లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని చిత్తమును చేయుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

యోనా 1:9-12
''నన్ను బట్టియే ఈతుఫాను మీమీదికి వచ్చియున్నది'' అనేకమందివారి గృహములలోనికి వచ్చేటటువంటి తుఫానులకు కారణము. వారి కుటుంబములోనికి వచ్చే తుఫానుకు వారు ఎలా కారకులో వారి జీవితములలోనికి వారే కారకులు. నీవు ఇతరులకు ఎంత హాని కలుగచేస్తున్నావో తెలుసుకోవటం విచారకరమైన సంగతి. ఇక్కడ ఒక ప్రవక్త వారి సంగములలోనికి ఇతరులకు హాని చేస్తున్నాడు.

అతడు దేవుని సన్నిధిలో నుండి పారిపోతూ ఉండినాడు. దేవునిని ఎరిగిన వ్యక్తి ఎవరైనా ఆయన చిత్తములో జీవించకపోతే ఇతరులకు హాని చేస్తాడు. మనం దేవుని వలన పుట్టిన వారము అయినప్పుడు మనము ఇతరుల యెడల పూచీ కలవారముగా ఉన్నాము. నీవు ఈ సంగతి గ్రహించకపోయినట్లయితే నీవు ఇతరుల మీద తుఫానును తెస్తావు. మన కూటములలో ఒకప్పుడు ఒక స్త్రీ తన పాపమును ఒప్పుకుంటూ ఉండినది. ''నా పాపమును బట్టియేనా ఇద్దరు బిడ్డలు చనిపోయారు'' మనము ప్రార్థన చేస్తాము. ''పరలోకము నందు నీ చిత్తము నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక'' అంటాము కాని ఆయన చిత్తము చేస్తున్నామా? నీ గృహము దేవుని రాజ్యమును కట్టేదిగా ఉన్నదా? నీ సంఘము అలా ఉన్నదా? అలాగయితే మనము పరలోక ప్రార్థన ఒక మనుష్యుడు దేవుని దగ్గరకు వచ్చిన తరువాత అతను దేవుని చిత్తము చేయుటయే తరువాత మెట్టు. ఆయన వలన జన్మించిన ప్రతివాని కొరకు దేవుని చిత్తము చెక్కబడియున్నది. నీవు మారుమనస్సు పొందిన తర్వాత దేవునికి నీ కొరకై ఒక ఏర్పాటు ఉన్నదని తెలుసుకో.

యోనా దేవుని చిత్తము నుండి వెలుపలికి వెళ్ళుచుండినాడు. కాని దేవుడు దానిలోనికి అతనిని లాగాడు. దేవుడు గిద్యోనును తన ఏర్పాటులోనికి లాగుకొనినాడు. దేవుడు సౌలుకు ఒక నూతన హృదయం ఇచ్చినాడు. 1 సమూ|| 10:9. సౌలు దేవుని చిత్తములో కొనసాగలేదు. ఆయన ఈలాగు తన కుటుంబము మీదికి ఒక తుఫాను తెచ్చాడు. అది నాశనము అయిపోయింది. ప్రవక్త అయిన సమూయేలుతో సౌలుకు సహవాసము చేసే అర్హత ఇచ్చాడు. కానీ అతడు దానిని విచ్ఛిన్నం చేసాడు. 1 సమూ|| 15:35 దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం విషయంలో దేవుని దుఃఖ పరుస్తున్నావేమో జాగ్రత్త! ఆయన చిత్తము నుండి ప్రక్కకు తొలిగిపోతున్నావు. నీవు దుఃఖము, మరణము పిచ్చితనము నీ కుటుంబములోనికి తేగలవు. సాతాను క్రైస్తవులను తొందర చేయడానికి ప్రయత్నిస్తాడు.

కొంతమంది ప్రజలు సగం దూరం మట్టుకే వచ్చి వెనక్కు వెళ్ళిపోయి దేవుని రాజ్యమునకు చాలా నష్టం కలిగిస్తారు. దేవుడు నిన్ను నిత్యమైన విలువ గల వాటి మీద నీ ధ్యానము నిలుపుమని కోరుతున్నాడు. కాని నీవు దేవుని చిత్తమునకు పూర్తిగా వ్యతిరేకముగా వెళ్ళవచ్చు. దేవుని చిత్తమునకు వెలుపట ఉన్నవారు తమ్మును తాము భక్తి హీనులతోనూ, అన్యులతోనూ ఏకీభవించువారు గొప్ప అపాయకారులుగా ఉన్నారు. దేవుని పిల్లలకు వ్యతిరేకముగా చెడు మాట్లాడేవారు వారిలో కొందరు. వారి గృహములు నరకముగా మారిపోతాయి.

ఆది కాం|| 45:7 యోసేపు తన జీవితకాలమంతా దేవుని చిత్తములో ఉండినాడు. ఆయన శ్రమలలో సంతోషించాడు. ఫిలిప్పీ 4:12 ''దీనస్థితిలో ఉండ నెరుగుదును. సంపన్నస్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును, ఆకలి గొనియుండుటకును, సమృద్ధి కలిగి యుండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొనియున్నాను''. నీవు ఉన్నటువంటి స్థితిని నీవు తృప్తిపడి ఉండటం గొప్ప సంగతి 1 తిమోతి 6:6 ''సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది''. నీ హృదయము సంతోషమందును, బాధయందును సంతృప్తి పండియుంటే కొదువలోనూ, సమృద్ధిలోనూ - అది మితమైన క్రైస్తవజీవితం. యోసేపు ఎల్లప్పుడు దేవునితో ఉండినాడు - గుంటలో పడద్రోయపడినప్పుడును, పోతీఫరు గృహములో బానిసగా ఉండినప్పుడును, ఖైదులో బంధింపబడినప్పుడును అంతేకాక ఆయన ఐగుప్తు సింహాసనము ఆక్రమించుకున్నప్పుడునూ దేవుడు యోసేపుతో ఉండెను. యోసేపు దేవునితో ఉండెను. ఆయన చిత్తమందు మాత్రమే నీవు దేవునితో ఉండగలవు. నీవు నీ మీదను, ఇతరుల మీదను తుఫానులు తీసుకొనిరావు. దేవుని ఆశీర్వాదములో ఉన్న సమృద్ధిని నీవు క్రిందికి తెస్తావు. దేవుని చిత్తములో జీవించడం కష్టమైన జీవితం. యౌవనస్థునిగా నేను ఒక విందు కొరకు కాచుకొని ఉండినాను. కాని నన్ను ఉపవాసముండి ప్రార్థన చేయమన్నారు. భోజనమునకు ముందు నాతో సెలవిచ్చారు. నేను విధేయుడనయ్యాను. దేవుడొకసారి నన్ను బహు సాధారణమైన, సామాన్యమైన దుస్తులు ధరించమని చెప్పాడు. ఆడంబరము గల దుస్తులు ఆ దినములలో ఫ్యాషన్‌గా ఉన్నాయి. మనుష్యులు నన్ను చూసి నవ్వారు. కొంతమంది నేను పిచ్చివాడిని అయిపోతున్నాను అని అనుకున్నారు. కాని ఆ దుస్తులు నాకు మేలు చేసినవి. మిషయా 53:10 ''అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన తనకు వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా వలన అతని ఉద్దేశ్యము సఫలమగును''? దేవుని చిత్తములోనున్న వారు క్రీస్తు వలే ఇతరుల పాపములు తమ మీద వేసుకొందురు. ఇతరులతో కలిసి బాధపడుటకు కలిసి సంతోషింతురు. ఈ రాజమార్గములో నడుచువారు దూతల యొక్కయు ప్రధాన దూతల యొక్కయు కాపుదల కలిగి ఉందురు. పరలోకము వారితో ఉండును.
మూల ప్రసంగాలు