|
వారు గాలిని విత్తినారు
|
కీ.శే. యన్. దానియేలు గారు |
హోషయా 8:10
''యూదా బెన్యామీను గోత్రముల నుండి 10 గోత్రములు వేరయ్యాయి''. ఈ బెన్యామీను, యూదా గోత్రములు ఇశ్రాయేలని ఈ గ్రంథములో పిలవబడుచున్నది. 10 గోత్రములు ఎఫ్రాయీము అని పిలవబడుచున్నవి. దేవుడు ఎఫ్రాయీయును అడవిగాడిద అని పిలిచాడు. ఎఫ్రాయీము విగ్రహారాధికురాలైంది. దేవుడు యెహోవాను విడిచిపెట్టిన వారి విషయమై చాలా కఠినముగా మాట్లాడుతుతున్నాడు. హోషేయా 8:7 ''వారు గాలిని విత్తియున్నారు గనుక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట యెత్తినది అది పంటకు వచ్చిన యెడల అన్యులు దాని తినివేతురు''. వారు స్వాతంత్య్రము అని చెప్పుకునే దానిని అనుభవిస్తున్నారు. దేవుని చిత్తములో లేనటువంటివారు స్వాతంత్య్రము అని చెప్పుుకునే దానిని అనుభవిస్తారు. సైతాను వారిని నాశనమునకు ఏర్పాటు చేస్తాడు. ప్రజలు దేవునిని విడిచిపెట్టినట్లయితే వారు గాలిని విత్తి ప్రళయ వాయువును కోయుదురు. ఒక రోజున వారు విషయములు వారి ఆధీనములో లేవని గుర్తించి సైతానుకు తమ్మును తాము అప్పగించుకొంటారు.
మనము ఆధార సత్యములను విడిచిపెట్టి సంఘనిర్మాణం ఆరంభిస్తే అది పాపమునకు స్థానం అయిపోతుంది. హోషెయా8: ''వచనం'', ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలి పీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయెను. దేవునిని నిజముగా ఆరాధించాలి అంటే మీరు సత్యమును తెలుసుకోవాలి. సత్యమును ఎరుగనివాడు ఇతరులను నిజమైన ఆరాధనలోనికి నడిపించలేడు. దేవుడు ఆత్మయు సత్యమునైయున్నాడు. ఎవరైననూ నిజముగా తిరిగిపుట్టియుంటే అతని ఆత్మ ప్రత్యక్షత ద్వారా నడిపించబడును. అతని ప్రార్థనలు ప్రవచనాత్మకముగా ఉండును. నిశ్చయముగా అతడు సైతాను యొక్క దాడికి గురియగును. కాని ఆయన ఇంనూ దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని హత్తుకొని యుంటే సైతాను అతనిని విడిచిపెట్టి వేస్తాడు. అతడు దేవుని వాక్యమునకు దైవ సంబంధమైన భావము సంపాదిస్తాడు.
నీ కొరకు దేవుని ఏర్పాటును ఆయన ఉద్దేశమును వెంబడించు. మనమందరము ఆయన ఉద్దేశములో ఉన్నట్లయితే ఒకరితో ఒకరము పరిపూర్ణముగా కూర్చబడతాము. మనమందరము కలిసి పనిచేస్తాము. యూదాలో ఎన్ని తప్పులు ఉన్నా ఇంకా దేవునిని వెంబడించారు. యూదా కూడా శిక్షించబడవలె. ఒక నీతిమంతుడు ఏడుసార్లు పడినను తిరిగి లేస్తాడు. దుర్మార్గుడు క్రింద పడితే ఎన్నటికీ లేవడు.
నీవు ఏర్పాటు చేసుకునేవి జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఒకడు ప్రతి దానిలోను తన ఆత్మీయ జీవితంలో కాపాడబడునట్లు చేయవలెను. |
|