|
దేవుని యందు ధైర్యము |
కీ.శే. యన్. దానియేలు గారు |
నిర్గమ 14:13
మోషే కు దేవుని యందు ఉన్న విశ్వాసము గొప్పది. ఏకైక భక్తుడు దాటి వెళ్ళవలసిన పరిస్థితులు విపరీతమైనవి. ఆయనను ధైర్యపరచి ప్రోత్సాహపరచటానికి ఏ వ్యక్తియులేడు. క్రీస్తు తన సేవయందు అడవిలో గడిపిన కాలం వలే ఇతడు అరణ్యము నుండి దేవుని పిలుపు విని వచ్చెను. అరణ్యమందు అతడు గడిపిన ఏకాంత జీవితం నుండి అనేక సంగతులు దేవుని యొద్ద నుండి అతడు నేర్చుకొనెను. అనేక సంగతులు నేర్చుకొనుటకు మానివేసెను. ఆయన ఐగుప్తు నందలి కళాశాలలో విద్యాభ్యాసము చేసెను. దేవుని పాఠశాల వ్యత్యాసమైనది. అక్కడ కూడా మనము అనేక సంగతులను నేర్చుకొనవలసియున్నాము. అనేక సంగతులు నేర్చుకొనుటను మానివేయవలసి యున్నాము. మన దేవుడు గొప్ప దేవుడు. మన దేవుని దగ్గరకు వచ్చి ఆయనను మితము చేయవద్దు. ఆయన గొప్ప ఏర్పాటులలోనికి కుదర్చగలిగినది ఏదో దేవుడు నీలో కనుగొన్నాడు. క్రీస్తు యేసు ద్వారా దేవుడు మన యందు పనిచేస్తున్నాడు. మనం ఆయన దృష్టికి గొప్పవారముగా అగుపడుతున్నాము. నీవు ఎంత దీనుడవుగా ఎంత సాధువుగా ఉంటావో దాని మీద నీ గొప్పతనము ఆధారపడి ఉంటుంది.అంతేకాకుండా నీ మోసకరమైన హృదయము, నీ పాడైపోయిన స్వభావమును నీవు ఎంత వరకు గ్రహించగలుగుతావో దాని మీద కూడా ఆధారపడియున్నది. నీవు నీ పాడైపోయిన స్వభావమును ఎంత వరకు గ్రహించుకుంటావో అంతవరకు దేవుడు తన శక్తిని నీ యందు ఉంచి ఆయన వలే పని చేయుటకు సహాయం చేస్తాడు. దేవుడు దేవుళ్ళను మట్టుకు తయారు చేయగలడు. ''మీరు దేవుళ్ళు'' అని వాక్యము సెలవిచ్చుచున్నది.
మోషే ఏ రీతిగా ప్రభువునందు ఏకైక వ్యక్తిగా ఎదిగాడో అది చూడడానికి నాకు ఆశ్చర్యం వేస్తుంది. తన ఏకైక జీవితము బాగా వ్యయం చేసినవాడు అలాంటి సమయం చాలా ప్రయోజనకరమని చూస్తాడు. మన ఏకాంత ప్రార్థనను మనం అభివృద్ధి చేసుకోవాలి. మోషే దేవునితో ఏకాంతముగా ఉండే సమయంలో దేవుని సన్నిధి దేవదూతలు ఆయనను సందర్శించుట చాలా సహాయం చేసి ఉంటుంది. మోషే యొక్క ధైర్యము చూడండి. గొప్ప నిరంకుశాధికారి అయిన ఫరోతో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడో చూడండి. దేవుడు నిన్ను పిలిచినట్లుగా నీవు ఎరుగుదువా? ఆయన పిలిచియుంటే అది భయంకరమైన సంగతి. నీవు సంపూర్ణంగా ఆయనకు విధేయుడవు కావాలి. దేవుని చేత పిలవబడటం భయంకరమైన విషయం. ఎందుకనగా ఆయన పిలుపులో ఉన్నటువంటి హక్కులు దాదాపుగా మనకు అందనివి. మనం చాలా దీనులముగాను కనిపెట్టువారలముగానుఉండాలి. మనం ఎంత దీనులంగా ఉండాలి! మనం నడిచేటప్పుడు ఏ మాత్రం ప్రార్థించగలం! మనం బస్సులో వెళ్ళేటప్పుడు ఎంత ప్రార్థించగలం! మనం ధ్యానించేటప్పుడు ఎంత లోతుగా వెళ్ళగలం! 'మీరు ఊరక నిలుచుండుడి' అనేది విశ్వసించడానికి, నమ్మడానికి ఆజ్ఞ ఇవ్వడానికి సులువైనదేనా! ఐగుప్తు సైన్యాలు వారి మీదకు వచ్చుచుండగా ఇది సాధ్యమేనా? గొర్రెపిల్ల వధించబడిన పిమ్మట మోషే ఐగుప్తు నుండి బయలుదేరి తన ప్రయాణం కొనసాగించెను. మన కొరకు వధించబడిన గొర్రెపిల్లను గూర్చియు మన కొరకు చిందించబడిన రక్తమును గూర్చియు మనం ఎక్కువగా ధ్యానించాలి.
దేవుడు మన పాపము బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. దేవునికి సంబంధించని ప్రతి దానిని మన జీవితంలో నుండి బయటకు పంపించివేయాలి. ఆత్మ ప్రభువును సేవించవలెనని ఆశిస్తుంది. కాని శరీరమైతే దానికి రావాల్సిన భాగము కొరకు పోరాడుతుంది. అంతేకాక నీ జీవితమును దాని సొంత విధానంలో ఆనందించవలెనని నిన్ను ముందుకు తోస్తుంది. ఇదంతయు ఆత్మను ఆటంకపరిచేది. కాని ఆత్మ శరీరం మీద అధికారం చేయనప్పుడు దేవుడు నీ యందు మహిమ పరచబడతాడు. ప్రారంభంలో ఆత్మకు శరీరంనకు మధ్య గొప్ప పోరాటం జరుగుతుంది. కాని ఒక దినమున ఆత్మ పరిపాలించును. శరీరము అధికారము చేసినట్లయితే గొప్పదేదీ దాని నుండి రాదు.
మనం మోషే జీవితం చదివేటప్పుడు దేవుని అనంతమైన భాగ్యంలో నుండి మనం తీసుకొని జీవితమును సమృద్ధిగా అనుభవించవచ్చు, 'గొప్ప అపాయాల ఎదుట కదలక నిలువబడు' అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు అందరూ గొర్రె పిల్లను అర్పించు విషయంలో మోషేతో ఏకీభవించారు. ఎలాంటి విడుదలను చూసారు! మనుష్యులందరికినీ వినబడే స్వరం ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. ఈ విధమైన విడుదలను చూసే వరకు దేవుని మీద ఆధారపడదాం. త్వరలోనే వారిని ధైర్యవంతులైనటువంటి, శక్తివంతులైనటువంటి శత్రువుల మృతమైన శరీరమును త్వరలోనే ఇశ్రాయేలీయులు చూసారు. ఆయన యొక్క మరణం ద్వారాను, పునరుజ్జీవం ద్వారాను ఈ లోకంలోనికి ఆయన విడిపించిన శక్తిని చూడడానికి మనం మన రక్షకునివైపు చూద్దామా! నీవు జయిస్తావు. నీ మీదికి వచ్చుచున్న శక్తులు, నిన్ను నలుగగొట్టుటకు వచ్చుచున్న శక్తులు, అన్నీ మరణించిన శక్తులే! అవి కనబడకుండా పోవడం నీ విజయమును నీవు చూస్తావు!!
|
|