లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

నీవు నా మార్గములలో నడిచినట్లయితే...

కీ.శే. యన్‌. దానియేలు గారు

జకర్యా 3 : 4,5

'సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునది ఏమనగా - నా మార్గములలో నడుచుచూ నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడ వగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును.

దేవుడు చెప్పాడు - ప్రధాన యాజకుడైన యెహోషువా మలిన వస్త్రములను ధరించుకొనియున్నాడని వాటిని తీసి పారవేయవలెనని మరియు అతడు క్రొత్త వస్త్రములతో ధరింపచేయబడవలెనని చెప్పాడు. కాని అది సరిపోదు. ఆయన జాగ్రత్తగా ఆయన మార్గములో నడువవలెను. అతడు మారుమనస్పు పొందిన తర్వాత బలపరచబడవలసిన విధానము ఏదనగా దేవుని వాక్యప్రకారము నడుచుకొనుటయే. దేవుని వాక్య ప్రకారము నీవు వేసే ప్రతి అడుగు నిన్ను బలపరుస్తుంది. నీవు శుద్ధీకరించబడిన తర్వాత నీలో నున్న పాత మనుష్యుడు చనిపోవడానికి దేవుడు ఏర్పాటు చేస్తాడు. పాత మనుష్యుడు అక్కడే యున్నాడు. కానీ అతడు తన శక్తిని బలాన్ని పోట్టుకుంటాడు. మారు మనస్సు పొందిన తర్వాత నీవు దేవుని ఆత్మ చేత నింపబడతావు. నీన్ను నీవు దేవుని వాక్యము చేత నింపుకోవాలి. దేవుని వాక్యము ఆత్మయు జీవమునైయున్నది. నీవు ఈ రీతిగా నింపబడినప్పుడు నీవు దేవుని వాక్యమునకు ఘనతను ఇస్తావు. నీవు దేవుని వాక్యమునకు వ్యతిరేకముగా వెళ్ళవు కానీ దేవుని వాక్యమును నెరవేరుస్తావు. ''నీవు నా మార్గములలో నడుచుచూ నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా కాపాడుకొనినట్లు అయితే అప్పుడు నీవు నా మందిరము మీద అధికారివై యుందువు''. ఆయన తన స్థానము నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. నిన్నునూ న్యాయాధిపతి చేయాలనుకుంటున్నాడు. మత్తయి 19:28 ''యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సంహాసనము మీద ఆసినుడైయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆశీనులై యిశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు.'' శిష్యులు క్రీస్తును నమ్మడం మట్టుకే కాదు గాని ఆయనను వెంబడించారు. మారు మనస్సు పొందినప్పుడు కొండ మీది ప్రసంగములో వివరించబడిన రీతిగా జీవము మీలో చిన్నదిగా ఉన్నది, లేక శక్తివంతముగా ఉన్నది. ఒక గొప్ప వృక్షము యొక్క జీవము ఒక చిన్న బీజమునందున్నట్లుగా ఈ గొప్ప నూతన జీవము కూడా మారు మనస్సు పొందినప్పుడు మీలో ఉన్నది.

అనేక మంది మాతో కలిసి వాక్యమును బోధించవలెనని ఆశిస్తారు. జాగ్రత్త మీరు మిమ్మును గూర్చి ఘనముగా ఆలోచించాలి. అయోగ్యముగా బోధించాలని ప్రయత్నిస్తే చీకటి శక్తులు మిమ్మును నలిపివేయును. తిరిగి పాపములోనికి మిమ్మును నడిపిస్తాయి.

మారు మనస్సు పొందినప్పుడు మీరు మేలైన దానిని హత్తుకొని కీడైన దానిని త్రోసివేయండి. దేవుని సేవలో శరీర సంబంధమైన ఉత్సాహము కలిగియుండుట సులువు. కాని మీరు ఆత్మలో నడిచి, ఆత్మలో మాట్లాడి, ఆత్మలో జీవించాలి. మీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయముగా మారుతుంది. మారుమనస్సు పొందినప్పుడు దేవుడు మీలో తన ఆత్మను ప్రవహింప చేయడానికి కావలసిన మార్గము ఏర్పాటు చేస్తాడు. ఒక ఆనకట్ట కట్టబడినప్పుడు కాలువలు త్రవ్వబడతాయి. వాటి ద్వారా నీరు ప్రయోజనకరముగా ప్రవహిస్తాయి. కొంత మంది కాలువలు త్రవ్వుతారు కానీ ఆనకట్ట కట్టబడలేదు. నూతన జీవము లేదు. ఆత్మలో జన్మించిన ప్రతివాడు ఆత్మను సమృద్ధిగా పొందుతాడు. దేవుడు నిన్ను పూచీ దారునిగా చేస్తాడు. నీవు మనుష్యులకు తీర్పు తీరుస్తావు. 2 కొరింధి 6:1 '' కాగా మేము ఆయన తోడిపనివారమై దేవుని కృపను వ్యర్ధము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాను.'' నీవు దేవుని నుండి వేరైన వ్యక్తివికాదు. దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు ఆయన మార్గములలో నడుచుట సులువుగా ఉంటుంది. నీవు ఆయనతో పాటు పరిపాలిస్తావు. నీవు దీనుడువుగా నుండి ఇతరులను తీర్పు తీర్చు దాని కన్నా కఠినముగా తీర్పు తీర్చుకుంటావు.

నీ యౌవన దినముల నుండి నీవు ఆయన సేవను పట్టుకొని యుండుట ఎంత అధిక్యత. నీవు దేవునితో ఏకముగా ఉన్నావు గనుక నీ కోర్కెలు నెరవేర్చబడతాయి. నీ ఆశలు పరలోకంలో గట్టిగా మ్రోగుతూ ఉన్నాయి. నీ కోర్కెలు నెరవేర్చడానికి దేవదూతలు పరుగెడుతూ ఉంటారు. నూతన జీవితములోనికి ప్రవేశించు. అప్పుడు నీవు సేవకుడవు మట్టుకు కాక ఆయన వాగ్దానములను పూర్తిగా నెరవేర్చు కుమారుడవు అయి ఉంటావు.
మూల ప్రసంగాలు