లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

స్తెఫను విశ్వాసము శక్తితో నిండియుండుట

కీ.శే. యన్‌. దానియేలు గారు

అపో|| కా. 6 : 8

సైఫను కృపతోనూ, బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.'' ఆ దినములలో సేవవృద్ధి అయినకొలది శిష్యుల సంఖ్య పెరిగింది. వారు ప్రతివారి అవసరతలను తీర్చలేకపోయారు. గ్రీకుదేశస్థుల విధవరాండ్రులను చిన్నచూపుచుసారు. పరిశుద్ధాత్మతోనిండినవారైన ఏడుగురిని విధవరాండ్రను చూసుకొనుటకు ఏర్పాటు చేసిరి. వారిలో సైఫను చాలా ప్రాముఖ్యుడు. విశ్వాసముతోనూ శక్తితోనూ నిండుకొనిన వాడైయున్నాడు. నేను గ్రామములో బోధించునప్పుడెల్లా సైఫను గూర్చిన ఈ వివరణను చదివి ప్రార్థించేవాడిని. '' ప్రభువా నీవు సైఫనుకు సహాయము చేసినావు కదా - నాకునూ సహాయము చేయుము.''

ఒక సారి ఒక స్థలములో జరుగుతున్న హైందవ పండుగలో నేను బోధించుచుంటిని. క్రైస్తవులు ఆ స్థలములో బోధించకూడదని ఏర్పాటు చేయబడినది. అక్కడ అనేక కష్టములు వచ్చినవి. కానీ సైఫను విశ్వాసముతోనూ, పరిశుద్ధాత్మతోనూ నిండియుండినాడని నాకు జ్ఞాపకము వచ్చినది. నీవు యౌవనస్థుడివిగా విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండినవాడివని కనబడినప్పుడు, పూచీతో కూడినపని నిమిత్తము ఏర్పాటు చేయబడ్డావని కనబడినప్పుడు అది ఎంత ధన్యకరమైనది! సైఫను పని విధవరాండ్రకు డబ్బు పంచిపెట్టుట. డబ్బుతో పని అంటే ఇతర పనులకన్న గొప్ప పవిత్రతా అవసరము. మన మనస్సాక్షి మీద ఏ విధమైన మరక కనబడకూడదు. మనకు చాలా సున్నితమైన తేటయైన మనస్సాక్షి ఉండాలి. సైఫను ఆలాంటివాడు. యౌవనస్థుల మధ్య అతడు ముందుగా నడిచి వెళ్ళుతుండినాడు. మొట్టమొదట హత సాక్షియొక్క కిరీటం పొందాడు.

''సభలో కూర్చున్న వారందరూ అతనివైపు తేరిచూడగా అతనిముఖము దేవదూతల ముఖమువలే వారికి కనబడెను'' అ.కా. 6 : 15 అపో.కా|| 7:5, 59 పట్టణపు వెలపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్విచంపిరి. సాక్షులు పౌలు అను ఒక యౌవనుని పాదముల యొద్ద తమవస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచూ - యేసుప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని సైఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి.''

క్రీస్తును పోలి అతడు తన శతృవును క్షమిస్తూ మరణించాడు. అతడు పరలోక రాజ్యములోనికి ద్వేషముతోనైననూ, విరోధముతోనైననూ ప్రవేశింపకోరలేదు. పరలోకము అలాటి ఉద్దేశములను లోనికి తీసుకోదు. ఒక యౌవనస్తుడు పవిత్రమైన మనస్సాక్షి కలిగియుండి పరిశుద్ధమైన జీవితము జీవిస్తూ నిరాటంకముగా అతని విశ్వాసము ఎదుగనిస్తూ ఉండి ఉన్నట్లయితే పాపులను ఆకర్షించే శక్తి నింపబడినవాడై ఉంటాడు. స్వస్థపరిచే దేవుని శక్తితో నింపబడతాడు. నీ కనులు పరలోకపు శక్తిని ప్రకాశిస్తాయి. ఏడుగురు మనుష్యులను ఎన్నుకున్నారు. వారు స్త్రీలమధ్యను పనిచేయవలసి ఉండింది. అంతేకాక డబ్బుతో పనిచేయవలసి ఉండింది. ప్రభువు కొరకు సేవచేసేవారు ఈ రెండు అంశములలోనూ బహుజాగ్రత్తగా ఉండాలి. యౌవనస్థుడైన సైఫను ఇలాంటి పనికొరకై ఏర్పాటు చేయబడ్డాడు.

విశ్వాసముతోనూ ప్రేమతోనూ నిండిన సైఫను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. క్రైస్తవత్వమునే లేకుండా తుడిచిపెట్టవలెనని ప్రజలు ఆలోచిస్తూ ఉండినారు. దీనిని ప్రబలపరుస్తూ ఉండిన యౌవనస్తుని చంపుట ద్వారా నెరవేర్చవలెనని అనుకున్నారు. సువార్తను చంపలేరు. సైఫను యొక్క హతస్సాక్షి రక్తములోనుండి పౌలు ఉద్భవించాడు - అంతకన్నా గొప్ప వ్యకి. పరి. పౌలుకన్నా గొప్ప మనస్సు గలవాడు ఇంకొకడు లేదు. ఆ మనుష్యులు పట్టుకొనుట మాత్రమే కాకుండా దానిమీద పరిశుద్ధాత్ముడు క్రియచేసాడు. సువార్త నిమిత్తము నీవు త్వరగా చనిపోతే అనేక ఇతరులలో జీవిస్తావు. యవనస్థులారా మీరు జీవించే విధానము బట్టి జాగ్రత్త. క్రైస్తవ సంఘము ఏర్పాటుచేయగోరి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడా?

మూల ప్రసంగాలు