|
దేవుని పరిశుద్దాత్మను దు:ఖపరచకండి |
కీ.శే. యన్. దానియేలు గారు |
ఎఫెసి 4:30
''దేవుని పరిశుద్దాత్మను దు:ఖ పరచకండి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడియున్నారు.'' ఒకడు తిరిగి పుట్టినప్పుడు అతడు గర్భము ధరించబడి దేవుని రాజ్యములోనికి పరిశుద్ధాత్మ యొక్క క్రియ వలన మనము జన్మించాము. మానవుని యొక్క మనస్సు మీద, హృదయం మీద జరిగేటటువంటి పని. ఈ క్రియ మనము గ్రహించుటకు వీలుకాని దేవుని క్రియ. ఇది మానవులలోనికి క్రీస్తు యొక్క లక్షణమును తీసుకొని వచ్చును. ఆ కాలము నుండి పరిశుద్ధాత్ముడు మనలను నడిపించి, నిలబెట్టి దేవుని పిల్లల సమూహమును ప్రేమించేటటువంటి ఆత్మీయ మనోభావము అతనికి ఇచ్చును. మానవుడు కోరినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క ఇష్టమునకు, అయిష్టమునకు పోల్చి చూపించవచ్చు.
పరిశుద్ధాత్ముడు ఆత్మలో క్రియ చేసే శక్తులను తన ఆధీనంలో పెట్టుకొని దేవుని రాజ్యము యొక్క విస్తరణకు వినియోగించుకొనును. పరిశుద్ధాత్ముడు నీ తలంపులను, ఊహలను, కోరికలను తన ఆధీనంలో పెట్టుకొని అవి దేవునికి సంబంధించినవిగా చేయును. పరిశుద్ధాత్ముడు ఎదురుగా నిలుచుట ద్వారా మన శరీరము ఏ భాగములోనైనా పరిశుద్ధాత్ముని ఎదిరించినట్లయితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు నీవు దేవునిని ''అబ్బా - తండ్రి'' అని పిలిచే వరకు నిన్ను నడిపిస్తాడు.
దేవుని చిత్తమునకు లేక దేవుని ఆత్మకు నీ విధేయత ఎదిగే కొలది నీ కుమారత్వపు గుర్తింపు హెచ్చగుచున్నది. నీవు నీ సొంతము కాదని నీకు బాగా తెలుసు. నీవు పరిశుద్ధాత్మ వలన నడిపించబడి ఆయన ఆధీనము క్రిందకు వచ్చు కొలది ఆత్మీయఫలములు నీ యందు కనిపించును. నీ తలంపు ద్వారా నీ యొక్క జీవితము ద్వారా నీ చుట్టూ ఉండే లోకము జయిస్తావు, కాని ఇది ప్రారంభంలో నీకు ఎదురాడును. నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీవు ఏర్వపరచుకున్న మార్గము శ్రేష్టమైనదిగాను సత్యమైనదిగాను చూస్తారు. వాళ్ళ హృదయములలో వారు ఒప్పించబడి నీ మాటలకు విధేయులు అవుతారు. ఎప్పుడు? నీవు దేవుని ఆత్మకు విధేయుడవు అయినప్పుడు, నీ మాటలకు నీ జీవితమునకు మధ్య ఎంత పొందిక ఉంటుందంటే దానిని ఎవరు ఎదిరించలేరు.
లోకం మనలను ఆకర్షించనిస్తున్నాం. ''వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని, దుర్భాష యేదైనను మీ నోట రానియ్యకుడి'' ఎఫెసి 4:29 ఇతరులకు జ్ఞానాభివృద్ధి చేయని వాటిని నీవు మాట్లాడకూడదు. ఒక మురికి గుంటలోనికి నీవు రాయి వెయ్యవు. ఇతరులకు నీవు నిరూపించవలసిన పని లేదు. నీ చుట్టూ ఉన్న వారి మీదను, నీ మీదను అది మురికి నీళ్ళు చల్లును. నీ వస్త్రముల మీద నీ చుట్టూ ఉన్న వారి మీద అది మురికి నీళ్ళు చల్లును. ఇతరులను హెచ్చరించనటువంటి మాటలు వారి పాదములు కడుగుటకు మనం వాడుకోగలిగినట్లయితే అది పరిశుద్ధాత్మను దుఃఖపరుచును. నేను కొన్ని విషయములు మాట్లాడవచ్చునా అని నేను అడిగినప్పుడు దేవుడు అలాంటి వాటిని అడుగుట కూడా తప్పు అన్నాడు. తన నాలుకను పరిశుద్ధాత్ముని యొక్క అధికారం క్రింద పెట్టగలిగినవాడు ధన్యుడు.
మనం పరిశుద్ధాత్మను దుఃపరచనప్పుడు నిజమైన జయం దొరుకును. నీ జీవితం నీ చుట్టుపక్కల జీవించుచున్న వారిపైన భయంకరమైన తాకుడు ఉండును. ఆటంబాంబు పగులగొట్టిన స్థలము నుండి 10 మైళ్ళ దూరంలో నున్న ఒక గ్రుడ్డివానికి తటాలున అగుపడును ఆ వెలుతురు. మన ద్వారా క్రియ చేయటం ప్రారంభించే ఆత్మీయ శక్తులు బలమైనవిగా ఉండును ఎఫెసి 4: 2, 3 '' ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను, సాత్వికముతోను నడుచుకొనవలెనని, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను''. నీ సహవాసము ఇలాంటిదైతే మనము అనేకులము కాకపోయినప్పటికి భయపడనక్కరలేదు. మనము నాణ్యతల గురిపెట్టుకొందాము. మీలో ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యులు మారుమనస్సు పొందవలెనని ఆశించుచున్నారు. దేవునియెడల నమ్మకస్థుడవై యుండి వారి కొరకు ప్రార్థించుము. అప్పుడు వాళ్ళు మారుమనస్సు పొందుదురు. పరిశుద్ధాత్ముని దు:ఖ పరచకుండా ప్రార్థించండి. మీ బంధుజనులను మీరు ప్రేమించాలి. వారితో సాధువైన మాటలలో వారు మారుమనస్సు పొందవలెనని చెప్పుము. ఆత్మీయమైన, మేలైన స్థితిలోనే గాని సాధువైన ఆత్మతో ఈ మాటలు చెప్పండి. వారి జీవితంలోని పొందికలేని వన్ని సర్వోత్కృష్టమైన మనస్సు సరిచేయుటకు సాధ్యము. ఆ మనస్సు నీ జీవితంలోని చిక్కులన్నిటిని సరిచేయటానికి చేతనయినది. దేవుని వాక్యమునకు సంపూర్ణమయిన విధేయత కలిగియుండుటయే క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశ్యము.
శరీరము ఎల్లప్పుడు ఒక అడ్డుబండ. మునుపు లోకములోని ఆత్మ దాని మీద ఏలుబడి చేస్తూ ఉండినది. ఆ ఆత్మ పరిశుద్ధాత్ముని యొక్క అధికారము త్రోసివేయుటకు చూస్తూ ఉంటుంది. పాపుల కొరకు మరణించుటలో క్రీస్తు చివరగా దేవుని చిత్తమునకు విధేయుడు కావలసి వచ్చింది. దేవుని వాక్యమునకు నిదర్శనమైన నిరూపణ ఉండవలెను. ప్రార్థనాత్మలోనే పశ్చాత్తాపపు ఆత్మ ఉండగలదు. పశ్చాత్తాపపడిన హృదయమే నేర్పించడానికి వీలైన హృదయం కనుక విధేయత గల హృదయము అవుతుంది. ప్రార్థనాత్మలోనే అతిశయించే శక్తులు క్రియ చేయటం ప్రారంభిస్తాయి. అద్భుత కార్యములు సామాన్యముగా జరిగేవిగా ఉంటాయి. నీవు దానికి అలవాటు పడిపోతావు. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ ఉనికి గమనించబడుతుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా చీకటి శక్తులు తొందర చేయబడతాయి. క్రీస్తు ఎరుగును. ఆయన ఎక్కడికి వెళ్ళినా చీకటి శక్తులు తొందరపర్చబడును. దయ్యం పట్టిన వారు కేకలు వేయుదురు. విమర్శకులు మాట్లాడటం ఆరంభిస్తారు. నీవు వెళ్ళే త్రోవలో ఎక్కడకు వెళ్ళినా విమర్శకులు ఉంటారు. వారిని లక్ష్య పెట్టకూడదు. నీ నీతి వాక్యము ఎల్లప్పుడూ కూడా ''ఏ కారణమేమి వాని వెదకటం కాదు కాని వారు చేసి చనిపోవడమే''.
మన సంభాషణలోను, ఇతరులతో మనం చేసే సహవాసంలోను, మనము తప్పుత్రోవను నడిపించబడకూడదు. లేక ఇతరుల చేత క్రిందికి ఈడ్వబడకూడదు. నీ యెదుట ఉన్నటువంటి క్షేత్రము విశాలమైనది. ఏ విధమైన సమయము వ్యర్థము చేసేవాడు ఉండటానికి వీలులేదు. ఒక డాక్టరు గారికి వారు దర్శించవలసిన పడకలు మూడు ఉంటే అతడు రాజకీయాలు మాట్లాడటానికి సందర్శకులతో విస్తారమైన రాజకీయ వ్యవహారములు మాట్లాడటానికి వీలులేదు. తన పని అయిపోయే వరకు తన పని చూసుకుంటారు. దేవుని మనస్సులో నీ కొరకు అనేకమంది ఆత్మీయమైన రోగులు ఉన్నారు. నీవు నీ జీవితం ముగించకముందు వారిని శ్రద్ధగా గమనించాలి.
సుందర్‌సింగ్ గారు చెప్పారు. ''ప్రార్థించే వానికి అద్భుతములు సాధారణమైనవి''. ప్రార్థన మానసిక శక్తులను దాటి ఆత్మీయ ప్రాంతములకు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆ భాగములకు తీసుకుని వెళతాడు. క్రింది మెట్టులో దొరకనటువంటివి నీకు లభిస్తాయి. నీవు మారుమనస్సు పొందిన తరువాత నీవు తెలుసుకోవలసిన విషయము ఏమనగా ఒక గొప్ప విషయాన్ని కనుగొన్నావని దేవుని నిధిని సంపాదించుకొన్నావని తెలుసుకోవాలి. అది ఎంత విస్తారమైన వంటే దానిని సంపూర్ణముగా చూడటానికి వీలులేదు. నీ ఆత్మీయ జీవితమును జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత ఖర్చయినా దానిని నడిపించాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి.
|
|