లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

యజమానుని ఉపయోగమునకు తగినట్లుగా

కీ.శే. యన్‌. దానియేలు గారు

2 తిమోతి 2:21

''ఎవడైననూ వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల, పరిశుద్ధపరచబడి యజమానుడు వాడు కొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు స్ధిపరచబడి ఘనతనిమిత్తమైన పాత్రయై యుండును''.

మీరు ప్రార్థన చేసి దేవుని వాక్యము చేత శుద్ధీకరించబడుతూ ఉండగా నీవు సాక్ష్యమిచ్చి ప్రభువుకొరకు సేవచేయడానికి మార్గము తెరవబడుతూ ఉంటుంది. నిన్ను నీవు ప్రధానముగా ఉండుటకు ముందుకు తోసుకొనవద్దు. నీ ప్రార్థన ఎన్నడైనా వ్యర్థముగా పోతుందని తలంచవద్దు. నేను యౌవన దినములలో చేసిన ప్రార్థనలు బహుతేటగా నెరవేర్చబడుట చూస్తున్నాము. పరిశుధ్ధమైన జీవితం జీవించడానికి నా యౌవన దినములతో నేను పడిన ప్రయాసకు తగిన జవాబు ఇవ్వబడింది. దేవుడు మనయందు బహు జాగ్రత్తగా ఆశకలిగి యున్నాడు. ఒక దినాన్న దేవుడు నిన్ను వాడుకుంటాడు, తరతరములకు గొప్ప సాక్ష్యముగా ఉండునట్లు దేవుడు ఈ సహవాసమును ప్రత్యేకమైన రీతిలో నిర్మిస్తూ ఉండినాడు.

''నీ యౌవనేచ్చలను విసర్జించి పారిపొమ్ము''. దేవుడు మనకు మన తలంపులలోనూ జయము ఇవ్వలెనని కోరుతున్నాడు. ఒక గుంపు ప్రజలు ఆ విధముగా జీవించినట్లయిన అనేకులకు ఆత్మీయ ఆశీర్వాదము తేవడానికి గొప్పశక్తి విడుదల చేయబడును.

నీవు మారుమనస్సు పొంది ఉంటే నీవు యోర్ధాను వైపుకు నడిచి వెళ్ళతావు. యోర్ధాను స్వార్ధ జీవితమునకు మరణము, యోర్ధానుదాటి వెళ్ళితే వాగ్దానదేశము వస్తుంది. వాగ్ధాన దేశములో ప్రవేశించి నీవు దానిని నీ స్వంతము చేసుకోవాలి. మన ప్రార్థన గుంపులో ఉండే ప్రతివారు మారుమనస్సు పొందవలెనని జాగ్రత్తతీసుకుంటాము. ఐగుప్తులో ఉన్నవారు ఇంకా ఎవరూ అక్కడలేరు. ప్రార్థనచేసే వారు మట్టుకే దేవుని రాజ్యము కొరకు ఏ గొప్ప విషయము అయినా చేయగలరు. దేవుని వాక్యమును పఠించు.

హెబ్రి 4:1 ''ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైననూ ఒక వేళ ఆ వాగ్దానము పొందక తప్పిపోవునేమోయని భయము కలిగియుందము''. మనము పరిశుద్ధత కొరకు పవిత్రకొరకు పోరాడునప్పుడు మనము వాగ్దానమును ఇప్పుడు స్వతంత్రించుకున్నాము అని చెప్పే స్థానమునకు రావాలి. ఒక వాగ్ధానము మనకు ఇవ్వబడింది కానీ దానికి మనము అసంతృప్తి చెందవచ్చు. దేవుని ఏర్పాట్లు మన మనస్సులో ఊహించగలిగిన దాని కన్నా చాలాగొప్పది. ఆయన వాటిని మనయందు నెరవేర్చవలెనని చూస్తాడు.

మూల ప్రసంగాలు