లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నిరీక్షణ, సంతోషము మరియు సమాధానము

కీ.శే. యన్‌. దానియేలు గారు

రోమా 15:13-16

''మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను, సమాధానముతోను, మిమ్మును నింపును గాక'' పరిపౌలు మనతో మాట్లాడుతున్నాడు. దేవునిని నిరీక్షణ కర్తయగు దేవుడు అని పిలుస్తున్నాడు. ఆయన నిరీక్షణ కర్తయగు దేవుడు విషయములు తలక్రిందులుగా నిరీక్షణ ఏమి లేనట్టుగా కనబడినప్పుడు ఆయన మనకు నిరీక్షణ అనుగ్రహించును. ఆయన మంచితన మంతటిని మన యెడల, మనం జ్ఞాపకం చేసుకొన్నప్పుడు అది మనలో నిరీక్షణ కలిగించును. మనము దానికి తగిన వారముగా కనబడనప్పుడు ఆయన మన యెడల మంచివాడుగా లేడు. కాని మన యందు ఆయన విషయమై ఏ ఆశయైననూ ఉన్నట్లు చూస్తే ఆయన మనలను దీవిస్తాడు. ఈ శరీరమునకు అత్యుత్తమమైన మందులాంటి ఆయన సంతోషము సమాధానము మనకు అనుగ్రహిస్తాడు. మనము ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తే అంత ఎక్కువగా పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి వస్తుంది. ఇది మనం కలిగియుండే నిరీక్షణను అభివృద్ధి పరుస్తాడు. పరిస్థితులు మనకు ఎదురుగా ఉన్నప్పుడు నిరీక్షణకు దేవుడైన ఆయన మనలను నిరీక్షణతో నింపుతాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనే శక్తులు విడుదల చేయబడతాయి. సృజించే శక్తి గల విశ్వాసము తప్పిపోని నిరీక్షణ. తరగని ప్రవాహముగా వచ్చే దేవుని ప్రేమ ఇవి అన్నీ నీలోనికి వచ్చును. దావీదు నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు నందు తన్నుతాను ధైర్యపరచుకొన్నాడు. 1 సమూయేలు 30:6..... ''దావీదుతో అరణ్యమందు ఉండిన 600మంది ప్రజలు వారి కుటుంబములు దావీదుతో ఉండినవి. ఆయన దూరములో పని మీద ఉండినప్పుడు ఈ పురుషుల కుటుంబములు తన ఇద్దరు భార్యలను శత్రువులు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయారు. దావీదుతో ఉండిన మనుష్యులు దావీదు మీద బహుగా కోపపడి దావీదును రాళ్ళతో కొట్టవలెనని చెప్పారు. వాళ్ళు నిరీక్షణ లేకుండా ఉండినారు. దావీదు సౌలు యొద్ద నుండి తన గృహము, బంధు జనుల నుండి పారిపోయాడు. ఇప్పుడు ఆయన వెంట వెళ్ళినవారు నమ్మకస్థులైన వారు ఆయనను రాళ్ళతో కొట్టవలెనని ఆశించారు. కాని ప్రభువు నందు తన్ను తాను ధైర్యపరచుకొన్నారు. గతములో దేవుడు ఆయన కొరకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాడు, గొల్యాతుతో పోరాటం, సింహము ఎలుగుబంటితో పోరాటం, నీకున్న ఆశీర్వాదములను లెక్కించుము. వాటిలో ఒక దాని తర్వాత మరియొకటి పేరు పెట్టి పిలువుము. మన ఆశీర్వాదములను లెక్కించుట ద్వారా మనలను మనము ప్రోత్సాహపరచుకోము. మన నిరూత్సాహములన్నీ మన సొంత మార్గములో వెళ్ళినందుకే సంభవించినవి. దేవుడు దీనికి పూచీదారుడు కాదు. కాని మనము పూచీదారులము అయి ఉన్నాము. దేవుడు ఎల్లప్పుడు కీర్తికి యోగ్యుడు. ఆయన ఎన్నడూ నిందార్హుడు కాడు. దేవుడు తన గొప్ప ఆశీర్వాదములను మన మీద క్రుమ్మరించవలెనని ప్రయత్నిస్తాడు. ఆయన మన సంచి ఆనందములతో నిండి ఆశీర్వాదములను పట్టలేకుండా ఉండినది. కనుక దేవుడు మన శీలమును మొట్టమొదట నిర్మిస్తాడు. తర్వాత మనలను ఆయన క్రమశిక్షణలో పెడతాడు. దానిని బట్టి ఆయన ఆశీర్వాదములను మనము కాపాడుకొని ఇతరులకు మాదిరిగా ఉండవలెను. నమ్మకమైన దేవుడు ఆయన స్వభావము, నమ్మకత్వము, ప్రేమ గల దేవుడు. ప్రేమ ఆయన స్వభావమును తనకు తానుగా వ్యతిరేకముగా ఎట్లా వెళ్ళగలడు. రోమా 15:14......... మీరు కేవలము మంచివారును, నమస్త జ్ఞాన సంపూర్ణులును ఒకరికొకరు బుద్ది చెప్ప సమర్థులునైయున్నారని'' మనతో మాట్లాడేవారు మనలో మంచితనం ఉన్నదనే భావంతో వెళ్ళాలి అనే భావంతో వెళ్ళతారు. మనం వారిని తిట్టినా, మనం వారిని దిద్దినా మన మంచితనం వారు తెలుసుకోవాలి. మంచితనం ఆత్మ ఫలములలో ఒకటి. మనమనేక సార్లు మన తప్పిదములను వృద్ధి చేసుకొనే పద్ధతిలో ఉంటాము. మనకు దిద్దుబాటు అవసరము. మనలో కొంతమంది తప్పుడు భావము కలిగి ఉంటాము. ప్రారంభించే వారు వారి బలమును సరిగ్గా ఎన్నుకొనలేరు. కనుక గర్విష్టులు అయిపోతారు. కనుక అనేకమైన తప్పులు చేస్తారు. వారిని ఓపికతో దిద్దాలి. ఓపికతో ప్రేమతో దిద్దాలి. మనయందు మంచితనమును వారు గుర్తించాలి. రోమా 15:2 ''తన పొరుగు వాని క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచవలెను'' మీరు ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగ జేయగలరా. నీ పొరుగు వానికి సంతోషపరిచి అతనికి క్షేమాభివృద్ధి కలుగ జేయగలరా. మీరు ఇతరులకు మేలైన కార్యములు చేసి అతనికి క్షేమాభివృద్ధి కలుగ జేయండి.

మన సహవాసము పరిశుద్ధముగా ఉండాలి. మనలో కోపముగాని, ద్వేషము గాని, అసూయగాని ఉండకూడదు. ఇవి సేవను క్రిందకు తోసివేస్తాయి. చిట్టచివరగా మనలో మంచితనం మట్టుకు ఉండాలి. నీవు వ్యాధిగ్రస్తులకొరకు ప్రార్థించినప్పుడు నీ మట్టుకు నీవు ఆత్మీయంగా మేలు పొందుతావు. నీవు పాపుల కొరకు ప్రార్థించునప్పుడు నీ మట్టుకు నీవు సంపాదించుకొంటున్నావు. నీతో నీవు ఇలాగు చెప్పుకోవు. ''నేను ఆ పట్టణం కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి. ఇతరులు అక్కడ ప్రయాస పడుతున్నారు. అది వారి భారము నాది కాదు''. ఇతరులు పనిచేసేటప్పుడు నీవు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, నీవు పనిచేసేటప్పుడు నీవు ప్రార్థించగలుగుతావు. నీవు ప్రార్థించేటప్పుడు నీ హృదయము విశ్వాసముతో నిరీక్షణతో నింపబడుతుంది. నీవు ఇతరుల కొరకు ప్రార్థించినట్లయితే దానిని అవకతవకలుగా చేయకూడదు. నీవు ప్రార్థనలలో గొప్ప వాటిని సాధించాలి. మనము ఒకరినొకరము ప్రేమతో గద్దించుకోవాలి. ముఖ్యముగా ప్రారంభికులు గద్దించబడవలె. ఒకానొక దినమున నీ ప్రారంభికులు నేర్పరితనము గల సైనికులు వలె తయారవుతారు. నీ పక్కనే నిలబడి నీవు ఏ ఉద్దేశముతో పోట్లాడుతున్నావో అదే ఉద్దేశముతో ఎన్నడూ తప్పిపోనటువంటి ఆయుధములతో పోరాడుతారు. దేవుని వలన కానటువంటి ప్రతి తలంపులు ఆపి వేసి క్రీస్తు ప్రభువు యొక్క ప్రత్యక్షతలు పొందాలి. క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతకు సమానముగా నీ వ్యక్తిత్వము వృద్ధి చేయబడగలదు. మనం క్రీస్తు వలే ఉండడానికి కాపాడబడవలెనని క్రీస్తు ఆశిస్తున్నాడు.

మూల ప్రసంగాలు