|
క్రీస్తు వైపుకు చూచుచూ... |
కీ.శే. యన్. దానియేలు గారు |
కీర్తనలు 61:2
''మనము దేవుని కొండ ఎక్కుతున్నాము. నీవు ఎక్కవలసిన కొన్ని స్థలములలో ఎక్కుటకు కష్టమైన స్థలాలు ఉన్నవి. ఆస్థలములలో మనము ఎక్కవలెనని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తే విజయుడు.
జర్మనీ దేశములో ఒక పాస్టరుగారు బ్లూమ్ హార్డ్ అనే పేరుతో ఉండినారు. ఆయన యొక్క గుర్తు ''క్రీస్తే విజయుడు'' నీకు రాబోవుచున్న ఓటమిని గూర్చి ముందుగా ఎందుకు భాదపడతావు? మనము ఓడిపోవుచున్నామనే ముందుగా ఆలోచిస్తాము. మనము ఆలోచించవలసిన విధము ఇది. ''నేను ఓటమికి కాదు. ప్రభువు నాతో ఉన్నాడు గనుక నేను విజయుడుగా ఉంటాను. నా బలమునందుకాదు, ఆయన బలమునందే''
ఇది ఖాళీగా ఉన్న సమాధినుండి ఈ నిరీక్షణ వస్తుంది. కానీ ఓటమి పొందుతామనే భావము మనలో ఉంటుంది. ఎందుకు మనము ప్రార్థన చేయము గనుక.
నా కళాశాల దినములలో, కళాశాలలో నాకు తెలియకుండా ఏదీ సంభవించలేదు. కానీ నేనే ఏది జరుగుతుందని ఎదురు చూసానో అదే జరిగేది. నేను విందుశాలకుగానీ, ఒక టీ - పార్టీకి గానీ దేవుడు అనుమతిస్తేనే వెళ్ళేవాడిని. దేవుని యొద్దనుండి వచ్చే హెచ్చరికలకు నీవు విధేయుడవు అవటానికి సిద్దముగా ఉంటే నీ ఆత్మీయ జీవితములో నీవు త్వరగా ఎదుగుతావు.
ఒకప్పుడు ఒక దెయ్యము పట్టిన స్త్రీ జర్మనీ దేశములో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమె ఇంటిలోనికి వెళ్ళి తాళం వేసుకుంది. తలుపు బద్దలు కొట్టవలసి వచ్చింది. బ్లూమ్ హార్డ్ గారు ఆమెను తిరిగి సంపాదించవలెనని పట్టుబట్టారు. ఆమె శరీరమును తాకి ప్రార్థన చేసారు. ఆమె జీవముతో తిరిగి లేచింది. తదుపరి బ్లూమ్ హార్డ్ గారికి సహాయకురాలుగా ఉండింది.
క్రీస్తే విజయుడని నీవు నమ్ముతావా? బ్లూమ్ హార్డ్‌గారు ఎన్నడూ దానిని సందేహించలేదు. ఒక సహవాసములో నీతి, పరిశుద్దత ఉంటే ప్రతివ్యాధి స్వస్థపరచబడుతుంది. మీరు అందరూ ప్రార్థనచేసి ఆత్మీయ బయట స్థితిని పెట్టవలెను. ఆత్మీయముగా మీరు ఏదైనా భాగమును ఈ సహవాస సేవలో తీసుకోవాలి. మీరెందుకు దేవునిని మిత పరుస్తారు? ఆయన సహ వాగ్దానము మనకు ప్రతి ఆర్ధికమైన సహాయము ఇవ్వడానికి సిద్దముగా ఉన్నాడు. ఈ సేవవృద్ధి అయ్యేకొలది అది జరుగుతుంది. మనము తప్పిపోకూడదు.
దేవుడు నావైపునకు చూస్తున్నాడు. నేను దేవునికి భయపడతాను నా యిష్టము వచ్చినట్లు డబ్బు ఖర్చు చేయడానికి వీలులేదు. బొత్తాలు కొనడానికి కూడా నేను దేవుని సెలవు తీసుకుంటాను. అది దేవుని డబ్బు. నా బంధువులకు సహితము దేవుని సెలవు లేకుండా నేను ఏమీ ఇవ్వను.
ఈ సేవలో నీ యొక్క భావము ఏమిటి? క్రీస్తునందు విశ్వసించు. నీవు విశ్వసిస్తే దేవుడు నిన్ను ఏదో నిర్మాణం చేయడానికి సహవాసములో సహాయము చేస్తాడు. నీవు ప్రార్థన చేయకపోతే నీకు ఒక భారము రాదు. దేవుడు మనకొరకు ఒక ఏర్పాటు చేసినాడు. నీవు ప్రార్థించుచున్నావు దేనికొరకు ప్రార్థించుచున్నావు? దేవుడు నీపైన భారము ఏమైనా పెట్టినాడా?
కీర్తన 64:6.. ''ప్రతివాని హృదయాంతరంగము అగాధము'' మీరు ప్రార్ధన చేసేటప్పుడు మీరు లోతుగా త్రవ్వుతారు. నీ హృదయములో అనేకమైన అడ్డుబండలు, అనేకమైన ఈవులు ఉన్నాయి. నీ దగ్గర కొంతమట్టి సుద్దకూడా ఉండవచ్చు. దాన్ని త్రవ్వి బయట పారవేయాలి. నీవు నిష్ప్రయోజకుడవని తలంచి యుండవచ్చును. నీవు వృద్ధుడవని తలంచి ఉండవచ్చు, అకస్మాత్తుగా నీవు యౌవనస్థుడవని తెలుసుకుంటావు. నీవు ప్రార్థన చేయకపోతే నిన్ను నీవు తెలుసుకోలేవు. ప్రజలకు ఉన్నతమైన విద్య ఉండవచ్చు, కానీ వారు సత్యము నెరుగరు. నీ తల్లి దండ్రులతో నీవు రాజీపడుతున్నావా? నీ గృహములో పాత అలవాట్లు ఇంకా వెంబడించవచ్చు. వారితో ఏకీభవించినట్లయితే నీలోనికి చీకటి వస్తుంది. హృదయం చాలా లోతైనది. నీవు త్రవ్వడం ఆరంభించాలి. దేవుని వాగ్గానముల నెరవేర్పు ఆలస్యం అవుతుండడం వల్ల నేను ఇంకా లోతుగా నా హృదయమును త్రవ్వుతున్నాను. దేవుడు తప్పు చేయలేడు. దేవుడు తన వాగ్దానములన్నిటిని ఒక్కసారి నెరవేర్చినట్లయితే సహవాసమంతటినీ నేను ఒక్కడ్ని చూసుకోలేను. నీవులోతుగా త్రవ్వితే లోపల మెదులుతున్నటువంటి ఆటంకములన్నీ బయటకు వస్తాయి. అప్పుడు నీ బలహీనతలు తీసివేయబడతాయి. పరి, ఆగస్టీన్‌కి మోనిక యొక్క ప్రార్థన సహాయకరముగా ఉండింది. అకస్మాత్తుగా అతనికి విజయము దొరికింది. మోనిక తన ప్రార్థనకు ఆటంకము కల్గించు కారణము ఏమైనా ఉంటే దానిని త్రవ్వి పారవేస్తుంది. మీలో కొంతమంది జీవితములలో అపజయము ఉన్నది. భయపడకండి. నీకు జయము ఉన్నది. నీవు సరిపడినంతగా దేవుని వాక్యము చదవడము దానిమీద ధ్యానించడము చేయడంలేదు. నీవు సరిగా చదివితే నీకు అపజయము లేదు. క్రీస్తు విజయము.
|
|