లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

ఖాళీస్థలములో నిలబడుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెహెజ్కేలు 13 :3-11వరకు, 5వ|| ''యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్దమందు స్థిరముగా నిలుచునట్లు మీరు గొడలలోనున్న బీటలు దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్ట పరచరు.''

మనము బీటలలో నిలవబడడానికి పిలవబడ్డాము. శ్రమ దినములలో ఒక క్రైస్తవుడు (ఖాళీస్థలములలో) బీటలలో నిలబడును. పరలోకపు సైన్యములు అతనితో ఉన్నాయి. అతడు ఎన్నడూ ఒంటరిగా లేడు. కనుక అతడు బీటలో నిలువబడి దేవుని కొరకు పోరాడును. అతని పోరాటము శరీర సంబంధమైన ఆయుధములతో కాదు. 2కొరింధి 10:4 ''మా యుద్దోపకర ణములుశరీర సంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి''. నిజముగా మార్చబడి, స్థిరపడిన క్రైస్తవుడు ప్రతి ఊహను క్రిందకు పడద్రోసి, క్రీిస్తు సిలువ పాదముల యొద్దకు తీసికొనివచ్చును. విశ్వాస సంబంధమేదైననూ నిత్యమైనది. దేవుని ఆత్మలో వచ్చే ప్రతి తలంపు నిత్యమైనది. మన యుద్దోపకరణములు ఏమియూ ఇహ సంబంధమైనవి కావు. మనము పగతీర్చుకునే ఆయుధములు మనము వినియోగించుకొనము. హానికరమైన ఆయుధములు అసలు ముట్టుకోనే ముట్టుకొనము.

రోమా 12 : 19 '' ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి - పగతీర్చుట నాపని, నేనే ప్రతి ఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడియున్నది.'' పగ తీర్చుకొనే ఆత్మ విశ్వాసపు పరిస్థితిని, ప్రార్థన శక్తిని నీకు దక్కకుండా చేస్తుంది. ఆది కాం|| 12:3 ''నిన్ను ఆశీర్వాదించువారిని ఆశీర్వాదించెదను, నిన్ను దూషించువారిని శపించెదను. భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వాదించబడునని అబ్రహాముతో అనగా''. దేవుడు సృష్టిని ఏలాగు నియమించాడంటే దీనులైన దైవజనుడు ఆశీర్వాదించే వారు. ఆశీర్వాదించబడతారు. క్రీస్తు చెప్పారు. నీవు ఒక గిన్నెడు చన్నీళ్ళు ఒక శిష్యునికి ఇస్తే నీవు దీవించబడతావు. పాపమును బట్టి సృష్టి మూలుగుచూ ఉన్నది. రోమా 8 : 22 ''సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని యెరుగుదుము.''

స్వభావికముగా మంచి వాటిని నాశనము చేసే తరంగములను ఒక పాపి పంపుతూ ఉంటాడు. చెట్టు వర్షపు మేఘముల మీద మార్పు కలిగిస్తుంది. ఒక వ్యక్తి నీతిమంతుడై అతని తలంపులలో పవిత్రుడుగా ఉంటే చుట్టూ ఉండే సృష్టి ఆశీర్వాదించ బడుతుంది. ఒక కుటుంబంలో దేవుని భయము ఉంటే సంతోషము వస్తుంది. వారు చాలా ధనికులు కాకపోవచ్చు. కాని వారు తృప్తి కలిగి ఉంటారు. దేవుని ఆశీర్వాదాలు నీ ఊహలకు వ్యత్యాసంగా ఉంటాయి. నీవు బీటలో నిలవబడతావు. దేవుని ఆయుధములతో పోరాడతావు. ఇది జరిగినప్పుడంతా నీవు సమాధానముగా ఉంటావు. నీకు సమస్తము దేవుడు చేయగలడు అనే విశ్వాసము నీకు ఉంటుంది. విశ్రాంతి గల హృదయమును మనకు దేవుడు ఇస్తాడు. ఆయన రెక్కల క్రింద నీకు పరిపూర్ణమైన కాపుదల నీడ ఉంటుంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము నీవు అనుభవిస్తావు.

మూల ప్రసంగాలు