|
దేవుని ఆలయమును కట్టుట |
కీ.శే. యన్. దానియేలు గారు |
యిర్మియా 10:19,20
''కటాకటా నేను గాయపడితిని. నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించుదును. నా గుడారము చినిగిపోయెను. నా త్రాళ్ళన్నియు తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయియున్నారు. వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు''.
దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన పిల్లలు ఆయన గుడారము విడిచిపెట్టారు. గనుక దేవుడు దు:ఖపడుతున్నాడు. ఈ గుడారము వారు అరణ్యమందు విడిచిపెట్టారు. అది ఒక చోట నుండి ఒక చోటుకు మోసుకొని పోగలిగిన ఆరాధించే స్థలం. దేవుని వాక్యానుసారముగా అది నిర్మించబడింది. దేవుని నిబంధన మందసం అందులో ఉండినది. దేవుని వ్రేళ్ళతో ఆయన ఆజ్ఞను రచించిన రాతి పలకలు కూడా అందులో ఉండినవి. దేవుడు చెప్పుతున్నాడు తాళ్ళు తెగిపోయినవి. పిల్లలు తన యొద్ద నుండి వెళ్ళిపోయారు. దానిని బాగు చేసే వారు లేరు. పాస్టర్లు దానిని చేయలేరు. ఎందుకనగా వారు ఆయనను వెదికినవారు కారు. పర్ణశాలను నీవు నిలబెట్టగలవా? దానిని నిర్మించుటకు ఆశ ఉన్నది? నీవు దానిని నీ సొంత హస్తములతో నిర్మించడానికి ప్రయత్నంచేస్తే అది విరిగిపోతుంది. అది మానవ హస్తం కాదు. కాని విశ్వాసపు హస్తము ఆ త్రాళ్ళను లాగవలెను. వారు దానిలోనికి ప్రవేశించినప్పుడు దేవుని ఆత్మ మనుష్యులను కలుసుకోవాలి. హృదయము నెమ్మదిపరిచే ఆత్మ అక్కడ ఉండాలి. గుడారమును వేయగలవారెవరు. దేవునికి భయపడేవారు చేయగలరు. మనయొక ఆరాధన స్థలమునకు ప్రార్థన లేకుండా వెళ్ళగూడదు. దేవుని సన్నిధిని నీతో తీసుకుని వెళ్ళాలి. అప్పుడు నీ చుట్టూ ఉండే ప్రజలు నిర్లక్ష్యముగా ఉండలేరు. దేవుని ఆత్మను నీతో తీసుకుని వెళ్ళి బోధకుడికి సహాయకుడిగా ఉండవలెను. మనం పరిశుభ్రమైన బట్టలు వేసుకొని ఆరాధన స్థలానికు వెళ్తాము. కాని మన హృదయం అపవిత్రంగా ఉంటుంది. మన కన్నులు అపవిత్రంగా ఉంటాయి. మనం దేవుని ఆలయం ఎలాగు అపవిత్రపరుస్తున్నాము, పరిశుద్ధాత్ముడు ఆలయంగా ఉండవలసిన శరీరము పాపపు ఉత్తేజములతో నిండియున్నది. ఆయన పరిశుద్ధ దేవుడని మనం మరచిపోతున్నాము. ప్రతి ఇతరమైన దానిని గురించి నీవు గమనం పోగొట్టుకుంటున్నావు. నీ వస్త్రములను గూర్చి కూడా కానీ పరిశుద్ధ దేవుడని మనం మరిచిపోతున్నాము. ప్రతి ఇతరమైన దానిని గురించి నీవు గమనం పోగొట్టుకుంటున్నావు. నీ వస్త్రములను గూర్చి కూడా కానీ పరిశుద్ధుడైన దేవుని ఎదుట నీవు ఉన్నావని జ్ఞాపకం ఉంచుకో. అక్కడ నీవు వ్యాధిగ్రస్తురాలైన నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చును. లేక దారి తప్పిన నీ బంధువును జ్ఞాపకం చేసుకొనవచ్చును. దేవుడు నీ మొర్ర వింటాడు. కొన్నిసార్లు మనం పోట్లాడి దేవుని గృహంలోనికి వెళ్తాము. మరికొన్నిసార్లు మనం మంచి వస్త్రములు లేవే అని విచారంతో వెళతాము. మనం ఆరాధన స్థలాన్ని ఒక శక్తివంతమైన స్థలంగా మార్చితే ఎంతో మేలు ! మనం బోధకుని గూర్చి గాని, అతనితో ఉన్న లోటుపాట్లను గూర్చి గాని మనం ఆలోచించరాదు. ఈ వ్యతిరేకమైన భావనను జ్ఞాపకం ఉంచుకోకూడదు. నీ ఆలయంను బాగు చేయదలిచావా. నిన్ను నీవు మొట్టమొదట రిపేరు చేసుకో. నీవు దేవుని పరిశుద్ధ ఆత్మకు ఆలయమైయున్నావు.
నీ పర్ణశాలను నీవు బాగు చేసినప్పుడు దేనిని గూర్చి నీవు భయపడవద్దు. దేవుడు నిన్ను గూర్చి జాగ్రత్త తీసుకుంటాడు. నీకు సంబంధించిన ప్రతి దాని గూర్చి జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన వాక్యములో ఉన్న సౌందర్యమును చూచుటకు ఎంత ధన్యులము.
ఆయన ఆలయము కొరకు లక్ష్యం ఉంచని ఒక పాస్టరుగార్ని నేనెరుగుదును. ఆయన కుటుంబం చెల్లాచెదురు అయిపోయింది. ఆయన కుటుంబంలో ఒక్కడు కూడా ప్రయోజకుడు కాదు. మనం జాగ్రత్తగా ఉందాం. దేవుని పర్ణశాలను నిర్మిద్దాం. ఆయన బలమే మనలను నిలబెడుతుంది.
|
|