లేమెన్స్ ఇవాంజెలికల్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్

మూల ప్రసంగాలు
 

దేవుని వాక్యముయొక్క గొప్పతనము

కీ.శే. యన్‌. దానియేలు గారు

కీర్తనలు :19.

ఆకాశము ఎంత విస్తీర్ణమైనదనగా దానిలోఉండే వస్తువులను వెదకలేనంత గొప్పది. ఆకాశమును ఆయన వివరించిన తర్వాత దావీదు దేవుని పరిపూర్ణమైన న్యాయచట్టమును గూర్చి మాట్లాడతాడు. ఆకాశము యొక్క గణిత సిద్ధాంతములన్ని పరిపూర్ణమైనవి. కానీ ఆత్మీయ కంటితో దేవుని వాక్యమందలి అధిక గొప్ప పరిపూర్ణతను చూస్తాడు. ఆత్మీయ కన్ను నిన్ను సృజించిన వానిని చూస్తుంది. అయన నిన్ను ఒక గొప్ప ఉద్దేశముతో సృజించాడు గొప్పశక్తిని నీయందు ఉంచాడు. నీ సేవల కొరకు లోకము ఆశించుచూ ఉన్నది. నీ చుట్టూ ఉన్న పాపాత్ముల నిస్సహాయస్థితిని నీవు చూసినప్పుడు దేవుడు నిన్ను అలాంటివారికి సహాయం చేయడానికి సృజించినాడని తెలుసుకో.

కీర్తనల గ్రంధకర్త దేవుని వాక్యము యొక్క విలువను గూర్చి మాట్లాడుతున్నాడు. యోహాను 6 : 63 నీవు దేవుని వాక్యమును దీన హృదయముతో చదివితే దానిలోని విషయాల నెరవేర్పును నీ కన్నుల యెదుట చూస్తావు. ఆ వాక్కులు ఎంత సజీవంగా ఉంటాయి. అంటే ఒక సజీవమైన వ్యక్తిని ముట్టుకున్నట్లే అనిపిస్తుంది. ఈ లోకములో ఉన్న విజ్ఞాన శాస్త్రములను చదువుట మనలను పరిపూర్ణులనుగా చేయవు కానీ దేవుని వాక్యము మనలను పరిపూర్ణులనుగా చేయును. దానిని ధ్యానించి, దానియందు ఆనందించేవారు ఈ లోకములో చాలా ప్రయోజకులుగా ఉంటారు. దేవుని వాక్యము సామాన్యులను విజ్ఞానవంతులుగా చేయును.

జార్జిముల్లర్‌ గారు 2000 మంది అనాధలను పోషించే పూచీ తీసుకున్నారు. ఈ అనాధల యొక్క అవసరతలు శారీరకమైనవి మట్టుకేకాదు గానీ ఆత్మీయమైనది. తల్లిదండ్రులు ఉన్నవారు జాగ్రత్తగా చూసుకోబడతారు. జాగ్రత్తగా దిద్దుతారు. నడిపిస్తారు. కానీ ఆనాధలకు దిద్దేవారు ఎవరూ లేదు. దేవుని వాక్యమును జాగ్రత్తగా పఠించిన జార్జిముల్లర్‌గారు ఈ 2000 మంది అనాధలకు నాయకుడు అయినారు.

యౌవనస్థులు ఎల్లప్పుడు నవ్వులాట లాడుతూ సంతోషంగా ఉండగోరతారు. కాని నవ్వులాటలో అవాస్తవికత ఉన్నది. పవిత్ర హృదయము నుండి ఉబికి పారే సంతోషము అయితే అది సత్యము. లేకపోయినట్లయితే నవ్వులాటలోకూడా హృదయము దు:ఖముతో ఉంటుంది. కీర్తనలు 119:72 మీరు చాలా ద్రవ్యము తీసుకొని ఒక అనాధయొక్క హస్తములలో పెడితే అతడు ఏమిచేస్తాడు? అతడు తన్ను తాను నాశనము చేసుకుంటాడు. నీవు ద్రవ్యము ఇవ్వవచ్చుగాని నీవు శీలము ఇవ్వలేవు. దేవుని వాక్యాన్ని నీవు పఠించినప్పుడు నీలో ఉండే అతి శ్రేష్టమైనవి బయటకు వస్తాయి. నీవు దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళి నీ విరామసమయంలో చదువుతూఉంటే దేవుని ఆత్మమన చుట్టూ ఆవరించి ఉంటాడు.

దేవుని వాక్యమును ఎరుగక దేవుని సేవను ఎంతగా పాడుచేస్తూ ఉంటాము! దేవునికి సంబంధిచిన వాటిని అపవిత్రమైన చేతులతో పట్టుకొంటాము. మనము దేవుని వాక్యమును చదివేటప్పుడు దేవుని భయం మనమీదికి వస్తుంది. దేవునియెడల భయమే నిజముగా ఒక గృహము యొక్క ఐశ్వర్యము. నీవు దేవుని వాక్యమును పఠించినప్పుడు దేవుడు నీ కొరకు చేసిన ఏర్పాటులను నీవు దేవుని ఆత్మవల్ల తెలుసుకుంటావు. దేవుని వాక్యజ్ఞానమందు లోటు నీతో చదువుకున్న వారికి ఆకర్షినీయముగా లేకుండా చేస్తుంది. వాక్యములో గొప్ప వాగ్దానములు ఉన్నాయి. దేవుని ఆత్మయే నీవు వాటిని చూసునట్లు చేస్తాడు. దేవుని వాక్యాన్ని నీవు పఠించేటప్పుడు, వాటిని, వాటిని గూర్చి గమనించేవాడివయితే దేవుని వాగ్దానముల తాళపుచెవిని ఇవ్వగల్గిన వాడిని అడుగుతావు. నిన్ను నీవు యోగ్యునిగా నిరూపించుకున్నంత వరకు దేవుడు నీకు ఆ తాళపుచెవులను ఇవ్వడు. నీవు స్ధిరపడి యుండునప్పుడు ఆయన తాళపు చెవులను తీసుకొని నిన్ను నీవు దేవునిగా చేసుకుంటావు. నరకములో నీ స్థానము స్థిరం చేసుకుంటావు. దేవుడు మొట్టమొదట నిన్ను తన వాక్యమునందలి సుత్తి దెబ్బలు చేత పరీక్షించి తదుపరి తన పరిశుద్ధ వాక్యమందలి అగ్ని జ్వాలలతో నిన్ను పరీక్షిస్తాడు. దేవుని వాక్యమందలి అగ్నిచేత నీవు ఎర్రగా కాగియున్నప్పుడు సుత్తిదెబ్బలు నిన్నురూపించడానికి వచ్చి పరీక్షిస్తాయి, పరలోకము విశాలమైనది. కాని దేవుని వాక్యము అంతకన్నా గొప్పది గానూ విశాలమైనదిగానూ ఉన్నది.

మూల ప్రసంగాలు