|
ఆమె తన గాడిద మీద నుండి క్రిందికి దిగి ఒక కోరిక కోరింది |
కీ.శే. యన్. దానియేలు గారు |
యెహోషవ 15 : 18,19
ఒక కోరిక కోరడానికై ఆమె గాడిద మీదనుండి క్రిందికి దిగింది. మనలో అనేకమందిమి గాడిదను ఎక్కితిరుగుతున్నాము. అది మనం ఏర్పాటు చేసుకున్నగాడిదయైతే, అది మనలోనికి గర్వం తీసుకువచ్చినది. నీవు అలాంటి గాడిద మీద కూర్చొని ఒక కోర్కెను కోరలేవు. నీ ప్రార్థనతో నీవు చూపించే తృప్తి నీ గాడిద అయి ఉంటుంది. నీవు క్రిందికి దిగాలి. మేము దర్శించిన అనేక స్థలములలో అనేక మంది తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించడం నేర్చుకున్నారు. తన కుమారుని విద్యకొరకు ఒకవ్యక్తి డబ్బు కొరకు ప్రార్థించడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరముగా దేవుడు అతనికి రెండువేల రూపాయలు పంపించాడు. అతనికి ఖ.జు. లో సీటు దొరక లేదు. కానీ వారు ప్రార్థించినప్పుడు సీటు దొరికింది. ఈ ప్రార్థనలు అన్నీ వ్యక్తి గతమైనవి. ఇది వారు తమ్మును గెలవడానికి లేక వారి ధౌర్భాగ్యమైన స్వభావమును గెలవడానికి కాదు. ఒకడు ఐగుప్తును విడిచి నంత మాత్రానచాలదు. ఒకడు వాగ్దానదేశం సమీపించేవరకు నడవాలి. అక్కడ అమాలేకీయులను ఎదుర్కోవాలి. అతడు హోరేబుకొండ దగ్గర నిలువబడి దేవుని ధర్మ శాస్త్రాన్ని పొందాలి. మరియు ఆయన వలన నేర్పించబడాలి. యీశ్రాయేలు హోరేబులో దేవుని మహిమను చూసింది. వారు దేవుని తిన్నగా వెళ్ళడానికి భయపడ్డారు. మరణిస్తామని భయపడ్డారు. తర్వాత వాగ్దాన దేశమును పరిశీలించి రమ్మని గూఢచారులను పంపించారు. వెళ్ళిన 12 మందిలో ఇద్దరు మట్టుకే ప్రభువును ఎరుగుదురు. తక్కిన 10 మంది భయంకరమైన చెడ్డవార్తను తెచ్చారు. సమూహమంతా ఏడ్చారు. వారు వాగ్థానదేశంలో ప్రవేశించడానికి అనర్హులు అని ప్రభువు చెప్పాడు. అప్పటినుండి అగ్నిమేఘం, వాగ్దాన దేశం నుండి వారిని నడిపించడం ప్రారంభించింది. ఏడ్చిన వారు అందరూ మరణించేవరకు 39 సం||లు అరణ్యంలో తిరుగుతూ ఉండినారు. సరియైన విశ్వాసపు మెట్టులేకపోతే వాగ్ధాన దేశములో ప్రవేశించలేరు.
కాలేబు కుమార్తె గాడిద మీదినుండి క్రిందికి దిగింది. ఇశ్రాయేలు వారిగాడిద మీద నుండి క్రిందికి దిగడానికి 39 సం|| పట్టింది. ఆమెకు దక్షిణ దేశం ఇచ్చిన వారి తండ్రిని ఇలాగు అడిగింది. ఆమెకు ఊటమడుగులు దయచేయమని అడిగింది. దేవుడు ఈ పట్టణములో అనేకమంది జనమున్నారని వాగ్దానం చేసాడు. ఆమె తండ్రి ఆమెకు మెరక మడుగులను, పల్లపు మడుగులను ఇచ్చెను. మన స్వార్థమునకు మరణించి దేవుని మహిమ యొక్కటే మనగురిగా పెట్టుకుంటే మనకు ఊటమడుగులు దొరుకుతాయి. దేవుడు మనకు వాటిని ఇవ్వవలెనని కోరుతున్నాడు. మన కూటములలో మారుమనస్సు పొందినవారు అనేక మంది అనేకమైన వాటి కొరకు దేవుని అడగడం మొదలు పెట్టారు. అవి అన్నీ ఈలోక సంబంధమైన ఆశీర్వాదులు వారికొరకు, వారి కుటుబంము కొరకు. నీవు దేవుని రాజ్యమును మొట్ట మొదట వెదుకు. వాస్తు సంబంధమైన దీవెన నీ కుటుంబము కొరకు, వారి కుటుంబముల కొరకు కావలెనని నీవు కోరితే దానికి లొంగవద్దు . కాని దేవుని రాజ్యమును వెదుకు, నీవు దేవుని రాజ్యమును కనుగొంటావు, ఆశ్చర్యరీతిగా నీ కుటుంబము యొక్క అవసరతలు గూడ తీర్చబడతాయి.
|
|