లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఆత్మీయ సమృద్ధి

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెషయా 13-15 పైన నుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడువరకు అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్ష వనముగానూ నుండును.''

రాబోయే దినములలో వచ్చుచున్న ఆత్మీయ సమృద్ధిగల కాలములను గూర్చి మాట్లాడుచున్నది. ఒక అరణ్యముగా తయారైన ఈ లోకము ఒక ఫలవంతమైన ఫలముగా మార్చబడుతుంది. ఇది విస్తారమైన విలువగలిగిన ఫలము కలిగి ఉంటుంది అని ఈ విధముగా దేవువు సెలవిస్తున్నాడు. ఈ కాంపౌండులో కొన్ని ఫలవంతమైన చెట్లున్నవి. కొన్ని వంటచెరుకుగా పనికి వచ్చే చెట్లున్నవి. మనుష్యులు తన శరీర సంబంధమైన ప్రయత్నముతో సాధించగల్గినదంతా ఒక కనిష్టమైన విలువ కల్గినది. అనగా అదివంట చెరకుగా ఉపయోగించే చెట్టంత విలువగలది. అన్యులు ఫలవంతముగా ఉండే విషయము దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు, కొర్నెేలి ఇంటిలో బోధించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిమీదకు దిగివచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఎండిపోయినచెట్టు పచ్చని చెట్టుగా మారుతుంది. విలువలేని చెట్టు ఫలవంతమైన చెట్టుగా మారుతుంది. ప్రతీది మారిపోతుంది. ఉజ్జీవము వచ్చినప్పుడు యౌవసస్థులు పరిశుద్ధ జీవితము జీవిస్తారు. వ్యాధిగ్రస్థులు స్వస్థతపడతారుపేదలు వారి అవసరతలో నుండి ఎత్తబడతారు. ఎఫెసీలోనూ, అంతి యోకయలోను, ధెస్సలోనీ కయలోనూ, కొరింథీలోనూ ఇంకా అనేకమైన అన్య పట్టణములలో సువార్త ప్రకటించబడినప్పుడు ఫలవంతమైన జీవితము ప్రారంభం అయ్యింది.

అనేక దేశములలో దుర్మార్గులను నీతిమంతులుగా తీర్చే తప్పుడు తత్వము ఉన్నది. నాయకుల హృదయాలను ఒక దురాత్మ నడిపించుచూ ఉన్నాడు. దేవుని ఆత్మవారిలో లేదు. జకర్యా 12:8 ''ఆ కాలమున యెహోవా యెరూషలేము. నివాసులకు సంరక్షుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తి హీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతివారు దేవుని వంటివారుగానూ, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగానూ ఉందురు.'' ఈ వాగ్దానముల యందు మనము నిలబడి వాటి నెరవేర్పుకు మనము చాలా దూరములో నున్నామని మనము కనుగొంటే మనము భూ సంబంధమైనవి వెదుకుతూ ఉన్నామని మనము గ్రహించాలి.

ఒక ఫలవంతమైన పొలము ఇంకనూ వృద్ధి చెంది ఆ ప్రక్కనున్న అరణ్యము కూడ ఫలవంతమైన భూమిగా మారును. నీవు ఇప్పటికే ఫలవంతమయి ఉండవచ్చు, కానీ నీ ఫలితము ఇంకనూ అభివృద్ధి చెందును. ఇది పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరుగుతుంది. నీలో ఉన్న మార్పును ప్రజలు చూస్తారు. నీవు మాట్లాడే మాటలు దేవోక్తులవలే మనుష్యుల హృదయములలో మ్రోగుతాయి. | పేతురు 4:11 '' ఒకడు బోధించిన యెడల దైవోక్తులను భోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తుద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక, ఆమెన్‌''. ఇది దేవుని యొక్క నిరీక్షణ. ప్రవక్తలు దేవోక్తులై యుండినాడు. కీర్తనలు 119:5-6 ''ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిననెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవ అవమానము కలుగనేరదు.'' 112వ ''నీ కట్టడలను గైకొనుటకును హృదయమును నేను లోపపరచుకొనియున్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్యనిర్ణయము''. కీర్తనల కర్త దేవుని వాక్యమునకు తన్ను తాను అప్పగించుకొని దేవుని వాక్యమునకు విధేయుడగుటకు ప్రయత్నిస్తున్నాడు. నీవు దేవుని వాక్యమునకు విధేయుడవు అగుటకు ప్రారంభించినప్పుడు నీకు భయము ఉండదు. నీవు మరణలోయలో సంచరించిననూ నీకు భయము ఉండదు. దేవుడు నీతో ఉన్నాడు. దేవోక్తులను వెంబడించు. నీ మట్టుకు నీవే ఒక ఉక్తిగా ఉండకూడదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీవు అది చేయగలుగుతావు. దేవుని యొక్క ఉక్తిగా మాట్లాడుట అది ఎంత ఆశీర్వాదము!

లక్షలాది యూదులను సంహరించిన ఐక్‌మైన్‌ చంపబడ్డాడు. అతడు కనికరము కొరకు వేడుకున్నాడు గానీ అతడు పశ్చత్తాపపడలేదు. అది హిట్లరు యొక్క తత్వము. అరణ్యములో న్యాయతీర్పు ఉండదు. బలమైన జంతువు బలహీనమైన దానిని చంపి తిని వేస్తుంది. మన దేశములలో కూడా ఇదే జరుగుతుంది. ధనికుడు పేద వానిని చంపి తినేస్తాడు.

అరణ్యములో సైతము నీతి ఉండునని దేవుడు సెలవిస్తున్నాడు. నీతి యొక్క ఫలితము సమాధానము. నీతి యొక్క ఫలము నిమ్మళత్వము, నిత్యము ఉండే నమ్మకము. మనము నిమ్మళత్వమును ఎంతగాప్రేమిస్తామో! మనము వృద్ధులము అయ్యేకొలది దానిని ఎక్కువగా విలువ చేస్తాం. మనకు నిమ్మళత్వం ఎక్కడ దొరుకుతుంది. అది మన హృదయముతో ఉండాలి. అప్పుడు అది ఇతరులకు వ్యాపిస్తుంది.

నీ వాక్కులు సమాధానము తెస్తుంది. అనేక జనాంగముల వరకు సమాధానము నిలిచియుండే కుటుంబాలను నేను ఎరుగుదును. పునరుథ్ధానపు పిదప అన్యజనులు 'పరిశుద్ధాత్మాను అందుకొన్నప్పుడు అరణ్యము ఒక ఫలవంతమైన ఫలముగా మారినప్పుడు జరిగే సంఘటనలు గూర్చి ప్రవక్తయైన యెషయా మాట్లాడుతున్నాడు.

మన మధ్య సమాధానము ఉండవలెను. యెషయా 44:3లో మనకు వాగ్దానములలో ఒకటి ఇవ్వబడింది. ఆ వాగ్దానములను స్వతంత్రించుకొనుటకు మనలో సమాధానము ఉండవలెను.

మూల ప్రసంగాలు