లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని మహిమ పరచు నిమిత్తము జీవించుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

| కొరింధీ 6:19,20

''మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైయున్నదని మీరెరుగరా! మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి''.

క్రైస్తత్వము తక్కెన మతములకన్నా వేరైనది. దేవుడు మనకు ఏర్పరచినటువంటి నియమము ఏమనగా ''దేవుని మహిమ పరచు''. ఏలాగు దేనితో, ఎక్కడ, ఎప్పుడు ''దేవున్ని మహిమపరచాలి''. అది మనయొక్క లక్ష్యము అయి ఉండాలి. జీవితములో వచ్చే ప్రతి మెలికలో ''నేను దేవుని మహిమపరుస్తున్నానా'' అనిమనము అడుగుకోవాలి. శరీరము మనకు శత్రువు అయిపోతోంది. గలతీ 5:17 మానవుని ఆత్మ మానవునిలో దేవుని వలన పెట్టబడింది. దేవుని నిగ్రహించుకొనే నిమిత్తము ఇది ఈలాగు జరిగింది. యోహాను 4 : 23,24 ''దేవుడు ఆత్మయై యున్నాడు'' నీయందుకూడా ఒక ఆత్మయున్నాడు. లోకము దాని విజ్ఞానముతో దేవునిని తెలుసుకోలేదు. ఇతర మతములలో మనుష్యుల ఆత్మలు ఎన్నడూ దేవుని సంధించలేవు. వారు దేవునితో సంబంధము లేకుండా జీవిస్తూ ఉంటారు. 1కొరింధి 2:14 ''దేవుని వలన జన్మించనివారు ఆత్మ సంబంధమైన విషయములు గ్రహించలేరు''.

ఒక ఉద్దేశము నిమిత్తము నీవు ఒక వెల యిచ్చి కొనబడినావు. నీవు నీ సొంతము కాదు. నీ యిష్టానుసారముగా వస్త్రధారణచేసి నీవు కోరినదెల్లా చేయలేవు. ఏ ఆభరణము అయినా సరే నీ యొక్క మీద కానీ, నీ చెవులలో కాని ధరించడానికి వీలులేదు, వినోదస్థలములకు దుర్మార్గముగా వెళ్ళడానికి వీలులేదు. ఒకడు ఒక లోకస్థుడైన మనుష్యునిలో ఒక ప్రవక్తను చూడలేడు. దేవుడు నీయందు ఒక ప్రవక్తను చూడవలెనని ఆశిస్తున్నాడు. నీ విలువను నీవు ఎరుగుదువా? వెలయిచ్చి కొనబడినావు. యూదా : 12. వర్షము ఇవ్వని మేఘములు ఉన్నవి. ఒక వ్యర్థమైన మనిషి అలాగు ఉంటాడు. స్వార్థప్రియుడు, అతడు ముఖ్యుడైన, ప్రముఖుడైన మనుష్యుడుగా ఉండగోరుతాడు. అతడు ఇతరులకు ఆడంబరముగా కనబడాలని కోరతాడు. దర్జీవాని ద్వారా ఒక వ్యక్తిగా చేయబడిన మనుష్యుడు ఇతరులకు మేలు చేయలేడు. దేవుని మహిమపరచే నిమిత్తము నీవు చేయబడ్డావు. ఆకలిగొనిన ఆత్మలు నీవలన తృప్తిపరచగలవో ఇతరులు నీ గురించి ఈలాగు చెప్పగలరా!

ఓ యౌవనస్థుడు నాతో చదువుకున్నాడు, అతడు బి.ఏ డీగ్రీ పూర్తిచేయలేదు. ఆ దినములలో ''ఆక్స్‌ఫర్డ్‌ డ్రెస్‌'' అని పిలవబడే వస్త్రధారణ చేసుకున్నాడు. అది ఒదులుగా ఉండే షరాయి. ఆ దినములలో అది ఫేషన్‌గా ఉండింది. ఎందుకనగా ఆ దినములలో వేల్స్‌ యువరాజు ఆ బట్టలను వేసుకునేవాడు. ఎక్కడకు వెళ్ళినా చెడ్డమాదిరి పెట్టేవాడు, నీవు మారుమనస్సు పొందిన తర్వాత పరిశుద్ధాత్మను దు:ఖపరచవద్దు. కొంత మందికి నేను భాధాకరముగా ఉంటిని. ఎందుకంటే వారు నా సమక్షములో ఏమియూ నా గురించి మాట్లాడలేకపోయేవారు. వ్యర్థమైన విషయములను బట్టి నీ సమయమును వ్యర్ధపరచుకొనవద్దు. నీవు వెలయిచ్చికొనబడినావనే విషయము నీవు జ్ఞాపకము చేసుకో.

ఒకనొకదినమున నీవు ఈ వ్యర్థమైనవిగానీ, ఆకర్షణీయమైనవి గానీ నీవు కోరుకోలేదు. ఆయన నీతి మార్గములో ఆశ్చర్యరీతిగా దేవుడు నిన్ను నడిపించడానికి నీవు అనుమతించావు. యెషయా 32:15,16 నీవు అరణ్యమునకు చెందినవాడవు. నీ కోర్కెలు, అపరిశుద్ధమైనవి, అదుపు చేయలేనివి. నీయందు అపరిశుద్ధమైన సహజ ప్రేరణయున్నది. శరీరాశలు నెరవేర్చడానికి నీవు ఉన్నావు.

అనేక గృహములు అరణ్యము వలే ఉన్నవి. క్రైస్తవేతరులను నీవు కలుసుకున్నప్పుడు నీకు ఎలాంటి అన్యోన్యత కలుగుతుంది. ఓ హిందువును కలుసుకున్నప్పుడు నీ తలంపులు ఎలాంటివి? నీవు పరిశుద్ధాంగా ఉన్నావా? మనుష్యుడు వివాహము నిమిత్తమే జన్మించాడని అనుకుంటున్నావా? వివాహము లేకుండా అతడు దేవున్ని మహిమ పరచలేడా? దేవుని ఏర్పాటు కొరకు కనిపెట్టగలవా? యెషయా 66:4 నీ స్వంత చిత్తమును ఏర్పాటు చేసుకొని నీవు దేవుని నామమునకు ఆరోపిస్తావా? నీవు నీ సొత్తు కాదు.

యెసయా 66:4

దేవునికి వ్యతిరేకముగా నీవు ఏర్పాటు చేసుకొనిన విషయములు ఒక జాబితా వ్రాయుము. నీవు మనుష్యులను చూచునప్పుడు దురాశా పరుడవై వారికి కలిగినది ఆశిస్తావా?

నీతి గల మనుష్యులను చూసి వారిలో ఉన్న మేలును ఎందుకు కోరవు? గృహములలో మనకు అన్ని అలవాట్లు ఉన్నాయా? మీ తల్లిదండ్రులు చేసినట్లుగా సరిగా వాటినే అనుసరించవద్దు. కానీ నీవు నడువలసిన మార్గము వాక్యము నుండి నేర్చుకో. క్రైస్తవ జీవితములో కొన్ని భాగములలో నా తండ్రి గారు నేర్పించబడి, దేవుని వలన నడిపించబడి నడిచేవారు. కానీ ఇతర భాగములలో దేవుడు నన్ను నడిపించినప్పుడు నన్ను తృణీకరించలేదు. వారి తలంపులలోనూ, సహజప్రేరణలోనూ పరిశుద్ధ పరచబడినవారు లోకమునకు అవసరమైయున్నారు. యూదా క్రీస్తు యొక్క సహోదరుడు. ఆయన పత్రిక వ్రాసేటప్పుడు చాలా అర్ధ సహితముగా వ్రాస్తాడు. యూదా 20వచనం. ప్రియులారా మీరు విశ్వసించు అతిపరి శుద్ధమైన దానిమీద మమ్ములను మీరు కట్టుకొనుచూ పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయుచూ...

మూల ప్రసంగాలు