|
నా ప్రార్ధనా మందిరము
|
కీ.శే. యన్. దానియేలు గారు |
యోహాను 2:13-16
''వీటిని ఇక్కడినుంచి తీసుకొని పొండి. నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి''.
యేసు కానాను నుండి యింత దూరం వచ్చాడు. అక్కడ ఆయన యెరూషలేములో మొట్టమొదటి అద్భుతక్రియ చేసాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించవలసి వచ్చినది. అక్కడ ఉండే పరిస్థితిని చూసి చాలా విచారించాడు. ఈ దేవాలయము మన హృదయమునకు గుర్తుగా ఉంది. మనము అనేకసార్తు యేసుప్రభువును మన హృదయంలోనికి రమ్మని ప్రార్థిస్తూ ఉంటాము, ఆయన అక్కడకు రావడానికి సంతోషిస్తాడు. యెరూషలేములో ఉన్న అన్ని స్థలములలో క్రీస్తు దేవాలయములో ప్రార్థన చేసే అవసరం వచ్చింది. ప్రార్ధనలో మనము దేవుని మనస్సు తెలుసుకుంటాం. మనం ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చి క్రమేణా దేవుని తలంపులు మనలో పెడుతుంటారు. దేవుని తలంపులు నీవు ఎరుగకపోతే నీవు ఎక్కడకు వెళ్ళుచున్నావో నీవు ఎరుగవు. దేవాలయములో వ్యాపారం జరుగుతూ ఉండింది. అక్కడ ఉండిన మతబోధకులు అలాంటి వ్యాపారం యొక్క ఫలితము దేవాలయంలో ఎరుగకుండిరి. క్రీస్తు ఈ దేవాలయమును సంపూర్ణముగా నాశనం చేయబడే కాలము వస్తుందని యెరుగును. క్రీస్తుకు మట్టుకే ఈ విషయము తెలుసును. శిష్యులును దానిని ఎరుగరు గనక దేవాలయమును అభినందించుచూ ఉండినారు. క్రీస్తు అక్కడ గొడ్లను, రూకలు మార్చువారిని చూచాడు. అది ఎక్కువగా డబ్బు సంపాదించే స్థలముగా మారిపోయింది. మన సహవాసము డబ్బు కొరకు ఉన్నదని ప్రజలు తలుస్తారు. లేదు. దురదృష్టవ-శాత్తుగా ఈ దినమునకు కూడా దేవాలయములు ధనార్జన కొరకు ఉన్నాయి అని అనుకుంటారు. మనము ఇక్కడ దేవునికి విధేయులు అగుటకును ఆయన ఉద్దేశములు నెరవేర్చుటనూ ఉన్నాము. మన దగ్గర డబ్బు ఉన్నా లేక పోయినా మనము విధేయులు అవుతూ ఉంటాము. అప్పుడు దేవుడు అవసరమయిన డబ్బును పంపిస్తాడు. దేవాలయమును, ధనార్జన నిమిత్తము వినియోగించుచూ ఉండినారు, దేవాలయము యొక్క విలువ పోయింది. అక్కడ ప్రత్యక్షతలు ఏమీలేవు. క్రీస్తు గొడ్లన్నిటినీ తోలివేసి రూకలు మార్చువారి బల్లలు పడద్రోసెను.
ఆత్మీయ జీవితమునకు అడ్డముగా ఉండే అనేకమైనవి మన హృదయము నిండా ఉన్నాయి. దేవాలయములో ప్రార్థన లేదని యేసు చూసినాడు. దేవాలయములో ప్రభువు ఉండినారు కానీ వారు ఆయనను గుర్తు పట్టలేదు. వారు ఉద్దేశ పూరితంగా సిలువకు కొట్టారు. అప్పుడు దేవాలయము పూర్తిగా నాశనము చేయబడింది. గత రెండు వేల సం||లలో అది తిరిగి నిర్మించబడలేదు. యెజ్రా 10:1, ''ఎజ్రా యేడ్చుచూ దేవుని మందిరము యెదుట సాష్టాంగపడుతూ పాపము నొప్పుకొని ప్రార్థన చేసెను. యిశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు గొప్ప సమూహము అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చిరి''. మన యొక దేవాలయమును కట్టినప్పుడు నీవు ప్రార్థనద్వారా దానిని కట్టాలి. భార్యభర్తలు యిరువురూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు గొప్ప ప్రత్యక్షతలు వారికి దారుకుతాయి.
క్రీస్తు ఆ రాతి మీద దేవాలయము నిలువదని చెప్పినప్పుడు వారు గ్రహించలేదు. ఈ విషయములను మనము గ్రహించుకోలేము. ఇతర లెక్కలు మన హృదయములోనికి వచ్చాయి - డబ్బు, గొడ్లు, మరియు బంగారం. మనము పిల్లలను గురించి ఆలోచించినప్పుడు, డబ్బే మనకు జ్ఞాపకం వస్తుంది. వారికి కావలసినంత డబ్బు వచ్చే విధముగా మనం వారికి అవి, ఇవి ఇస్తుంటాము. దేవుడు వారిని దీవించగలిగే చోట వారిని పెట్టము. ప్రార్థనకు సమయము లేదు. దేవుని ప్రత్యక్షతలకు సమయము లేదు. దేవాలయములో ఇలాంటివి జరగడానికి సమయములేదు. కనుక దేవుడు దానిని నాశనము చేయబడనిచ్చాడు. దేవుడు వ్యక్తుల వైపుకు, కుటుంబముల వైపుకు ఫెలోషిప్‌ల వైపుకు దేవాలయముల వైపుకు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ వీరికి ప్రత్యక్షత ఏ మాత్రము ఉన్నది? ప్రత్యక్షత ఎక్కడ లేదో అక్కడ నాశనం వస్తుంది. సామెతలు 29:18
''దేవోక్తిలేని యెడల జనులు కట్టులేక తిరుగుదురు''.
|
|