|
హృదయమందు వెనుకకు తగ్గినవాడు తన సొంత మార్గములతో నిండియుంటాడు. |
కీ.శే. యన్. దానియేలు గారు |
సామెతలు 14:14 ''భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును. మంచివాని స్వభావమువానికే సంతోషమిచ్చును.''
మనము వెనుకకు తగ్గిన వెంటనే సైతాను మనలోనికి తన తలంపులను పెట్టును. సైతాను మనము వెనుకకు తగ్గే సమయము కొరకు కనిపెడతాడు. అతడు తర్వాత తన తలంపులతో మిమ్మును తప్పు దారి నడిపిస్తాడు. ఒక మనుష్యుడు నాతో పనిచేస్తూ ఉండినాడు. అతడు వెనుకకు తగ్గినాడు. అదినేను ఎరుగకుండా ఉంటిని. మనం పని ఏలాగుచేయాలో దాని గురించి నిండు సలహాలు ఇస్తు ఉండే వాడు. నేను అతని సలహాల గూర్చి ప్రార్థన చేసేవాడిని. దేవుని నడిపింపు అతనికి పూర్తిగా వ్యతిరేకముగా ఉండుటచూసి అతని తలంపులు నేను విడిచిపెట్టెవాడిని. కొంతకాలము అయిన తరువాత. అతడు నాతో ఉండడం, సహవాసమును వెనుకకు లాగునదిగా ఉన్నది అని చెప్పాడు. తరువాత అతను వెళ్ళిపోయాడు. అతడు తర్వాత తన్నుతాను నాశనం చేసుకున్నాడు. వెనక్కు జారిన వారితో ఉండడం చాలా అపాయకరం. దేవుని పిల్లల సహవాసంలో మట్టుకే వారు దిద్దబడగలరు. వారి తప్పులు వారు ఎన్నుకోరు. దేవుని పిల్లలలో ఉండే తప్పులను మాత్రం చూస్తారు. ''మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును.'' నీవు దేవునితో సరిగా ఉన్నప్పుడు నీవు తృప్తి చెందుతావు. దేవుని వాక్యముతో నీవు సంతోషముగా ఉంటావు. నీవు దేవుని పిల్లలతో సంతోషముగా ఉండగలవు. దేవుని వాక్యానుసారముగా సరిచేయబడిన హృదయముగలవారు అత్యధిక సంతోషముతో నింపబడుదురు - అదే పరలోకము. దేవుడు తనప్రేమను బట్టి నిన్ను పరలోకము కొరకు సృజించాడు. నీవు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు నీవు తృప్తి చెందుతావు. మనుష్యులందరిలో అతి దుర్మార్గులలో కూడా దేవుని కొరకైన ఒక వాంచను కలిగియున్నారు ఎందుకనగా మనము దేవుని కొరకు సృజించబడ్డాము.
'' గ్రహింపుగలవాని హృదయములో జ్ఞానము నిలుచును.'' నీవు దేవుని నీతిని వెదకి నట్లయితే నీవు తలగా ఉంటావుగానీ తోకగా ఉండవు. దేవుని సేవ చేయని జనములు నశించిపోతారు. దేవుడు చాలాముందుగానే ఆలోచించి ఏర్పాట్లు చేస్తారు. ఇతరుల ఎడల నీకు ప్రీతిని కలిగించే ఆత్మను ఇస్తాడు. నీవు దేవునితో సరిగా ఉన్నావు గనుక నీ మనస్సాక్షి ఎన్నడూ గుచ్చదు. అదే పరలోకము. కాని నీవు మరుసటి ఉదయమున నీ కొరకు మట్టుకే ఆలోచిస్తున్నావు. మనుష్యులు రేపు నన్ను మెచ్చుకుంటారా? అనేప్రశ్న నీ మనస్సును ఆవరించుకొని యున్నది. కానీ దేవుడు నిన్ను నిత్యము శ్రేష్టునిగా చేయగోరుతున్నాడు. ''ఒక మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును''. ఇది దేవుని పని. నీ స్వభావము దేవుని స్వభావముగా మారుటకంటే ఎక్కువనీవు కోరుకొనగల్గిన దేమి? యెషమా 61:4,6 ''చాలా కాలమునుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరములనుండి శిథిలములైయున్న పురములను బాగుచేయుదురు.'' ''మీరు యోహోవాకు యాజకులనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు.'' అనేక తరముల వరకు నిలిచియుండు వెలుగుగా దేవుడు నిన్ను సిద్దపరుస్తున్నాడని నీవు ఎరుగుదువా? నీవు మరణించినపుడు ఎవడైననూ తన జీవిత విధానమును మార్చినవాడు అని గానీ, తనకుటుంబము యొక్క పద్దతిని గాని చీకటి నుండి వెలుగులోనికి మార్చినవాడని నీ గురించి ఆలోచిస్తారా? నీ ప్రభువుతో నీవు సంపూర్ణముగా తృప్తి చెందినట్టి ఆ స్థితి నీవు మొట్ట మొదట సంపాదించుకోవాలి. నీవు ఆయన యందు, ఆయన నీయందు ఉండగా క్రీస్తు నిన్ను నడిపించును.
|
|