. ప్రార్థించే నరుడు బలిష్టుడౌతాడు. మాట్లాడే మనుష్యులను గూర్చి భయపడవద్దు. వారెప్పుడు ప్రార్థన చేయరు గాని చాలా మాట్లాడతారు. వారు మాట్లాడినప్పుడు వాళ్ళు సైతాను చేతిలో ఉన్నారు. ఒకనాడు సైతాను నిన్ను అతని ఉద్దేశ్యముల నిమిత్తం వాడుకుంటాడు. సంఘమునకు అపాయకరులైన వారెవరు? క్రమముగా సంఘానికి వచ్చి ఎన్నడు ప్రార్థన చేయని వారు, ప్రార్థన అనగానేమి? అది దేవునికి మనం ఇచ్చే తరుణం. ఆయన పండ్లకు పదును పెడతాడు. దేవుడు మనలను వినియోగించేటప్పుడు మనం పర్వతములను నూర్చుదుము. నేనీ వాగ్దానములు చదివేటప్పుడు నేను ఆశ్చర్యపడుతుంటాను. పర్వతములు, కొండలు ఎక్కడపడితే అక్కడ కనపడుతుంటాయి. వారు సంఘంలో నాయకత్వం వహిస్తుంటారు. ఒకరోజున వారు దుమ్ముగాను, ధూళిగాను మారుతారు. ప్రార్థించే వాడు నూర్చుతాడు. మన సంఘములు దుస్థితిలో ఉన్నాయి. యూనివర్శిటీ డిగ్రీలు తెచ్చుకున్న వారు ఉన్నారు. వారు దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచిన పాత్రలు కారు. వారు యౌవన దినములలో వ్యభిచారం నుండి దూరంగా ఉండలేరు. వారు గొప్ప బుద్ధిహీనులు. సామెతలు 6:32 నేను దీనిని పిల్లవానిగా చదివితిని. దానిని గుర్తు పెట్టుకున్నాను. నేను ఈ వాక్యమును చదివేటప్పుడు వణికేవాడిని. ఈ పాపము చేసినవారు దేవుని రాజ్యమునకు పనికిరారు. పాపమును దాచిపెట్టేవారు, వేదిక మీద నుండి బోధించవచ్చును. సైతాను సంతోషిస్తాడు. మిషనరీలు పాశ్చాత్య దేశం నుండి వస్తారు. వారు కొన్నిసార్లు వారి సమర్పణను లెక్కించుకోవచ్చు. నీ జీవితంలో పాపమును దాచినప్పుడు నీ సమర్పణ వలన ప్రయోజనం లేదు. సమర్పించుకొనే మనుష్యుడు ఇతరులను తప్పుదోవ పట్టించవచ్చు. పరి.ఫ్రాన్సిస్ దీనిని గ్రహించాడు. ఐరోపా ఖండమంతా ఆయనను వెంబడించడానికి సిద్ధంగా ఉండినారు, కొద్ది విషయంలో ఆయన దారి తప్పినాడు బోధకులమును, సువార్తి కులమైన మనము మన యొక్క సమర్పణను బట్టి ఇతరులను ప్రక్కదోవ పట్టించవచ్చు. నీ సమర్పణ కాదు. క్రీస్తు యొక్క సమర్పణ మన కొరకు రక్షణ తయారు చేసింది. నీ యెదుట సిలువ నిలువబడియున్నప్పుడు నీవు పాపమును దాచవు. అప్పుడు క్రీస్తు ఈలాగు చెప్పచున్నాడు. ''రండి, పరిమితము లేని నీతిమార్గము నీకు చూపింతును'' యెషయా 48:17.
ఆయన నీకు నేర్పించిన, ''నీవు వెళ్ళవలసిన మార్గము ఇదే'' ఆయన ఉపదేశం ప్రయోజనకరమైనది. నీవు ఆయన యొద్ద ఏమి నేర్చుకున్నను అది లాభదాయకముగానే ఉంటుంది. దేవుడు ఇలాగు చెప్పుతున్నాడు. ''నేను నీకు లాభదాయకం కలిగించు మార్గము నేర్పింతును. నీవు కళాశాలకు వెళ్ళి ఇది అది నేర్చుకుంటావు. కాని నేను నీకు నేర్పు మార్గము లాభదాయకమై యుండును''. దేవుని సలహా మీరు తీసుకుంటే దానికి మీరు ఎన్నడూ దు:ఖించరు. ఏ పరిశుద్ధులును దీనికి దు:ఖించలేదు. నీవు ఒక తండ్రివి, తల్లివి అయితే దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నీ గృహంలో ఉండేది ఏదైనా సరే నూర్పిడి చేస్తాడు. నీ బంధువులు నీకు వ్యతిరేకంగా రావచ్చును. కాని ఏమియూ చేయలేరు. వారి ఎదుర్పాటును నురిపిడి చేస్తావు. పెద్ద నదులు సమాధానమును సూచించును. మనము చూడగలిగేంతవరకు యదార్థంగా ప్రార్థించేవారు నీతి తరంగముల వలే ఉందురు. నేను అప్పుడప్పుడు సముద్రంలో స్నానానికి వెళ్ళుతుండేవాడిని. తరంగములు వచ్చి నన్ను వాటి దిశలో దొర్లించుకొని పోవును. అదేవిధముగా మీ నీతి ఇతరులు దొర్లేటట్లు చేస్తుంది. ఏలియా అలాంటి తరంగము వలే ఉండినాడు. ఆయన నీతి ఒక తరంగము వలే వచ్చింది. ఆహాబు, అతని భార్య, 800 మంది బయలు ప్రవక్తలు దొర్లుకుంటూ క్రిందికిపోయారు. ''నీ నీతి, నా నీతి'' యెషయా 54:17.
ఓ యవ్వనస్థుడా, ఓ యౌవ్వన స్త్రీ నీవు ప్రార్థించే మనుష్యుడవా? ప్రార్థించే స్త్రీగా ఉన్నావా? అనేకమంది మేడం గ్యోంను విమర్శించారు. కాని ఒక దశ వచ్చినప్పుడు పరిశుద్ధులు సైతం వెళ్ళి ఆమెను కలుసుకున్నారు. ఫెలోషిప్ యొక్క నీతి సముద్రతరంగముల వలే ఉండునని యోచిస్తున్నాను. వీటిని దేవుని యొద్ద నుండి పొందుకొందుము. 28 సం||ల క్రితం నేను ఈ వాక్యాన్ని చదివాను. నాకు ఆర్థిక ఇబ్బంది ఉండినది. నేను ప్రభువును అడిగాను ''ప్రభువా, నేను ఇక్కడకు నా సొంత నిశ్చయతలో వచ్చానా? లేక నీవు నన్ను ఇక్కడకు తీసుకువచ్చావా?'' నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసాను. దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు. యెషయా 48:15 మధ్య రాత్రి వేళలో దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అప్పుడు నేను చాలా సంతోషించాను. బహు సామాన్యమైన భోజనం ఆ మధ్యాహ్నం భోంచేసినప్పుడు నేను లక్ష్యముంచలేదు. ఎందుకనగా మా దగ్గర ఒకటిన్నర పైసలు చేతిలో ఉండినవి.
ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. దీని భారం తీసుకునే వారు ఎవరు? బయలు ప్రవక్తలు యెజబెలు భోజనపు బల్ల దగ్గర సంతోషంగా ఆరగించుచున్నారు. సంఘం యొక్క పరిస్థితులు చూడండి. నీ కుటుంబమునకు ఏమి సంభవించును?
పిల్లలకు సత్యము ఎవరు నేర్పించుదురు? సత్యమునకు గ్రుడ్డిగా ఉండవద్దు. ఏలియా పిచ్చివానివలే ఉన్నాడు. భోజనం ఉన్నా లేకపోయినా దానికి లక్ష్యం ఉంచలేదు. కెరీతి వాగు దగ్గర ప్రార్థన చేసాడు. అతడు దేవునిని ఈలాగుే అడిగి ఉండవచ్చు, ''మోషే వలన రక్షించబడిన ప్రజలము మేమేనా?'' సంఘం యొక్క పరిస్థితిని బట్టి నీకు ఏమైనా దు:ఖం ఉందా? సంఘం యొక్క, క్రైస్తవ కళాశాలలు బడుల యొక్క దిశలో నీ భావమేమి.
సంఘంయొక్క దేశం యొక్క పరిస్థితి ఏలియాను దు:ఖంతో పిచ్చివాని వలే చేసింది. ఈ దేవునిని కలుసుకోవాలి అనుకున్నాడు. ఆయన దేవునితో పోరాడినాడు. ఒక్క రాత్రి అయినా నీవు సంఘం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? విడిపోయిన కుటుంబం కొరకు లేక ఇతరుల కొరకు? నీకు ఆత్మీయ దృష్టి ఉంటే నీవు ప్రార్థించటానికి త్వరపెట్టబడతావు. ఏలియా ప్రార్థన నుండి తిరిగివచ్చి ఆహాబును కలుసుకున్నాడు. అంతకుముందు ఆయన యెజెబెలు బల్ల దగ్గర తినడానికి, త్రాగటానికి వెళ్ళలేదు. ఒక విధవరాలు దగ్గరకు వెళ్ళాడు. ఆయన విశ్వాసముండిన ఒక స్థలానికి వెళ్ళాడు గాని ఆర్థిక సమృద్ధి ఉన్న స్థలానికి వెళ్ళలేదు.
ఏలియా సజీవుడైన దేవునిని నిరూపించాడు. నీ ఆసక్తిని బట్టి నీవు నడిపించబడవద్దు. నీ హృదయం దేవుని కొరకు అగ్నితో మండుచున్నదా? మధ్య రాత్రివేళ నీవు ప్రార్థించుచున్నావా? సంఘముల భారం నీకు వచ్చుచున్నదా? సంఘముల భారం నీకు వచ్చుచున్నదా?
నీవు యౌవనస్థుడవుగా ఉన్నావు. వేరే ఇతర భారములన్నియు నిన్ను క్రుంగదీయటం లేదు. కనుక దేవునికి మొర్ర పెట్టు, దేవుడు నిన్ను నురుపిడి మ్రానుగా చేయబోవుచున్నాడు. 'ప్రభువా నా అయోగ్యతను నాకు చూపెట్టు నన్ను వినియోగించుకొనుము' ఇది మన ప్రార్థనయై ఉండును గాక.
|
|