|
మంచి వార్తను ప్రచురింపజేయుట
|
కీ.శే. యన్. దానియేలు గారు |
యెషయా 52:7,8
''సువార్త ప్రకటించుచూ సమాధానము చాటించుచూ, సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందములైయున్నవి, ఆలకించుము నీ కావలివారు పలుకుతున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యోహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు.''
'' నీ దేవుడు ఏలుచున్నాడు''. అని మనము చెప్పగలమా? ఆయన గొప్పవిజయశాలి. వాటర్లూ యుద్ధాన్ని బ్రిటిషు వారు గెలిచినప్పుడు గొప్ప సమస్యల్ని ఎదుర్కొన్నారు. వార్త ఇంగ్లాండు దేశమునకు చేరింది. రహదారుల మీద పరుగెత్త బండ్లు ఆ ఒక స్థలంనుండి మరియుక స్థలమునకు తీసుకొనిపోబడింది. ఆ దినములలో ఉత్తరాలు మోసే బండ్లు ఉందేవి. ఈ బండ్లు ఒక స్థలంనుండి మరియొక స్థలమునకు పరుగెత్తుకుంటూ వెళ్ళేవి. వారు వెళ్ళేటప్పుడు విజయమును చాటించుకుంటూ వెళ్ళేవారు. ఈ బండ్లను లాగే గుర్రాలను ఒక స్థలం నుండి మరియెక స్థలానికి మార్చేవారు. వార్తలు అందటం ఆలస్యం కాకుండునట్లు గుర్రములు అలసిపోయినప్పుడు వేరే గుర్రాలను తరలించేవారు. శుభవార్త! మీరు ఇతరులకు ఇవ్వడానికి మంచి వార్త నీ దగ్గర ఉన్నదా. నీవు విశ్వసించిన ప్రభువు ఏలుతున్నాడు! ఈ విజయమును గూర్చిన వార్త ప్రచురించబడింది. ఎందుకనగా వియజమును గూర్చిన వార్త ప్రతి ఆంధ్రదేశస్థునికి ఆ విజయములో ఒక భాగము ఇస్తుంది.
మీ రాజు ఏలుచున్నాడని ఎరుగుదురా? దాని అర్థం ఏమిట? నీ ప్రార్థనలన్నిటికి జవాబు దొరికిందని అర్థం. ఈ మంచి వార్తను తెచ్చేవారి పాదములు సౌందర్యవంతములు. ఆయన రాజు! విజయమునీది. నీ దుఖములు ఏమైననూ సరే. మిషనరీలు ఈ మంచివార్తను లోకమంతటా తీసుకొనివెళ్ళారు. నీవు ఈ మంచివార్తను ఇతరులకు అందిస్తావా. లేక పోతేనీవే తప్పిపోతుంటావా?
నిజమైన ప్రతి సువార్తికుడు ముందుకు వెళ్ళేటప్పుడు తన పాదముల జాడను విడిచిపెడతాడు. ఆ విజయవంతమైన హృదయం నీకున్నదా? అప్పుడు నీవు నీ పాద జాడలను నీ వెనుక విడిచిపెట్టి వెళ్ళతావు. చైనా దేశములో పాస్టర్ షి గారి దినములలో ప్రజలు ఆయనను అడిగారు, మీరు మున్సిపల్ ఛైర్మన్‌గా ఉండండి అని. ఆయన చెప్పేది అంతా ఏమి చెప్పితే అది చేస్తాము అని చెప్పారు. షి గారు వారి హిందూ దేవాలయములను మూసివేయమని చెప్పారు. వారు అలాగు చేసారు. ఆయన పాదముద్రను వెనుక విడిచివెళ్ళాడు. అబ్రహాము తన పాదముద్రను విడిచివెళ్ళాడు. ఆయన బిడ్డలు దానిలో నడిచివెళ్ళారు. శారా తన పాదముద్రను విడిచి వెళ్ళింది. రూతు తన పాదముద్రను విడిచి వెళ్ళింది. అప్పుడు ఆమె యొక్క మునిమనవడైన దావీదు వాటిని వెంబడించాడు. సువార్త పాదములు బరువుగా ఉంటాయి. అప్పుడు కొండలు లో బడును. ముద్రలు దానిపైన ఉండును. క్రీస్తు తన పాదముద్రలను ఎన్నటెన్నటికీ విడిచి వెళ్ళెను. నీవు ఆ పాదజాడలో నడిచి వెళ్ళుతూ నీ సిలువను మోసుకొని నీవు కూడా నీ పాదముద్రలను వెనుక వారికి విడి వెళ్ళాలి.
|
|