|
దేవుని సమీపముగా వచ్చుట |
కీ.శే. యన్. దానియేలు గారు |
నిర్గమ 24:2
''మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను'' మోషే దేవుని పిలుపుకు ఆయన వాక్యమునకు విధేయుడు అయిన కారణమును బట్టి మరియు మానవునికి దేవునికి విధేయుడయ్యే అవకాశం ఇవ్వబడింది. తర్వాత ఆయన సత్యమును గ్రహించుకునే శక్తి కూడా ఇవ్వబడింది. మానవుని యందు ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం దేవుని సత్యమును ప్రశ్నిస్తుంది. దానికి విధేయుడు అవటానికి ఆలస్యం చేస్తుంది. అతని గర్వం అతనిని విడిచినప్పుడు విధేయత కొరకు ప్రార్థన చేస్తాడు. కీర్తనలు 119:5 ''ఆహా! నీ కట్టడాలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడి యుండిన ఎంత మేలు'' మనలో కొంతమంది అవిధేయతకు ఎంతగా అలవాటుపడ్డాము'' అంటే ముఖ్యమైన ఫలవంతమైన, చురుకైన దేవుని జీవం మనం సత్యము నెరిగి దానికి విధేయులము అయినప్పుడు మట్టుకే అది మనలోనికి వచ్చును. మనకందరికి సత్యమును ఎరిగేటటువంటి దానికి విధేయత చూపించేటటువంటి అవకాశం ఇవ్వబడింది. దేవుని సత్యమును నీవు ఎరిగి దానికి విధేయత చూపించినంత మట్టుకు శక్తిగల దేవుని శక్తి నీ ద్వారా పనిచేయును. మనుష్యుడు దేవుని స్వరూపమందు చేయబడినాడు. దేవుని పోలికలో మనుష్యుడు తన చుట్టూ ఉన్న మనుష్యులను మార్చగలిగిన లోతైన సత్యము గ్రహించుకొనుటకు శక్తిమంతుడు అవుతాడు. మొట్టమొదటగా ఆయన సత్యమెరిగి దానికి విధేయుడు కావాలి. లేకపోయినట్లయితే జీవము నిష్పలమైనదై ఉండును. కీర్తనలు 119:133 ''నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకుము'' దావీదు గ్రహించినాడు ఏమనగా దేవుని వాక్యానుసారముగా నడవ కలిగిన వాడు అయితే మాత్రమే ఏ దుర్మార్గతయు తన మీద అధికారం చేయనీయనంతకాలం అతని జీవితం సార్థకమైన సాక్ష్యము కలదిగా ఉండును.
దేవుని నిన్ను ఆశీర్వదించుమని అడుగుట తప్పు. దేవుని నీకు నేర్పించుమని నీకు విధేయత గల ఆత్మను దయచేయమని అడుగుట శ్రేష్టమైన విషయం. మోషేను ఒక్కడినే పైకి రమ్మని ఎందుకు అడిగాడు? ఆయన విధేయత నేర్చుకున్నాడు గనుక ఆయన పిలుపును అంగీకరించి దానికి అవసరమైన విధేయతకు తన్నుతాను అప్పగించుకొనినందు వలన మాత్రమే. ప్రతి చిన్న విషయానికి, ''నేను ఏమి చేయను? ''మరియు ''నేను ఏమి చెప్పను''? అని దేవుని ఎందుకు ప్రశ్నించాడు? తన జ్ఞానం సరిపోదని గ్రహించుకొన్నాడు. దేవునిని తమ జీవితములో ప్రతి చిన్న విషయమై ఆయనను అడిగేవారు నిజముగా ఆయనను తమ జీవితములో దేవునిగా చేస్తున్నారు. దేవుని యొక్క ఉద్దేశము ఏమంటే నిన్ను ఆయన ఎంతో చేతనైన వ్యక్తిత్వము గలవాడో అంతగా నిన్ను చేయవలెనని ఆయన ఆశ. ఆయన మనకు నేర్పించి మనలను విధేయులుగా చేయలేకపోతున్నానే అని ఆయన దుఃఖిస్తున్నారు.
దేవునిని ఎల్లప్పుడు తన ఆశీర్వాదములను ఇతరుల మీద ఉంచుమని వారు తెలుసుకోవలసిన సత్యం తెలుసుకోకుండా ఉన్నంత కాలం ఆయనను అడుగవద్దు. మొదట తెలుసుకోవడం తరువాత తెలుసుకున్న దానికి విధేయులం అవడం నిన్ను దేవునిలో ఒక భాగముగా చేస్తుంది. దానిని బట్టి నిన్ను ముట్టేవాడు ఆయననే ముట్టుచున్నట్లుగా ఉండును. ఈ ఏర్పాటును పనిచేసే దానినిగా చేయడానికి దేవుడు ఒక మార్గము కనుగొనినాడు. అది ఏమనగా నీ గతమును శుద్ధీకరించి ఒకప్పుడు నిన్ను పరిపాలించిన చెడును జయించే శక్తి నీలోనికి పెట్టడం, ఒక నూతన క్రీస్తుయేసు నందు జీవమునిచ్చు ఆత్మ నియమం పాపమునకు పైగా లేచేటట్లు చేసే నియమం మనయందు ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి మన యందు పనిచేయుటకు ప్రారంభించును. క్రీస్తు మరణము వలన మనకు శుద్ధీకరణము లభించుట నిశ్చయమైన మనోభావం ఆయన పునరుద్ధానం ద్వారా వచ్చును.
ఎల్లప్పుడూ ప్రారంభించండి! ఈరీతిగా నీవు అనంతమైన దేవుని జ్ఞానంలోనికి భాగంగా వెళతావు. ఆయన సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడు మట్టుకే ఆయన తలంపులు నీలోనికి ప్రవేశపెట్టగలడు. లిఖించబడిన వాక్యమును బట్టి నీకు నూతన జ్ఞానం అనుగ్రహించును. ఆ జ్ఞానంనకు నీవు విధేయుడవు అగునట్లుగా కృప కొరకు నీవు ప్రార్థించునప్పుడు క్రీస్తు తన సేవ యందు కనుపరిచిన శక్తిని నీలోనికి తెచ్చుకుంటున్నావు. దేవుని చిత్తమును జరిగించువాడు దేవునితో విడువక ఎల్లప్పుడూ దేవునితో ఏకత్వము కలిగి ఉండును. ఆయన పరిపూర్ణ జ్ఞానమునకు ఆయన చిత్తమునకు పరిపూర్ణ విశ్వాసం అవసరమైయున్నది. దీనిని బట్టి నీవు మనుష్యుని అభిమానం పోగొట్టుకొనవచ్చు. లోక సంబంధమైన సంతోషం పోగొట్టుకుంటాము. మనము ఇతరులకు సహాయం చేయగలిగినప్పుడు మనము ఎక్కువ సంతోషం అనుభవిస్తాము. మీరు మీ సహోదరునికి అమోఘమైన సహాయం చేయలేనప్పుడు నిజమైన దుఃఖము నిన్ను ఆవరించును. అది నిన్ను పూర్తిగా నిస్సహాయడునుగాను, ఉత్సాహము లేనివానిగాను చేయును. ఇతరులను ధనవంతులుగా చేసి వాని సంతోషపరిచే విధముగా మన జీవితములు కట్టుకుంటున్నామా? మోషే ఒక్కడే దేవునితో బహుసన్నిహితముగా రమ్మని పిలవబడ్డాడు. తన ప్రజలకు తమ జీవితములలో ప్రతి విధముగాను సహాయకరముగా ఉండునట్లు దేవునికి సంపూర్ణముగా విధేయుడు అయినాడు. మనుష్యులు తమకు నాశనకరమైన తత్వజ్ఞాన శాస్త్రములో మరణిస్తూ ఉండగా దేవుడు తమ ధర్మశాస్త్రము మోషే చేతులకు అప్పగించెను. దానికి ఆయన విధేయుడు అవుతాడని ఆయన ఎరుగును. మోషే ధర్మశాస్త్రమును దేవుని యొద్ద నుండి పొందు నిమిత్తమై 40 దివారాత్రములు దేవుని సన్నిధిలో గడుపవలసి వచ్చినది. ఆయన తన ధర్మ శాస్త్రము నీ హృదయము మీద వ్రాయును. ఆయన నోటి మాటలను పలుకువానిగా చేయును. దానిని బట్టి జీవ జల ప్రవాహములు నీలో నుండి ప్రవహించును. అని దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను నీవు సిద్ధపరచుకున్నావా? మనము దేవునికి అవిధేయులము అవుటకు నేర్చుకుంటే దేవుడు మనతో ఏమీ చేయలేడు. నేను విశ్వసించేది ఏమంటే మోషే గొప్ప సమాధానముతో మరణించియుంటాడు. తన ప్రజలను విమోచించవలెననే యౌవన కాలపు వాంఛలు మహిమకరముగా నెరవేర్చబడినవి. ఒక జనాంగమంతా బానిసత్వం నుండి విడుదల పొంది నిరీక్షణతో వాగ్దాన దేశములోనికి నడుస్తూ ఉండినారు. ఇది ఎంత మహత్కార్యము. నిర్గమ 24:7, 8. క్రీస్తు ద్వారా వచ్చునటువంటి పరిపూర్ణ సత్యమునకు సూచించే దానిగా మోషే ఉన్నాడు.
నీ జీవితం యొక్క సాధ్యములు గొప్పవి. ఆయన వాక్యజ్ఞానముతోను దానికి విధేయుడు అవుటతోను నీ జీవితమును అలంకరించుకో. తన తప్పుడు జీవితాన్ని క్షమించుకొనే సహాయము ఇచ్చే జ్ఞానము కొంతమంది కలిగియున్నారు. నీకు కావాల్సింది నీవు క్రీస్తు సిలువ యెదుట దీనుడవు అయి ఉండే జ్ఞానము నీకు కావాలి. మోషే 2,50,000 మందికి సహాయం చేసాడు. నీ జ్ఞానంనకు అనుకూలముగాను, నీ విధేయతకు అనుకూలముగాను క్రీస్తు యొక్క కొలతను నీవు కలిగి ఉంటావు. క్రీస్తు ఎంతవరకు నీ జీవితంలో ఉన్నాడో అంత వరకు నీ జీవితం ఫలవంతముగా ఉంటుంది. నీవు సహవాసంలో ఉండటం దేవునికి విధేయుడవు అవుట ద్వారా కనబడాలి. మనుష్యుడు తప్పిపోవచ్చు కాని దేవుడు ఎన్నడు తప్పిపోడు. దేవుడు తన పరిపూర్ణ చిత్తమునకు నీ యొక్క మనస్సు , శరీరము పరిపూర్ణముగా విధేయులై యుండవలెనని కోరుచున్నాడు.
|
|