|
దేవుని కుటుంబము |
కీ.శే. యన్. దానియేలు గారు |
లూకా 15:21, ''ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి''.
తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు, మనమందరం ఇంటికి వచ్చాము. మనమంతా తప్పిపోయిన కుమారులమే, మనం తిరిగి మన తండ్రి గృహమునకు వస్తాం. మన తండ్రిగృహము మనము ఒకప్పుడు వాంఛించినవన్నీ కలిగి ఉన్నది. మన ప్రతి అవసరతను నా తండ్రి గృహములో తీసుకోగలము, మన తండ్రి అతి శ్రేష్టమైన వస్త్రములను సిద్దపరిచాడు. అధికారమునకు గుర్తుఅయిన ఉంగరమును ఇచ్చాడు. నీవు ఊరకనే కూర్చుండుటకు ఒప్పుకోని చెప్పులను ఆయన సేవకు నీ పాదములకు తొడిగిస్తారు. నీవు సువార్తను ప్రకటించవలెను, వేయబడిన వస్త్రము నీకు సరిగా సరిపోకపోవచ్చు. ఎందుకంటే నీవు చాలా చిక్కపోయావు. జబ్బుగా ఉన్న ఒక వ్యక్తి తిరిగి అతని బట్టలు వేసుకొనేటప్పుడు అది వదులుగా ఉండడం చూస్తాడు. ఈ యౌవనస్థుడు కృషించిపోయి వెనక్కు వచ్చాడు. భోజనముగూడా అంతగా ఇష్టపడి ఉండడు. ఇటీవల పందుల దగ్గర భోంచేయడానికి ప్రయత్నించినవానికి ఇది చాలా ధనవంతమైన భోజనం. కొంతమంది అనాధలు కరువుకాలములో గడ్డితింటూ ఉండినారు. వ్యాధిగ్రస్థులయ్యారు. తర్వాత వారి కడుపులు కడుగవలసి వచ్చింది. వారు సరి అయిన భోజనం భుజించలేకపోయారు. మనతండ్రి ఇంటిలో ఖరీదు గల భోజనమును మనలో కొంతమందిమి చూస్తూ ఉండవచ్చు. మన ఆత్మీయ జ్ఞానము తక్కువైన వాటితో తృప్తి చెందింది. ఇప్పుడే ఇంటికి తిరిగివచ్చాము. మంచి ఆహారం తృప్తిగా భుజించడానికి ఇంకా కొంత సమయం తీసుకుటుంది. మనము ఎదిగి మనకు ఇవ్వబడిన రుస్తులలోనూ ఉంగరములోనూ కుదుర్చబడడానికి కొంత సమయము పడుతుంది. ఇప్పుడు అవి వదులుగా నేలమీద వ్రేలాడుతూ ఉన్నవి. మనలో కొంతమందిమీ అలా గమనించవచ్చు. తప్పిపోయిన కుమారుడు నేల మీద పండుకోవడానికి అలవాటుపడ్డాడు. జీన్‌వాల్ బిషప్పుగారు ఇచ్చిన ఒకరకమైన మంచము మీద పడకలో నిద్రించలేకపోయాడు. మనలో కొంతమందిమి దేవుని వాక్యము వలన వచ్చే మూలుగును అనుభవించ లేకపోతున్నాం. దేవుడు మనయందు చాలా విలువైన భోజనము పెడుతున్నాడు. మనము ముందు తినడానికి అలవాటుపడిన ఆహారం వంటిది కాదు. మనము ఇంతకు ముందునడిచిన సహావాసం వంటిదికాదు. మనము దేవునితో చెప్పాము. ''మేము పాపాత్ములం.'' అది యదార్ధముగానూ, నిజముగానూ చెప్పాలంటే కొంత అనుభవము అవసరము. నీ స్వభావము క్రీస్తు యొక్క స్వభావము కన్నా ఎంతో వ్యత్యాసమైనదని నీవు గమనించుచున్నావా? నీ స్వంత స్వభావమును నీవు ద్వేషిస్తున్నావా? నీవు నీ స్వంత స్వభావమును ద్వేషించినప్పుడు మట్టుకే నీకు దైవస్వభావము దొరుకుతుంది. నీవు నీ గర్వములో కొనసాగుతున్నావా? మనయందు ఎంతో గర్వము మనలను ఇంకనూ పట్టుకొని యున్నది. ఒకపురి వెంబడి మరియొక పురి నేను తీసివేసి నప్పటికినీ ఇంకనూ నాలో గర్వము ఉన్నట్లు గమనిస్తున్నాను.
క్రైస్తవులలో ఒక సాధారణమైన స్వభావం ఉన్నది. ''మనమందరం మంచివారం'' క్రైస్తవుడు అనగా ఎవరు ''నేను ఒక పాపిని. క్రీస్తువల్ల రక్షించబడ్డాను. నేను గమనిస్తూ ఉంటాను. నాలో ఇంకనూ పాపం ఉంది''. అని చెప్పేవారే. నీవు నీ హృదయమును తిరిగి-తిరిగి వెదుకు కుంటేనే గానీ నీవు నీ తండ్రి గృహములోనికి ప్రవేశించలేవు. ఒక పూర్తి భోజనమును భుజించలేని వారు చాలా మంది ఉన్నారు. ఎందుకు వారు కొంచెం తినడానికి అలవాటు పడ్డారు? వారి కడుపు చిన్నది అయిపోయింది. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ అధికారమును నీవు మర్చిపోతూ ఉంటావు. నీ కొరతను నీవు బాగా గ్రహించినప్పుడు తండ్రి దానిని తీరుస్తాడు. దేవునికి నీ అవసరత తెలుసు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే. దేవదూతలు నా అవసరతలు తీర్చడం గమనిస్తూ ఉన్నాను. తండ్రి గృహములోనికి నీవు ఇంకా ఇమడలేదేమో! సేవకులు నీకు సమస్తం తీసుకొస్తూఉంటారా? ఇక్కడ సేవకుల మధ్యకూడా బహు పరిశుభ్రమైన మాటలు వింటాం. ఒకరినొకరు నిందించుకోవడం తిట్టుకోవడం కాదుగాని ప్రేమ, ఐకమత్యం గల ఆత్మ ఉంటుంది.. ఒకరితో ఒకరు కనికరించుకోవడం మాత్రమే కనిపిస్తుంది. ప్రతిసేవకుడు ఎల్లవేలళ్ళో సేవ చేయడానికి సిద్దంగా ఉంటాడు. ''ఇది నా పని కాదు'' అని ఎవ్వరూచెప్పరు. పంది గుర్రు గుర్రుమనునటువంటి శబ్దము నీవు వినవు. ఒకానొకదినమున నీవు దేవుని వాక్యముతప్ప, దేవునివాక్యముకు విధేయుడవు అవుట తప్ప మరిదేనికి సంతోషపడవు. అపవిత్రమైనది ఏదీ తండ్రి ఇంటిలో చూడవు. నీ నోటినుండి ఒక అపవిత్రమైన మాట ఒకటి కూడా రాకూడదు. ఒకా నొకప్పుడు నీవు లోకవాంఛల యందు సంతోషించుచుంటివి. కానీక్రీసు నిన్ను ఉన్నత స్థాయికి పైకి లేపినాడు. యోహాను 17:8 నిత్యమైన మాటలు నీకు వస్తాయి. నిత్య స్వభావములు నీకు వస్తాయి. అవి నాశనము చేయబడనేరవు. గొప్ప పరిశుద్ధుల హృదయములలో నిత్య తలంపులు ఉంటాయి, అందుకే నీవు వారి జీవితములు చదువుతావు. దేవుడు నీకు ఇచ్చే ఆహారము పరలోకమునందు సిద్ధముచేయబడింది. నీవు దానిని తింటే సుళువుగా జబ్బుపడవు. నీవు ఆ భోజనం భుజించి నెమరువేస్తూ ఉంటే ఆత్మీయంగా దానిని అరిగించుకొంటూ ఉంటే నీవు బలశాలివి అవుతావు. యోహాను 6:68 అది కొండనుండి తీయబడిన తేనె. మనం దానికి అలవాటుపడితిమా అది దేవదూతలు తినే భోజనం. ద్వితి 32:13,46,47. అది నీవు బండ నుండి తీయబడిన తేనెగా గుర్తిస్తున్నావా? కీర్తనలు 119:103 నీవు నిజముగా మారుమనస్సు పొందితే దేవుని వాక్యము తీయగా ఉంటుంది. అది నీకు తీయగా లేకపోతే నీలో ఏదో తప్పు ఉందన్నమాట. నీవుదానిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంతబలశాలివి అవుతావు. బహుత్వరలో సేవకులు నీకు ఇచ్చే ఆజ్ఞలకు తండ్రి ఇచ్చే ఆజ్ఞలకు బేధమేమియు కనుగొనరు. (యోహాను 17:2-6వరకు) నీకు ఆయన బయలు పరచిన పేరు ఏమిటి? అది ఒక బలమైన నామము అది దేవదూతలు మహిమపరిచేది. పరలోకము వంగి నమస్కారం చేసేది. ఆ నామమున నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడాలి. పరిశుద్ధాత్ముడు ఆయన నామమందలి శక్తిని నీకు బయలు పరచినాడా. ఎవరైనా నీ యింటిలోనికి వచ్చినప్పుడు '' నీవు ఎందుకు ఇక్కడకు వచ్చినావు'' అని నీవు అడుగుతావు. ''నీ కుమారుడు పిలిచినాడు'' అని ఆయన చెప్పుతాడు నీవు ఏమిచెప్పగలవు? నీ కుమారుని పేరు చెప్పినప్పుడు నీవు దానికి అంగీకరించాలి. కుమారునితో అంగీకరించనివారు సముద్రము అడుగు భాగముననున్న ఫరోతోనూ, అహాబుతోనూ, సన్హెరీబుతోనూ ఉందురు. ఆ నామము నీకు నాకు బయలు పరిచాడు. ఆయన మనలను శుధ్దీకరిస్తూన్నాడు. ఎందుకుమనలోనుండి ప్రేమబయటకు రావచ్చుఅని. నీవు దేవుని ప్రేమతో నిండియున్నప్పుడు సమస్తము నీ ఎదుట వంగును. నీ దగ్గర తండ్రి ప్రేమయున్నదా? ఒక్కసారి ఆ ప్రేమ నీలో నుండి బయటకు వచ్చినప్పుడు '' ఈ కుమారుడు ఈ తండ్రి ఒక్కటి అయి ఉన్నారు. వారి ఆజ్ఞలు ఒక్కటి అయి ఉన్నాయి'' అని సేవకులు స్వభావికముగా తెలుసు కుంటారు. తండ్రి తన శక్తిని తన కుమారునికి ఇచ్చి ఉన్నాడు. నీవు కూడా దానిలో ఒక భాగము తీసుకొని ఆయనను నీవు సూచించవచ్చు. అది నీవు చేసువరకు ఆయన నిన్ను శుద్దీకరిస్తూ ఉన్నాడు.
నీవు తండ్రి ఇంటిని అంటిపెట్టుకొని ఉంటే బలము పొందుతావు. 1 పేతురు 2:9 నీవు పాపములోనికి వెనక్కు వెళ్ళటం ఇష్టం ఉండదు. 1 పేతురు 4 :11 నీ తల్లిదండ్రులకు నీవు ఒక దేవోక్తి వలే ఉంటావు. నీవు నీ తండ్రి ఇంటికి వస్తే ఆయన స్వభావం నీలోనికి వస్తుంది. తేనే త్రాగుచూ మూలుగను భూజించుదువు. నీవిప్పుడు పరిశుభ్రమైనవాటినే గ్రహించుదువు. నీలోనుండి వచ్చు మాటలు ప్రవచనాత్మకంగా ఉంటాయి. పరి పౌలు వ్రాతలు ఎందుకు చదువుతున్నావు? ఆయన మాటలకు దేవుని మాటలకు ఏ బేధము కనబడటంలేదు.
నా కళాశాల దినములలో మనుష్యులు నన్ను చాలా విమర్శించేవారు. దైవ స్వభావము - పరిశుద్ధత, స్వార్థ రహితము - నీలోనికి వచ్చినప్పుడు ఎంతకాలం నిన్ను చూసి లోకము నవ్వగలదు. ప్రవచనం అనగానేమి? సువార్తను బోధించుట. చనిపోయిన వారు తిరిగి లేస్తారు. ఎండిపోయిన ఎముకలు తిరిగి కలుసుకుంటాయి. నీవు బోధిస్తూ ఉండగా మాంసము వారిని కప్పుతుంది.నీవు ప్రవచించుచూ కొనసాగితే వారు ఒక సైన్యం అవుతారు.
నిద్రపోవద్దు, నీకు ఇవ్వబడిన దుస్తులలోనికి, ఉంగరంలోనికి, కాలికి చెప్పులలోనికి నిన్ను నీవు ఇముడ్చుకోవాలి. ప్రజలు దేవుని ప్రేమను ఆయన మహిమకరమైన స్వభావమును నీయందు చూస్తారు. వారు ''నీ ప్రేమను, నీ వాక్యమును బట్టి పరలోకమందున్న తండ్రి బిడ్డలుగా పిలువబడుదురు గాక''.
|
|