లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని వెంబడించుట

కీ.శే. యన్‌. దానియేలు గారు
దిన వృ. 20:1-4 వరకు, 12, 13 వచనములు
''యూదా వారందరును తమ శిశువులతోను, భార్యలతోను, పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి. యెహోషాపాతు రాయబారులను తన రాజ్యమంతట పంపి దేవుని వాక్యం వారికి నేర్పించాలని చెప్పాడు. దేశము అన్య బలిపీఠము నుండి ఈ బలిపీఠము చుట్టూ పెరిగిన వనముల నుండి దేశము శుభ్రపరచబడిందని చూస్తున్నాము. దేవుని ఆరాధించుటతో కొంత అన్యారాధన కూడా కలుగవచ్చు. అన్యుల ఆరాధన అనగా చీకటిని తీసుకొని రావడం. నిజమైన విశ్వాసము నందు మన హృదయములు స్థిరపరచబడకుండా దుష్టాత్మలు చూస్తాయి. తిరిగి తిరిగి ఒక సంఘనాయకుడు ప్రభువును వెదకాలి. యెహోషాపాతు ఈ రీతిగా ప్రభువును వెతికాడు.

దేవుడు ఆయన రాజ్యపూచీని నీవు వహించినట్లయితే నీ కుటుంబాన్ని విస్తారంగా దేవుడు దీవిస్తాడు. కొంతమంది దేవుని రాజ్యభారమును వహించుటకు సమయము లేని వారుగా ఉంటున్నారు. వారు ఇక్కడ అక్కడ పరుగెత్తుతారు గాని వారి హృదయంలో ఉండేది ప్రాముఖ్యత కొరకైన ఆశ. వారి ఉత్సాహం త్వరగా అంతం అయిపోతుంది. మన పని మన ప్రార్థనా జీవితమును జాగ్రత్తగా చూసుకొనుటయే. ప్రార్థించే వ్యక్తి దేశము యొక్క పార్లమెంటును సహితము ఉర్రూతలూగించవచ్చు.

యెహోషాపాతు బాగా ఆరంభించాడు. కాని ఒక విషయంలో అతనికి గ్రుడ్డితనం వచ్చింది. ఇది అతని కుటుంబాన్ని నాశనం చేసింది. దేవుని న్యాయతీర్పు ఎవరి మీద అయితే బలముగా పడబోవుచుండెనో అతనితో ఏకీభవించాడు. అతడు మరణమును సూక్ష్మముగా తప్పించుకున్నాడు. కాని అతని కుటుంబము నాశనం అయినది. నీవు సహవాసం పేరు పెట్టుకొని ఇక్కడకు అక్కడకు పరుగెత్తి చివరకు ఏమి సంపాదించేవాడవు కాకపోవచ్చు. నీవు దేవుని చిత్తమును వ్యక్తిగతముగా నీ జీవితంలో వెంబడించాలి. దేవుని నడిపింపును నీవు పోగొట్టుకుంటే దానిని తిరిగి సంపాదించటం చాలా కష్టం.

ప్రభువును వెదికే దానిలో యెహోషాపాతు దేశమంతటిని ఐక్యపరిచాడు. నీవు ప్రభువుకు నిజముగా సేవ చేసినట్లయితే చాలా వ్యాఖ్యానము ఉంటుంది. కాని దేవునికి, ఆయన వాక్యమునకు నమ్మకముగా ఉండుము. నీవు ఓడిపోవు. యెషయా 26:9 ''రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది. నాలో నున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోకనివాసులు నీతిని నేర్చుకొందురు. ''ఈ దినములలో మనం సాధారణముగా మానసిక సంబంధమైన క్రైస్తవులను చూస్తున్నాము. కాని ఆత్మ సంబంధులను కాదు. యోబు 32:8 ''అయిననూ నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును''. యెహోషాపాతు తన్ను తాను పరీక్షించుకొని ఉపవాసము ఒకటి ప్రకటించాడు. దేవునికి లంచం పెట్టడానికి ఉపవాసం ఒక మార్గము అయిపోయింది. ఉపవాసం ద్వారా దేవుడు లంచం పెట్టబడడు. ఇది ఆత్మ సంబంధమైనదై యుండవలెను. విషయములను సరిచేయకుండా ఉపవాసం ఉండుట వ్యర్థము. దేవుని తోడి సంబంధములలో మనం ఉన్నతమెట్టులో జీవించుదుము.

కొత్తగా మారుమనస్సు పొందిన వారు బోధించకూడదు. ప్రభువు వారిని అడిగినప్పు డు వారు దీనముగా సాక్ష్యము ఇవ్వాలి అంతే ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిన గుంపుతో మీరు చేరండి. అనుభవంలేని వాడు లోపలి సంఘములోనికి ప్రవేశించుట అపాయకరము. దెయ్యం పట్టిన వానిని వాడు మార్చబడిన వెంటనే తన శిష్యులతో చేరనివ్వలేదు యేసు. ఇక్కడ ప్రాముఖ్యతను వెదికే వారికి స్థానం లేదు. దేవునికి దీనముగా సేవ చేయుటకు వెదికే వారే సహవాసములో ఉండవచ్చు.
మూల ప్రసంగాలు