లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

బావులు త్రవ్వుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

కీర్తనలు 63:1&2
''దేవా! నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమేందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టియున్నాను. నీళ్లు లేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనియున్నది. నీ మీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.''

నీటి కొరకు కీర్తనాకారుడు కేక వేయుచున్నాడు. దేవుని శక్తిని, దేవుని మహిమను చూచుటకు ఆయన దప్పిగొని యున్నాడు. ఇస్సాకు ఎక్కడికి వెళ్లినా బావులు త్రవ్వడము ప్రారంభించాడు. ఫిలిష్తీయులు వాటిని అపహరించేవారు లేక పూడ్చివేసేవారు. ఎండిన భూమిలో బావిని త్రవ్వుట సులభముకాదు. మన ఆత్మలు దాహముగొని యున్నందువలన మనము బావులు త్రవ్వుచున్నాము. మనము త్రవ్విన బావులను క్రైస్తవులనిపించుకొనే మన స్వంత బంధువులు పూడ్చివేయుచున్నారు. ఒక బావిని అపహరించేదేమిటి? ఒక తప్పయిన మార్గమునకు మన ప్రార్థనా జీవితము వెళ్లగలదు. దాని భావము మన బావిపూడ్చబడుట.

దేవునితో నిబంధన చేసుకొనిన తండ్రిని ఇస్సాకు కలిగియున్నాడు. దేవునితో నిబంధన చేసుకున్న వ్యక్తి దాచబడిన మూలాదారము నుండి యెడతెగని నీటిని పొందుతాడు. అన్య కుటుంబమునుండి వచ్చిన భార్యను ఇస్సాకు కలిగియున్నాడు. ఆమెకు సరిపోయినంత విశ్వాసములేదు. అయితే వారు కలిసి జీవించునంతగా ఇస్సాకు ఆమెను విశ్వాసపు మెట్టుకు లేవనెత్తాడు. వారికి విశ్వాసము ద్వారా బిడ్డలు కలిగిరి. బిడ్డలను కటిగియున్న దీవెనను వారి చుట్టునున్న ప్రజలు చూచిరి. వారి జీవితాలలోని దేవుని ఆశీర్వాదమును వారి చుట్టు నున్న వారు చూచిరి. నిబంధన చేయబడిన జీవితమునుండి ఉబికే ఊటను - సంఘములు, కుటుంబములు ఆపివేయుచున్నవి. ప్రజలు నిజమైన ప్రార్థనా జీవితమును కోరుటలేదు. ఫిలిష్తీయులు ఇస్సాకును ద్వేషించి అతని బావులను పూడ్చివేసినారు. జీవజలముల కొరకు నీవు బావులు త్రవ్వాలి.

ప్రార్థనా జీవితమును కాపాడు కున్నంత కాలము నీ జీవితము నిత్యము పచ్చగా నుండును. కీర్తన 52:8 ''నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవచెట్టువలె నున్నాను.'' దేవుని బిడ్డలు దేవుని యెదుట కనిపెడతారు. మనకు చెప్పడానికి దేవుని యొద్ద కొన్ని సంగతులున్నవి. మనము ప్రార్థనలో కొనసాగుకొలది మన విశ్వాసము అభివృద్ధి చెందును. మన విశ్వాసము అభివృద్ధి చెందుకొలది నూతన ప్రత్యక్షలు మనకు కలుగును. మనము ఆ ప్రత్యక్షతలకు విధేయులమయినపుడు మనము బలపరచబడెదము.

ఎడారి భూములలో మనము బావులు త్రవ్వుచున్నాము. ఇస్సాకును యిష్టపడని అబీమెలెకు అతడు ఎంత అధికముగా ఆశీర్వదింపబడినాడో చూచినాడు. దేవునితో ఇస్సాకు వాగ్ధానం చేసాడు. తన తండ్రి విధించిన క్రమశిక్షణను ఇస్సాకు ఎదిరించలేదు అతడు యిప&ఉడు క్రమశిక్షణ గల వ్యక్తి. నీవు దేవుని వాక్యమునకు లోబడి, లోతుగా త్రవ్వుకున్నప్పుడు నీవు ఊటలను నీవు ఊటలను కనుగొందువు.

నీవు మారుమనస్సు పొందినపుడు దేవుడు నీతో చేసిన నిబంధనను తిరిగి స్థిరపరచుటకు దేవుడు ఒక తరుణము కొరకు చూచుచున్నాడు. నీవు లోతునకు త్రవ్వినపుడు శాశ్వతమైన నీటి ఉత్పత్తిని నీవు పొందగలవు. దేవుని స్వరమునకు అబ్రాహాము విధేయుడయినాడు. అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనను దేవుడు మరచిపోలేదు. కొందరు మిక్కిలి ఎండిన భూమిలో నివసించినను వారు దేవునితో నిబంధన చేయబడిన వారుగా ఉండుటవలన తమ చుట్టునున్న ప్రపంచాన్ని మార్చగలిగిరి.
మూల ప్రసంగాలు