లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

కుటుంబము నిమిత్తం దేవుని మార్గము

కీ.శే. యన్‌. దానియేలు గారు

తీతు 2:3

''అలాగుననే వృద్ధ స్త్రీలు కొండెగత్తెలును మిగుల మద్యపానాసక్తులునై యుండక ప్రవర్తన యందు భయభక్తులు గల వారై యుండవలెననియు, మంచి ఉపదేశము చేయువారునై యుండవలెనినయూ బోధించుము''. ఒక స్త్రీ యందుండే సాధుత్వము, నిర్మలత్వము ఒక ప్రసంగముగా మార్చవచ్చును. స్త్రీలు వ్యర్థ ప్రసంగములు చేయకూడదు. ఒక స్త్రీ వ్యర్థ ప్రసంగము చేసినట్లయితే ఆమె ఎలాగు ప్రార్థించగలదు. తన భర్తను బిడ్డలను ఎలాగు కాచుకొనగలదు. ఒక భక్తి కలిగిన స్త్రీ వ్యర్థ ప్రసంగములతో సంబంధం ఉంచకూడదు. 4వ వచనం భర్తలను ప్రేమించుచు ఇది ఎందుకు చెప్పబడింది. భర్త ఇంటికి వచ్చినపుడు భోజనము సిద్ధముగా ఉండును. ఒక వర్తమానము కూడా సిద్ధముగా ఉండాలి. ప్రేమ అలాంటి మెట్టులో ఉండాలి. ఒక భక్తి కలిగిన స్త్త్రీీ ఏమి ధరించుకొందును అనే విషయంపై తన సమయం గడపదు. ఒక స్త్రీ తన భర్తను దేవుని ఆత్మతో ప్రేమించినట్లయితే ఆయన ఎప్పుడూ తప్పిపోడు.

''బిడ్డలను ప్రేమించుట'' ఒక స్త్రీ తన ఆత్మ కొరకు ఆశించాలి - బిడ్డ యొక్క సౌందర్యము (5వ వచనం) కుటుంబ జీవితము ఆత్మీయంగా ఉన్నట్లయితే అది ఆధీనములో ఉండే జీవితం. ఎల్లప్పుడూ కీచులాడుకోవడం, పెద్ద వాగ్వాదములు ఉండకూడదు. భార్యభర్తలు ఇద్దరూ దేవుని చిత్తమును వెదకాలి. స్త్రీలు లోబడేవారుగాను నేర్పించబడడానికి తగిన స్థితిలోను ఉండాలి.

పురుషులు మితమైన మనస్సు గలవారై ఉండాలి. నీవు దేవుని వాక్యముతో నింపబడి ఉంటే నీకు ఈ లక్షణము ఉండును. సామె 3:5

ఒక వ్యక్తి నాతో ఈవిధముగా అన్నాడు. ''నన్ను నేను కాపాడుకోవటం నేను ఎరుగుదును'' తర్వాత అతడు పాపంలో పడిపోయాడు. మనలో గర్వం ఉన్నది. మనము సమస్తము ఎరుగుదుము అని మనము అనుకుంటాము. గర్వపు ఆత్మ మనలను పట్టుకుంటుంది. దీనముగా ఉండుట చాలా కష్టము. 7వ వచనం. దేవుని ఆత్మ మన దగ్గరి నుండి కొన్ని విషయములను ఎదురు చూస్తాడు. వాటిలో ఒకటి మనం మంచి మాదిరిని చూపెట్టాలని, ఒక యౌవనస్తుడు ఇక్కడ ఉండినాడు. ఆయన జీవితం మంచి మాదిరిగా ఉండినది. ఆయన పాశ్చాత్య దేశమునకు వెళ్ళినా కూడా తన మార్గములో పరిపూర్ణుడుగా ఉండినాడు. మనం భుజించుటలోను మాదిరి చూపెట్టాలి. నీ యౌవనం తిరిగి రాదు. 20 ఏళ్ళు అయిన తర్వాత నీవు ఇప్పుడు ఉండినట్టుగా యౌవనస్థుడిగా ఉండలేవు. నీవు ఈ వయస్సులో జీవించే జీవితం నీవు తర్వాత కాలములో బోధించేటప్పుడు బలముగా ఉంటుంది. నీ భవిష్యత్‌ దేవుని హస్తములలో ఉన్నది. దేవుడు నీ జీవితంలో ఆశగొనియున్నాడు. ఆయన నీమీద ఆధిపత్యం వహించితే చీకటి శక్తులు నీ జీవితంలో పాలుపుచ్చుకోవచ్చు. ఇలాంటి జీవితంలో ఒక జీవితం దావీదు యొక్క జీవితం. దేవుడు కాపాడటం మట్టుకే కాదు. కానీ ఆయన నిన్ను నడిపిస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన వాక్యమును నీవు విశ్వసించితే నీవు దీవించబడతావు.

మూల ప్రసంగాలు