లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుడు హృదయమును వెదకును

కీ.శే. యన్‌. దానియేలు గారు

యిర్మియా 12:13
''జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు. కాని ప్రయోజనం లేకపోయింది. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు''.

ఇలాంటివి జరుగుతున్నవని వినుటకు విపరీతముగా ఉన్నవి. 10వ వచనములో దేవుడు చెప్పుతున్నాడు. అనేకమంది పాస్టర్లు ద్రాక్షతోటను, ఫలము లేనిదిగా చేసారు. అనేకమంది ఆశ్చర్యపడుతున్నారు. వారు కష్టపడి పనిచేసిన తరువాత ఫలములు లేవు. దేవునికి కారణము తెలుసు. దున్ని విత్తనము విత్తువాడు జాగ్రత్తగా ఉండవలెను. యిర్మియా 13:23. ఒకడు నిజముగా మారుమనస్సు పొందితే తప్ప గోధుమలు ఎలాగ చల్లగలడు.

అనేకసార్లు మనము బోధకులు తప్పుడు సిద్ధాంతములు బోధించుట చూస్తున్నాము. ఒకడు మా కూటములలో మారుమనస్సు పొందాడు. అతడు పాశ్చాత్య దేశములకు వెళ్ళి పాపములో పడి తిరిగివచ్చాడు. అతడు ఇంకనూ బోధించుచున్నాడే గాని ముళ్ళతుప్పలను కోస్తున్నాడు. విశ్వసించిన మనుష్యులు పరిశుద్ధాత్మతో నింప బడుదురు అని బాధించాడు అది తప్పు. ఇలాంటి బోధ మనుష్యులను నాశనం చేయును. యిర్మియా 14:14 వీరు మానవుల చేత నిర్మించబడ్డ ప్రవక్తలు. సొంతంగా ప్రవక్తలైనారు. ఇలాంటి బోధకుడిని చూసి విన్నవారు కూడా బోధించాలని ఆశిస్తారు. వారు ఒక సహవాసమును నిర్మాణం చేయవలెనని కోరతారు. కాని వారు గ్రహింపు లేనివారై సులభమైన జీవితం కొరకు వెదుకుతారు. ఇలాంటి ఉద్దేశ్యములు మనుష్యులలో ఉన్నప్పటికి నిజమైన క్రైస్తవ జీవితములోనికి వారు మనుష్యులను నడిపించగలిగితే నేను సంతోషిస్తాను. ఆస్తి మీద ఆధారపడిన భక్తి నేను ఇష్టపడను. నీవు నీబిడ్డలు దేవుని రాజ్యమును కట్టగలిగితే అది గొప్ప మేలు. యెహోషువ వలే నీ జీవితాంతమందు ఇలాగు చెప్పగలవు. ''నా కుటుంబము నేను యెహోవాకు సేవ చేయుదుము''.

నీవు తిరిగి పుట్టినావా. నీవు ప్రభువు నందు విశ్వసించినావా క్రీస్తు తిరిగి లేచినాడని నమ్ముతావా. అప్పుడు నీకు ఈ అనుభవం దొరుకుతుంది. రోమా 12:1 ఈ వాక్యమును చదవండి. దివారాత్రములు దానిని ధ్యానించండి. దాని సిద్దాంతమునకు మిమ్మును మీరు ఒప్పజెప్పుకొనండి. అప్పుడు మీ జీవితములలో ఏ ఓటమి ఉండదు. అప్పుడు నీవు ఆయన పరిపూర్ణ చిత్తమును నెరవేరుస్తావు. దేవుని చిత్తము ఏమిటి. ఈ లోకానుసారమైన ప్రీతికి నీవు చనిపోయినావా? సజీవయాగముగా నీవు మారినావా. అలాగయితే ప్రభువు నిన్ను ఏదైనా చెయ్యమని నీవు అడిగినప్పుడు నీవు చేస్తావు. 43 ఏళ్ళ క్రితం నేను నరసాపురం వెళ్ళాను. 118 డిగ్రీల వేడిలో చాలా మైళ్ళు నడిచాను. వేడిని దూరాన్ని నేను లెక్కపెట్టలేదు. 43 ఏళ్ళు నరసాపురం కొరకు ప్రార్థించాను. మళ్ళీ ఇప్పుడు తిరిగి వెళ్ళి బోధించాను. యిర్మియా 10:20. కొంతమంది ప్రజలు పరలోక రాజ్యమునకు బహుదూరముగా ఉన్నప్పటికి మేము పరలోక రాజ్యము లోపలే ఉన్నాము అని అనుకుంటారు. తల్లిదండ్రులు వారి బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుతున్నారు అనుకుంటారు. కాని వారు ఎలాంటి పాపములు చేసియున్నారో వారు ఎరుగరు. యిర్మియా 13:13, నేను ఎలాంటి సంఘములో పుట్టాను అనగా నేను తిరిగి పుట్టినప్పుడు నేను సత్యమును గ్రహించాను.

నీవు పాపివని ఎవరు చెప్పగలరు. ఎవరు నీకు గ్రహింపు ఇవ్వగలరు. దేవుని ఆత్మతో నీవు సంబంధము కలిగి ఉంటే నీపాపపు స్థితిని నీవు గ్రహించుకుంటావు. నీ స్వార్థం పోతుంది. మోసకరమైన హృదయం నీలో నుండి తీసివేయబడుతుంది. యిర్మియా 14: 7, 17 నీ హృదయం మోసకరముగా ఉన్నప్పుడు నీవు సత్యమును గ్రహించలేవు. మనలో కొంతమందిమి ప్రార్థన చేస్తున్నాం. కాని సత్యమైన ప్రార్థన నిజమైన విరిగి నలిగిన స్థితి మనలో నుండి రావు. నీకు విరిగిన హృదయం ఎప్పుడు లభించింది. యిర్మియా 7:16. దేవుడు హృదయం వైపు చూస్తున్నాడు. తొందర సమయంలో మట్టుకే నీవు ప్రార్థన చేయగోరతావు. తీరిక ఉండే సమయంలో నీవు ప్రభువు మీద కనిపెట్టటానికి ఆశపడవు. నీ హృదయంలో దేవునికి అడ్డుగా ఉండేవి చాలా ఉన్నాయి. ఇవి నిన్ను పరిపూర్ణుడు కాకుండా అడ్డుపడుతున్నాయి. నీవు ఆయన మీద కనిపెడితే వాటిని దేవుడు చూపిస్తాడు.

మన సంఘములలో సమాధానము లేనిచోట, నీతి లేనిచోట వారు చెప్పుతారు. ''సమాధానము, సమాధానము, నీతి'' యిర్మియా 9:14 నీవు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు. కాని అది లోతైన ప్రార్థన కాదు. సైతాను నిన్ను మోసపర్చటానికి కాచుకొనియున్నాడు. నీవు పూర్తిగా పశ్చాత్తాప పడలేదు. దేవుని బిడ్డల సహవాసంలో నీవు లేకపోతే నీవు వెనుకకు జారిపోతావు.

నిజమైన దైవజనుడు దేవుని యందు విశ్వాస ముంచేవాడు, ముళ్ళతుప్పలు కోయడు, అతడు సహోదరులను సమకూర్చి డేరాలు వేసి సేవ చేస్తాడు. పాస్టరు 'షి' గారు ప్రభువు నందు విశ్వాసముంచాడు. మనం విశ్వాసమును పోగొట్టుకొనకూడదు. నీవు దేవుని చిత్తము చేస్తున్నావా, నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా, నీవు విశ్వసించితే నీవు రోమా 12వ అధ్యాయమును జీవిస్తావు. నీ జీవితములో అపజయం ఉండదు.

దేవుడు ఏమి సెలవిస్తున్నాడు. పిల్లలు పోయారు - డేరా నాశనకరమైన స్థితిలోకి వచ్చింది. ప్రస్తుతం సంఘ పరిస్థితి ఇది. మందగొర్రెలు దొడ్డిలో నుండి బయటికి వెళ్ళిపోయినవి. ఇది దేవుని యొక్క దుఃఖము. దేవుడు దీనిని యిర్మియాకు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఒక పాస్టరు తన సేవ కొరకు ప్రార్థించి వాటి కొరకు భారము వహించాలి. పాస్టరు ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు సంఘంలో వ్యతిరకముగా పనిచేసే వారు ఎవరో చూపిస్తారు.

ఆత్మీయ రాజ్యములో అనేకమైన శక్తులు ఉన్నవి. క్రీస్తు నామమున ప్రార్థిస్తే ఒక దేవదూతను పంపించి మనుష్యులను ఒక కల ద్వారా హెచ్చరించవచ్చు. ఆటంకపరిచే వాడు ఒక వ్యాధి ద్వారా హెచ్చరిక పొందవచ్చు. ఒక వ్యాధి లేకపోతే కష్టములు దేవుని చేత పంపబడినవి. అవి ఒక దీవెన. నీవు ప్రార్థన చేయని వారి విషయం నీవు బోధించడానికి వీలులేదు. బోధించవలెనని ఆశించే వారు చాలామంది నీవు బోధించగలవా, మనుష్యుల హృదయములకు దేవుని వాక్యము తీసుకురాగలవా. ఇలాంటి సేవ యొక్క విలువ ఎంతో నీవు ఎరుగుదువా. మనం బోధించడం సులువు అని మనం అనుకోవచ్చు. మనం కుటుంబారాధన జరుపవచ్చు. గాని నీవు దేవుని వాక్యము మనుష్యుల హృదయములోనికి పంపించగలవా. బోధ నీది అయి ఉండకూడదు. ప్రసంగము ప్రభువు దగ్గర నుండి వచ్చినది అయితే అది చీకటి శక్తులను బంధించి వేస్తుంది. నీవు ప్రార్థించకపోతే చీకటి శక్తులు నీమీద ఎగిరి దూకుతాయి. క్రీస్తు సువార్తకు వ్యతిరేకముగా పోరాడు జనులు గాని, ఒక గుంపు గాని నాశనం అయిపోతారు. కొంతమంది తమ హృదయంలోని దుష్టమైన ఊహలను బట్టి బోధిస్తారు. మన శరీరము దేవుని మహిమ పరచకుండా ఆపివేయవచ్చు. రోమా 12:1, దేహములోని నలిగిపోయిన అవయవములు అన్నీ బలమును ఇవ్వగలిగిన ఆత్మ ద్వారా నూతన పర్చబడతాయి. దేవుని సేవలోనికి ఆత్మ నిన్ను ఇమడ్చగలదు. నీవు ఖచ్చితముగా ఆలోచిస్తే నీవు సజీవ యాగముగా జీవిస్తావు. నీ యందు నీకు ఉన్న విశ్వాసమును విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసమును నిలుపుతావు. అప్పుడు నీవు ఈ లోక మర్యాదను అనుసరించవు. నీవు లోకమును దేవునిని కలుపవు. నేను నా ప్రియ స్నేహితులతో చెప్పాను. వారు దేవుని చిత్తమును లోకముతో కలుపుతున్నారని, నీవు దేవుని చిత్తమును ఎరుగవు అని నా స్నేహితునితో చెప్పాను. మంచి అనేది శ్రేష్టమైన దానికి విరోధి అని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు మంచి చేయవచ్చు. కాని అది దేవుని ఎదుట పరిపూర్ణముగాను, అంగీకృతముగాను ఉండాలి. నీవు దేవుని పరిపూర్ణ చిత్తము చేస్తే నీవు ఒక గొప్ప విజయము సాధిస్తావు. దేవుడు తన పరిపూర్ణ చిత్తమును చేయవలెనని నిన్ను కోరుతున్నాడు. అప్పుడు నీవు ''ప్రభువా పరలోకమందు నీ చిత్తము నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును గాక'' అని నీవు చెప్పవచ్చు.

చెడును మంచితో జయించండి. మీరు శ్రమ పడిననూ ఫర్వాలేదు. అవునంటే అవును అని, కాదంటే కాదని ఉండవలెను. పరిశుద్ధాత్ముడు ప్రతీది ఉన్నది ఉన్నట్లు చూసును. నీవు రోమా 12వ అధ్యాయం మెట్టులోనికి నీవు లేచినట్లయితే నీ ప్రసంగం శక్తివంతమవుతుంది. దేవుడు చెప్పుతున్నాడు ''నాడేరా విరిగిపోయింది''. నిన్ను అడుగుతున్నాడు. ''నీవు దానిని తిరిగి ఒక నూతన స్థలంలో నిర్మించగలవా''. మనుష్యులు నిన్ను ''నీవు ఇక్కడ ఎందుకు ఉన్నావు'' అని ప్రశ్నించే స్థలంలో నీవు ఉండకూడదు. నీవు క్రీస్తు నామమును పైకి ఎత్తుచున్నావని ఆయన శక్తిని ప్రయోగించుచున్నావని వారు చూడాలి.

మూల ప్రసంగాలు