|
నిజమైన జ్ఞానము |
కీ.శే. యన్. దానియేలు గారు |
యెహెజ్కేలు 28:2-5
''నరపుత్రుడా, తూరు అధిపతితో యీ లాగు ప్రకటింపుము-ప్రభువగు యెహోవా సెలవిచ్చున దేమనగా - గర్విష్టుడవై నేనొక దేవతను, దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆశీనుడనై యున్నాను అని నీవు అనుకొనుచున్నావు; నీవు దేవుడువు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు, నీవు దాని యేలునకంటే జ్ఞాననవంతుడవు. నీకు మర్మమైనదేదియు లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యమునొందితివి, నీ ధనా గారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటిని. నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి.
ఇక్కడ తూరు అధిపతితో చెప్పుతున్నాడు. '' నీవు దాని యేలుకన్నా జ్ఞానివి'' దాని మేలు ఒక జ్ఞానిగా ఎంచబడినాడు. తూరు అధిపతి చాలా జ్ఞానముగలవాడు. ఎంతజ్ఞానం. అతడు ఐశ్వర్యవంతుడును, గర్విష్టుడును అయ్యేంత వరకు. తన జ్ఞానమంతా తన్నుతాను హెచ్చించుకోవడానికి తనను దేవునితో సమానుడిగా చేసుకోవడానికి వినియోగించబడింది. క్రీస్తుతో పోల్చుకుంటే ఎంత బేధము? పిలిప్పీ 2:6,7 ''ఆయన దేవుని స్వరూపము గలవాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను''. క్రీస్తు దేవునితో గల సమానత్వమును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన స్థానమును వదలిపెట్టి ఒక దీనుడైన మనుష్యుడైనాడు. సిలువ వలన వచ్చు మరణమును అంగీకరించాడు.
యెహోజ్కేలు 28:14 '' అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్టించబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి.'' దేవుని దృష్టిలో సైతాను పరిపూర్ణుడైన కెరూబుగా జీవించాడు. కాని అతడు దేవునితో సమానుడిగా ఉండవలెనని కోరినాడు. యెషయా 14:14 ''మేఘమండలము మీదికెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా'' గర్వము మొదటి దూతకు పరలోకపు గర్వమే అతని నాశనము. దేవుడు చాలా ఔదార్యము గలవాడు. మనకు ఆయన తనతో సమానత్వము ఇవ్వవలెనని కోరుతున్నాడు. సృజించబడినవారు ఆయనతో సమానులుగా ఉండుటకు పైకెత్తబడిరి. క్రీస్తు తన సమానత్వమును ఇచ్చివేయడానికి సిద్దముగా ఉండినాడు. ఆయన భూమి మీదకు వచ్చి ఒక పేదపశువుల పాకలో జన్మించాడు. దీనత్వము గొప్పతనానికి గుర్తు. క్రైస్తవత్వముపౖౖెకి విరోధ భావముగా కనబడి లోపల యధార్థ విషయములు గలది. క్రైస్తవత్వము ఇటింటి భక్తి. క్రీస్తుకొరకు తన జీవితమును పోగొట్టుకొనడానికి లోతుగా తగ్గించుకొనువాడు అత్యున్నతమైన పదవికి ఎత్తబడతాడు. తన భూ సంబంధమైన అవసరతలు బట్టి ఆలోచించక ఆయన రాజ్యమును వెతికేవాడు సమస్తమును పొందుతాడు. కానీ ఈ జ్ఞానము పూర్తిగా వ్యతిరేకమయినది. తూరు అధిపతి తనమట్టుకు తాను చాలా జ్ఞానముగా ఉండినాడు. దాని యేలు జ్ఞానము గలవాడు కానీ తన మట్టుకు కాదు. తూరు అధిపతి తనమట్టుకు తాను జ్ఞానముగలవాడు. ప్రతి దేవుని బిడ్డ నిజమైన జ్ఞానముతో నింపబడతాడు. ఈ జ్ఞానం ఒకనిని దీనునిగా చేస్తుంది. ధనము పేరు ప్రఖ్యాతులు ఎన్నడూ నిజమైన క్రైస్తవులకు గురులు కావు. ఫిలిప్పీ 2 : 11 ''దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతినామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.'' యేసునామమంత ఉన్నతమైన నామము మరి యొకటి లేదు. క్రీస్తు నామమునకు ప్రతి మోకాలు వంగును. ఒకానొక దినమున మనుష్యులు లోకరక్షకునిగా అంగీకరిస్తారు. నీవు నేను దేవుని వాక్యము బోధించుట వలన ఆ దినమును త్వరపెట్టాలి. ఆయనను నీ ప్రభువుగా అంగీకరించాలి. రక్షించబడినవారు అనేకులు తమ స్వంత ప్రభువులుగా కొనసాగుతున్నారు. వారు రక్షించబడ్డారు గానీ క్రీస్తు యొక్క ప్రభుత్వమును అంగీకరించలేదు. దాని యేలు జ్ఞానముగలవాడు. కానీ దేవునితో వ్యతిరేకముగా చెప్పడానికి గానీ కారణము అడుగుటకుగానీ తెగించలేదు. ఆయన దేవుని దగ్గర నుండి సలహాలు పొందునిమిత్తము తన్నుతాను కాపాడుకున్నాడు. అతడు తన్నుతాను నీతిమంతునిగా తీర్చుకొనుటకుగానీ, ఇతరులగూర్చి ఫిర్యాదుచేయడానికి గానీ తన మనస్సును కాలుచుండిన అగ్నినుండి రక్షించుటకు సమర్థుడు. లేకపోయినప్పటికీ ఓ రాజా మేము నీ ప్రతిమకు సేవచేయము. ''దేవుడు మనకిచ్చే జ్ఞానము మనలను దేవుని యెదుటను, మానవుల ఎదుటను దీనులుగా చేస్తుంది. ఎల్లప్పుడూ నేర్చుకోడానికి సిద్ధంగా ఉంచుతుంది. దేవుడు మనకు ఇచ్చే గుణలక్షణము మనలను ఎత్తైన ప్రాంతములోనికి ఎత్తుతాయి. ఒక దీనుడైన మనుష్యుడు లోకముకన్నా ఎత్తైన స్థలములో ఉన్నాడు. అతడు అంతకంతకూ ఎత్తైన స్థలానికి వెళతాడు. క్రీస్తు దీనుడై యుండినాడు. తన్నుతాను రిక్తునిగా చేసుకున్నాడు. నీవు పరలోకములోనికి వెళ్ళాలని ఆయన పశువులపాకలోనికి వచ్చాడు. నీవుమునిగిపోకుండునట్లు క్రీస్తు వచ్చాడు. పరలోకపు జ్ఞానముతోనూ, పరలోకపు కృపతోనూ మనము మునిగిపోకుండా పై కెత్తడానికి ఆయన వచ్చాడు. దేవుని కోర్కెలకు మనలను మనము అప్పగించుకోవాలి. మనము దేవునితో సమానులుగా ఉండడానికి తగిన జ్ఞానము మనకు ఉన్నదా? తక్కిన మనుష్యులకు సమానునిగా మనలను చేసుకోవడానికి తగిన జ్ఞానము మనలో ఉన్నదా లేదు! పెద్దవాళ్ళు పెద్దగానే యుండనీ. క్రీస్తు వంటి స్వభాము నీ గురిగా పెట్టకో. మనము ధనికులము అయ్యేటట్లు మనము గొప్పవారము అయ్యేటట్లు, జ్ఞానులముగా ఉండవద్దు. పేదరికములో సంతోషము ఉన్నది. కానీ దేవుడు మనకు ధనము ఇస్తే అది ఆయన రాజ్యమును వ్యాపింపచేయడానికి వాడాలి.
|
|