లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ప్రభువును ఈ దినమే వెదుకు

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెషమా 55 : 6

ప్రజలు దేవుని వెదకడానికి ఒకటి ఏర్పాటుచేసుకుంటారు. ఈ విధముగా వారికి ఉన్నటువంటి ప్రశస్తమైన అవకాశమును పోగొట్టుకుంటారు. రేపటి సమయము ఎన్నటికీ రాదు. నేను ఒక దినము ఏర్పాటు చేసుకున్నాను. ఆయనను పిలిచాను. అది నా రక్షణ సమయము. ఆయన విని నన్ను రక్షించి ఇన్నిదినములు నిలువబెట్టినాడు. ప్రత్యేక కూటములను నీవు నిర్లక్ష్యము చేయవచ్చు. అక్కడ అనేకులు కూడుకుంటారు. దేవునిని పిలుస్తూ ఉంటారు. ఆయన సమీపములో ఉంటాడు. అది ప్రతియేడూ ఒకసారి జరిగే కార్యము అని అనుకోవచ్చు. ఇంకొక బోధకుని కొరకు వచ్చే సం|| కనిపెట్టవచ్చు. నీవు ఏర్పాటుచేసుకొన్నట్లుగా అది నెరవేరదు. ఒక ఆఫీసరుగారు ఎన్నడూ దేవునిని వెదికిన వాడు అతని జీవితములో అనేకమైన అద్భుతములు చూసాడు. అతని భార్య విడవ కుండా పట్టుకున్న రోగము స్వస్థపడింది. ఆయనకు ఒక తేలు కుట్టింది. ఆయనను అభిషేకించి ప్రార్థిస్తే స్వస్థత పొందాడు. ఆయన కుమార్తె మారుమనస్సు పొందినప్పుడు అతడు ఏడ్చాడు. ఈ భక్తి ఆయనకు చాలా ఎక్కువ అయిపోయింది. ఆయనకు దొరికిన ప్రశస్తమైన తరుణమును పోగొట్టుకున్నాడు.

నీ కోర్కెలు నీవు తిరిగి జన్మించితే అవి దేవుని కోర్కెలు అయి ఉంటాయి. వ్యర్థమైనలోకపు పాపపు తలంపులు నిన్ను వదలిపెడతాయి. ప్రభువును వెదుకు. దేవుని వెదకటానికి శ్రేష్టమైన సమయము ఏది. ప్రసంగి 12 : 1 ''దుర్దినములు రాకముందే - ఇప్పుడు వీటియందు నాకు సంతోషములేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే'', నీవు యౌవనస్థుడవైయున్నప్పుడు నీవు నీ దేవుని తెలుసుకోవాలి. యౌవన దినములే సరి అయిన సమయము. లోకము యొక్క పాపములు నీలోనికి రాకముందే. దావీదు తన గొర్రెలను, మేకలను మేపుతూ ఉండినప్పుడు తన వడిసెలతోనూ రాయితోనూ ఉండినప్పుడు అతడు ప్రభువును వెదికాడు. చిన్నపిల్లలైన మీరు దేవుడు మీ కొరకు దాచియుంచినది ఎరుగరు. దేవుడు మీ నిమిత్తము ఓ ఏర్పాటు కలిగిఉండినాడు. అది ప్రేమగల మనస్సుతో ఏర్పరచబడినది. నా బిడ్డలు యౌవనస్థులుగా ఉండినప్పుడే ప్రభువును తెలుసుకోవాలని కోరాను. నీవు ఆయనను ఎప్పుడైనా వెదికావా? ఆయనను కనుగొన్నావా? జక్కయ్య పాపముతో నిండినాడు, మోసముతోనూ ధనాపేక్షతోనూ నిండియుండినాడు. కానీ ఆయనను వెదికి కనుగొన్నాడు'' జక్కయ్యా నేనును నీతో నివాసము చేసి భోజనము చేయవలెనని కోరుతున్నాను.'' అని యేసు చెప్పాడు. ఆయన ఆ ఈ కుటుంబముతో భోజనము చేసాడు.

నీవు ఆయన వాక్యమును వినాలి. నీవు ఆయన వాక్యమునకు విధేయుడవు అయినప్పుడు నీ జీవితముకొరకు నిన్ను సిద్దపరుస్తాడు. దావీదు ఒక సింహమును, ఒక ఎలుగుబంటిని, గొల్యాతును కలుసుకున్నాడు. దేవుడు అతని శత్రవులను కలుసుకోవడానికి సిద్దపరిచాడు. శ్రేష్టమైన సంగతి ఏమంటే ఆయనను వెదకడం. ఆయన వాక్యములో ఆయనను వెదుకు. ప్రతీలైను ఆయన్ను గురించి, ఆయన రాజ్యము గురించి మాట్లాడుతుంది. ఒకానొకదినమున ఆయనతో నీవు కిరీటముధరించు కోవడానికి సిద్ధముగా ఉంటావు. ఆయన శ్రమలలో పాలు పొందడానికి భయపడి పారిపోవద్దు. దేవుడు తప్ప ఎవరునూ నీకు కావలిగా ఉండరు.

అనేక మంది నన్ను ఇతరదేశమునకు వెళ్ళి ఇంకా డీగ్రీలు సంపాదించుకోమని చెప్పారు. నన్ను ఒక పరిశుద్ధుని వైపు చూపించి ఆయన నాకు క్రీస్తును గూర్చి ఇంకా ఎక్కువగా నేర్పిస్తానని చెప్పితే నేను ఆయన దగ్గరకు ప్రయాణము చేయడానికి సిద్దంగా ఉంటాను. నా స్నేహితులు నాకు ఇంగ్లాండు / దేశం వెళ్ళమన్నప్పుడు దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చారు యెహెజ్యేలు 38:7.

ఒక పాస్టరుగారి భార్య ఖరీదయిన బట్టలు, బంగారమును ప్రేమించింది. ఆమె చనిపోతూ ఉండినప్పుడు వాటిని గట్టిగా పట్టుకొంది. ఆమె దేవున్ని ఎన్నడూ వెదకలేదు. కొన్నిసార్లు స్వస్థతనిమిత్తం దేవునిని వెదికింది. నీవు ఎన్నడైనా దేవునిని వెదుకుదువా?

క్రీస్తు పాదముల దగ్గరకు నిన్ను నడిపించాలని నేనుకోరుతున్నాను. నేను కనబడకుండా పోవచ్చు గానీ, క్రీస్తు నీకు సమస్తమును అయి ఉంటాడు. నీవు లోకమును ప్రేమించవు. లోకాశలనూ కలిగియుండవు దాని యేలు 1:8 ''రాజు భుజించు భోజనమును, పానముచేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొన కూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండు సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా'' నీవు చెప్పాల్సిందే. ''రేపు ఈ హృదయముతో దేవునికి ప్రార్థించాలా? దానిని నీవు ఉల్లంఘించకూడదు. నీ బిడ్డల కొరకు ఒక వర్తమానము ఉన్నదా? నీవు ఒక సినిమా చూడకముందు దానిలో నిజము ఉన్నదా అని నీవు అడుగుతావు. ఆ సినిమా నీ హృదయమును వ్యభిచారపు ఆశలతో నింపుతుంది. దానియేలు రాజు యొద్దనిలువబడి ఈ రీతిగా చెప్పాడు, ''రాజా నీవు చాలా గర్విష్టుడవు''. బెల్తాషాజరు (దానియేలు) గోడమీద రాతను చదివాడు, చెప్పాడు. ''నీవు నీ తండ్రి చంపబడబోతున్నారు? యోసేపు ఫరోయొద్ద నిలబడ్డాడు. నీవొక బోధకునిగా నిలబడి దేవుడు నీతో చెప్పు విషయములు తెలియపరుస్తావా, నీవు నీ ప్రిన్సిపల్‌గారి ఎదుట నిలువబడి దేవుని వర్తమానం ఆయనకు తెలియ పరుస్తావా?

ఇప్పుడే ఆయన్ను వెదక్కపోతే నీవు ఆయన దగ్గరనుండి ఒక నాటికి చాలా దూరములో ఉంటావు. ఒక ధనికుడు నరకంలో నుండి ఏడుస్తూ అబ్రహామును పిలుస్తూండినాడు. జవాబు ఏమంటే ''నా కుమారుడా లాజరును పంపడం అసాధ్యం''. ప్రజలు దేవుని వాక్యం వినడానికి రారు. స్వస్థతకొరకు వస్తారు. అలాంటి వారికొరకు ప్రార్థించుట నా పూచీకాదు.

ప్రజలు నీవు క్రైస్తవుడవు అనే విషయం తెలుసుకోవాలి. నీవు పేదవాడివి అయినప్పటికీ నీకు లంచం ఇవ్వలేమని వారు తెలుసుకోవాలి. ఒక కుర్రవాడు నన్ను తనయింటికి తీసుకు వెళ్ళి నా దగ్గర లెక్కలు నేర్చుకున్నాడు. నేను తరచుగా ఆయన యింటికి వెళ్ళవలెనని కోరాడు. మీ ఉనికి నా సహోదరుని మీద పనిచేస్తుంది. అతడు మంచివాడు అవుతాడు. ప్రజలు మీ జీవితాన్ని చూస్తారు అని అతడు చెప్పాడు. దేవుని తలంపులు మీ తలంపులు కాదు. నేను ఒక వ్యాపారస్థుడుని అవ్వాలని కోరాను. దేవుడు చెప్పాడు. ''అది నా తలంపుకాదు. కనుక ఈ వ్యాపారం మాని వెయ్యి'' నేను కళ నేర్చుకొని పెయింటింగ్‌ వేసేవాడిని. కొన్ని పరీక్షలు పాస్‌ అయ్యాను కూడా. దేవుడు దానిని నన్ను వదలిపెట్టమన్నాడు. తర్వాత దినములలో ప్రజలు చెప్పారు, ''ఒక మంచి ఉద్యోగాన్ని వదలి పెట్టావయ్యా చాలా విచారం''. కాని నేను చెప్పాను.'' డబ్బు పోనివ్వండి, నేను దేవున్ని కనుగొన్నాను. ఇప్పుడు వందలాది వ్యభిచారులు, త్రాగుబోతులు మార్చబడుతున్నారు. నీవు ఒక ఆత్మను మార్చగలవా? నా పెయింటింగ్‌లు ఒక్క ఆత్మను రక్షించునా? అక్కలు వారికి తమ్ముళ్ళుంటే ప్రీతి చూపిస్తారు. కానీ నీవు వారికి క్రీస్తునిచ్చావా? నీవు మంచివాటిని వారికి ఇచ్చావు. కానీ నీవు అతిశ్రేష్టమయినది వారికి ఇచ్చావా? నీవు ఇతరులకు దీవెనగా ఉండకుండా నీవు జీవించి ప్రయోజనం ఏమిటి?

నేను మారుమనస్సు పొందినప్పుడు నా తండ్రి చెప్పాడు '' దేవుడు నిన్ను జాగ్రత్తగా చూచుకుంటాడు''. దేవుడు నన్ను నడిపించి నాకు నేర్పిస్తాడు అని చెప్పాడు. నీవు అనేక పాపములకు దాసుడవు. త్రాగుడు, వ్యభిచారము, దుష్టమైన తలంపులు, ద్వేషము, ఇతర చెడులు, ద్వేషం, కోపము, అసూయ, నీ హృదయములో ఉన్నవి. అవి రోగములు తీసుకువస్తాయి.

దేవుడు సాలుకు ఒక నూతన హృదయం ఇచ్చాడు. 1 సమూ|| 10:9 సామెతలు 4:24. నీవు ఒక నూతన హృదయం సంపాదించుకుంటే దానిని బహుజాగ్రత్తగా కాపాడు. దానిని దేవుని వాక్యముతో నింపు. అనేక సం||లు నీవు నేర్పిన విషయాలు వారికి జ్ఞాపకం ఉంటాయి. నా విద్యార్థులు నాతో చెప్పారు'' అయ్యా మీరు సత్యము కొరకు నిలబడ్డారని మేము ఎరుగుదుము.''

దేవుడు తన బిడ్డలకు మర్యాద ఇస్తాడు, ఒకడు తన బిడ్డలను అజాగ్రత్తగా చూస్తే దేవుడు వారిని తీసుకొని వెళ్ళిపోతాడు.

విశ్వాసముగలవారికి మర్యాద ఇవ్వు. అది నీ అత్తగారుకావచ్చు, సోదరిగావచ్చు.

నీ పాపము కారినట్లుగా కనబడుతుంది. వాక్యము బైబిలులో చాలా భాగము చదువచ్చు. కానీ అది నీ హృదయములో ఉండదు. నీవు ఆ పాపము 40 ఏండ్లక్రింద చేసి ఉండవచ్చు. కానీ నీ హృదయము మీద వ్రాయబడియున్నది. తమ హృదయములో పాపమును యోచించువారు ఎన్నడు వర్ధిల్లరు.

మీలో అనేకమంది అన్యులబడిలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. క్రీస్తును చూపించు. యెషయా 55 : 5 నిన్ను ఎరుగని ప్రజలు నీ యొద్దకు వస్తారు. ఒక ధనికురాలైన హైందవ స్త్రీ మాయింటికి వస్తూ ఉండేది. ఆమె చెప్పింది. ''మాకు పెద్ద రాబడి ఉంది కానీ మేము సంతోషంగాలేము.'' మీ సంతోషానికి ఉండే రహస్యం ఏమిటి. కాబట్టి నా భార్య ఔ.జు. పరీక్షకు సిద్ధపడటం మాని వేసి ఆ హిందూస్త్రీకి బోధించండ ప్రారంభించింది. కీర్తనలు 130 : 4 దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. యెషయా 58:11 దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు! చెట్లు పాటలు పాడతాయి.

ప్రాథమిక పాఠశాలలో మట్టుకే చదువుకున్నామే ఆమె మారుమనస్సు పొందింది. ఆయన్ను వెంబడించే కొలది ఆయన నేర్పించాడు. పాదుర్లకు బోధించడానికి ఆమెకు దేవుడు ఒక తరుణం ఇచ్చాడు.

నీ హృదయములో గర్వమున్నది. అందుకొరకై నీవు దేవుని మఖమును ఎన్నడూ వెదకవు. నీ సమయమును వృధగా పోనివ్వవద్దు.

మూల ప్రసంగాలు