లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని యొక్క నీతి

కీ.శే. యన్‌. దానియేలు గారు

1 సమూ|| 21: మనము పాత నిబంధన చదివేటప్పుడు మానవకార్యములలో దేవుని సత్యము ఉపయోగించుట చూడవచ్చును. ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పటికినీ, ఆయన నీతి మంతుడు, ఆయన నీతి ఎల్లప్పుడు క్రియలలో చూస్తాము. యిర్మియా 17:2 ''యూదాపాపము ఇనుప గంటముతో వ్రాయబడియున్నది; అది వజ్రపుమొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకల మీదను చెక్కబడియున్నది; ఇది సత్యము. జాతి ఏదైన కుటుంబములు సంబంధించిన, ఒక వ్యక్తికి సంబంధించిన పాపములున్నవి. కానీ అవి అన్నియు లిఖించబడ్డవి. భారతదేశము యొక్క పేదరికము, దేశ పాపమును బట్టియే. అనగా ధనికుల యొక్కయు భారతదేశములోని ఉన్నత కులస్థుల యొక్క అత్యున్నతమైన స్వార్థము. బ్రాహ్మణుడు సుఖముగా జీవించాలనే ఉద్దేశముతో భారతదేశమును పరిపాలించలనే ఉద్దేశముతో మానవ సమాజమును ఏర్పాటు చేసాడు. భారత దేశములో ఉన్నటువంటి మతములు మనకు ఏ నీతి గురించిన జ్ఞానం ఇవ్వలేదు. క్రైస్తవ సంఘములోనికి కూడా న్యా జ్ఞానం లేకపోవడం అనేది పాకింది. మనం ఇంకా నీతి అనేదానిని పాటిస్తున్నాం.

దేవుని సూత్రములు మన జీవితములలో పనిచేస్తున్నవి. సౌలు రాజు అయినప్పుడు దేవుని చిత్తములో కొంతకాలం ఉండినాడు. త్వరలో గర్విష్టుడు అయిపోయినాడు. సమాయేలు యొక్క ప్రభావము తప్పిపోయింది. తర్వాత పౌలు క్రూరంగా ప్రవర్తించాడు. తన అల్లుడునే చంపాలనీ కోరాడు. దేవుడు దానిని ఆపుచేసాడు. ఒకసారి 80 మంది యాజకుల మీద పడ్డాడు. గొల్యాతు ఖడ్గమును దావీదుకు ఇచ్చిన కారణము చేత. దాని ఫలితము ఏమిటి పాపము పాపమే. దాని ఫలితాన్ని మోసుకోవాలి. ఆ దేశమంతా భాదపడింది. హత్యచేసే ఇతరులు కూడా ఉండినారు. దేశములో కరువు వచ్చింది. దావీదు దేవుని యొద్ద విచారణ చేయగా అది సౌలు యొక్క పాపమును బట్టియే అని జవాబు ఇచ్చాడు. ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసే నిమిత్తం సౌలు యొక్క ఏడుగురు కుమారులనుపట్టుకొని ఉరితీసారు. మానవుని యొక్క పాపముల నిమిత్తము నిజమైన ప్రాయశ్చిత్తము సిలువలోనే అని దావీదు ఎరిగియుండినాడు. అది మానవ అవసరతలు అన్నింటిని ఎదుర్కొంటుంది. మన జీవితములలో మనము ఓప్పుకొనని పాపములు పశ్చత్తాపములేకుండా విడువకూడదు. మనము రక్షించబడే నిమిత్తము రక్షించబడ్డాము. అది పరిపూర్ణము చేయబడవలెను. ముందుకు నడిపే మనలోనికి వచ్చింది. కనుక మనము మన తల్లిదండ్రుల యొక్క పాపములు కూడా ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో రక్షణ కనిపెట్టి యుండి మన తండ్రుల పాపములు తెలుసుకోవా. విలాపనా. 5:7 దేవుడు ఇశ్రాయేలుకు తమ పాపముల నిమిత్తము పశ్చత్తాప పడడం నేర్పించాడు. తమ పితరుల యొక్క పాపం ఒప్పుకోవడం కూడా నేర్పించాడు. హిందూ మతములో నీళ్ళలో స్నానం చేయడం ద్వారా నీవు క్షమించబడగలవని భావిస్తారు. మీరు సువార్తను బోధించినప్పుడు రక్షణ యొక్క విత్తనము చల్లుతున్నారు. అంతేకాకుండా దేశము యొక్క రాబోయే దినములలో వచ్చే ఆర్థిక సంబంధమైన రాజ్యాంగ సంబంధమైన, నీతి సంబంధమైన విరుగుడును గూర్చిగూడ బోధిస్తాము. ఏదేశమునకైనను ఉండే ఒక నిరీక్షణ క్రీస్తు సువార్త. ఈ వెలుగు మనయందు ప్రకాశించాలి. మన ద్వారా ప్రకాశించాలి.

ఆకివీడులో కొంతమంది బాప్తీస్మము పొందారు. ఒక స్త్రీ చెప్పింది.'' గత సం||లో నేను ఒక్కదానినే వచ్చాను. కానీ ఇప్పుడైతే నలుగుర్ని నాతో తెచ్చాను. నేను క్రీస్తునందు విశ్వాసించి ఇప్పుడు నేను ఆయన ద్వారా ప్రార్థిస్తున్నాను.'' దేవుని కృపద్వారా దేవునివాక్యం ఇతరులకు అందుచున్నది. ఈ స్త్రీ బాప్తీస్మము పొందవలెనని విన్నది. ఆమె వెళ్ళి ప్రభువుకు ప్రార్థన చేసింది. ఆయన ఆ స్త్రీని మత్తయి 3వ అధ్యాయం చదవమని చెప్పాడు. ఆంధ్రలో వెలుగు వ్యాప్తిస్తూ ఉన్నది. 4,5 వేలమందిని దేవుని వాక్యం వినే నిమిత్తము సమకూర్చడం సులువైన విషయముకాదు. మనం బోధించేది సత్యమని వారు ఎరుగుదురు. కానీ కొంతమంది ప్రారంభంలో మారు మనస్సు పొందినవారు వెనుకకు వెళ్ళిపోయారు.

మనం ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నప్పుడు మన తండ్రి యొక్క కుటుంబము కొరకు ఎలాగు ప్రార్థనచేయవలెనో దేవుడు బయలు పరుస్తాడు. క్షామము వచ్చినప్పుడు కారణముకొరకు దావీదు దేవుని అడిగాడు. రాజైన సౌలు యొక్క పాపము అని చెప్పాడు. పాలించేవాడు ప్రజల మీదికి ఎంతో కష్టం తేగలడు. సంఘనాయకులుకూడా వెలుగు వ్యాపించవలెనని కోరరు. వారు ఆ పనిచేయరు. ఇతరులు చేయడానికి ఒప్పుకొనరు. ఇలాంటి ప్రవర్తన వలన తరతరములు వరకు దేవుని శాపము తెచ్చుకుంటుంది. అనేక జనముల వరకు దేవుని శాపం తెచ్చుకుంటారు సంఘపు నాయకులలో కొంతమంది యజెబెలు బల్ల యొద్ద కూర్చుంటున్నారు. భారతదేశములో సంఘముయొక్క పరిస్థితి విషాదకరముగా ఉంది. దావీదు తన సొంతదేశమందు కార్యము చేస్తున్నాడు. మన ప్రజలకు వారి చేసే ప్రతి క్రియ ద్వారా వారి మీదికి ప్రతిక్రియ జరుగుతుందని ఎవరైనా నేర్పించేవారున్నారా?

దావీదు కుమారుడైన అబ్షాలోము బహు దుర్గార్గుడైపోయాడు. అడుగడుగకు అతడు పాపములో దిగిపోయాడు. అకస్మాత్తుగా అతడు తప్పించుకోలేని మరణమును అతడు కలుసుకున్నాడు. ఒకడు రాజ కుమారుడు కావచ్చు కాని అతడు దేవుని న్యాయతీర్పునుండి తప్పించుకోలేడు. దేవుడు మనలను కాపాడితే తప్ప మనం క్షేమముగా ఉండలేము. '' నీవు దీవించితే ఓ దేవా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరముగా ఉండును.'' దావీదు ఈ రీతిగా ప్రార్థన చేసాడు. సౌలు తన జీవితంలో మొదటి భాగములో జాగ్రత్తగా ఉండినాడు. తర్వాత భాగములో దేవుని పిల్లలతో సహవాసము పోగొట్టుకున్నాడు. దేవుని పిల్లల సహవాసము ఒక కాపుదల. వారి కాపుదలలో మన పాపములు బయటకు వస్తాయి. మన పాపములను మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మేలు. మన ఆరోగ్యము గూడా వృద్ధి చెందుతుంది మన శరీరములో ఉండే క్రిములు చచ్చిపోతాయి. వాక్యము శ్రమల గూర్చి వ్రాస్తుందిగానీ మనం జాగ్రత్తగా వెదికితే ఆ శ్రమకు కారణము తెలుసుకుంటాము, దేవుడు నీతిగా న్యాయము తీర్చును.

మూల ప్రసంగాలు