|
దేవుని నేత్రముల ద్వారా చూచుట |
కీ.శే. యన్. దానియేలు గారు |
మత్తయి 14 : 25-33
''గాలిని చూచి భయపడి మునిగిపోసాగి''. పేతురు యేసు వైపుకు ఎల్లప్పుడు అదే ధాటిగా చూడలేదు. అప్పుడప్పుడూ చూస్తూ ఉండేవాడు. క్రీస్తు ద్వారా గాలిని చూడలేదు. మన సమస్యలను క్రీస్తు ద్వారా చూడాలి. లేకపోతే మునిగిపోతాం. మన సమస్యలన్నిటినీ గ్రహించి వాటిని క్రీస్తు ద్వారా చూడాలి. ఇక్కడ ఒక పక్వము చెందని క్రైస్తవుడు ఉన్నాడు. అతడు విశ్వాసముతో నింపబడడం కన్నా ఉత్సాహముతో నింపబడ్డాడు. మన విశ్వాసము చాలా వరకు ఉత్సాహమే గనుక మనము పొరబడుచున్నాము. మనము ఇతరులను అనుకరించగోరుతాము. ఇక్కడ పేతరు క్రీస్తును అనుకరించాలని ప్రయత్నము చేసాడు. అది ఉత్సాహమేగానీ విశ్వాసము కానప్పుడు మనలను నిరుత్సాహపరచి నాశనం చేయడానికి సైతానుకు ఒక అవకాశం దొరుకుతుంది. కాని ఇక్కడ పేతురుకు కొంత విశ్వాసం ఉండింది. కనుక అతడు పూర్తిగా మునిగిపోలేదుస్కెవయ యొక్క పిల్లలు పరి. పౌలును అనుకరించవలెనని కోరినారు గానీ విశ్వాసమే లేదు. అపొ.కా. 19:15,16 ''అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, ఆ దెయ్యము పట్టిన వాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.'' వారు ప్రధాన యాజకుని కుమారులు గనుక వారు అపవిత్రాత్మల మీద అధికారం చేయాలని చూసారు కానీ అది సాధ్యం కాలేదు.
మనం చీకటి శక్తులతో చుట్టబడిన లోకములో ఉన్నాము. మన విశ్వాసమును పెద్దది చేయాలనుకున్నప్పుడు చీకటి శక్తులు మనలను జయించడానికి చూస్తాయి. పేతురు క్రీస్తువలె సముద్రము మీద నడవాలని కోరాడు. క్రీస్తు అతనిని ప్రోత్సాహపరిచాడు, కానీ గాలులు బలముగా వీస్తున్నందువలన పేతురు అంతకంతకు లోతుగా మునిగిపోసాగాడు. క్రీస్తు పాదములు మునిగిపోలేదు. పేతురు కేకలు వేసి చెయ్యెత్తి క్రీస్తును పిలిచాడు. క్రీస్తు అతనిని అవిశ్వాసి అని పిలవలేదు గానీ అల్పవిశ్వాసి అని పిలిచాడు, మనకు విశ్వాసం ఉంది కానీ అది అల్పవిశ్వాసమే. ఒకసారి క్రీస్తు పేతురుతో చెప్పాడు. ''ఇప్పుడు నన్ను వెంబడించలేవు. కాని తర్వాత నన్ను వెంబడిస్తావు''. పేతురు అప్పుడే క్రీస్తును వెంబడిస్తానని చెప్పాడు. అదే రాత్రి ఒక అమ్మాయి ప్రశ్నించిన తర్వాత క్రీస్తును ఎరుగనని చెప్పాడు. నీవు పదే పదే క్రీస్తు వైపుకు చూడు. ఆయన సన్నిధిని గూర్చిన గ్రహింపు నీకు ఎల్లప్పుడు దొరుకుతుంది. కొంతమంది నీతో చెప్పుతారు, ''ఒక తుఫాను చెలరేగుతుంది. నీవు ఎక్కడున్నావు? నీవు చెప్పవలసింది ''క్రీస్తు నాతో ఉన్నాడు నన్ను కదలమని క్రీస్తు చెప్పలేదు''. కొన్ని తొందరలు కొన్ని సార్లు చాలా పెద్దవిగా కనబడుతాయి. ఎందుకంటే క్రీస్తు ద్వారా వాటిని చూడడం లేదు గానుక. మనము పరిశుద్ధుల జీవితములు పరీక్షించినప్పుడు వారుపెద్ద తొందరలను అధ్బుతకరమైన విశ్వాసంతో ఎదుర్కొన్నారు. వారు మనలను సవాలు చేస్తారు.నీవు కొన్ని సార్లు క్రీస్తుకొరకు చిన్న విషయములను విడచిపెట్టటానికి ఇష్టంలేదు. మీ గృహములలో వచ్చేటటువంటి తొందరలు నీ గమనము అంతటినీ ఆకర్షిస్తాయి. దేవుడు నిన్ను, నీ బిడ్డను కూడా చూసుకోగలడనే గ్రహింపు నీకు ఉండదు. నీవు సిలువవైపుకు చూడవు. క్రీస్తు చెప్పాడు ''వారు నన్ను చంపిఉంటే మిమ్ముల్ని కూడా చంపివేస్తారు. కానీ ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి యున్నాడు. నా ద్వారాను నా సిలువ ద్వారానూ, నా శ్రమల ద్వారానూ నీకు వచ్చే శ్రమల వైపుకు చూడు. నన్ను ఒక తిండిబోతని, త్రాగుబోతని, దెయ్యము పట్టిన వాడని పిలిచారు.'' క్రీస్తు 40 దినములు ఉపవాసం ఉండినాడు అది తిండిబోతా. మనయొక్క శ్రమలను క్రీస్తు ద్వారా చూడగల్గితే అవి సూక్ష్మముగా కనబడతాయి.
ఒకసారి మేము సువార్త ప్రకటించడానికి బయలు దేరినప్పుడు గుంపులో ఒకడు అధికముగా తినడం వలన కడుపు నొప్పి తెచ్చుకున్నాడు. మేము అందరము ఆగాలని చెప్పాడు. ఎందుకు? అతనికి కడుపునొప్పి వచ్చింది గనుక, అతని కష్టమును గ్రహించి మా వంటవాళ్ళలో ఒకనిని అతనితో విడిచి పెట్టి బయలు దేరాము. మనము మనకు భోజనము సిద్దము చేసుకోగలమని చెప్పాను. అప్పుడు తుంపరలు పడడం ఆరంబించింది. సువార్త ప్రయాణాన్ని వాయిదా వేద్ధామని కుర్రవాళ్ళు చెప్పారు. స్వార్థపరత్వం! అయ్యో నేను బాధపడుతున్నాను! ఓ. నా బిడ్డ బాధపడుతుంది! వాటి వైపుకు క్రీస్తు ద్వారా చూడండి! లేకపోతే మునిగిపోతాం. యోహాను 17:23 ''వారియందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.'' క్రీస్తు తండ్రితో ఒక్కడైయున్నాడు. అతడు తండ్రి యందున్నాడు గనుక చాలా ధైర్యము వహించాడు. '' నావన్నియూ నీ వన్నియూ నావి''. క్రీస్తు అది చెప్పడానికి వీలైయుండాలని చెప్పుతున్నాడు. అతడు తండ్రితో ఏకమైయున్నాడు గనుక నీళ్ళపై క్రీస్తు నడిచాడు. అయ్యో మనం ఆయన నుండి వేరుగా ఉన్నాము. కొలస్సి 2 : 9, 10 ''ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివశించుచున్నది. మరియు ఆయనయందు మీరును సంపూర్ణులైయున్నారు; ఆయన సమస్త ప్రధానులకును, అధికారులకును శిరస్సై యున్నాడు.'' మనము ఆయన యందు సంపూర్ణులమై యున్నాము. ఎంతగొప్పవార్త. మనము సత్యముద్వారా పరిశుద్ధపరచబడవలెనని క్రీస్తు ప్రార్థిస్తున్నాడు. నీ ప్రార్థన దేవుని వాక్యముగా ఉండనివ్వండి. దేవుని ఆత్మవచ్చినప్పుడు ఏలీషాదాసుడు గుర్రములను దేవుని రధములను చూసాడు. అప్పటి వరకు శతృ సైన్యాలు అతనికి భయమును పుట్టించుచూ వచ్చినవి. పరిశుద్ధాత్ముడు మన మీదికి నచ్చినప్పుడు మనము కూడా వారిని చూస్తాము. మనము ఆత్మ ద్వారా వాటన్నిటీనీ క్రీస్తు ద్వారా చూసినప్పుడు మనకు వచ్చే తొందరలు స్వల్పమైనవిగా చూస్తాము.
|
|