లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

శిష్యత్వం యొక్క ధర

కీ.శే. యన్‌. దానియేలు గారు
లూకా 14: 26, 27

''ఎవడైననూ నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు''. శిష్యత్వమును గురించి నిశ్చయం చేసే షరతులను గూర్చి యేసు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇవి చాలా కఠినమైన షరతులు. వాటిని వెంబడించటం సులువు కాదు. కాని అలాంటి విధేయత యొక్క ఫలితము నిత్యము నిలుచును. వాటిని వెంబడించుట సులువు కాదు. 'కాని అలాంటి విధేయత యొక్క ఫలితము నిత్యము నిలుచును. ఇక్కడ వింతైనటువంటి పరిస్థితి ఉన్నది. ''నీ తండ్రిని, తల్లిని, భార్యను, బిడ్డలను ద్వేషించు''! వారు నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచునప్పుడు నీవు వారిని ద్వేషించగలవా? లేదు! వారు నీ ఆత్మీయ జీవితంనకు ఆటంకముగా ఉన్నప్పుడుమట్టుకే ఇది అన్వయించుకోవాలి. ఎవరైనను ప్రభువును సేవించవలెనని ఆశించినప్పుడు కొన్నిసార్లు తండ్రియో లేక తల్లియో, చెల్లియో ఆటంకముగా ఉండగలరు. పరి. ఫ్రాన్సిస్‌గారి విషయంలో అది ఆయన తండ్రి. తండ్రి కోర్టుకు ఆయనను లాగి ఆయన యొద్ద నుండి ఆయన డబ్బును, బట్టలను, సమస్తమును లాగివేసెను. పరి. ఫ్రాన్సిస్‌గారు చెప్పాడు, నీవిక నా తండ్రివి కాదు. పరలోకమందున్న తండ్రియే నాతండ్రి. ఆయన గొప్ప ఆత్మీయ మనుష్యుడుగా మారాడు. దేవుడు ఆయనకు అనుగ్రహించిన ఆత్మీయ కృపలు అత్యున్నతమైన మెట్టుకు వృద్ధి చేయబడినవి.

నీ వృద్ధాప్యమందు ఒక నిర్లక్ష్యమైన తండ్రిని గాని, తల్లిని గాని జ్ఞాపకం తెచ్చుకొని ''నా తండ్రి నా జీవితం నాశనం చేసాడు. ఈ కన్నీరు ఈ దుఃఖము భక్తి హీనమైన నా తండ్రి జీవితం వలననే నేను కూడా అదే నేర్చుకుంటిని'' ఈ దినమున తల్లిదండ్రులు, యౌవనస్థుల ఆత్మీయ జీవితంలో మహా గొప్ప ఆటంకములు. క్రీస్తు చెప్పేది సత్యములు. దేవాలయములో ఉన్న గొప్ప కొరత పరిశుద్ధులను ఆత్మీయులైన యౌవనస్థుల కొరకు, తల్లిదండ్రులు వారికి మహాగొప్ప ఆటంకము. వారి బిడ్డల యొక్క అవినీతి జీవితం చూచి నవ్వుతారు. వారి బిడ్డలను మ్రింగివేసేది ఎవరు? తల్లిదండ్రులా లేక త్రాచుపాములా. వారిలో కొంతమంది త్వరగాను, సమయమునకు ముందుగాను వచ్చేటటువంటి తమ బిడ్డల మరణమును చూస్తారు. నా స్నేహితుడు ఒకనిని ఈ విషయములో నేను గద్దించాను. అతడు (తన భార్యను పోగొట్టుకొన్నాడు) భక్తి హీనురాలైన అత్తగారి చేతిలో బిడ్డలను పెట్టాడు) కాని అతడు దానిని లెక్క చేయలేదు. తన యౌవనస్థులై ఎదిగిన ముగ్గురు బిడ్డలను అతడు పాతిపెట్టాడు. నేను అతనిని దేవుని సలహా మీద హెచ్చరించాను. కాని అతడు దానిని తీసుకోలేదు. వారి నిమిత్తమై తన పూచీని వహించడు. కాని దేవుడు సమస్తము చేయునని తలంచాడు.

రెండో షరతు ఏమంటే ఒక మనుష్యుడు దినదినము తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. ఒక మనుష్యుడు భక్తి గలవాడయితే దేవుడు అతనికి సమస్తమును ఇవ్వవలెనని అనుకుంటాడు. అవును, దేవుడు నీవు అందరికీ దాసుడవు అయినప్పుడు నీకు సమస్తము అనుగ్రహిస్తాడు. ఒక నిజ క్రైస్తవుడు వంటవానిగా ఉండటానికి గాని, కూలి పని చేయటానికి గాని వెనుకతీయడు. కర్తార్‌సింగ్‌ ఒక ధనికుడైన యౌవనస్థుడు. ఇంటిలో నుండి బయటకు త్రోసివేసినప్పుడు కూలివానిగా పనిచేసి తన బట్టలను సంపాదించుకున్నాడు. సిలువను మోయడమంటే అది ఒక సువార్తికుని జీవితం అంటే సులువైనది కాదు. ప్రార్థన సులువుగా రాదు. ఇతరుల భారములు మీద వేసుకొని ప్రార్థించటం సులువు కాదు. ఈ దినములలో పాదిరులు బిషప్పుగారు వారికివ్వనటువంటిఅర్హతల విషయమై దుఃఖపడతారు. దానికి బదులుగా యౌవనస్థుల కొరకు దు:ఖపడరు. ఈ యౌవనస్థులు తమ సంఘంలో పాపంలో జీవించుచున్నారు. పాస్టర్లు వారి సంఘంలో విభజించబడిన కుటుంబముల గూర్చి దుఃఖపడరు. నీవు నీ సిలువను భరించాలి. దేవుడు నిన్ను పిలిస్తేనే తప్ప నీవు ఒక పాస్టరుగానో ఒక సువార్తికుడవుగానో ఉండవద్దు. నీవు కష్టపడి పనిచేస్తే దేవుడు ఆర్థిక సంబంధమైన అవసరతలను దేవుడు చూస్తాడు. మన స్వార్థపరత్వము మనలను మనము ప్రేమించుకొనుట ఇది మన యొక్క సిలువ. మన యొక్క నష్టము. నీవు నీ సొంత స్వభావమును విరుగగొట్టాలి. మన సొంత స్వభావమే మన శత్రువు. మనము దీనులముగా ఉండలేము. సాత్వికులుగా ఉండుట సులువు కాదు. ప్రతి క్రియలోను ప్రతి మాటలోను నీ గర్వం నీ లోనికి రావడం చూస్తావు. దేవునిసన్నిధిలో నీ స్వభావమే నీ శత్రువు అని తెలుసుకుంటావు. దీనిని బట్టి నీవు ఫలించలేకపోవుచున్నావు. నీవు క్రీస్తును వెంబడించాలని అనుకున్నప్పుడు దానికయ్యే ఖర్చును జాగ్రత్తగా ఎంచాలి. కొన్ని కుటుంబములలో అంతస్థులు ఎంత క్రింద ఉన్నాయంటే వారికి ఎంత నేర్పించినా తీసుకోరు. అలాంటి వారు దేవుని సేవ చేయలేరు. ''దూతలు ప్రవేశించడానికి భయపడే చోట బుద్ధిహీనులు పరిగెత్తెదరు! జాగ్రత్త! దీనిని వెంబడించగలుగుతున్నారా? ఎంతవరకు వెంబడించగలరు. అది చాలా కష్టమైన విషయం. క్రైస్తవ జీవితం సులువైనది కాదు. అనేకమంది నాతో ఈ జీవితం కలిసి ప్రారంభించారు. కాని వెంబడించ లేకపోయారు. క్రైస్తవ జీవితం సులువైనది కాదు. దానికి ముందు రావాల్సిన ప్రార్థన మెట్టు సులువైనది కాదు.

మీరు ఒక గోపురమును కట్టకముందు దానికి కావాల్సిన సరుకు ఏ మాత్రం ఉన్నదని మీరు లెక్కించాలి. నేను కుతుబ్‌మినార్‌ను ఢిల్లీలో చూసాను. దాని పక్కన మరియొక్క కట్టడం ఉండినది. మరియొక రాజు కుతుబ్‌మినార్‌కన్నా ఎతైన కట్టడం ప్రారంభించాడు. పెద్ద నేల దళం కట్టాడు. ఇంకా కొన్ని అడుగులు కట్టిన తర్వాత చనిపోయాడు. నీ దగ్గర సరుకు ఉన్నదా అని యేసు అడుగుతున్నాడు. నీ దగ్గర ప్రేమ అనే సిమెంటు ఉన్నదా? నీ జీవితం నీకు సహాయం చేయగలదా? అనేక దేశములలో పిల్లలు వారి తల్లిదండ్రుల యొక్క ఆత్మీయ శ్రమలు అన్నింటిని పడగొట్టి వేయుచున్నారు. వారికి డబ్బు సంబంధమైన లాభములు కావాలి. క్రీస్తు చెప్పాడు. ''జాగ్రత్త సరియైన అంచనా వేయాలి''.

నీ బంధువులు ఆత్మీయ సంబంధమైనవారు కాకపోతే వారి సలహా తీసుకోవద్దు. నిజమైన దేవుని బిడ్డల సలహా తీసుకో క్రీస్తు ఇలాగు చెప్పాడు. ''ఒక శిష్యుని యొక్క బంధువులు ఆటంక కారకులు అయితే వారిని ద్వేషించాలి. నవీన పురాతన యుద్ధములో వినియోగించే విధానము ఏమనగా శత్రువు యొక్క బలమును జాగ్రత్తగా పరిశీలించాలి. గత యుద్దంలో బ్రిటీషు వారు ఫ్రెంచ్‌ వారు ఫ్రాన్సు దేశంలో యుద్ధమునకు ముందు హిట్లరు యొక్క బలమును సరిగా అంచనా వేయలేదు. హిట్లరు తన బలమును దాచిపెట్టాడు. వీరు హిట్లరు బలమును తక్కువగా అంచనా వేసి ఓడిపోయారు. సైతాను యొక్క బలమును నీవు ఎరుగుదువా? నీవు బైబిలు చక్కగా చదువుకున్నావా. కొంతమంది దైవజనులు ఎలాగు శోధనకు లొంగిపోయావో చదివావా, సమ్సోను ఏవిధంగా ఓడిపోయాడో దావీదు ఎలాగు ఒకసారి ఓడిపోయాడో శత్రువు యొక్క బలమును తెలుసుకో. ఒకసారి నేను నా యౌవన దినములలో సంపాదించిన జయమును గూర్చి సంతోషించుచుంటిని. దేవుడు నాతో చెప్పాడు. జాగ్రత్త నేను నీతో లేకపోయిన ఉంటే నీవు తప్పిపోయి ఉండేవాడివి. భూమి మీద సైతాను పడద్రోయలేనటువంటి ఏ పరిశుద్ధుడు లేడు. దేవుని సన్నిద్ధియే నిన్ను రక్షించును. ధన్యుడవుగా ఉండు, జాగ్రత్తగా ఉండు''. దాని ఖర్చును లెక్కపెట్టకుండా దేవుని కొరకు ఏమి చెయ్యటానికి ప్రయత్నించవద్దు.

మూల ప్రసంగాలు