లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

మన తప్పిదములను ఒప్పుకొనుటకు దీనముగా నుండుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెనా 1:12

''నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినదని నాకు తెలియును. నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి. అప్పుడు సముద్రము మీమీదికి రాక నిమ్మళించునని'' వారితో చెప్పెను.

ఒక ప్రవక్త అనేక విషయములను గ్రహించగలడు. తన దారికి అడ్డముగా వచ్చియున్న గొప్ప తుఫాను గూర్చి గ్రహించుకున్నాడు. ఇలాంటి విషయములు ఒప్పుకోవడానికి మనము దీనులము కాదు. భార్య యొక్క జబ్బు విషయములో ఒక భర్త దానికి కారణమైయుండవచ్చు. దానిని ఒప్పుకోవడానికి తగినటువంటి దీనత్వము అతనికి లేకపోవచ్చు. ఒకసారి ఒక భార్య జబ్బుగా ఉంది. ప్రార్థనకై మమ్ములను అడిగినారు. మేము ప్రార్థన చేసి, ఎంత చేసినా ఏ మార్పు లేదు. ప్రభువును అడిగితే భర్త పాపము భార్య మీదికి వచ్చినదని చెప్పారు. చివరగా భార్య చనిపోయింది. ఎందుకంటే భర్త తన్నుతాను తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు. కొన్నిసార్లు తల్లి యొక్క పాపం ఒక బిడ్డ జబ్బుపడేటట్లు చేస్తుంది. భార్య జబ్బుగానున్న కాలంలో భర్త వేరొకరి డబ్బు ఖర్చుచేసి, ఆ ఖర్చు పెట్టడం ద్వారా కొంతమంది తమ ప్రేమను బయలుపరుస్తారు. కానీ విశ్వాసపు ఖర్చుందా?

తెడ్లు బలంగా వేయుట వలన తెడ్ల దగ్గర మనుష్యులు చాలా కష్టపడ్డారు. కానీ పరిస్థితి మారలేదు. వారి దగ్గర ఉండే సామాను పారవేసి ఓడను తేలికగా చేసారు. అయినప్పటికీ ప్రయోజనం లేదు. తుఫాను యొక్క తీవ్రతను ఆ పడవ తట్టుకోలేకపోయింది. దేవుడు తన ప్రవక్తలతో ఉంటాడు. కానీ ఇక్కడ యోనా తన యిష్ట ప్రకారంగా అవిధేయుడై దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. అతడు దేవుని చిత్తములో లేడు. నీవు దేవుని చిత్తంలో లేకపోతే పాపం చేస్తున్నావు. దేవుని కాపుదల నీ యొద్ద నుండి తీసి వేయబడుతుంది. దేవుడు మారుమనస్సు పొందిన వారితో ఉన్నాడు. కానీ వారు దేవునితో ఉండాలి. అప్పుడే మీరు సంరక్షించబడతారు. నీవు ఇష్టపూర్వకంగా పాపం చేసినప్పుడు దేవుని కాపుదల తీసివేయబడుతుంది. అది 10 ఆజ్ఞలలో ఒక దానికి అవిధేయుడవు అవుట కాదు గాని ఆయన చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళుట. యోనా ప్రయాణం చేస్తున్న ఓడ మీదికి నాశనం తీసుకొస్తూ ఉండినాడు. మీ కుటుంబం మీదికి నీవు తొందర తీసుకొచ్చి ఉండవచ్చు. నీవు భక్తిహీనుల మధ్య జీవిస్తూ ఉండవచ్చు. నీవు ఆ స్థలంను ఇష్టపూర్వకంగా ఏర్పాటు చేసుకున్నావు. లోతు ఇలాగే చేసి తన కుటుంబం మీదికి నాశనం తీసుకొచ్చాడు. దానియేలు సింహపుబోనులో పడవేయబడ్డాడు. కాని ఆయన దేవుని చిత్తములో ఉండినాడు గనుక క్షేమముగా ఉండినాడు. దావీదు తన యింటి మిద్దె మీద దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా నడుస్తూ ఉండినాడు. ఒక శోధన అతనిని తాకింది అతను పడిపోయాడు. నీవు దేవుని చిత్తమును ఎరిగి దానికి వ్యతిరేకముగా వెళ్ళినట్లు అయితే వెయ్యిమంది నీ కొరకు ప్రార్థన చేయవచ్చును. కానీ దాని వలన ప్రయోజనం లేదు. యోనా ప్రార్థన చేయలేకపోయాడు. కనుక నిద్రించుచూ ఉండినాడు. ఒక గొప్ప పట్టణము నాశనము అయిపోతూ ఉండినది. నినెవే పట్టణానికి వర్తమానం అందించడానికి యోనా ప్రవక్త తప్ప మరి యెవరూ కనబడలేదు.

10,000 మంది ఆత్మలు అవసరతలో పడి యుండవచ్చును. వారికి వర్తమానం పంపడానికి నీవు ఒక్కడివే కనబడవచ్చును. కాని నీవు ధనమును, సౌఖ్యమును వెదుకుతున్నావు. గత యుద్ధకాలములో ఒక సైన్యం ఒక కందకంలో దాగి ఉంది. శత్రువు మీదికి వస్తుండినాడు కానీ అక్కడ సైన్యము ఉండిన సంగతి యెరుగడు. ఆ సైన్యములో మరియొక భాగములో ఉండిన కెప్టెను గారు శత్రువు రాకను గురించి యెరిగి కందకములో దాగియున్న మనుష్యుల యొద్దకు వార్తను పంపించాడు. వార్తాహరుడు ఒక మోటారు సైకిలు మీద పంపబడ్డారు. దారిలో అతనిని చంపివేశారు. ఇంకొక వార్తాహరుని పంపించారు. అతనిని కూడా కాల్చివేసారు. చివరకు ఒక వార్తాహరుడు వెళ్ళాడు. వాళ్ళ సైన్యము రక్షించబడింది. మనం శత్రువును ఎదుర్కొని వర్తమానం పంపగలమా.

నినెవే రాజు గర్విష్టుడు. కానీ అతడు ఎదుటనున్నటువంటి యుద్ధమును బట్టి అతని హృదయమును సిద్ధపరిచాడు. ఆ పట్టణం వర్తమానం అందుకొనుటకు దేవుడు వా రి హృదయములను సిద్ధపరిచాడు. యోనా పారిపోతున్నాడు. యోనా సత్యమును ఒప్పుకొన్నాడు. దేవుని ప్రేమ బలమైన తుఫానును పంపించును. ''అది నా పాపము. నన్ను సముద్రములో పారవేయండి'' అని అతడు చెప్పాడు. అదిసరిగా క్రైస్తవుని యొక్క హృదయము. తన తప్పిదమును ఎరిగియుండి, తనకు రావాల్సిన శిక్షను అనుభవిస్తాడు. అప్పుడు జీవమా, మరణమా అనేది ప్రశ్న కాదు. కానీ ఆయన శిక్షను భరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

యెషయా 53: 4, 7 వచనములు

నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. మన వ్యసనములను వహించెను. అయిననూ మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగను మనమతనిని ఎంచితిమి. మన యతి క్రమక్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడిననూ అతడు నోరు తెరువలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని యెదుట గొర్రెయు మౌనముగా నొండునట్లు అతడు నోరు తెరువలేదు''.

క్రీస్తు మన కొరకై శ్రమపడుతున్నాడు. క్రీస్తు మన శిక్షను తన మీద వేసుకొన్నాడు. మనము ఇతరుల కొరకు శిక్షను అనుభవించుటకు పరిశుద్ధులముకాము. మనము ఇతరుల పాపముల మన మీదికి రానిమ్ము'' అని చెప్పలేము. కాని క్రీస్తు చెప్పగలిగినాడు. మన పాపములు తన మీద వేసుకున్నాడు. యోనా తన పాపమును ఒప్పుకొన్నాడు. కాని క్రీస్తు అయితే మన అతి క్రమ క్రియలను బట్టి గాయపరచబడ్డాడు. మనము పాపము చేసితిమి అని అతని యొద్ద ఒప్పుకొనుట మంచిది. అప్పుడు క్రీస్తు మనలను స్వస్థపరుస్తాడు.

మూల ప్రసంగాలు