లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

హృదయములో దేవుని యొక్క లోతైన పని

కీ.శే. యన్‌. దానియేలు గారు

1యోహాను 3:21 '' మన హృదయము మనయందు దోషారోపణ చేయని యెడల దేవుని యెదుట ధైర్యముగల వారమగుదుము''.

మనము పశ్చాత్తాపపడుతూ క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్తాపముయొక్క వేరు వేరును మెట్ల లో మనము ఎక్కవచ్చు. మన మనసాక్షి మనలను ఏ మెట్టులో దోషారోపణ చేస్తుందో ఆ మెట్టు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆ మనసాక్షి క్రీస్తు వలన నడిపించ బడిదైయుండవలెను. హృదయము వెలిగించబడినప్పుడు పశ్చత్తాపము ఇంకనూ లోతుగా వెళ్ళుతుంది. దేవుని ఆత్మ నీయందు నివశించడం ప్రారంభిస్తాడు. మేము తిరిపుట్టినామని చెప్పుకొనే కొంతమందిలో పశ్చత్తాపము నామకార్థము మట్టుకే. అలాంటివారు వెనుకకు వెళ్ళిపోతారు. కానీ దేవుని ఆత్మ పశ్చాత్తాపము ఇచ్చినట్లయితే అది ఇంకనూ లోతుగా లోతుగా వెళ్ళుతుంది. హృదయాన్ని వెలిగించుతూ ఉంది.

నేను తిరిగి పుట్టినప్పుడు నా హృదయమును తేటగా దేవుని ఆత్మ నా యెదట ఉంచినాడు. నా పశ్చాత్తాపములోతుగానూ, ఇంకా లోతుగానూ వెళ్ళసాగింది. నన్నేదో శక్తి పట్టుకొని నేను లోతైన వాటి కొరకు వాంచించునట్లు చేసింది. కొన్ని సార్లు మన హృదయము మనలను గుచ్చకపోవచ్చు. అది ఉన్నతమైన మెట్టు. యెషయా, ప్రవక్త దేవుని సన్నిధిలోనికి అతను వెళ్ళినప్పుడు అతని హృదయముగానీ, అతని మనస్సాక్షిగానీ అతనిని గుచ్చలేదు. కానీ దేవుడు అతని మీద దోషారోపణచేసాడు. ఒకడులోతుగా వెళ్ళుతూ ఉంటే అకస్మాత్తుగా దేవుని సన్నిధి అతనికి దొరుకుతుంది. వారి పశ్చాత్తాపములోతుగా వెళ్ళుతుంది.

ఒకడు తన్ను తాను ఈ విధముగా అడుగుకోవాలి ''నేను పీతురువలే ఎందుకు లేను? నేను యోహాను వలే ఎందుకు లేను'' ఈ శిష్యులలో అనేకులు స్థానికుడు అయిన యోహాను సమయములో పశ్చాత్తాపపడ్డారు. క్రీస్తు వచ్చినప్పుడు వారి పశ్చత్తాపము ఇంకా లోతుగా వెళ్ళింది. క్రీస్తు తిరిగి వెళ్లినప్పుడు వారి పశ్చాత్తాపము ఇంకనూ లోతుగా వెళ్ళింది. నీ పశ్చాత్తామును ఈ రీతిగా లోతుగా వెళ్ళేకొలది నీవు యెషయా యొక్క అనుభవమును అనుభవిస్తావు. ఈ పుస్తకంలో రచించబడిన జీవితములను నీవు అనుకరించడానికి ప్రారంభించాలి. దేవుని ఆత్మ బయలు పరచుట ద్వారా నీలోనికి వెలుగు ఇంకనూ ఇంకనూ అధికముగా వచ్చుకొలది నీ పశ్చత్తాపము లోతుగా చేయబడుతుంది. దేవుడు నిన్ను దోషారోపణచేయని సమయం ఒకటి వస్తుంది. అప్పుడు నీ మనస్సు దేవుని మనస్సుతో ఐక్యపరచబడుతుంది. అప్పుడు ఏలియాలో వచ్చినట్లు గొప్పశక్తి నీలోనికి వస్తుంది. ఏలియా సాధించినటువంటి విషయము చిన్న సాధనకాదు. మన మధ్యస్థమైన వాటి గూర్చి తృప్తి చెందకూడదు. మన జీవితముల ద్వారా మట్టుకే లోకము పట్టుబడగలదు. మన హృదయములు మనమీద దోషారోపణ చేయని యెడల మనము దేవుని యెడల గొప్ప నమ్మకము కలిగియుందుము. యెషయా ధైర్యముగా ముందుకు వెళ్ళినాడు. అకస్మాత్తుగా అతడు దోషారోపణ చేయబడినాడు. అకస్మాత్తుగా ఉన్నతమైన ప్రత్యక్షతన నీకు దొరుకుతుంది. నీవు నిందించబడినట్లు గమనిస్తావు. వెస్లీ గారి గుంపులో అధికమైన పరిశుద్దతకొరకు వారందరూ పోరాడుచూ ఉండెను. వారి జీవితములు ఇంగ్లాండు దేశమును మార్చినవి. ఇంగ్లాండు అప్పటికి పాపముతో నిండియుండింది. కానీ వెస్లీయుల జీవితములను ఆ దేశము ఎదిరించలేకపోయింది.

కొన్నిసార్లు ప్రజలు నీ జీవితమును చూసి దోషారోపణచేయబడతారు. తరువాత వారు నీ శత్రువులు అయిపోతారు. వారి మీద నీవు న్యాయతీర్పు తెచ్చినావు. భయపడకుము, దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. నీ హృదయములోని లోతైన వాంచలన్నీ నెరవేరతాయి.

మూల ప్రసంగాలు