లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఒక పవిత్రమైన మనస్సాక్షిని కాపాడుకొనుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

అపో. 24:16

''ఈ విధముగా నేనును దేవుని యెడలను, మనుష్యుల యెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు చూసుకొనుచున్నాను.''

ఇక్కడ పరి పాలు చాలా ప్రముఖ్యమైన విషయాన్ని బయలు పరుస్తున్నాడు. ఆయన తన మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడు కొనుచున్నట్లు ఆయన చెప్పాడు. అది ఒక క్రైస్తవుని జీవితములో అత్యున్నతమైన మెట్టు. మనము మన పాపములు ఒప్పుకొని క్షమాపణ పొందితే మనకు విడుదల, స్వస్థత దొరుకుతుంది. మనము ప్రభువునందు ఎదుగుతూ ఉంటే ఇవన్నీ సంభవిస్తాయి. మనం మన మనస్సాక్షిని శుద్ధీకరించుకోవాలి. ఎందుకు? దేవదూతలు మనయొక్క స్నేహితులుగా ఉంటారు. వారు మనతో జీవించాలని కోరతారు. ఒక చెడ్డ మనస్సాక్షితో పరలోకములో నడవలేము. మన గృహములు పవిత్రమైన మనస్సాక్షి ఏలుబడి చేస్తూ ఉండే వాతావరణముగలవై ఉండాలి. అనేక సార్లు చాలా పోరాటం జరుగుతూ ఉంటుంది - భార్యభర్తలమధ్య లేక తల్లి దండ్రులు, బిడ్డలమధ్య. దానికి ప్రతిఫలం ఏమిటి, ఒకదురాత్మ మన యింటిలోనికి ప్రవేశిస్తుంది.

అబ్రహాము యొక్క కుటుంబములో ఉండిన గొప్పతనం ఏమంటే శారా అబ్రహాములిద్దరూ దేవుని యెదుట పరిపూర్ణులుగా జీవించారు. ''సరే నీవొక కుమారుని కొరకు అడుగుచున్నావు. కానీ దేవుని ఆత్మ నివశించలేని స్థలములో నేను ఒక కుమారుని ఇవ్వలేను''. ఎందుకు? పరలోకరాజ్యము యొక్క గొప్ప ఆశీర్వాదములను అతడు పొందువాడై యుండాలి.

ఒక ట్రైనింగ్‌ స్కూలులో నేను ప్రాధానోపాధ్యాయునిగా ఉండిన కాలములో చాలా పోట్లాటలు బడిలో ఉండినవి. ఆడపిల్లలు సులువుగా పోట్లాడే విధముగా జీవిస్తారు. ఆ బడిలో ఇద్దరు స్త్రీ టీచర్లు ఎల్లప్పుడు పోట్లాడుతూ ఉండేవారు. ఆ దినములలో ఆయన కృపవలన నేను పవిత్రమైన మనస్సాక్షినికాపాడుకున్నాను. ఈ పోట్లాడే మనుష్యులు జీవితము ఎలాగడుపుతారా అని నాకు ఆశ్చర్యంవేసేది. కొన్ని దినములు అయిన తర్వాత ఒక టీచరుకు పిచ్చిపట్టింది. నేను దాని విషయమై ఆశ్చర్యపడలేదు. ఆమె పరిశుధ్ధమైన మనస్సాక్షిని కాపాడుకోలేదు. ఆమె ఏదైనా చెప్పేది, తదుపరి దానిని ఇష్టం వచ్చినట్లు వంకర తిప్పేది. పరి, పాలు చక్కగా పెరిగిన క్రైస్తవుడు. అయినప్పటికీ ఆయన ''నేను ఎల్లప్పుడూ శుద్ధమైన మనస్సాక్షిని కాపాడుకొనుటకు ప్రయత్నిస్తున్నాను. అనివ్రాసాడు. | పేతురు 3:15,16 టీచర్లు తమ మంచి మనస్సాక్షిని పాడుచేసుకోగలరు. వారు తమ సమయమును మాట్లాడుతూ గడిపివేస్తారు. హెడ్మాష్టరుగారు వచ్చినప్పుడు చాలా ప్రాముఖ్యమైనది ఏదోచేస్తున్నట్లుగా నటిస్తారు. అనేక సార్లు నేను పరీక్షించబడ్డాను. ఏదో ఒక సూపర్‌ వైజరు గారు అకస్మాత్తుగా వస్తారు. ఏదో ప్రాముఖ్యమైన విషయములు చేస్తున్నట్లుగా నటించవచ్చు. అది సరికాదు. నా మనస్సాక్షికి మలినము తగలకుండా జాగ్రత్తగా చూసుకునేవాడిని. మనం పొరపాట్లలో ఉంటే మనపొరపాట్లు త్వరగా తెలుసుకుంటే మంచిది. ప్రజలు మన పొరపాట్లు తెలుసుకొని నివ్వండి. మనము ఏమైయున్నామో దానిని తెలియ పర్చడానికి భయపడకూడదు.

దావీదు పాపము చేసిన తరువాత ఆయన గృహము బహుచెడ్డ వాతావరణముతో నిండిన గృహముగా మారినది. పిల్లలపై నిందవేయడంలో ప్రయోజనం లేదు. నా బిడ్డలలో ఏదైనా పొరపాటు ఉంటే నన్ను నేను పరీక్షించుకుంటాను. ఆఫ్రికా దేశములో ఒక త్రాచుపాము ఉండేదట. అది ''ఉమ్మివేసే త్రాచుపాము'' అని పేరుపెట్టారు. అది చాలా అపాయకరమైనది. దానిని గనుక మనము కోపము పుట్టించినట్లయితే నీ కనులలోనికి తిన్నగా ఉమ్మివేయగలదు. గొప్పబాధనీకు కలుగుతుంది. నీ కనులు గ్రుడ్డివి అయిపోతాయి. మన తలంపులు అలాగు ఉంటాయి. అపో 24 : 18 ''మీ హృదయములలో దేవుని శుద్దీకరించుకొండి''. మనంమేలు చేసేటప్పుడు మనం బాధపొందడానికి సిద్ధంగా ఉండాలి. మనలను మనము న్యాయములో ఉన్నామని తీర్పు తీర్చుకొనకూడదు. మనలను మనము నీతిమంతులమని తీర్పుతీర్చుకొనుట ద్వారా మన మనస్సాక్షిని కలుషితం చేస్తున్నాము, బైబిలుతో తమమనస్సాక్షిని పాడుచేసుకునే వారిని చాలా మందిని చూడవచ్చు. కయీను ఒకడు. దేవుడు చెప్పాడు, ''నీ తలంపులు జాగ్రత్తగా చూసుకో. పాపము నిన్ను గెలవడానికి వేచియుంది'' కానీ అతడు దానిని లెక్కచేయలేదు. తన అసూయకు దాసుడు అయిపోయాడు.

మనస్సాక్షి గురించి బైబిలులో చాలా లోతైన విషయాలు వ్రాయబడి ఉన్నవి. (హెబ్రి 9:9) క్రీస్తు మనలో మంచి మనస్సాక్షి సిద్దపరచాలని కోరుచున్నాడు. నేను మొట్టమొదటి సారి ఆపరేషన్‌ థియేటర్‌లోనికి ప్రవేశించినప్పుడు వాళ్ళు హడావుడిగా అక్కడ ఉండే గాలిని పరిశుభ్రం చేయడానికి చూసినారు. దేవుడు అలాంటి ఫ్యాన్‌లను మన హృదయములో స్విచ్‌వేస్తాడు. ఏ దుష్కార్యము మన హృదయములలో నిలువ ఉండ కూడదు. ఈ దినమున నిన్ను పట్టుకుంటుంది. రేపు మీ బిడ్డలను పట్టుకుంటుంది. నీవు దేవుని వాక్యమును చదివి ఈ విధముగా ప్రార్థించినప్పుడు ఆ ఫ్యాన్లు మొదలు పెట్టబడతాయి. ఎవరైననూ ప్రార్థించేటప్పుడు అది నా హృదయము మీద పనిచేస్తుంది. నన్ను శుద్దీకరిస్తుంది. మనము ఈ విధముగా శుద్ధీకరించబడినప్పుడు దేవదూతలకు స్నేహితులుగా ఉండడానికి మనము తగిన వారముగా ఉంటాము. దేవదూతలు వచ్చి మనతో నివాసము చేస్తాయి. అబ్రహాము ఇంటికి దేవదూతలు అనుకోకుండా వచ్చారని తలంచవద్దు. అక్కడ పవిత్రమైన వాతావరణము ఉండబట్టి వారు వచ్చారు. మనము అంతకంతకూ ఎక్కువగా దేవుని సన్నిధిలోగడుపుదాం. శుద్ధమైన మనస్సాక్షిని కాపాడు కోవడానికి నేను ఎల్లప్పుడు ప్రార్థన చేస్తాను. అలాగుచేయడం చాలా కష్టమైన పని. ఒక సంఘములో కోశాధికారిగా ఉండి పవిత్రమైన మనస్సాక్షిని కాపాడుకోవటం కష్టం. ఒక శుద్ధమైన మనస్సాక్షి ఉండడానికి మనము ప్రార్థన చేస్తున్నామా? అది ఎంతగొప్ప లాభము! నీవు దేవునిని పిలిచి నప్పుడు వెంటనే నీకు సహాయము చేయడానికి ఆయన అక్కడ ఉంటాడు. పరిశుద్ధమైన మనస్సాక్షిని కాపాడుకొనుటకు మనము ప్రార్ధన చేస్తున్నాము. నీకు ఏ భయము ఉండదు. నీతో ఎల్లప్పుడు ఆయన ఉంటాడు. ఎందుకు? నీవు మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానకి ప్రయత్నిస్తున్నావు.

పరిశుద్ధుడైన పౌలు అలాగు ఉండినాడు. సెర్గియా పౌలుతో అక్కడుండిన మాంత్రికుడు పౌలు యొక్క సేవను పాడు చేయవలెనని చూసినప్పుడు, పరి పౌలు నీవు గ్రుడ్డివాడవు కావాలి, అని చెప్పాడు. అలాగుననే జరిగింది. ఆయన ఎంతోధైర్య వంతుడిగా ఉండినాడు. మేజిస్ట్రేటు ముందు ''నేను మంచి మనస్సాక్షి ఎల్లప్పుడూ కాపాడుకొంటిని.'' అని ప్రకటించాడు. నీ పిల్లలుబడి నుండి తిరిగి వచ్చినప్పుడు నీ యిల్లు పవిత్రముగా ఉండనీ. అప్పుడు చీకటి శక్తులు పారిపోతాయి. మనలో ఏ దాచబడిన పాపం ఉండకూడదు. మన తల్లిదండ్రులు పాపము దాచిపెట్టారు. అందుకే మన గృహములు చీకటితో నిండి ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ గృహములు శుద్ధీకరించుచున్నారు. ఒక పవిత్రమైన వాతావరణములో జీవించడం నేర్చుకున్నావు. ప్రార్థన బైబిలు పఠన ఆ వాతావరణాన్ని సృజింప నియ్య. ప్రభువుని శుద్ధీకరించటానికి తరుణమిమ్ము. నీలో ఎల్లప్పుడు శుద్ధమైన మనస్సాక్షి ఉండనిమ్ము.

మూల ప్రసంగాలు