|
సువార్తకు యోగ్యమైనట్లుగా జీవిచండి. |
కీ.శే. యన్. దానియేలు గారు |
1సమూ|| 2:12
ఇది ఒక యాజకుని కుటుంబము, కానీ ఏలీ కుమారులు ప్రభువును ఎరుగరు. ఈ దినమున అనేకమంది నాయకుల పిల్లలు ఈరీతిగానే యున్నారు. తీర్పు వచ్చినప్పుడు అది తీవ్రముగా వారి మీదకు వచ్చును. దానికి విరుగుడు లేదు. యాజకుని ఉద్యోగం ప్రత్యేకమైన అధికారము అనుగ్రహించబడింది. ఇశ్రాయేలీయులు సిలోహులో దేవునిని ఆరాధించారు. సిలోహు పట్టణము ఏ ఫ్రాయీము ప్రాంతములో ఉండినది. గుడారము అక్కడ వేయబడింది. ప్రజలు అక్కడ అర్పణలు అర్పిస్తూ ఉండినారు. ఏలీ కుమారులు దేవునిని ఎరుగకుండా ఉండినారు. మన క్రైస్తవ గృహములు అనేకమైన వాటిలో దేవునిని ఎరుగరు. నీవు దేవునిని ఎరుగనప్పుడు నీవు ఎల్లప్పుడు, అపాయమునకు గురి అవుతూ ఉంటావు. తన కుమారుల ద్వారా యాజక సేవ ఏదో రకంగా జరుగుతూ ఉన్నదని ఏలీ తృప్తి చెందాడు. వారి భక్తిని సరిచేయక పోవడం ఏలీ చేసిన ఘోరమైన నేరములలో ఒకటి. ఒక తండ్రి తన కుమార్తెను గాని, కుమారుని గానీ ఒక గుంటలోనికి త్రోసినప్పుడు అతని భక్తిని ఏలాగు అంచనా వేస్తారు. ఏలీ మంచివాడే, కానీ అతని మంచితనము తన బిడ్డలను దేవుని యొద్దకు తీసుకు వెళ్ళలేదు. వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారు. బలులలో అతిశ్రేష్టమైన భాగము దేవుని కొరకు సిద్దపరచబడుచుండగా వారు దానిని తీసివేసుకునేవారు. ప్రజలు విసుగుచెంది దేవునికి అర్వణలు తెచ్చుటకు అసహ్యించు కొనిరి.
ఒక స్థలములో నేను ప్రజలను అడిగాను. ''మీరు ఎందుకు దేవునికి అర్పణలు తీసుకు రారు''? ''దాని వలన ప్రయోజనము ఏమి? మేము దేవునికి అని ఇచ్చే డబ్బును అక్రమముగా ఉపయోగించుకుంటున్నారు''. అని వారు చెప్పారు. పాస్టర్లు మరి కొంతమంది ఇతర ప్రజలు దానిని దొంగిలిస్తారు. నా సంఘములో నేను చాలా కాలము కోశాధికారిగా ఉండినాను. సంఘపు డబ్బు నా చేతులకు వచ్చినప్పుడు నేను వణికేవాడిని.
మనము అర్పణలు అర్పించునప్పుడు దేవుడు కనిపెడుతున్నాడు. మొట్ట మొదటలో ఏలీ కుమారులు అర్పింపబడిన మాంసమును దొంగిలించే వారు. దేవుడు ఏ మాత్రమూ తృప్తిచెందలేదు. తరువాత అమాయకులైన స్త్రీలు దేవాలయమునకు వచ్చినప్పుడు వారు పాపములో పడ్డారు. మనుష్యులు దేవుని ఎరుగకుండా సంఘములో పెద్ద పదవిని అలంకరించినప్పుడు వారు దుర్మార్గులు అయిపోతారు. ఒకరు వేదాంత కళాశాలకు వెళ్ళవచ్చును గానీ అది నిష్ప్రయోజనము. మారు మనస్సు పొందటం మొట్టమొదటి అడుగు. తరువాత నీ నాలుకను నీ శరీరమును అదుపులో పెట్టుకోనవలెను. నీ కనులు పరిశుద్ద పరచబడాలి. ఇతరులను గూర్చి దుర్వార్త వినవలెనని నీ చెవులు దురదగా ఉంటే అవికూడ పరిశుద్ధపరచ బడాలి. పోట్లాడే టటువంటి నీ స్వభావము అదుపులో పెట్టబడాలి. నేను మారు మనస్సు పొందిన తర్వాత ఎక్కువగా మాట్లాడితే చెంపలు వేసుకునేవాడిని కాని నేను ఎక్కువ బాగుపడలేదు. కనుక ప్రార్థన చేయడం ఆరంభించాను. భోజన శాలలో రెండవ సారి వడ్డించవలసిన అవసరం ఉన్నప్పటికీ నేను నోరు తెరిచేవాడిని కాదు. మనము యాజకులుగా తర్ఫీదు పొందాలి. నా స్నేహితులు నేను తక్కువగా తింటున్నానని గమనించి నాకు ఇంకా ఎక్కువగా వడ్డించమని సేవకులకు చెప్పేవారు కానీ దేవుని యొక్క క్రమశిక్షణ ఏమనగా కొలత ప్రకారం నేను తినాలని.
దేవుడు లేని మనుష్యులు అధికముగా తిన్నప్పుడు వారు దుర్మార్గులు అయిపోతారు. ఏలీ కుమారులు వ్యభిచారులు అయిపోయారు. దేవుని గృహములో వ్యభిచరించుట కన్నా మరణమే మేలు. క్వయర్ సభ్యులు ఎంతో పాపము సంఘములోనికి తెస్తారు. తలంపులు దుర్మార్గముగా ఉన్నప్పుడు అక్కడ కొనసాగుట కంటే తీసివేయబడుట మేలు. సంఘములో భోధించుట సులువైన విషయము కాదు. నీ కనులు పవిత్రముగా ఉండాలి. ఒక పట్టణములో వృద్ధుడైన పాస్టరు గారు ఒకాయన ఉండేవాడు. మంచివాడు ఆయన నన్ను వచ్చి బోధించమని కోరేవాడు. బోధించడం ఘనకార్యమైన విషయముగా మనము భావిస్తాము. కానీ మనతో ఒక శాపమును తీసుకొని రావచ్చు. మనము దేవునిని ఎరిగి ఇతరులు కూడా దేవునిని ఎరిగేటట్లు చేయకపోతే ఒక శాపము సంపాదించుకుంటాము. నేను ప్రార్ధన చేసి, ప్రార్థన చేసి నన్ను నేను పవిత్ర పరచుకొనేవాడిని. తరువాత నేను వెళ్ళి బోధించే వాడిని.
ఒక పెద్ద గవర్నమెంటు ఆఫీసరు నా దగ్గరకు వచ్చి తనకిష్టమైన కుమార్త్తెకు సహాయము చేయమని కోరాడు. మేము ప్రార్థన చేస్తే ఆమె మారుమనస్సు పొందింది. తన తండ్రి మారుమనస్సు పొందవలెనని కోరింది. అంత పూర్తిగా వెనక్కు తిరగడం అవసరం లేదని తండ్రి చెప్పాడు. మారుమనస్సు లేకుండా ఆయనే వెళ్ళి బోధించేవాడు. వృద్ధాప్యములో ఆయన వ్యాధిగ్రస్థుడై స్వస్థతకొరకు ప్రార్థన అడగడానికి కావలసిన విశ్వాసం లేదు. డబ్బు ఇవ్వడానికి చూసేవాడు. నేను చెప్పేవాడిని. ''నీవు స్వస్థత పొందితే నాకు చాలు. ''నీ డబ్బును కాదు ఆశించేది నీ విశ్వాసమునే''.
నీ డబ్బు ఎలాగు వినియోగిస్తున్నావో జాగ్రత్తగా చూసుకో. దేవుని గృహమును నీవు ఏలాగు వినియోగించుకుంటున్నావు? క్రీస్తుని తప్ప మరి ఎవరినీ నేను ఎరుగకుండా జాగ్రత్త తీసుకున్నాను. యాజకత్వం అనేది ఒక ఘనమైన ఉద్యోగం. నీవు వేదిక మీద నుండి బోధించినప్పుడు దేవదూతలు అక్కడకు వస్తారు. కొంతమంది దైవజనులు వేదిక మీద నుండి దర్శనములు చూసారు. నీవు ఏకత్వము కలిగి పాటలు పాడితే నీ భవిష్యతు నిమిత్తమై దేవుని దర్శనములు చూస్తావు. ఆరాధించే స్థలము అద్భుతమైన స్థలము. దానిని పవిత్రముగా కాపాడు. నీవు ఆ స్థలములోనికి వచ్చునప్పుడు ప్రార్థనతో రా. అక్కడ దేవుని వర్తమానము విన్నప్పుడు ఒక దేవుని గూర్చిన బయల్పరుపు కొరకు రా అక్కడ నీవు వర్తమానము విన్నప్పుడు నీవు ఇంటికి వెళ్ళి విన్న వర్తమానము విషయమైన ప్రార్థన చేయి. నేను ప్రార్థిస్తాను. ''ప్రభువా నేను బోధించిన విషయమై జీవించడానికి నేర్పించు''. నేను బోధించినప్పుడు నీకు వర్తమానం ఇవ్వబోవడం లేదు నాకును, నా కుటుంబమనకును కూడా ఇస్తాను.
ఏలీ కుమారులు నాశనం అయి పోవుతూ ఉండినప్పుడు ఒక దైవజనుడు వచ్చాడు. 1సమూ 2:27-34 వరకు, యాజకుని గృహం దేవుని గృహమును అపవిత్రపరిచింది. మనుష్యులు తమ్మును తాము పవిత్ర పరుచుకొనినప్పుడు తమ శరీరముపై గెలుపొందితేనే తప్ప యాజకత్వమునంగీకరించరు. లేకపోతే చాలా అపాయకరమైన విషయము. అది తేలికైన విషయము కాదు. నీవు ఒక గుమస్తాగా కానీ, ఒక పోలీసు వానిగా కానీ ఉండడానికి అంగీకరించవచ్చు. కానీ పాదిరిగారుగా ఉండడానికి అంగీకరించలేవు. పరిశుద్ధులైన వారే బోధించడానికి తగినవారు. వేదాంత విద్యార్థులలో అనేకమంది ప్రార్థించుట ఏలాగో ఎరుగరు. వారి వర్తమానములన్నీ పుస్తకము నుంచి ఏర్పాటు చేసుకున్నవి. అవి ప్రజలకు సహాయము చేయవు. ప్రతి వర్తమానము దేవుడు సిద్దపరచవలెను. నాకు మామగారుగా మారినటువంటి ఒక పాస్టరుగారు అనేకసార్లు నన్ను బోధించమని కోరేవారు, కానీ నేను నిరాకరించేవాడిని. ఉపవాసము ఉండి ప్రార్థనచేసి నన్ను నేను పవిత్రపరచుకొని నేను దేవుని యొద్దనుండి వర్తమానం పొందితేనే తప్ప నేను నిరాకరించే వాడిని. నేను ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో నా సమయమును దేవునితో గడపాలని కోరేవాడిని.
ఒక వేదాంత కళాశాల అనగా అది పరిశుద్ధ పరచ బడిన బడిగా నుండాలి. అక్కడ మనము మానసిక సంబంధమైన జ్ఞానమును మట్టుకు సంపాదించుకొంటే చాలదు. 1 పేతురు 2:9 పరి-పేతురు మనలందరినీ యాజకులుగా పిలుస్తాడు. ఎందుకు మనము క్రీస్తుయొక్క అద్భుతకరమైన వెలుగులోనికి వచ్చాము. నీవు ఈ వెలుగులోనికి వచ్చినప్పుడు ఏ చీకటి నీమీద దాడి చేయదు. ఈ క్రీస్తు వెలుగు నిన్ను పూర్తిగా వెతుకును,నీలో ఉన్న దుష్టత్వమంతటిని అదినాశనం చేయును. నీలోనుండే దుష్టమైన ఉద్దేశ్యములను నాశనంయేయును. మనము బైబిలు చదివేకొలది మనము మందుతీసుకుంటూ ఉంటాము. దేవుడు పంపించే ఎక్స్-రే నిన్ను విభాగించి ఉండే క్రిములన్నిటినీ చంపివేస్తుంది. నీవు ప్రతి ఉదయకాలమందు ప్రభువు యొద్ద కపిపెట్టినప్పుడు నీవు పశ్చాత్తాప పడతావు. నీవు దు:ఖిపడి నీ పరిస్థితిని దేవునికి చెప్పుకుంటివు. అదినీలో ఉన్నటువంటి మురికిని నీ హృదయాంతరంగములో ఉండే క్రిములను నాశనంచేయును. హృదయంలో ఆత్మను సరియేయును. దేవుని వాక్యము అంటే దేవుడే. ఒక స్త్రీ వచ్చి క్రీస్తు వస్త్రపుచెంగును ముట్టుకుంది. ఆమె పడక మీది నుండి లేవడానికి కష్టపడింది. తన వీధిగుండా క్రీస్తు వెళ్ళడం చూసినప్పుడు బలం పొందింది. ఈస్త్రీ సమూహము మధ్యకు వెళ్ళింది. యూదా స్త్రీలు సాధారణముగా ఈలాంటి పనిచేయరు. వారికి ఒక లోతైనటువంటి నమ్రత ఉంటుంది. ఒక పురుషుడు గనుక ఆమెను త్రోసిఉంటే క్రిందపడిపోయేది. అంత బలహీనురాలుగా ఉండింది. కానీ క్రీస్తుకు సమీపముగా, వచ్చింది. క్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. ఆయన శరీరమునుండి ప్రభావము బయలు దేరి ఆమె శరీరములో ప్రవేశించింది. క్రీస్తు వ్యక్తిత్వము ప్రభావముతో పూర్తిగా నింపింది. ఇప్పుడు అది ఆయనలో నుండి వెళ్ళి ఆమెను ముట్టింది. ఆయన నూరుశాతము నిండుగా ఉండినాడు. అకస్మాత్తుగా అది 50 శాతానికి పడిపోయింది. శక్తి ఆయనలో నుండి బయలు వెడలినట్లు గ్రహించాడు. ఆయనను ముట్టిన వారు ఎవరో కనుగొన గోరాడు. మాటలు మాట్లాడే పేతురు అక్కడ ఉండినాడు. అతడు చెప్పాడు, ''మేము అందరము నీ మీద పడుతుంటే నిన్ను ముట్టినవారు ఎవరో తెలుసుకోవాలని కోరావు''. వారు ముట్టింది విశ్వాసపు తాకుడు కాదు. ఆమె స్వస్థత పొందింది. పోగొట్టుకొనిన బలమును ఆమె తిరిగి సంపాదించుకొంది. ఆమె క్రీస్తు ఎదుటకు వచ్చి తన వృత్తాంతము ఆమె తెలియపర్చింది. నీవు బైబిలు చదివేటప్పుడు ఇదే జరుగుతుంది. మొట్టమొదట నీవు దేవుని గూర్చిన జ్ఞానముగలవాడవై ఉండాలి. నీవు సంఘమందు మట్టుకు యాజకుడవు కాదు గానీ నీ కుటుంబమునకు. ప్రతివ్యక్తికి ఒక యాజకుడుగా ఉండాలి. అతని యాజకత్వము తన భార్యను కొట్టడానికి, ఆమెమీద ఆయన అధికారము చూపించడానికి కాదుగానీ తన భార్యబిడ్డలకు నేర్పించేదానికి.
హన్నా సమూయేలుకు నేర్పింది. శారా ఇస్తాకుకు నేర్పింది. ఒక తల్లి యొక్క మాటలు ఎల్లప్పుడు బిడ్డల మనస్సులలో నిలుస్తాయి. ప్రిన్స్ చార్లెస్ ఆంగ్లదేశము యొక్క రాజ కుటుంబమునకు చెందినవాడు. కానీ దేవుడు తన రాజ గృహమునకు చెందినవాడుగా ఉండాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వందలకు వేలమంది ఆత్మలు జీవమును, వెలుతురును నీ యొద్ద నుండి పొందుతారు. దేవుడు నిన్ను ఒక ఆఫీసులోగానీ, స్కూలులోగానీ పెట్టవచ్చు. కొంతమంది బడులలోని మేనేజర్లు మార్పుపొందిన మన ఉపాధ్యాయులు అబద్దములు ఆడరని ఎరుగుదురు. వీరు తమ ఉపాధ్యాయులను కొన్ని పేపర్ల మీద సంతకము పెట్టమంటే వారు నిరాకరిస్తారని ఎరుగుదురు. కొంతమంది, ''ఈ దినము ఆదివారము, ఇటువంటి కార్యములు మేము నెరవేర్చలేము'' అంటారు.
తలంపునందును, మాటలలోనూ, క్రియలలోనూ మనము మన దేశమునకు సేవ చేయవలెనని మన వార్తా పత్రికలు పలుకుతూ ఉంటాయి. భారతదేశము కొరకు మనలో ఎలాంటి తలంపులు గలవు? లంచములు తీసుకునే ఒక అధికారి అతని మనస్సులో ఏలాంటి తలంపులు కలిగి ఉంటాడు, కీర్తనలు 112:3. ''దేవుని వాక్యము కనికరము నీతి నిత్యము నిలుచునది. ఒకసారి నన్ను విశాఖపట్నమునకు హెడ్మాష్టరు ఉద్యోగము చేయడానికి వెళ్ళమని చెప్పారు. నేను ఆయన చిత్తముకొరకు ప్రార్థన చేసాను. ఆయన కీర్తన 110:4 ఇచ్చారు. దేవుడు నన్ను యాజకునిగా నియమించాడు. దేవుని కృప నీతో ఎల్లప్పుడు నిలుచును. ఓ క్రైస్తవ ప్రజలారా మీరు యాజకులు - రాజుకు తగిన యాజకులు. సైతానుకు నీమీద ఏలాంటి అధికారము లేదు. దేవుని వాక్య పఠనముచేయి. దేవుడంటే మంచి జ్ఞానము సంపాదించుకో, వాగ్ధానములను స్వాధీనపరచుకో.
ఈ ఆశీర్వాదము నాకు ఎలాగు వచ్చింది? నేను దేవుని వాగ్దానములు చేతపట్టుకొని దేవునిని ఈలాగు అడిగే వాడిని, ''ఇవి నా జీవితములో నెరవేర్చు''. దేవుడు చెప్పాడు వ్యర్థమైన స్థలములను తిరిగి కట్టడానికి ఈ సహవాసమును వాడుకో. నేను దేవునితో చెప్పాను, ''నీవు ఘనతవహించిన యాజకునిలాగా నన్ను చేస్తానని చెప్పావు. నీ కృప తరతరములకు నిలుచును. ఫెలోషిప్‌కు దేవుడు ఇచ్చిన వాగ్దానములు, అవి నీవి కూడా, ఈ యాజకత్వమును పోగొట్టుకొనకుము. నిలిచియుండే ఆ నీతి మనయందుకూడా నిలవాలి!!!
|
|