లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

హిజ్కియా యొక్క విశ్వాసము

కీ.శే. యన్‌. దానియేలు గారు

యెషయా 37:14-38, యెషయా 38:1 ''హిజ్కియా ఉత్తరము దేవుని యొద్ద విప్పినాడు''

భయపెట్టే ఉత్తరము ఒకటి ఒక గొప్పరాజు దగ్గరనుండి వచ్చింది. యెషయాతో విశ్వాసమునందు గొప్ప స్నేహితుడు ఒకనిని కలిగియుండడం చాలా అదృష్టవంతమైన విషయము. వారిద్దరికీ వారి వారి విచారణలో ఉండినాయి. కానీ ఇద్దరూ కలసి దేశములో ఉజ్జీవము కొరకు పనిచేసినారు. హిజ్కియా ఆ రాజ్యము అంతటినీ నిజమైన పశ్చాత్తాపములోనికి నడిపించాడు. హిజ్కియా దేశమంతటిలో పనిచేయడం ప్రారంబించాడు. ఉజ్జీవం వచ్చినప్పుడు పస్కాను ఆచరించడానికి కావలసిన ఏర్పాట్లు అన్నియు చేసాడు. దేశము అంతయు ఆత్మీయముగా బలపడిన తరువాత ఒక గొప్ప పరీక్ష వారికి వచ్చింది. భయపెట్టే ఆ ఉత్తరము హిజ్కియా దైవగృహములోనికి తీసుకొని వెళ్ళి దేవుని యెదుట ఉంచాడు.

నీవు దేవునికి చెందిన వాడవని నూతన గ్రహింపులోనికి ప్రవేశించడమే మారుమనస్సు. పాపముతో భరించబడిన ఆ గ్రహింపు పాపం నుంచి విడుదల పొందింది. ఒక నూతన గ్రహింపు అతనిలోనికి వస్తుంది. అధ్భుతమైన విశ్వాసము కలిగిన ఒకనాయకుని వలే హిజ్కియా పరిస్థితిని ఎదుర్కొన్నాడు.

నీవు ఒక్కనివే ముందుకు సాగలేవు, దేశము, సంఘము, కుటుంబము కలిసి ఎదగాలి. మనమిద్దరమూ కలిసి ఎదుగుతుంటే ప్రతివాడు రెండవవానిమీద ఆధారపడతాడు. హిజ్కియా భయపడి, ఉత్తరం దేవుని దగ్గరకు తీసుకువెళ్ళాడు. అతని మనస్సు తేలిక అయింది. అతని మనస్సు స్థిరంగా ఉండింది. దేవునితో సంబంధము కలిగి యుండి దేవుని వాక్యం ధ్యానించే వారికి ఇదే జరుగుతుంది. యెషయా 37:32 ''శేషించు వారు యెరూషలేములోనుండి బయలు దేరుదురు, తప్పించుకొనిన వారు సీయోను కొండలో నుండి బయలు దేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును.''

కొన్ని స్థలములలో దేవుని గూర్చిన గ్రహింపులేనప్పుడు అక్కడ ఏ అద్భుతములు జరుగవు. విశ్వాసము అంటే ఏమీ? నీయందు లోతుగా ఆశపెట్టుకొనియున్న దేవుని యొక్క గ్రహింపు. హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉండినాడు. దేవుడు అతనికి ఒక వాగ్ధానం ఇచ్చినాడు. సన్హెరీబు యొక్క సైన్యము ఒక రాత్రిలో ఎగరగొట్టబడింది సన్హెరీబు తనసైన్యము మీద ఆధారపడ్డాడు. ఇప్పుడు వారు అందరూ చనిపోయి ఉన్నారు. అతడు పారిపోవలసి వచ్చింది. అతని కుమారులే అతనిని చంపివేసారు.

హిజ్కియా జీవితములో రెండవ ఇబ్బంది. అతడు జబ్బుతోపండుకొని యున్నప్పుడు కలిగింది. మూడవ ఇక్కట్టు అతడు ఉప్పొంగేమాటలకు వ్యతిరేకముగా నిలబడవలసి వచ్చినప్పుడు కలిగింది. గొప్ప కార్యములు జరిగినప్పుడు కొన్నిసార్లు మనము నిర్లక్ష్యముగా ఉంటాము. ఆత్మీయముగా క్రిందికి పోవడానికి ఇష్టపడతాము. మన ప్రార్థనలకు వచ్చే గొప్ప జవాబు తర్వాత సైతాను మనలను తాకుతాడు.

హిజ్కియా జీవితములో ఉబ్బించి మాట్లాడే వారి మాటలు ఒక గొప్ప ఇబ్బందిగా వచ్చింది. ఇక్కడ అతడు దేవున్నుండి తప్పిపోయాడు మన జీవితముల ద్వారా దేవుడు కనబడాలని కోరతాడు. మనం అందరం కలిసి పైకి లేవాలి. ఎవడైననూ ఉబ్బించే మాటలు మాట్లాడుతుంటే వాటిని అంగీకరించకూడదు.

మనం బోధించే దానినే మనం వెంబడించాలి. మన ప్రేమయందు విశ్వాసమందు తక్కువ పడకూడదు. ఉబ్బించే మాటల యొక్క ఇబ్బంది వచ్చినప్పటికీ మనము దేవునికి నమ్మకస్థులుగా ఉంటాం. సర్వమహిమను ఆయన ఎత్తునకు తీసుకువెళ్ళి ఆయన చూపిస్తాడు.

మూల ప్రసంగాలు