|
మన అనుభవము ద్వారా బోధించుట |
కీ.శే. యన్. దానియేలు గారు |
2 పేతురు 2 : 12-22
భక్తిలో ఉన్నతమైన విషయముల గురించి మాట్లాడి దానిని అనుసరించనటువంటి ప్రజలు ఉన్నారు. అది ఒక అబద్ధము అవుతుంది. మన ఆత్మీయ అనుభవము గురించి మనము అత్యధికముగా చెప్పితే అది తప్పు. సైతానుకు అది తెలియును. దీని వలన వాడు తన శక్తిని నీ మీద ప్రయోగిస్తాడు. నీ అనుభవమునకు మించిన విషయాలు మాట్లాడవద్దు. దీని ద్వారా తిరిగి అనేకమంది పాపములో పడిపోయారు. మనుష్యులు వారివలన తప్పుగా నడిపించబడుతున్నారు 2 పేతురు 2:18 ''వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచూ, తామే శరీర సంబంధమైన దురాశలుగవారై, తప్పుమార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టలు చేత మరలు కొల్పుచున్నారు''. వీటిని తప్పించుకొనిన కొందరు గొప్పగా తమ గురించి చెప్పుకునేవారిని బట్టి మోసపోతున్నారు. మన సహవాసంలో కొందరు ఈ రీతిగా పొరపాటులు చేసారు. వారు సంపాదించుకొనని ఉన్నతమైన అనుభవమును గూర్చి కొన్ని గుంపుల వారు మాట్లాడతారు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో మనం జాగ్రత్తగా ఉండాలి. సకల ప్రజలు నిన్ను సరిగా నడిపించరు. కొంతమంది నన్ను అడిగారు, ఈ సహవాసంలోనే మేము ఉండాలా? మేము ఇతరుల దగ్గరనుండి మంచి విషయాలు మేము నేర్చుకోలేమా? నేను వారికి చెప్పిన ఒకే ఒక విషయం ఏమిటంటే, ''ఈ సహవాసములో నీవు తప్పిపోతే మేము నిన్ను దిద్దుతాము''.
జాగ్రత్త ! దేవుని వాక్యములో లిఖించబడిన విషయములు మనుష్యులు నమ్మకుండా చేయడానికి సైతాను మనలను పూర్తిగా విఫలులనుగా చేసి మనలను ఒక దృష్టాంతముగా చూపెడుతాడు. నేను సుందర్‌సింగ్ గారి వద్దకు వెళ్ళినప్పుడు కూడా దేవుడు నాతో ఇలాచెప్పాడు, ''నీవు నా సేవకుడవని జ్ఞాపకముంచుకో. నీవు నా చిత్తముచేయాలి''. ఇది సుందర్‌సింగ్‌కు వ్యతిరేకమయినంటి హెచ్చిరిక కాదు. ఆయన నన్ను ఖచ్చితముగా నడిపించాడు. కానీ నా ఆ శక్తి నడిపించబడాలి. నా గురి తిరిగి నిశ్చయం చేయబడాలి. కొంతమంది చక్కగా బోధిస్తారు. కాని నీవు వారి లోతును ఎదగాలి. యౌవనస్థుడైన ఒక ఔత్సాహికుడు తన అంతస్థుకు మించి బోధించగలడు. మనము ప్రభువు దగ్గరనుంచి వర్తమానములు అందుకోవాలి. నీవు ఆ వర్తమానము ఇచ్చిన తర్వాత నీ జీవితంలో ఇది సత్యమా అని గమనించాలి. మనుష్యులు గొప్పవాక్కులు మాట్లాడవచ్చు, కాని వాళ్ళు నీళ్ళు లేని బావులు, అప్పుడు దేవుడు గాడిదలను అలాటివారితో మాట్లాడటానికి వినియోగించుకుంటాడు. సైతాను అలాటి బోధకుడ్ని పట్టుకోవడానికి కాచుకొని ఉంటాడు.
బిలాము తన లాభము కొరకు ప్రవచించాడు. వీటిలో ఎల్లప్పుడు శరీరమునకు ఒక భాగము ఉన్నది. ''నేను'' అనేవాడు పూర్తిగా అణగగొట్టబడాలి. అవ్వ యొక్క శరీరాశ దేవునితో ఉండే సహవాసాన్ని పాడుచేసింది. దేమా కూడా ఈ లోకమును ప్రేమించి దేవున్ని విడిచి పెట్టాడు. ఈ సహవాసములో అనేకమంది గొప్పవారు కావలెనని మిమ్మును విడిచిపెట్టారు. వారి ఉద్దేశము తప్పు. వారు లోకములోనికి వెళ్ళి పేరాశలో మునిగిపోయారు. మన ఆత్మీయ అనుభవము గూర్చి జాగ్రత్తగా ఉందాం. మన అనుభవమునకు పైగా మాట్లాడకూడదు. మన అనుభవమును గూర్చి గొప్ప చెప్పకొనకూడదు.
మీరు గొప్ప పరిశుద్ధుల అనుభవముల గూర్చి మాట్లాడవచ్చును. కానీ దానిని దర్శించునప్పుడు ఒక బోధకుని సామాన్య అనుభవమువలే వినే వారి యొక్క అనుభవము వలే దానిని ప్రకటించాలి, ప్రసంగము అయిపోయిన తర్వాత బోధకులు ఆ అనుభవము కొరకు ప్రార్థించాలి. మనము కక్కివేసిన దానిలోనికి తిరిగి నడిపించాలని సైతాను కోరతాడు. యౌవనస్థులు దిద్దుబాటులు అందుకోవాలి. లేక పోతే మనలను దిద్దేవారు లేకపోయే సమయం వస్తుంది.
|
|