లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

క్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చెను

కీ.శే. యన్‌. దానియేలు గారు

లూకా 23:32 '' మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు''.

ఇద్దరు నేరస్థులు ఉండినారు. క్రీస్తు ఇద్దరు దొంగల మధ్యన వ్రేలాడుతూ ఉండినాడు. ఆయన పరలోకమునుండి భూసంభంద మైన గృహం నుండి స్త్రీ గర్భంలోనికి వచ్చాడు, దేవుడు అలా క్రిందికి దిగి రావలెనంటే సులువైన విషయంకాదు, ఒక చిన్న శిశువుగా ఆయన నరహంతకుల ద్వారా చుట్టబడ్డారు. అప్పుడు ఐగుప్తులోనికి పారిపోవలసి వచ్చింది. ఆయన ఎదుగుచూ ఉండగా పాపపు సహజ భావము కలిగిన వారితో కదులుతూ ఉండవలసి వచ్చింది. ఆయన 12 సం|| వయసులో దేవాలయములోనికి వెళ్ళి ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉండినాడు. ఆయన ఇంకా ఎదిగినప్పుడు విశ్వసించనటువంటి సహోదరులతో జీవించవలసి వచ్చినది. దేవుని రాజ్య అవసరములు మొట్టమొదటగా భరించవలెనని ఆయన తన తల్లితో చెప్పాడు.

ఆ తర్వాత సేవ, శిష్యులను ఏరుకున్నాడు. వారిలో కొందరికి నిప్పు వంటి స్వభావము కలదు. తొందరపడే పేతురు వేషధారియైన ఇస్కరి యోతు యూదా, నమ్ముటకు చేతకాని తోమా అక్కడ ఉండినారు. పరిసయ్యులతో ఆయన భోజనానికి అంగీ కరించవలసి వచ్చేది. వారైతే స్వనీతితోనూ, పాపముతోనూ నిండి యున్నారు. ఈ విధముగా ఆయన క్రిందకు దిగివచ్చాడు. జక్కయ్య ఇంటిలో గూడా ప్రవేశించాడు. సిలువ మీద ఇరుప్రక్కల దొంగతో ఉండినాడు. ఈ రీతిగా పాపులతో పూర్తిగా ఒకటైనట్లుగా కనపడ్డాడు, ఆ ఉద్దేశంతోనే ఆయన దిగివచ్చాడు. నీతి మాలిన మనుష్యుల స్వభావమును ఆయన మార్గములో చూసాడు. అతిహీనమైన మనుష్యుల మధ్య ఆయన నివాసం చేసాడు.

ఎక్కడైతే చెడ్డ తలంపులు ఉన్నవో, ఎక్కడైతే ప్రేమహీనత, కలదో పరిశుధ్ధత కొరకైన ఆశ ఇవన్నీ ఎక్కడ లేవో అక్కడే నరకము ఉంది. పరిశుద్దులు, దేవదూతలు మన మధ్య నివశించలేరు. క్రీస్తు క్రిందికి దిగి వచ్చి పాపులతో గుర్చించబడ్డాడు. నరహంతకుడైన బరబ్బా యొక్క శిక్షను క్రీస్తు స్వీకరించాడు. ఆయన పాపులయొక్క సమస్యలను గ్రహించు కోవడానికి వచ్చాడు. హెబ్రి 4:15 ''మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభవము లేనివాడు కాడు గానీ, సమస్త విషయములలోనూ మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను''. మన పాపములను క్రీస్తు తన మీద వేసుకున్నాడు, కానీ సిలువ వేయబడుతున్నప్పుడు సంతోషించాడు, మానవుని విషపూరితమైన స్వభావము అంతటిని తనలోనికి తీసుకున్నాడు. ఆయన మన మధ్యనివాసము చేయడానికి వచ్చాడు. ఒక నేరస్థుని మరణమునకు సమానమైన మరణం వరకు దీనముగా తగ్గించుకున్నాడు. ఇద్దరు దొంగలలో ఒకడే రక్షించబడ్డాడు. రెండవవాడు నాశనం అయినాడు. మీరు ఒప్పుకొని కోరకపోతే క్రీస్తు తనంతట తానే ఏమీ చేయలేడు.

క్రీస్తు, మనవంటిపాపపు స్వభావమును కలిగియుండి నాడు, కానీ మన పాపపు స్వభావాన్ని సమాధి చేయుటకు సమాధివద్దకు తీసుకు వెళ్ళాడు. ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు. యెషయా 53:12 కావున ''గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను. ఘనులతో కలసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయెను. అనేకుల పాపము భరించుచూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను''. పాపము చేసిన వారి మధ్య ఆయన లెక్కించబడ్డాడు. పాపము తనకు రావలసిన కూలిని ఇచ్చి ఆయన మరణించాడు. అయినప్పటికినీ మనకు నిరీక్షణ ఉన్నది. మన గురించి సమస్తమును ఎరుగును. మనలను రక్షించగలవాడు ఆయనే !

మూల ప్రసంగాలు