లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఇరుకు ద్వారమున ప్రవేశించండి

కీ.శే. యన్‌. దానియేలు గారు

మత్తయి 7:13
''ఇరుకు ద్వారమున ప్రవేశించండి'' మీరు ఆత్మ వలన జన్మించిన వారై ఉండాలి. అదే ఇరుకు ద్వారము. విశాలమైన ద్వారము ఉన్నది. బాప్తిస్మము తీసుకొనుట ద్వారా రూఢిపరచుట ద్వారా నీవు క్రైస్తవుడవా? నీ జీవితంలో ఫలము ఉన్నదా? మనము నిశ్చయత కలవారమై ఉండి మనలను మనము మోసపరచుకొనకూడదు. నీవు సమూహంతో కలిసి వెళ్ళాలి అనుకున్నావా? కొద్దిమంది మాత్రమే ఇరుకైన ద్వారమును ఏర్పాటు చేసుకుంటారు. వారు పాపులము అని గుర్తిస్తారు. బోధించుట సులువు. దేవుడు నన్ను ఎల్లప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. నేను ఇరుకైన మార్గము వెంబడిస్తున్నానా. నేను ఇరుకైన మార్గములో వెళ్ళుతున్నానా? మనం ముఖస్తుతి సులువుగా సంపాదించుకొనవచ్చు. మనం దేవున్ని మోసగించలేము. నీ చుట్టూ ఉన్న వారంతా అబద్దాలు ఆడుతుంటే నీవు సత్యము చెప్పుతావా. అది ఇరుకైన మార్గము. ఒక వనితను పట్టుకొన్న ధనికునికి నీవు ఓటు ఇవ్వాలని అనుకుంటున్నావు. నేను చదువుకున్న పట్టణంలో ఒక పెద్ద లాయరు గారు సంఘంలో ఉండినాడు. ఆయన రూ.500/- కానుక ఇచ్చినాడు. ఆరోజులలో అది పెద్ద మొత్తం. ప్రతివారు దాని గూర్చి విన్నారు. ఆయన రూ.500/- ఆత్మలను నాశనం చేసినాడు కూడా. దుష్టులను నీవు అభిమానించుదువా?

నేను ఖర్చు పెట్టుకోవడానికి కొంచెం డబ్బు దొరికేది. నేను దానిని జాగ్రత్తగా వినియోగించే వాడిని. దేవుడు నన్ను ఉదయకాలమందు తీసుకునే రొట్టె పాలు ఒక నెల దినములు ఆపు చేయమని చెప్పాడు. నేను జాగ్రత్తగా ఖర్చుపెట్టే వాడిని. నేను ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకునే వాడిని కాదు. నేను రొట్టె పాలు ఆపివేసినప్పుడు మనుష్యులు నన్ను పిచ్చివాడని అనుకున్నారు.

దేవుడు నిన్ను అకస్మాత్తుగా కలిగే దుఃఖము నుండి తప్పిస్తాడు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనుటకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. నేను చాలామంది స్త్రీలను ఎరుగుదును. వారికి ఉద్యోగం రాగానే చాలా బట్టలు కొనుక్కొనేవారు. వారు వాయిదాల మీద డబ్బులు చెల్లించేవారు. వారు ఈ విషయాలను నా దగ్గర ఒప్పుకొనే వారు, వాళ్ళు నాజూకైన వస్త్రాలు ధరించుకొనకపోతే వారు ఎందుకూ పనికిరారు. వారు మంచి వస్త్రములతో తృప్తిపడేవారు. వేసవి సెలవులలో నేను బోధించటానికి అటు, ఇటు తిరిగేవాడిని. నా తల్లి నన్ను భోగ్యమైన ఆహారములతో తృప్తిపరచాలని కాచుకొని యుండెడిది. కాని నేను ఇంటి దగ్గర ఉండనని నిరుత్సాహపడింది. నేను ఒక గ్రామం నుండి మరియొక్క గ్రామానికి బోధిస్తూ తిరుగుచూ ఉండేవాడిని. కొన్నిసార్లు నాకు ఆహారం ఉండెడిది కాదు. అది ఇరుకు మార్గము. నీవు నీ కొరకై జీవిస్తున్నావా?

ఇరుకైన మార్గమును ఏర్పాటు చేసుకో. నేను ఒక జత బట్టలతో ఆరంభించేవాడిని. వాటిని ఉతికి ఆరిపోవడానికి వ్ర్రేలాడవేసేవాడిని. ఇలాగు నా మార్గములో కొనసాగేవాడిని. దారిలో పాములు ఉన్నప్పటికి నేను పాదరక్షలు లేకుండానే వెళ్ళేవాడిని. దేవుడు నన్ను రక్షించేవాడు. ఒకసారి నా చుట్టూ వర్షం కురుస్తూ ఉండింది. వర్షపు చినుకులు నా మీద పడలేదు. దేవునికి తెలుసు నేను తడిసిపోతే వేసుకోవటానికి ఇంకొక జత బట్టలు లేవని తెలుసు. దేవుడు నీ ద్వారా పనిచేయవలెనని కోరుతున్నాడు.

యౌవనస్థులు మురికి విషయాలు మాట్లాడటంలో మునిగిపోయి ఉంటారు. 20, 30 ఏండ్లు వచ్చేసరికి చచ్చిపోయి ఉంటారు. వారు దృష్టినుంచి అదృశ్యమైపోతారు. నాతో చదువుకొన్నవారు నాతో కలిసి కూర్చొన్నవారు ఈ లోకమును త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు విశాలమైనటువంటి అవినీతి, అపవిత్రతతో నిండిన మార్గమును ఏర్పాటుచేసుకున్నారు. నేను యౌవనస్థునిగా ఉండినప్పుడు దేవుడు నాతో యోసేపు కథ చెప్పారు. ప్రతి దినము నా భోజనమునకు ముందు, నేను నిద్రపోవడానికి ముందు నన్ను యోసేపు వలే చేయమని దేవుని అడిగాను. దేవుడు ఒక పోలీసు వానివలే చుట్టూ కావలి కాసి ఉదయమే లేచి ప్రార్థనలో జీవించటానికి దేవుడు నాకు తోడ్పడెను. వారు రాత్రంతా నిద్రపోయి పాపంతో జీవించటానికి తెల్లవారి లేస్తారు.

భోజనం కోసం అడుక్కోవద్దని దేవుడు నాకు సెలవిచ్చాడు. ఇతర మతస్థులు అడుక్కుంటారు. దేవునిని ఆయన నీతిని మనం వెదకాలి. యోసేపు, మోషే, దావీదు, దానియేలు యొక్క జీవితములను చదవాలి. ఈ జీవితములను చదువుచున్నావా. నేను హైస్కూల్‌లో చదివే కాలములో నేను దేవుని గ్రంథమును మోకాళ్ళ మీద ఉండి చదివేవాడిని. నేను జాగ్రత్తగా గుర్తు పెట్టుకొనేవాడిని. ''ప్రభువా! నన్ను అలాగ చేయి'' అని ప్రార్థించినాను. తీక్షణంగా నేను చదివిన దానిని బట్టి నా బైబిలు పాతది అయిపోయింది. గాలివీచి బైబిలు యొక్క పేజీలు అన్నీ చూపెట్టేది. గాలివీచి బైబిలులో ఉన్న పేజీలు కొట్టుకొనిపోయేవి. నేను దేవుని వేరొక బైబిలు కోసం అడిగాను. ఒక స్నేహితుడు నన్ను భోజనానికి పిలిచి కొత్త బైబిలు ప్రెజెంట్‌ చేశాడు.

ఈ విధంగా దేవుడు నా అవసరతలు తీర్చి నా విశ్వాసం నిర్మాణం చేసారు. నీవు ఇరుకు మార్గం ఏర్పాటు చేసుకున్నావా. కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను విశాలమార్గంలో నడిపించుచున్నారు. వారు వారి కుమార్తెలను, ధనికులు పెద్ద డిగ్రీ గల వారికిచ్చి వివాహం చేస్తున్నారు. పురుషులు త్రాగినా, చెడు జీవితం జీవించినా ఫర్వాలేదు. వారి దేవుడు, వారి డబ్బు, వారి విద్య. కాని వారి మూఢభక్తి వలన ఆలయమునకు వెళతారు. దేవునిని ఒక డాక్టరుగానో లేక వారి జాగ్రత్తలు చూచుకునే ఒక మనుష్యునిగానో వాడు కోవాలని చూస్తారు. జబ్బు రాగానే దేవుడు రావాలి. వారు స్వస్థపడగానే వారు ఏవిధమైన రుసుము అడక్కుండానే వెళ్ళిపోవాలి! నీవు ఎప్పుడైనా పశ్చత్తాపపడి నిజమైన ప్రేమతో దేవునిని ఆరాధిస్తావా. నూతన జన్మతో ప్రారంభించే జీవితాన్ని నీవు జీవిస్తున్నావా, నికోదేము వృద్ధాప్యంలో క్రీస్తును కలుసుకున్నాడు. ''నీవు తిరిగి జన్మించాలి, నీవు ఎన్నడెన్నడు ఇరుకు ద్వారమును ప్రవేశించలేవు'' అని ఆయన చెప్పాడు. నీవు ఇరుకు ద్వారమున ఎప్పుడైన ప్రవేశించావా. ''నేను ఒక ఉపాధ్యాయుడను. నాకు మోషే ధర్మశాస్త్రం తెలుసు'' అని నీవు చెప్తావు, క్రీస్తు చెప్తాడు నీవు దారి తప్పావు. నీవు గాయం చేసావని నీకు ఎరుకేనా. నీవు సత్యముతో ఆటలాడవవద్దు. నీవు బురదవంటి దాని నుండి పైకి ఎత్తబడితివని ఎరుగుదువా. నాకు తెలుసు. నా తల్లిదండ్రులు నన్ను బాగా పైకి తీసుకువచ్చారు. అయినప్పటికీ నేను పాపమునకు లొంగిపోయేవాడిని. దుష్టుల యొక్క సాంగత్యములోనికి నేను త్రోయబడియుంటే నేను దుర్మార్గుడనైయుందును. సంఘం నన్ను సంరక్షించింది.

నేను అబద్ధములాడేవాడిని. దేవుని వాక్యము నాకు ఇయ్యబడినప్పటికి ఇదే నాగతి. నేను దేవుని వాక్యమునకు విధేయుడను కావలెనని నేను ఎరుగుదును. నేను ఆటలాడేవాడిని, కుస్తీ పట్టేవాడిని. ఆటలు నన్ను పాపము నుండి తప్పించినవి. అవి నా శక్తిని వినియోగించి చదువుకు సిద్ధముగా నా మనస్సును నూతనపర్చేవి. కాని నా హృదయమును రక్షించేది ఎవరు. యెహెజ్కేలు 36:25-29 వు. దానియేలుకు పూర్వము 8 సం||లకు యెహెజ్కేలు ఒక ప్రవక్తగా ఉండినాడు. ఆయన మాటల ద్వారా దేవుడు, నాతో మాట్లాడినాడు. నేను వాటిని విశ్వసించాను. నీకు నూతన హృదయము ఎవరు ఇవ్వగలరు. నీకు నూతన హృదయం ఉంటే నీవు ప్రార్థించేటప్పుడు పరలోకంలో వినబడుతుంది. దేవదూతలు నీ స్వరమును ఎరుగుదురు. ఎవరు ప్రార్థిస్తున్నారు. దానియేలు! సింహపు నోళ్ళు దేవదూతల ద్వారా అదుపులో పెట్టబడినవి.

ఒకప్పుడు ఒక డిప్యూటి కలెక్టరు గారి కుమారుడు కారు నడుపుతూ పొగత్రాగేవాడు. నేను అతని మీద ప్రార్థించాను. కాని అతనికి విశ్వాసం లేదు. అయ్యో పొగత్రాగే వారులారా మీరు మీ యొక్క ఊపిరితిత్తులను క్యాన్సరు కొరకు ఎందుకు సిద్ధపరచుదురు? ఆ కుర్రవాడు చనిపోయాడు. జబ్బుగానే, యవ్వనస్తురాలైన భార్యను, వ్యాధిగ్రస్థురాలైన బిడ్డను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మనుష్యులు పాపంలో జీవిస్తారు. వారు అందమైన స్త్రీలను తమ కొరకు భార్యలనుగా కోరుకుంటారు. వారు శరీరమును పాపముతో నింపుకుంటారు. వారు భార్యలకు వ్యాధిని బిడ్డలకు మరణమును తీసుకువస్తారు.

నీ హృదయంలో నరకము ఉన్నది. అది నిన్ను నీ భార్యను, నీ బిడ్డలను దహించి వేస్తుంది. యెహెజ్కేలు 36:33-36 వరకు యిర్మియా 25: 31, 32 నీవు నీ కొరకు జీవిస్తూ వ్యభిచారమందు కొనసాగితే ఒక సుడిగాలి వస్తుంది. నీవు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నావా?

సైతాను నాకు హెడ్మాష్టరు పదవిని ఒక ఊరిలో చూపించాడు. అది కెనెడియన్‌ బాప్టిష్టు మిషనులో చాలా కోరదగిన పదవి. కాని దేవుడు నన్ను మద్రాసుకు పిలిచాడు. నేను మద్రాసులో 5 సం|| జీవించిన తరువాత జపాను వారు విమానములో వచ్చి బాంబులు వేస్తారనే విషయము జరగనున్నదిగా ఉండింది. మేము మద్రాసు నుండి పారిపోవాలా, ప్రభువును అడిగాము. ప్రభువు నాతో యిర్మియా 42:10 ద్వారా నాతో మాట్లాడారు. కాని బాంబుల సంగతి ఏమిటి? ఒకరాత్రి మేము 11:00 గం||లకు ప్రార్థిస్తూ ఉండగా జపాన్‌ బాంబులు సముద్ర తీరమున పడ్డాయి. అవి పట్టణం మీద పడలేదు. దేవుడు మమ్మును గూర్చి జాగ్రత్త వహించాడు. దేవుడు మమ్మును బాంబుల నుంచి తప్పించాడు.

నేను విశాలమైన మార్గమునేర్పాటు చేసుకోవడానికి నిషేదించబడ్డాను. కాని దేవుడు నన్ను ఆపు చేసాడు. చెట్టు దాని ఫలముల వలన తెలియబడును. విశాల మార్గములో సమస్తము బాగానేయున్నట్లు జరుగును. కాని అకస్మాత్తుగా ఒక పొట్లాట వచ్చును. ఒక కర్రవలె కత్తిని తీసుకొని నీవు కోపము వెళ్ళబుచ్చదలచుకున్నావు. అధోగతి మార్గాన నీ జీవితం నడుస్తుంది.

లెక్కలు నేర్పించే ఉపాధ్యాయుడు 4, 5 తరగతులకు నేర్పించేవాడు. కాని అతడు సరిగ్గా నేర్పేవాడు కాదు. కాని నేను 6వ తరగతికి నేర్పవలసిన వాడను. ఈ వ్యక్తి చిట్టచివరి సంవత్సరములో వచ్చే ఫలితము పాడు చేయవలెనని యోచించాడు. కాని చివరి సం||నకు నేను లెక్కలు చెప్పుతూ ఉండినాను. అకస్మాత్తుగా తనకు కుష్టరోగం వచ్చింది. ఈ వ్యాధి ఒకరోజున తరగతిలో విపరీతమైన పరిస్థితిని తీసుకువచ్చింది. అతడు సిగ్గును అనుభవించాడు. బడిని విడిచిపెట్టవలసి వచ్చింది. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా కొంతమంది వెళ్ళవలెనని చూస్తారు. నీచముగా మాట్లాడటానికి ప్రయత్నించవద్దు. మనకుపైన ఉన్నతమైన ఆధిపత్యమునొకటి పనిచేస్త్తూ ఉంది. మనుష్యులు నాకు కీడు ఎంచినప్పుడు నేను వారి కొరకు ప్రార్థించేవాడిని, ''ప్రభువా వారిని తీసుకోవద్దు, వారికి చిన్నబిడ్డలు ఉన్నారు'', వ్యభిచారంలో జీవిస్తూ ఉన్న ఒక వ్యక్తి నన్ను దూషించడం ప్రారంభించాడు. నా బోధకు తట్టుకోలేకపోయాడు. అతని సొంతపాపం అతనిని నాశనం చేసింది. దేవుడు నన్ను ఎదిరించి మాట్లాడనివ్వలేదు. దేవుని బిడ్డల గూర్చి చెడు వార్త చెప్పవద్దు. ఇలాంటి వారు తప్పించుకోలేరు. దేవుడు వారికి న్యాయము తీర్చును. వారికి దేవుని భయము లేదు. 2 థెస్స|| 1:6 ఒక దైవజనుడు దేవుని మాట పలికినప్పుడు నిన్ను నీవు తగ్గించుకోవాలి. నీవు పెద్దవాడివి అయినప్పటికినీ నీవు వణకాలి. ఫరో తన్ను తాను తగ్గించుకొనేవాడు కాడు. కాని అతనిని ఆశీర్వదించమని మోషేను బ్రతిమలాడాడు. కాని అతడు దుర్మార్గంగా ప్రవర్తించిన తరువాత అది ఎలాగు సాధ్యపడుతుంది. అనేకమంది దుర్మార్గంగా జీవిస్తారు. మరియు దేవుని వాక్యమునకు వ్యతిరేకంగా వెళ్తారు. దేవుని తీర్పు వారికి వ్యతిరేకంగా వస్తుంది. వారు సువార్తకన్నా మించిన వారా? వారు సువార్తకు వ్యతిరేకులైతే దేవుని తీర్పు వారి మీదకు వస్తుంది. ఒక బోధకుడు దేవుని వాక్యంను, ఆయన ఆశీర్వాదంను తీసుకొనివస్తాడు. ఒక కమ్యూనిస్టు వ్కక్త్తి మేము బోధించుచుండగా మా మీద రాళ్ళు విసిరాడు. అతడు చనిపోయాడు. మరియొక స్థలంలో మేము బోధించుచుండగా ఒక కమ్యూనిస్టు ఆయన మమ్మును దూషించడం ప్రారంభించాడు. ఆయన భార్య పిచ్చిది అయిపోయింది.

నీవు దేవుని వలన జన్మించి ఆయన చిత్తములో ఉన్నవాడవైతే నీ చుట్టూ దేవుని సైనికులు ఉంటారు. బండ మీద నిలబడియుండు, గాలి వస్తుంది కాని అది మనలను ముట్టి వెళ్ళిపోతుంది. మనము పడిపోము. ''అది నా బిడ్డ యొక్క ఇల్లు. ఓ వరదా! నీవు దానిని ముట్టవద్దు'' అని దేవుడు చెబుతాడు.

కొంతమంది తమ జీవితములకు అతుకులు వేయవలెనని చూస్తారు, వారి జీవితములలో కొన్ని భాగములలో మేలు కావలెనని కోరుతారు. నీ మధురమైన ఉద్భోదలు నీ పాతబుడ్డిలో వేయవద్దు. ''నన్ను పిలువుము, నీవు ఎరుగనంటి విషయములను నీకు కనుపరుస్తాను'' అని దేవుడు సెలవిచ్చాడు నీకు కనుపరుస్తాను'' అని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు నీకు శక్తి కూడా దయ చేస్తాడు, దేవుని వాగ్దానములను స్వతంత్రించుకో. నీవు కొత్త గ్రంధమును అందుకుంటావు. నీవు దేవునికి చెందిన వాడవైతే లోకమంతా నీవైపునకు ఆకర్షించబడతుంది. దేవుడు నీ కొరకు గొప్ప ఏర్పాటు చేసినాడు. ఏ విషయంలో నీవు గర్వించవద్దు. ప్రభువు తన కార్యమును చేస్తున్నాడు.
మూల ప్రసంగాలు