లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దానియేలు దేవునితో నడిచెను

కీ.శే. యన్‌. దానియేలు గారు
దానియేలు 12: 13

''నీవు అంతము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు.'' దేవుడు దానియేలుతో మాట్లాడెను. ఆయనకు 18 సం||ల వయసు వచ్చినప్పటి నుండి దానియేలు ప్రభువుకు సమీపంగా నడిచాడు. దానియేలు దేవుని రాజ్యము కొరకు నడిచాడు. దానియేలు ఒక ప్రవక్త అతనితో దేవుడు పరలోకం యొక్క గొప్ప మర్మములను పంచుకున్నాడు. దానియేలుతో దేవుడు మాట్లాడిన విషయములు గ్రహించుటకు కష్టమైనవి. దానియేలుకు ప్రత్యేక రకమైన విశ్వాసం ఉండినది. దాని ద్వారా దేవుని దగ్గర నుండి ఆయన మర్మములను గ్రహించగలిగిన శక్తిని పొందినాడు. దానియేలు దేవుని యొక్క తెలివి, జ్ఞానం పంచుకొన్నాడు. దేవుని మర్మములు తెలుసుకున్నాడు. దానియేలు గ్రంథము గ్రహించుటకు కష్టమైనది. ప్రస్తుత కాలపు, రాబోయే కాలపు సంఘటనలు అందులో వ్రాయబడినవి. దానియేలు పాత నిబంధన గ్రంథపు యోహాను అని చెప్పవచ్చు.

ఆయన ఒక దర్శనం చూసి దానియొక్క దెబ్బవలన క్రిందపడి బలహీనుడు అయిపోయాడు. దేవుని బలమైన తలంపులు మన మనస్సులోనికి ప్రవేశించినప్పుడు మనం బలహీనులమైపోతాము. కాని దానియేలు దేవుని విడిచిపెట్టలేదు.

దానియేలు యొక్క భక్తి బబులోను దేశములో ఉండిన భక్తి ఒక దానికి ఒకటి వ్యతిరేకమైనది. భయంకర చీకటి గల ఒక దేశంలో ఒక వ్యక్తి దేవునికి సమీపంగా నడుస్తూ ఉండినాడు. ఇది మనకు ఎలాంటి ప్రోత్సాహకరమైన విషయం! మీలో కొంతమంది చాలా దుర్మార్గమైన స్థలములలో నివసించవలసియుంటుంది. దానియేలు రాబోయే రాజ్యమును చూసినాడు. ఆయన క్రీస్తును చూడగలిగాడు. ఆయన చేతులతో నిర్మించబడనటువంటి రాయి. ప్రార్థన ,పత్యేకించబడుట ద్వారా దేవుని మర్మములను సంతోషంతో అంగీకరించగలిగిన స్థలములకు ఆయన ఎక్కగలిగినాడు. దేవుని మర్మములు పరలోకం యొక్క ధనము. రాబోవు యుగము ఆయన చూచినాడు. క్రీస్తు భూమి మీద జీవించిన తర్వాత దేవాలయంలో జరిగే ఆరాధన నిలిచిపోతుంది. రాబోయే సంవత్సరముల సంగతులు బయలుపర్చటం సులువైన విషయం కాదు. మీ తండ్రిగాని, మీ తల్లిగాని ఎప్పుడు చనిపోతారో చెబితే నీవు ఏడవడం ప్రారంభిస్తావు. దేవుడు తన మర్మములు తన చేతులలో కలిగి ఉన్నాడు. ఆయన రొమ్ములో నీవు జీవించే ఉంటే, ఆయన రొమ్మునకు ఆనుకొని జీవిస్తూ ఆ మర్మములను పంచుకొనేవారు ధన్యులు. దానియేలు దేవునికి తన గొప్ప మర్మములన్నిటిని పంచుకున్నాడు. ఆయనకు అనేకమైన కలలు, దర్శనములు వచ్చినవి. ఆయన మనకు అనేకమైన మర్మమైన రాతలను ఇచ్చాడు. తన ప్రియబిడ్డలతో దేవుడు తన రాజ్యము యొక్క రాబోవు కాలపు ఉద్దేశ్యములను బయలుపరుస్తాడు. అధమ పక్షము వారి యెడల ఆయన కుండే ఏర్పాటులు బయలు పరుస్తాడు. యెహోవా నామమును పైకెత్తి చూపించుటకు అన్యదేశములలో దేవునికు దానియేలు చాలా నమ్మకస్థుడుగా ఉండినాడు. నీ హృదయం యొక్క భక్తిని అనుసరించి దేవుడు తన ఏర్పాట్లను నీతో పంచుకొనగలడు. దేవుడు అబ్రహాము గృహమును దర్శించెను. ఏలయనగా అతని హృదయం దేవునితో ఒకటిగా ఉండినది. ''నేను సొదొమ గొమొర్రాలకు చేయబోయే విషయం అబ్రహాము నుండి ఎలాగు దాచిపెట్టగలను?'' అబ్రహాముతో పంచుకోకుండా ఏ విషయము తనలో దాచుకోలేకపోయాడు.

మన ప్రేమ గల దేవుడు నీతో అనేక విషయములు పంచుకుంటాడు. దానియేలు దేవునికి ఎంత సమీపముగా నడిచినాడు అంటే అతని కలలు ప్రవచనాత్మకములు ఆయన మాటలు ప్రవచనాత్మకములు. ఆయన వివరణ ప్రవచనాత్మకం. ఒక యౌవనస్థుడు ఎంత ఆశీర్వాదంగా ఉండగలడు! ''మెనేమెనే టికిల్‌ యు ఫార్సిన్‌'' అనే గోడ మీద వ్రాతను ఆ రాత్రి ఆయన వివరించాడు. ఆయన వివరించిన కొద్ది గంటలకు న్యాయ తీర్పు ముగింపు అయినది. దానియేలు బానిసవాడా? దేవుని మనస్సు నీలోనికి వచ్చినప్పుడు నీవు బానిసగా ఉండగలవా? లేదు. ఆయన పరిపాలకుడు. నీవు దేవునికి సమీపంగా జీవిస్తే పెద్దవారు నీ యొద్ద నుండి నేర్చుకోవడానికి వస్తారు. భవిష్యత్తును దేవుడు నీకు బయలు పరుస్తాడు.

దేవుడు దానియేలుతో ఈ రీతిగా సెలవిచ్చాడు. ''నీ దినములు ముగించే సమయానికి నీవు విశ్రాంతి తీసుకొందువు, కాలాంతమందు నీ వంతులో నిలచెదవు''. మనలో ప్రతి ఒక్కరము దేవునితో మనము నడిచే నడకను బట్టి అంతము వరకు నిలకడగా ఉండిన యెడల కాలాంతమందు మన వంతులో నిలిచెదము.

మూల ప్రసంగాలు