|
అధికారమునకు లోబడుట |
కీ.శే. యన్. దానియేలు గారు |
రోమా 13
''ప్రతి వాడును పై అధికారులకు విధేయులు అవ్వాలని మనము నేర్పించబడ్డాము. అప్పుడు ఉండిన ప్రభుత్వమునకు ప్రభువుకూడా ఏ విధముగానూ జోక్యము కలిగించు కోలేదు. ప్రభుత్వములో ఏదైనా పొరపాటు ఉంటే తన రాజ్యము దానిని నిశ్చయముగా పడద్రోయును. 400 సం||లో లంచగొండి తనం కలిగిన రోమా గవర్నమెంటు పడిపోయింది క్రైస్తవులు ఆ దేశ ప్రభుత్వమును తీసుకోవలసి వచ్చింది. ఆత్మీయ అంతస్థులు సరిఅయిన రీతిలో కాపాడబడితే దొంగ అంతస్థులు అన్నీ క్రింద పడదోయబడతాయి. కనుక మనము ప్రభుత్వముతో పోట్లాట పెట్టుకొనకూడదు, ప్రభుత్వమునకు నడుపగల క్రమమైన పద్దతిని ఏర్పాటు చేయాలి. అది సరిఅయిన పద్దతిలోనయిన సరే. దొంగపద్దతిలోనయినా సరే. మనము ప్రభుత్వముతో కాదు పోట్లాడవలసినది కానీ మానవ స్వభావముతో, క్రీస్తు మానవ స్వభావమును తీసివేసి దాని స్థానములో దైవ స్వభావము పెట్టాడు. క్రీస్తు కప్పము చెల్లించుట మానివేసే దాన్ని అభివృద్ధి పరచలేదు. కానీ ఆయన అన్యాయపు రోమా ప్రభుత్వమును, మురికి యూదా సంఘమును పడద్రోయడానికి విత్తనములు విత్తాడు. భారతదేశములో మిషన్ ప్రాంతాలను చూస్తే దైవజనులు లేరు. కలహించే పద్దతులను ఉపయోగించేవారు అత్యున్నతమైన స్థానమునకు వెళ్ళతారు. వారు క్రైస్తత్వమునకు మార్పు చెందినారు కనుక వారు మిషన్లలో కొనసాగుతారు. వారి నుండి మంచి ఏ మాతమ్రు రాదు. వారు దేవుని వాక్యము నమ్మరు. యధార్ధతే సరి అయిన పద్దతి అని వారికి చెప్పితే వారు దానిని నమ్మరు. వేషధారణయే అతిశ్రేష్టమైన ఈవులను ఇస్తుందని వారు మనకు చెప్పుతారు. కనుక నిజముగా నీతిమంతులైన వారు మిషన్లలో కొనసాగలేరు. పరిస్థిలులు ఈరీతిగా ఉన్నప్పుడు భారత సంఘానికి నిరీక్షణ ఎక్కడ?
ఆయన బోధించుచున్న వాక్యము తిరుగుబాటును తెస్తుందని క్రీస్తు ఎరిగియున్నాడు, మనం సత్యమును తెలుసుకొని దానికి విధేయులమై సత్యమును నేర్పించినట్లయితే తిరుగుబాటు తప్పక వస్తుంది. సువార్తను ప్రజలకు ఇవ్వాలి. ఒక రక్షకుడు పాపులకొరకు మరణించాడు. సువార్తను ఇవ్వకుండా మీరు మేలుచేయ లేరు.
మన బంధువులకు లొంగిపోయి మన ఆత్మీయ జీవితమును నష్టపరచుకున్నప్పుడు అది ప్రేమకాదు. మనం సంఘం నిమిత్తము భారముకలిగి ఉంటే ప్రభువును ప్రేమించే కొంతమందిని పట్టుకొని ఒక కదలిక తీసుకురావాలి. ఈ ప్రజలు సువార్తను నమ్ముతారు. నీ హృదయములోనికి ప్రభువు జీవితమునకు పనికి వచ్చే నిజమైన సిద్ధాంతములను విత్తుతున్నాడు. మారు మనస్సుగూర్చి మాట్లాడవద్దని చెప్పే బంధువులు నాకు ఉండినారు ఇప్పుడు వారు తొందరలో పడియున్నారు. వారి బిడ్డలు ఎదిగి ఉన్నారు. వారిని అదుపులోపెట్టలేక పోవుతున్నారు.
ఏ వ్యక్తికి నీవు దేనినీ అచ్చియుండ కూడదు. ప్రేమను తప్ప - మన యజమాని యొక్క లెవల్‌కు మనం అందుకోవటం చాలా కష్టంకానీ ఆయన కృపనిస్తాడు. మోషే తన యెదుట ఉండిన గొప్ప పని విషయమై నిరుత్సాహపడలేదు. ఆయన పొదలో చూసిన వాని యందు విశ్వాసముంచాడు - ''నేను ఉన్నవాడను అనువాడను, నీ యిరుగుపొరుగున ఉన్నవారి కొరకు ప్రార్ధనచేయి, నీపైనున్న వారి కొరకు నీతో కలిసి పనిచేసేవారికొరకు కలిసి ప్రార్థనచేయి. లేకపోతే సైతాను వారిని నీకు వ్యతిరేరముగా త్రిప్పుతాడు. పెద్ద ఆఫీసర్లను చూసి భయపడవద్దు. నీకు దొరికిన వెలుగును నీకు అవకాశం దొరికినప్పుడు వారి మీద ప్రకాశింపచేయి. ఆదైవ స్వభావములో మనము పెరుగుదాము. ఇది గొప్ప పరిణామము తీసుకువస్తుంది. అప్పుడు తప్పుడు భక్తి ప్రభుత్వములు క్రీస్తు యెదుట విరిగి పడి పోతాయి.
|
|