|
సమృద్ధి అయిన జీవము |
కీ.శే. యన్. దానియేలు గారు |
యోహాను 10:1-15. ''నేను గొర్రెల మంచికాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొఱ్ఱెలు నన్ను ఎరుగును.''
క్రీస్తు యొక్క గురి ఏమంటే మనకు జీవమును ఇచ్చుటకును, సమృద్ధియైన జీవమును ఇచ్చుటయే. బిడ్డలలో ఉండే జీవము అది సమృద్ధియైన జీవముకాదు. జీవము యొక్క గుర్తులన్నియూ ఉన్నవి కానీ మాట్లాడుటకు శక్తి లేనివారు. వారి అవసరతలను తెలుపలేరు. మనము ఆత్మయందు జన్మించినప్పుడు మనము కూడా అలాగే ఉంటాము. దేవుని రాజ్యము -నందు మనంబు చాలా ప్రయోజనకరము కాదు, కానీ మన అవసరతలు మనము ఎదుగుచూ దేవునికి తెలియపరుస్తాము. ప్రారంభములో మన ప్రార్ధనలు అంత సరిగా ఉండవు. కానీ మన హృదయమును మనము పరిశోధించుకొనిన కొలది ఉన్నతమైన వాటికొరకు, శ్రేష్టమైన వాటికొరకు మనము అడుగుతాము. ఆయన మనకు ఇచ్చే జీవము సమృద్ధి అయిన జీవము. కొన్ని సార్లు నూతనముగా మారుమనస్సు పొందినవారు, వారి ప్రార్థనలు వినబడుతూ ఉండడము గమనిస్తాము. లోకసంబంధమైన వాటికొరకు మనము అడుగుతూ ఉంటాము. వారిని గానీ, వారి బిడ్డలను గానీ దేవుని చేతులకు అప్పగించరు. హృదయములోనికిని, దేవుని వాక్యములోనికినీ వెతుక్కుంటూ వెళ్ళడం పుట్టుకతో వచ్చే గుణలక్షణం. జీవితము మానవ సమాజము యొక్క కొరతల విషయమై మొరపెడుతూ ఉంటుంది. పేదలను శ్రద్ధగా చూసుకుంటూ ఉంటారు. ఒకవ్యక్తి మార్పుచెంది అంతకంతకూ శ్రేష్టుడైతే అతడు లోకములోనికి అంతకంతకూ గొప్పదీవెనలను తెస్తాడు.
ఒక చిన్న కుర్రవాడు త్రాగుడు, పదార్థములను తయారుచేసే వానియొక కుర్రాడు మారుమనస్సు పొందాడు. బోధకుడిగా మారాడు. త్రాగుడు పదార్థములనమ్ముటలో అతని తండ్రి చేస్తున్న దుర్మార్గతను బట్టి అతడు వెంటనే బాధపడ్డాడు. ఈ త్రాగుడు అనే దెయ్యంతో పోట్లాడడానికి తన దగ్గర ఉండిన 1.5 లక్షల డాలర్లు వినియోగించాడు. అతని తండ్రితో నీవుచేసేది తప్పు అని చెప్పాడు. మనలో ఉండే జీవము సమృద్ధి అయిన జీవితమేనా? పోయిన సం|| కన్నా ఈ సంవత్సరము మరి ఎక్కువ సమృద్ధియైన జీవితమున్నదా? దేవుని ఆత్మ నిన్ను శుద్ధీకరించవలెనని కోరుతున్నాడు. నిన్ను తప్పుడు త్రోవపట్టించవలెనని విపరీతమైన ఆత్మలు పరిశీలించుచున్నవి. నీ కోర్కెలకు అనుకూలముగా అవి నిన్ను నడిపించగోరుచున్నవి. నీ మనస్సును ఆత్మీయమైన ముందడుగులో ఉంచు. ఇతరులను రక్షణలోనికి తెచ్చుటలో ఎంతవరకు నీవు ముందుకు సాగినావు.
క్రీస్తు మనమంచికాపరి. సమృద్ధియైన జీవము నీలో పని చేస్తుందా? అప్పుడు నీ జీవితము దిన దినానికి శ్రేష్టముగా మారుతుంది. క్రైస్తవత్వము మానవ సమాజమును మారుస్తుంది. మనము క్రైస్తవత్వమును చచ్చిన మతముగా మనము చేసి యున్నాము. మనము దేవుని బిడ్డలుగా పైకి లేచి మానవ సమాజములో ఉండే చెడుతనమునకు వ్యతిరేకముగా పోరాడకపోతే మన భక్తి వ్యర్థమే.
|
|