|
క్రీస్తుతో ఉండుట |
కీ.శే. యన్. దానియేలు గారు |
యోహాను 15 :27
''మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు'' శిష్యులు వచ్చి క్రీస్తుతో కూడా ఉండిరి. అది సులువైన కార్యము కాకపోవచ్చు. క్రీస్తుతో నివసించడం సులువైన కార్యం కాదు. లోకస్తులు ఆయనతో నివసించలేరు. వారి మానసిక, శారీరక ఆత్మీయ శక్తుల మీద చాలా ధైర్యముగా కోరతారు. క్రీస్తుతో ఉన్నవారు వారి ఇష్టానుసారముగా నిద్రపోవటానికి వీలులేదు. ఇతరులను దూషంచలేరు. లోకస్థుల వలే తమ్మును గూర్చి తాము గొప్ప చెప్పుకోలేరు. వారు గద్దింపులు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నిరాశలు, అదుర్పాటులు కొన్ని పరమ రహస్యములను ఎదుర్కోవాలి. వారు వివరించలేక అవి వారికి తెలియపర్చబడే వరకు ఓపికతో కనిపెట్టాలి. మన వ్యక్తిగత జీవితంపై మనం హక్కును కోరలేము. మనం క్రీస్తుతో ఉండి మన హృదయం మన ఇష్టానుసారంగా లేవడానికి వీలులేదు. మన సమయాలను వ్యర్థమైన సంభాషణలో గడపడానికి వీలులేదు. నీ మనోభావం ఎల్లప్పుడు దిద్దబడుతూ ఉంటుంది. నీవు గొప్పగా ఎంచేది క్రిందపడవేయబడుతుంది. తెలుసుకొనుట, తెలుసుకొనకపోవుట అనేవి విస్తారముగా నీ జీవితంలో ఉండును. నీ సమయం నీది కాదు. నీ సొంత తలంపులు, ఉద్దేశములు తొలగించవలెను. క్రీస్తుతో ఉండటం సులువు కాదు.
కొంతకాలం క్రీస్తుతో జీవించిన తర్వాత శిష్యులు అనుభవం సంపాదించుకున్నారు. జీవిత పోరాటములలో అది వారిని బాగా బలపరిచింది.
యోహాను 6:53 ''మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము కలవారు కారు'' అనే వాక్యము ప్రజలు గ్రహించలేక పోయారు. ఆయన మాటలు ఆయన మార్గములు సులువుగా గ్రహించుకోలేము. వారందరు లాజరు సమాధి యొద్దకు నడిచి వెళ్ళారు. వారందరు వేదనలో ఉండినారు. వారు చూడబోయే దాని విషయమై వారి విశ్వాసము సమముగా లేదు. వారు క్రీస్తుతో తుఫానులో ఉండినారు. నిరాశలోనికి వారు పరుగెత్తినారు. వారి విశ్వాసములో కొరత గద్దించబడింది. క్రీస్తు వారిని ఐదు (5) వేల మందికి ఆహారం పెట్టమని సెలవిచ్చినప్పుడు వారికి ఎటూ తోచలేదు. 200 దేనారముల రొట్టెలు కూడా ఈ 5వేల మందికి ఆహారం పెట్టుటకు సరిపోవు - వారి ఊహ అంతమోటుగా ఉండినది. ఆయన వలే వారు ఆలోచించలేకపోయారు.
యెషయా 55:8, 9 ''నా తలంపులు మీతలంపుల వంటివి కావు మీత్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యెహోవా వాక్కుఆకాశములు భూమి పై ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీతలంపుల కంటె నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి''.
పేతురు దారుణమైన అనుభవం సంపాదించుకున్నాడు. క్రీస్తు ''సాతానా నా వెనుకకు పొమ్ము'' అని చెప్పవలసి వచ్చినది. నీ క్రమము లేని జీవితం క్రీస్తుతో కూడా నీవు జీవించుటకు కష్టసాధ్యమైన పనిగా చేస్తుంది. అదే విధముగా నీ సందేహించు విశ్వాసం మరియు నీ క్రమశిక్షణ లేకపోవటం క్రీస్తుతో నివసించటానికి వీలుకానివిగా చేస్తాయి.క్రీస్తు జీవితంలో ప్రతి భావము మీదను ఆయన గంభీరమైన వ్యక్తిత్వమైనవాడు. తన కంటిలో నుండి వచ్చినటువంటి గుచ్చుకొనే దృష్టి మనుష్యుల యొక్క తలంపులను వారి యొక్క ఉద్దేశములను దృష్టించగలవు. పరిసయ్యుల యొక్క తలంపులు దృష్టించబడి గద్దించబడింది. క్రీస్తుతో కూడా ఉండుట సులువైన విషయం కాదు.
నీవు క్రీస్తుతో కూడా ఉన్నావా?నీవు ఆయనతో జీవించే క్రమశిక్షణలో నిన్ను నీవు పెట్టుకున్నావా? నీవు వ్యాధిగ్రస్తుని యొక్క పడక యొద్దకు లేక చనిపోయిన వాని యొద్దకు నీవు క్రీస్తుతో కూడా నడిచి వెళ్ళితివా? పరిశుద్దాత్మ వచ్చినప్పుడు క్రీస్తును గూర్చి ఆయన సాక్ష్యమిచ్చును. కాని క్రీస్తుతో నడిచేవారు, క్రీస్తుతో ఉండేవారు మనుష్యులు గ్రహించగలిగిన విధముగా వారు ధృడమైన అనుభవం సంపాదించుకుంటారు. యోహాను 15:26, 27 వారి వేదాంత జ్ఞానం వలనగాని, వారికి కలిగిన ఉత్తేజం వలన గాని వారు మాట్లాడరు. క్రీస్తుతో కూడా ఉండే అనుభవం శిష్యులు కలిగి ఉండినారు. శిష్యులకు క్రీస్తుతో కూడా ఉండే అనుభవం ఉండినది. వారు పరిశుద్ధాత్మను సంపాదించుకున్నారు. ఇవి రెండు చక్కగా కలిసి వారిని సంపూర్ణులైన సాక్షులుగాచేసినవి.వారికి భయములు గాని, సందేహములు గాని లేవు. 1యోహాను 1:1 ''కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటామో, మా చేతులు దేనిని తాకి చూచెనో'' అని వారు చెప్పిరి. ఆయన సన్నిధి కోరేటటువంటి కోర్కెలకు మిమ్మును మీరు లోబరచుకొనినవారు. మీ సొంత మార్గముల వెంబడి వెళ్ళేవారు ఆయనకు పదేపదే అవిధేయులు అవుతారు. అప్పుడు ఆయన మీ వద్ద నుండి వెళ్ళిపోతారు. ఒక మనుష్యుడుక్రీస్తును వెంబడించుటకు ఒక అనిస్థితమైన తేదీలు నియమించితే అనగా అతని తండ్రిని సమాధిచేసిన తరువాత - క్రీస్తుచెప్పారు'' మృతులు తమ మృతులను పాతిపెట్టనివ్వండి. నీవు వచ్చి నన్ను వెంబడించు''. క్రీస్తుతో చనిపోవుట అనే తిరుగులేని అనుభవం ఒకడు పోగొట్టుకొనకూడదు.
ఒక దినమున పరి. ఫ్రాన్సిస్‌గారు ఒక ధనికుని ఇంటికి వెళ్ళారు. ఈ వ్యక్తి ఫ్రాన్సిస్ గారి జీవితం చూడవలెనని ఆశించారు. వారు నిద్రకు వెళ్ళినప్పుడు అతని గౌనును ఫ్రాన్సిస్ గారి గౌనుతో కలిపి కట్టివేసి నిద్రపోయాడు. అలాగయితే ఫ్రాన్సిస్‌గారు నిద్ర నుండి లేచినప్పుడు ఇతడు కూడా లేవవచ్చునని అనుకున్నాడు. ఫ్రాన్సిస్‌గారు మధ్య రాత్రిలో లేచి ఆ ముడిని విప్పి వేసి ప్రార్థనకు వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి బర్నార్డుగారు నిద్రలేచి ఫ్రాన్సిసుగారు వెళ్ళిపోయిన సంగతి చూచి ఫ్రాన్సిసు గార్ని వెదకటం ప్రారంభించాడు. ఫ్రాన్సిసుగారు ప్రార్థిస్తూ ఉండటం చూసాడు. ఆయన చుట్టూ గొప్ప ప్రకాశమానమైన వెలుగు ఉండింది. బెర్నార్డు దానికి తట్టుకోలేకపోయాడు. ఆయన మూర్ఛిల్లినాడు. ఆ రాత్రి బెర్నార్డు మారుమనస్సు పొందవలెనని భావించాడు. బెర్నార్డు మారుమనస్సు పొందాడు.
ఫ్రాన్సిసు గారితో నివసించడం చాలా కష్టమైన విషయం. ఫ్రాన్సిసు గారు శరీరాన్ని ''గార్థభం'' అని పిలిచాడు. ఎందుకంటే మంచి క్రమశిక్షణకు అది ఎల్లప్పుడు అడ్డం తగులుతూ ఉంది. సులువుగా కోపపడుతుంది. వికారమైన రీతిగా సమయం కానప్పుడు దాని గురించి తెలియచేస్తుంది. మన శరీరం అలాగుంటుంది.
పరిపౌలుగారు క్రమశిక్షణను గూర్చిన విలువను ఎరిగియుండినాడు. క్రీస్తుతో ఉండటం కష్టమైన విషయం. కాని ఒకసారి నీవు ఆయనతో ఉన్నప్పుడు నిన్ను ఒక గొప్పవ్యక్తిగా చేస్తాడు. నీ మాటలు మనుష్యుల హృదయములోనికి చొచ్చుకొనిపోయే బలమైన బుల్లెట్లుగా చేస్తారు. క్రీస్తు ఈ విధంగా చెప్పారు. ''నాతో కూడా మీరు ఉండి అనుభవం సంపాదించుకున్నారు. పరిశుద్ధాత్ముడు మీకు సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేస్తాడు.
నీ యౌవన దినములలో క్రీస్తుతో కూడా ఉండటం చాలా ఆశీర్వాదకరమైనది. ఈ స మయంలో సౌఖ్యమైనటువంటి నిద్రను నీవు కాదనుకుంటే నీవు పరలోకంలో గొప్ప సంపాద్యమును సంపాదించుకుంటావు. నీ జీవితం ప్రయోజకత్వంలో పెరుగుతుంది. కాని అది ఎన్నడును పనిచేయనిది కాదు. మానసిక సంబంధమైన వేదాంత శాస్త్రము వల్లగాని లేక రోమన్ కేథలిక్‌లు వెంబడించే శరీర సంబంధమైన క్రమశిక్షణ ద్వారా గాని ఆత్మీయ సంబంధమైన మందత్వం జయించలేము. మిమ్మును దిద్ది మార్చేటటువంటి రక్షకునితో జీవించుట అవసరం. శిష్యుల జీవితములు మందమైనవిగా ఉండటానికి వీలులేదు. యోహాను 15:27 ''మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు''.
శనివారం రాత్రి ప్రార్థన అనగా ఆయనతో ఉండటం ఆయన శ్రమలలో పాలుపొందటం, ఆయన భారమును భరించటం, యెషయా 44:8, ''మీరే నాకు సాక్షులు''. ఆయన మన మీద ఆధారపడియున్నాడు. శరీరం లేకుండా ఆత్మసాక్ష్యము ఇయ్యనేరదు. ఈ శరీరము క్రీస్తుతో ఉండటానికి ఎంతకాలం క్రమశిక్షణ పొందినదో లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడో మీ సాక్ష్యము ఎదురాడుటకు వీలుకానిది మీ సాక్ష్యము ద్వారా లోకము ఆశీర్వదించబడును. మనం ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతాము. 1. యోహాను 1:1 ''కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటామో, మీ చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము.
|
|