లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నేనే మార్గమును, సత్యమును, జీవమునైయున్నాను

కీ.శే. యన్‌. దానియేలు గారు

యోహాను 14:6

''యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును'' లోకములో వేరొక మార్గము లేదు. లోకము దేవుని వాక్యమును మార్చలేదు. సత్యమును చెప్పడానికి ఆయన తన జీవమును ఇచ్చాడు. నేనే మార్గమును, జీవమునైయున్నాని ఆయన చెప్పాడు. మీరు సత్యమును పోగొట్టుకుంటే మీ జీవితమునే పోగొట్టుకుంటారు. ఒకప్పుడు ఒక కుటుంబము ఒక నూతన పట్టణమునకు వెళ్ళారు. ఆ కుటుంబంలో ఒక యౌవనస్థుడు గుడ్డలు కొనుక్కోవలెనని ఆశించాడు. కాని అతడు ''నాకు ఒక అంగడి చూపించండి. అక్కడ మనుష్యులు సత్యము మాట్లాడాలి. నాకు మంచి వస్త్రము అమ్మాలి''. కొన్ని అంగళ్ళు ఎంత నీతిమాలినవిగా ఉంటాయో మీకు తెలుసు. కొన్ని సంవత్సరాల క్రితం నేను పట్టణం విడిచిపెట్టి వెళ్తూ ఒక కోటు కుట్టించుకొనుటకు గుడ్డ కొనవలసి వచ్చింది. నేను మూర్‌ మార్కెట్‌కు వెళ్ళాను. వారు నన్ను మర్యాదగా చూసారు. నాకు మంచి బట్ట అని ఒక దానిని అమ్మారు. కాని అయ్యా ఇది పాడైపోయిన గుడ్డ అని దర్జీవాడు చెప్పాడు. అది ఒకసారి ఉతకటానికి కూడా పనికిరాదు. దర్జీవాడు బాగా చెప్పాడు. ఆ కోటు ఒక్కసారి ఉతకటానికి కూడా పనికిరాలేదు.

నీవు జీవిత భాగస్థుని ఎన్నుకోవాలని ఆశించినప్పుడు సత్యము చెప్పే కుటుంబము కొరకు వెతుకుతారు. ఒక పిచ్చి పిల్లను చేసుకోవడానికి ఇష్టపడరు. వివాహములో మనుష్యులు వారి కుమార్తెలను ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. వారికి మానసిక వ్యాధులు వచ్చి ఉండవచ్చును. కాని దానిని వారు తెలియపర్చరు. గ్రుడ్డివాడు అయిపోతూ ఉండిన ఒకవ్యక్తిని నేను ఎరుగుదును. దీనిని తెలియపర్చకుండా ఒక వివాహము చేసుకున్నాడు. ఇది లోకము క్రీస్తు చెప్పుతున్నాడు ''నేనే సత్యమును నన్ను నమ్మండి. నేను మిమ్మును నిత్య జీవములోనికి నడిపిస్తాను. పరిపూర్ణమైన జీవము ఆరోగ్యము సమాధానములోనికి నడిపిస్తాను''. ఆయన నిత్య జీవములోనికి నిన్ను నడిపిస్తాడు. ఇతరులను ఎందుకు నమ్మాలి. క్రీస్తు చెప్పుతున్నాడు ''నా జీవితం మీరు నమ్మదగని విషయం ఏమైనా ఉందా సిలువ మీద నన్ను చూసారా. మేకులు కొట్టబడినప్పుడు నన్ను చూసారా. నాలో ఏమైనా మోసం కనిపించిందా. నాలో ప్రేమను మట్టుకే మీరు చూడలేదా. అలాగయితే నన్ను నమ్మండి. నేనే మార్గమును సత్యమును జీవమునైయున్నాను''. ప్రియులారా మీరు మోసపోకండి. యౌవ్వనస్తుడా నీ యవ్వన దినములు ప్రారంభించినప్పుడు ఆయన వైపుకు చూసి ఆశీర్వదించబడు. ఒక యౌవనస్థునిగా నాజీవితమును ఏ వ్యర్థమైన దానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ''నేనే మార్గమును, జీవమును, సత్యమునై యున్నాను'' అనే వాక్యమును నేను నమ్మాను. అనేకమంది నాతో స్కూల్‌లో, కాలేజీలో చదువుకున్న వారు నన్ను లోకములోనికి లాగవలెనని చూసారు. ఇది దేవుని మార్గమా? అబ్దమాడని వాని యొక్క మార్గమా? అని నేను ప్రశ్నించే వాడిని. ఆయన తన రక్తముతో తన మాటకు ముద్ర వేశాడు. ఆయనను వెంబడించిన వారు లోకము లోకములోని శక్తులను మార్చారు. రాజ్యములు వారిని చూసి వణికినవి.

ఈ దినమున క్రీస్తు చెప్పుతున్నాడు. నేనే మార్గమును క్రైస్తవులు ఎందుకని తప్పిపోవుతున్నారు. వారు ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. కొందరు వారు పొందే మేలును బట్టి విశ్వసించారు. ఆయనను వెంబడించు, ఆయన యందు విశ్వసించు. నీ జీవిత మంతా బంగారముగా మార్చబడటం చూస్తావు. నీ తాకుడు స్వస్థపరిచే తాకుడు. నీ చిన్న గృహము ఒక చిన్న పరలోకముగా మారును. నీవు ఈ సత్యమును వెంబడిస్తే నీ సొంత బిడ్డలు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. ''ఏమిటీ. ఇతడు నా కుమారుడు కాడా? వాడు ఇంత గొప్పశక్తిగా మారడం చూస్తే ఆశ్చర్యం కాదా?'' అతడు సత్యం చెప్పుతాడు.

నిత్య జీవములోనికి నిరాశ అపజయము లేని చోటుకు నిన్ను నడిపించగలిగినది ఎలాంటి సత్యము. క్రీస్తు నందు అపజయము లేదు. క్రీస్తు ''నేనే మార్గమును'' అని చెప్పినప్పుడు మనము దానిని నమ్ముదాము. ఆయన యందు నీవు వెతుకుచున్న ప్రతీదీ దొరుకుతుంది. అవి వెండి, బంగారములు కావు. వెండి వలన, బంగారము వలన ప్రయోజనం ఏమిటి. కావాల్సినంత బంగారము, దివ్యమైన వస్త్రాలు కలిగిన ఒక స్త్రీని నేనెరుగుదును. ఆమె చనిపోయే సమయములో ఒక్కసారి తన యొక్క బంగారము మీద వస్త్రాల మీద కన్ను వేయాలని చూసింది. ఒక త్రీవమైన చూపుతో కన్ను మూసింది. ఆమెకు ఒక చక్కని కుమార్తె ఉండింది. క్రీస్తు నందున్న సత్యమును ఆమెకు ఎన్నడూ బోధించలేదు. ఆ తల్లి సత్యమును ఎరుగక ఆమె తన జీవితములో చాలా బాధపడింది. సత్యము నేర్పింపబడిన కుటుంబాలను నేను ఎరుగుదును. ''నీవు ఇంకా కొంతకాలం జీవించాలి''అని బిడ్డలు చెప్పినప్పుడు వారు ప్రార్థనచేసి జీవితం పొడిగించబడటం చూసారు. క్రీస్తు నందు తప్పిపోవడం అనేది ఉండదు. ఆయన సత్యం ఆయన యందు జీవము ఉన్నది. మీరు సత్యమును ఏర్పాటు చేసుకుంటే మీరు జీవమును ఏర్పాటు చేసుకున్నట్లే. మీ జీవితంలో పరిచయం చేయబడిన ఎవరైనను ఒక నూతనమైన వ్యక్తిగా మారతారు. అతడు ఒక దొంగ అయి ఉండవచ్చు. కాని అతడు మార్చబడతాడు. నేను దొంగలు మారడం చూసాను. వారు వ్యాధిగ్రస్తులను, పాము కాటు తిన్న వారిని స్వస్థపరచగలరు. దుష్టులు వారి దగ్గరకు వచ్చినపుడు వారు మార్చబడ్డారు.

యెషయా 56:10 ''ఈలోకము నాయకులను గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఎప్పుడూ మొరగరు. దొంగలు వస్తున్నప్పుడు నిద్రబోతున్న కుటుంబాలను లేపరు. అపాయము ఉన్నప్పుడు హెచ్చరిక చేయరు. నిద్రపోవడానికి ఎల్లప్పుడు ఆశిస్తారు. వారు పేరాశ కలిగిన కుక్కలు. లోకములో నాయకులు ఈరీతిగా ఉన్నారు. వారు దురాశ కలిగిన కుక్కలు ఏది హానికరమో వారు ఎరుగరు. ఆ నాయకత్వము పాపములోనికి అబద్ధములలోనికి, అపవిత్రత, వీటిలోనికి నడిపిస్తుంది. నేను పిల్లవానిగా ఉండినప్పుడు మా క్రైస్తవ కాలనీ యొక్క హద్దులు నేను దాటినప్పుడు మనుష్యులు చెడ్డమాటలు మాట్లాడటం విన్నాను. అక్కడ ప్రతివిథమైన దుష్కార్యము జరిగింది. చెడ్డమాటలు మనుష్యులు పలకడం విన్నాను. నేను ఆలయంలో చూసాను దాని నిండా నగ్న విగ్రహములు ఉన్నాయి. అయ్యో ! హైందవ బాలబాలికలకు ఏమి నిరీక్షణ ఉన్నది. నేను వారికి ఉపదేశం చేయడానికి ప్రయత్నము చేసాను. కాని వ్యర్థమైన ఒక కార్యము నేను చేస్తున్నానని అనుకున్నాను. ఎందుకంటే వాళ్ళు తిరిగి వెళ్ళి వాళ్ళ విగ్రహములను ఆరాధిస్తారు.

యెషయా 58:9 ''అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును''. ''నీవు నన్ను పిలిస్తే నేను ఇదిగో నేను ఇక్కడ ఉన్నానని సెలవిస్తాను'', ఎంత చక్కగా దేవుడు జవాబిస్తాడు. ఆయనకు ఎంత పూచీతనం ఉన్నది ఆయన అంటున్నాడు'' నా బిడ్డ పిలుస్తుంది. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. యెషయా 58:11 ''నీవు నీరు కట్టిన తోటవలె నుండి పాడైన స్థలములను బాగుచేయుదువు'' ఇది దేవుని వాక్యము. నీ జీవితంలో ఇది నెరవేరాలి. ఆడపిల్లగాని, మగ పిల్లవాడు గాని నీ ప్రార్థనలు ఎప్పుడూ వ్యర్థము కావు. సర్వశక్తి మంతుడైన దేవుడు నీతో ఉన్నాడు. గనుక నీవు ఎక్కడకు వెళ్ళునప్పటికి నీ సమస్తము బాగుచేయుదువు. ''నేను ఈ వ్యాధిగ్రుస్థుని కొరకు ప్రార్థన చేస్తాను, లేక దుస్థితిలో ఉన్న ఈ కుటుంబము కొరకు ప్రార్థన చేస్తాను''. అని నీవు అంటావు, మనము అందరము ఏకముగా ఉండి సిలువవైపుకు కన్నులెత్తి చూస్తే ఒక నూతన శక్తి నూతన నిరీక్షనీ మనలోనికి వస్తాయి. ఇక ఎన్నటికినీ నీవు కాదుగాని సత్యము, ఆయన నిన్ను ఆశీర్వాదించి నిన్ను వాడుకుంటాడు.

మూల ప్రసంగాలు