|
మీరు మార్పు నొందుడి
|
కీ.శే. యన్. దానియేలు గారు |
మత్తయి 14:22-36 వరకు
ఐదు (5)వేల మందిని పోషించే అద్భుత క్రియ తర్వాత ఒంటరిగా ప్రార్థనకై వెళ్ళిపోయాడు. శిష్యులు పంపించి వేయబడ్డారు. కాని క్రీస్తు ఒక్కడే నిలబడ్డాడు. తనకు కపెర్నహోము చేరేందులకు మార్గము లేదని ఆయన చింతించలేదు. శిష్యులు ప్రార్థన యొక్క ఆవశ్యకతను గమనించలేదు. వారు ఆత్మీయ రంగంలో ప్రవేశించలేదు. అక్కడ ఒక దైవజనుడు చీకటి శక్తులను ఎదుర్కొవాలి. దేవుని చిత్తమునకు వెలుపల ఉన్న మారుమనస్సు పొందిన వారిని గూర్చి సైతాను లక్ష్యముంచలేదు. రోమా 12:2 ''మీరు ఈలోక మర్యాదననుసరింపక ఉత్తమమును, అనుకూలమును సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనునట్లు మీరు జాగ్రత్త పడవలెను'' ఒకడు ఎల్లప్పుడు తన మనస్సు నందు నూతన పర్చబడుతూ ఉండాలి. దేవుని వాక్యమును పరిశుద్ధాత్మయు ఎల్లప్పుడు ఒకనిలో పూర్తిమార్పు కల్గించుచు ఉండాలి. నీవు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉంటే సైతాను నిన్ను ప్రత్యేకమైన శత్రువుగా భావిస్తాడు. పరి పౌలు ఆసియాకు వెళ్ళవలెనని తన ప్రయాణం స్థిరపరచుకొన్నాడు. కాని ఆ రాత్రి ప్రభువు అతనిని ఐరోపా ఖండమునకు మార్చాడు. ఆసియా వెళ్ళడం మంచిదే. కాని అది పరిపూర్ణ దేవుని చిత్తము కాదు.
మనం సైతానుతో పోరాడటానికి రంగస్థలం ప్రవేశించామో లేదో అది ప్రశ్న. అలాగయితే నీవు ప్రార్థన కొరకై వెళ్ళిపోవాలి. సరి అయిన మెట్టులో నీ ఆత్మీయ జీవితం కాపాడుకుంటేనే నీలో నుండి జీవ జలం క్రింది మెట్టులో నున్న వారికి ప్రవహించును. ఆ సమయానికి క్రీస్తు శిష్యులు ఆత్మీయంగా మెళకువగా లేరు. కనుక వారిని తమ సొంతమార్గమున వారి ఆత్మీయ మెట్టును గ్రహించే వరకు ఆయన వెళ్ళనిచ్చాడు. క్రీస్తు తన మెట్టును ఎరిగియుండినాడు. పేతురు తన మెట్టును ఎరుగకుండా ఉండినాడు, గెత్సమనే వనంలో సైతం తాను పోరాడబోయే పోరును తాను ఎరుగకుండా ఉండినందున అతను నిద్రించినాడు. అతని బలం పూర్తిగా సరిపోనిది. కాని అది అతను ఎరుగడు. రాత్రి మొదటి భాగంలో క్రీస్తు ప్రార్థనలో ఉండినాడు. కాని శిష్యులు పడవను నడిపించుచునే యుండినారు. సైతాను వారిని ఎదిరించుచు ఉండినాడు. గనుక వారు తమ మార్గంలో ముందుకు సాగలేకపోయారు. క్రీస్తు పడవలోనికి ఎక్కినప్పుడు మట్టుకే వెంటనే పడవ దరికి చేరింది. ఆయన సముద్రము మీద నడుస్తూ వచ్చాడు. ప్రార్థించినప్పుడు మట్టుకే మనం ఎరుగని దానిని తెలుసుకుంటాము. నూతన క్రియలు చేస్తాము. క్రీస్తు ఓడలోనికి వచ్చినప్పుడు గాలి ఆగిపోయింది. దేవుని చిత్తంలో ఉండుట సమయంను సరిగా వినియోగించుకొనుట. క్రీస్తు తన ప్రార్థన ముగించుకొని వారిని చేరే వరకు ఈ ప్రజలు పోరాడుతూనే యున్నారు. డబ్బును బట్టిగాని సమయమును బట్టిగాని ప్రార్థన యొక్క విలువను కట్టవద్దు. కాని ప్రార్థన యొక్క విలువను డబ్బులో గాని, దాని కొరకు హెచ్చించే సమయంలో గాని ఎంచవద్దు. దేవుడు మనతో, మనమీద పని చేసే సమయంలో తీసుకొని మనం సమయంను సద్వినియోగం చేసుకున్నాం అనుకుంటున్నాం. చివరగా పేతురు వలే నీవు మునిగి పోవనారంభిస్తావు. లోతైన నీళ్ళలో నీవు చిక్కుకుంటావు. క్రీస్తు ఎన్నడూ ఆలాగు చిక్కుకోలేదు, ఆయన గెన్నెసరేతుకు చేరగానే వ్యాధిగ్రస్తులందరిని క్రీస్తు నొద్దకు తీసుకువచ్చారు. ఆయన వారి అవసరతలన్నింటికి సమానంగా ఉండినాడు. క్రీస్తు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు సైతాను 40 దినములు శోధిస్తూనే ఉండినాడు. ఎందుకనగా ఆ 40 దినములు ప్రార్థన ఆయన జయకరంగా ముగించినట్లయితే సైతాను రాజ్యం క్రిందికి లాగి వేయబడును.
మనము ప్రభువు వలే ఉండాలి. మనం ఆత్మీయంగా మెళకువగా ఉండాలి. ఏ సమయమందైనను మనయొక్క ఆవశ్యకతను ఎదుర్కొనవచ్చు. వ్యాధిగ్రస్తులు మనలను చుట్టుకుంటే మనం దానికి సమానులమేనా! ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరిచే శక్తి కొరకు ప్రభువును అడుగుచున్నాను. మనుష్యులు మన దగ్గరకు వచ్చి మనం వారి కొరకు ప్రార్థన చేయగా వెంటనే వారు పాపమును గూర్చి ఒప్పించబడాలి. ప్రతివిధమైన వ్యాధిని స్వస్థపరిచే శక్తిని గూర్చి దేవుని ప్రార్థిస్తున్నాడు. నీకున్న బలం ఏమాత్రమున్నదో నీవు ఎరిగి ఉండాలి. కాని నీకు అవసరమైన బలమును గూర్చి తెలుసుకొనుటకు ఆత్మీయంగా చురుకుగా ఉండాలి. ప్రజల యొక్క ఆవశ్యకత గొప్పది. మీ అందరికీ ఈ సేవలో భాగమున్నది. వ్యాధిగ్రస్తులు ఆయన వస్త్రపు చెంగును మట్టుకు ముట్టుకొనవలెనని ఆశించారు. అలాంటి స్వస్థత కొరకు ఒక దీనమైన పరిశుద్ధమైన జీవితం అవసరం.
|
|