|
దేవుడే నా సహాయకుడు |
కీ.శే. యన్. దానియేలు గారు |
కీర్తనలు 54:4
''ఇదిగో దేవుడే నా సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు.'' దావీదు గొప్ప కష్టములలో పడ్డాడు. ఆయనను చంపవలెననుకున్న రాజు ఆయనను తరుముకొని వెళ్ళాడు. దావీదు ఒక స్థలం నుండి మరొక స్థలంనకు పరుగెత్తుకొని వెళ్లినాడు. ఆయన కెయిలాలో ఉండినాడు. అక్కడ క్షేమంగా ఉంటానని నిరీక్షించాడు. కెయిలా మనుష్యులు దావీదుకు సహాయం చేస్తామని చెప్పారు. కాని సౌలు కెయిలాను పట్టుకోవడానికి వస్తుండినాడు. దావీదు ప్రార్థించి కెయిలా మనుష్యులు నన్ను సౌలుకు అప్పగించుదురా అని దేవుని అడిగాడు. వారు నిన్ను అప్పగిస్తారని దేవుడు చెప్పాడు.
ఫిలిష్తీయుల యొక్క దాసత్వం నుండి రక్షించగలిగిన దావీదు చేసిన ధైర్యమైన కార్యము కొరకు ప్రజలు కృతజ్ఞులుగా లేరు. ప్రజలు దావీదును చంపడానికి సౌలు రాజుకు సహాయం చేస్తున్నాఉ. దావీదు తల దాచుకోవడానికి స్థలం లేకుండా ఉండింది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. ఇది అంతా కొంతమంది స్త్రీలు పాడిన పాట వలన వచ్చింది. ఈర్ష్య అంత సులువుగా సౌలులోనికి ప్రవేశించింది. ఈర్ష్య మనలోనికి ప్రవేశించగానే మనం దానిని చంపివేయాలి. ఈర్ష్యకు వ్యతిరేకముగా నిలువబడగలిగిన వారు ఎవరూ లేరు. అది శరీరమునకు ఆత్మకు ఒక వ్యాధి వంటిది. అది సౌలును తన కుటుంబమును నాశనం చేసింది. ఈర్ష్య ప్రజలను పిచ్చివారినిగా చేస్తుంది. సౌలు పిచ్చివాడు అయిపోయాడు. ఒక దురాత్మ అతనిలో ఉండింది. అప్పుడప్పడు అతను ఏడ్చి ఇలా చెప్పేవాడు. ''నేను తప్పు చేస్తున్నాను, దావీదూ నివే సరి. దేవుడు నీకు ఈ బహుమతి ఇస్తాడు''. ఒక పాపి జీవితంలో సైతాను తన పాపమును గ్రహించేటట్లు అనుమతిస్తుంది. కానీ దాని సంకెళ్ళ నుండి విడిపించబడటానికి ఒప్పకోదు. ఏ ఆత్మ నీ హృదయంలో పాలన చేస్తుందో జాగ్రత్త. లోకములో అనేక ఆత్మలు ఉన్నవి. అవి సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవచ్చు. నీయందు ఎలాంటి ఆత్మ పరిపాలన చేస్తుందో తెలుసుకోవడానికి జాగ్రత్తపడు.
దావీదు దేవున్ని తనకు సహాయం చేయమని అడుగుతూ ఉండినాడు. అతనికి సహాయకులు లేరు. ఒకసారి ఆయనకు వెంబడించుచున్న 400మంది ఆయనకు వ్యతిరేకంగా తిరిగారు. అప్పడు దావీదు తన్నుతాను ప్రభువు నందే ప్రోత్సాహపరచుకున్నారు. గొప్ప నిర్సుతాహపరిచే సమయములలో మనము అలాగు ఉండగలిగితే ఎంత మేలు. దావీదు ఇశ్రాయేలు పట్టణమును విడిచిపెట్టి అరణ్యములో తన 400మంది వెంబడించే వారితో ఉండినాడు. ఇప్పుడు వారు ఆయనను చంపవలెనని అనుకున్నారు. ప్రతివాడు ఇలాంటి పరిస్థితులలోనికి వస్తాడు. ''దేవుడే నా సహాయకుడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను దేవుడు నన్ను విడువడు'' అని దావీదు చెప్పాడు. నీ రక్షణ ఎక్కడ ఉన్నది? మన సహాయకులు అందరూ తమ జ్ఞానమందు నీతియందు సహాయం చేయుటకు శక్తి యందు మితము గలవారై యున్నారు. దేవుడే మనకు అమితమైన సహాయకుడు.కొన్నిసార్లు మనము అపాయమందున్నప్పుడు మనము ఎరుగము. దేవుడే మనకు సహాయము చేసేవాడు. క్రీస్తు యొక్క ఒడిలోనే మనకు రక్షణ ఉంది. మనం ఎల్లప్పుడు దేవునితో ఉన్నామా.ఒకప్పుడు సుందర్‌సింగ్ నిద్రపోవడానికి స్థలం లేకుండా ఉండినాడు. అతడు ఒక విడువబడిన ఇంటిలోనికి నిద్రపోవడానికి వెళ్ళాడు. ఉదయమున లేచినప్పుడు రెండు పాములు అతని పక్కన పండుకొనియుండటం చూసాడు. అవి అతనికి ఏ హాని చేయలేదు. దేవుడే అతనికి సహాయకుడు. చిట్టచివరగా దేవుడే మన సహాయకుడు. ఆయన నిన్ను గురించి తలంచుచున్నాడు. ఆయన నీ విషయంలో నెరవేర్చవలెనన్న పరిపూర్ణ ఏర్పాటు ఒకటి దేవునికి ఉన్నది. దావీదు తన జీవితంలో తన గొప్ప ఏర్పాట్లను దేవుడు నెరవేర్చడం చూస్తున్నాడు. ''దేవుడే నా సహాయకుడు చూడండి'' అని దావీదు చెప్పాడు. ''దేవుడే నా సహాయకుడు'' అనే స్థలంనకు ఎల్లప్పుడు వచ్చి చెప్పగలిగే విషయం గొప్పది. ఈ దినం ఒక మనుష్యుడు నాతో చెప్పాడు. ''మినిష్టరు గారి దగ్గర నుండి ఒక రికమండేషను తెచ్చుకున్నానండి. అయినను నాకు ఉద్యోగం రాలేదు''. దేవుడు అతనికి సహాయకుడుగా లేడని నేను అనుకున్నాను. దేవుని నీవు తెలుసుకున్నప్పుడు నీవు సమస్తమును తెలుసుకున్నావు నీ వైఫల్యములు నీ దు:ఖములు అన్నీ నీవు దేవునికి దూరముగా ఉన్నందువలననే. దావీదుకు దేవుని యందు గొప్ప విశ్వాసం ఉండినది. ''నేను బ్రతికిన దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదెను. ''దేవుడు నీకు ఎలాగు సహాయము చేయవలెనో ఎరుగును. దేవుడు నీకొక భోజనము దొరకకుండా చేస్తే నీ కడుపునొప్పి నుండి దేవుడు నిన్ను రక్షించినాడనమాట. ఆయన కాదు అనడానికి ఎల్లప్పుడు మంచి కారణం ఉంటుంది. ప్రతిసారి ఆయన కాదంటే అది ఒక ఆశీర్వాదమే. దేవుడు ఎల్లప్పుడు నీ మేలే కోరతాడు.
|
|